Archive for the ‘సినిమా విశ్లేషణ’ Category

నవలనుంచి సినిమా వరకు- రాబిట్ ప్రూఫ్ ఫెన్స్.

ఈ భూమి మాస పత్రిక సెప్టెంబర్ సంచికలో ప్రచురితమయిందీ వ్యాసం.

September 29, 2012 · Kasturi Murali Krishna · One Comment
Posted in: సినిమా విశ్లేషణ

నిన్న వెన్నెల పేజీలో నా వ్యాసం

నిన్నటి ఆంధ్రభూమి దినపత్రిక వెన్నెల పేజీలో నేను రాసిన వ్యాసం ప్రచురితమయింది. దాని లింకు ఇదిగో….

September 1, 2012 · Kasturi Murali Krishna · No Comments
Posted in: సినిమా విశ్లేషణ

నవలనుండి సినిమా వరకు- క్లాక్ వర్క్ ఆరెంజ్

ఈభూమి మాసపత్రికలో గత మూడు సంవత్సరాలుగా నేను రాస్తున్న ఫీచర్ ఇది. ఈశీర్షికన ఈ నెల క్లాక్  వర్క్ ఆరెంజ్ సినిమాను పరిచయం చేశాను.

August 20, 2012 · Kasturi Murali Krishna · No Comments
Tags: , , ,  · Posted in: సినిమా విశ్లేషణ

కమర్షియల్ క్లాస్సిక్, దేవానంద్ సినిమా గైడ్- పరిచయం.

ఇది జనవరి పాలపిట్ట మాస పత్రికలో ప్రచురితమయింది.

January 8, 2012 · Kasturi Murali Krishna · No Comments
Tags: , , ,  · Posted in: సినిమా విశ్లేషణ

జయదేవ్- పరిచయం.

జయదేవ్- పరిచయం. ఇది ఆగస్టు నెల ఈభూమి మాస పత్రికలో ప్రచురితమయింది.

September 9, 2010 · Kasturi Murali Krishna · One Comment
Posted in: సినిమా విశ్లేషణ

విరహవేదన ఇంత మధురంగా…….

ఒకప్పుడు మన సినిమాల్లో నాయికా నాయకులు మామూలు మనుషులలాగా ప్రవర్తించేవారు. మామూలు మనసున్న మనుషుల్లాగా ఆవేదనలు, సంవేదనలను అనుభవించేవారు. అందుకే, ప్రతి సినిమాలో ఒక విరహ గీతం తప్పనిసరిగా వుండేది.

విరహగీతాలు ఎంతో సున్నితంగా వుండేవి. అవి నాయికా నాయకుల విరహ వేదనను ప్రదర్శించటం ద్వారా శ్రోతల మనస్సులలో నిద్రాణమయి వున్న సున్నిత భావనలను తట్టిలేపేవి. తమలో దాగిఉన్నట్టు సామాన్యులు గ్రహించలేని అత్యంత మృదుమధురమయిన సున్నిత భావనలకు అక్షర రూపం ఇచ్చి, అందమయిన గేయంగా మలచేవారు. రాతిహృదయం కూడా కరగి నీరయి జలజలా స్రవించే రేతిలో అమోఘమయిన, సుందరమయిన, అత్యంత సున్నితమయిన గీతాలను సృజించి ప్రజల హృదయాలను రసభరితం చేసేవారు.

ఆజావొ తడప్ తే హై అర్మాన్, యే ష్యాం కీ  తన్ హాయియా ఐసేమే తేరా గం, మెరె బీనా తుం బిన్ రోయే, రసిక్ బల్మా వంటి అనేకానేక అతి గొప్ప విరహ గీతాలున్నాయి. ఒక మధురమయిన అలవికాని ఆవేదనను రగిల్చి, ఆవేదనలోని అందాన్ని, సౌఖ్యాన్ని మనసుకు నేర్పుతాయి. విరహవేదనలోకూడా ఇంత సౌఖ్యం దాగుందా అనిపిస్తాయీ పాటలు. అయితే, విరహ గీతమే అయినా వీటన్నిటికీ, భిన్నమయినదీ, అత్యంత చమత్కారభరితమూ, అదే సమయానికి అతి సున్నితమయిన పాట ఆర్జూ సినిమాలో లతా మంగేష్కర్ పాడిన బేదర్దీ బాలుమా తుఝ్ కో మెర మన్ యాద్ కర్తా హై, అనే శంకర్ జైకిషన్ సృజించిన గీతం. ఈ పాటలోని భావాల సుమమాలా అల్లింది హస్రత్ జైపురి.

సినిమా కథ మామూలే. నాయికా నాయకులు ప్రేమించుకుంటారు. పాటలు పాడుకుంటారు. ఇదిగో ఇప్పుడే వస్తానన్న నాయకుడు ఎంతకీ రాడు. అతని కోసం ఎదురుచూస్తూ, అతని సాంగత్యం కోసం విలపిస్తూ, అతనితో ఈ ప్రదేశాలలో గడిపిని ఆ ప్రేమ మయమయిన అద్భుతమయిన కాలాన్ని తలచుకుంటూ నాయిక ఒక విరహ గీతం పాడుతుంది. అదే ఈ పాట.

సందర్భం మామూలే. కానీ పాట అంత తేలికయినది కాదు. అతి క్లిష్టమయిన రాగము. ఎన్నో మెలికలుంటాయి. అంతే గొప్ప పదాలు, భావాలౌంటాయి. వాటిని అనుభవిస్తూ పాడాలి. ఆ సంవేదనలకు ప్రాణం పోయాలి. లతా మంగేష్కర్ కు ఇది వెన్నతో పెట్టిన విద్య.

పాట ఆరంభంలోనే, కొండ అంచుపైన వొంటరిగా నిల్చుని, క్రింద లోయలోకి, అనంతమయిన శూన్యంలోకీ చూస్తూ, ఆ ఆ ఆ అంటూ లతా రాగం తీయగానే ఎద జల్లుమంటుంది. మనసులో ఒక ఆవేదనా వీచిక ఎగసిపడుతుంది.

బేదర్దీ బాలుమా తుఝ్కో మెర మన్ యాద్ కర్తా హై
బరస్తాహై జొ ఆంఖోంసే వొ సావన్ యాద్ కార్తా హై

పాట ఆరంభమవుతుంది.

పల్లవిలో నేపధ్యంలో వినిపించే తబలా గతిని గమనించండి. లతా పలికే పదాల భావాలను ఎంత చక్కగా అవి మరింత శోభాయమానం చేస్తాయో అనుభవించండి. అంతేకాదు, తబలా తళతళలు పాటకు ఒక ఊపునిస్తాయి.

హృదయంలేని ప్రియుడా నా మనస్సు నిన్ను గుర్తుకు తెచ్చుకుంటోంది. కంటినుంచి కారే కన్నీరు వర్షాకాలాన్ని తలపుకు తెస్తోంది అంటోది నాయిక.

కభి హుం సాథ్ గుజ్రే దిన్ సజీలీ రాహ్ గుజారోంసే
ఖిజాకే భేస్ మె ఫిర్తీహై అబ్ పత్తే చనారోసె
వొరాహే యాద్ కర్తీహై వొ గుల్షన్ యాద్ కర్తా హై

కవి చమత్కారం ఇక్కడే తెలుస్తుంది.
తాను నాయకుడి కోసం ఎదురుచూస్తున్నానని నాయిక ఎక్కడా ప్రత్యక్షంగా చెప్పదు. వాళ్ళు ఎదురు చూస్తున్నారు. వీళ్ళు ఎదురుచూస్తున్నారు అంటూ తన విరహ వేదనను ప్రకృతిలో ఆపాదించి పరోక్షంగా తెలుపుతోంది.

ఒకప్పుడు పచ్చగా కళకళ లాడే ఈ దారులలో మనం కలసి నడిచాం. ఇప్పుడు ఎండుతాకులతో నిండి, వాడిపోయిన మోడుల మధ్య తిరుగుతున్నాను. ఈదారులూ, ఈ తోటా నిన్ను గుతుచేస్తున్నాయి అంటోంది. ఇక్కడ ప్రతీకలు ఎంత సందర్భోచితంగా వున్నాయో, నాయిక మానసిక స్థితిని ప్రతిబింబిస్తున్నాయో గమనించండి.

కోయి ఝోకా హవాకా జబ్ మెర ఆచల్ ఉడాతాహై
గుమాహోతాహై జైసె తూ మెర దామన్ హిలాతాహై
కభిచూమాత జొ తూనే వొ దామన్ యాద్ కర్తాహై

గాలి తరగ ఆమె కొంగు ఎగరగొట్టినప్పుడు ఆమె అతడు తన చేతిని పట్టి ఊపుతున్నాడన్న భ్రాంతి కలుగుతుంది. అతడు తాకిన ఆ  చేయి అతడిని గుర్తుకు తెచ్చుకుంటోంది.

వహిహై ఝీల్ కె మంజర్ వహి కిరణోంకి బర్సాతే
జహ హం తుం కియా కరేథె పహెరో ప్యార్ కీ బాతే
తుఝె ఇస్ ఝీల్ క ఖామోష్ దర్పణ్ యాద్ కర్తాహై

తాము గంటల తరపడి మాట్లాడుకున్న నది అదే, అప్పటి లాగే కిరణాల వర్షం కురుస్తోంది. కానీ, ఇప్పుడు ఆ ప్రకృతిలో జీవం లేదు. అందుకే, నిశ్శబ్ద దర్పణం లాంటి నది అతడిని గుర్తుకుచేస్తోంది.

ఈకడ ఖామోష్ దర్పణ్ అనటం ఎంతో గొప్పగా వుంటుంది. ఆమె నది గురించి చెప్తోందా, తన హృదయం గురించి చెప్తోందా?

ఇలాంటి అత్యద్భుతమయిన కవిత్వం ఎద లోతులలోని ఆవేదనలకు, సంవేదనలకు అక్షర రూపం ఇచ్చేది ఆకాలంలో. అప్పటి ప్రేక్షకులు అందుకే ఎంతో అదృష్టవంతులు. ఆ కవులు, గాయకులు, సంగీత దర్శకులు అదృష్టవంతులు. వారి శ్రోతలు ఒక మంచి సృజనను అర్ధంచేసుకుని ఆదరించేవారు.

అందుకే, ఎంతటి విరహ వేదనలో వున్నా సరే ఇలాంటి పాటలు వింటూంటే ఆవేదన స్థానాన్ని అదో అకమయిన ఆనందం ఆక్రమిస్తుంది. కళ్ళ వెంట నీరు కారుతున్నా, మనసు ప్రశంత సరస్సయిపోతుంది.

ఈ పాట చిత్రీకరణ కూడా ఔచిత్యంగా వుంటూ పాట ప్రభావాన్ని పెంచుతుంది. సాధన అందం గురించి మరో సారి. వెన్నెల ఆకృతి దాలిస్తే అది సాధన లా వుంటుంది.

ర్

August 25, 2010 · Kasturi Murali Krishna · 2 Comments
Posted in: సినిమా విశ్లేషణ