Archive for the ‘సంగీత మహారధులు’ Category

ఖిల్ తె హై గుల్ యహాన్- నీరజ్ పరిచయం.

ఈనెల ఈభూమి మాస పత్రికలో ప్రచురితమయింది.

October 17, 2012 · Kasturi Murali Krishna · No Comments
Posted in: సంగీత మహారధులు

ఆంధ్రభూమిలో ఆర్డీ బర్మన్ గురించి నా వ్యాసం.

ఆంధ్రభూమిలో దిన పత్రికలో  ఆర్డీ బర్మన్ గురించి నేను రచించిన వ్యాసం ఇవాళ్టి వెన్నెలలో  ప్రచురితమయింది. ఆవ్యాసం లింకు ఇదిగో!

June 29, 2012 · Kasturi Murali Krishna · No Comments
Tags: , , ,  · Posted in: సంగీత మహారధులు

సంగీత దర్శకుడు రవి అస్తమయం.నా శ్రద్ధాంజలి.

ఈమధ్య రకరకాల పనులతో బిజీగా వుండటం వల్ల వార్తలను పట్టించుకోవటంలేదు. ఇవాళ్ళ సాయంత్రం గూగుల్ లో ఏదో వెతుకుతూంటే రవి మరణించాడన్న వార్త కనిపించింది.

ఒక్కసారిగా అనేకానేక మధురమయిన పాటల పరిమళాలు మనస్సును చుట్టుముట్టాయి.

ఒకవైపునుంచి రఫీ, చౌధవీక చాంద్ హో, అంటూంటే మరో వైపునుంచి లత, మిల్తీ హై జిందగీమె మొహబ్బత్ కభీ కభీ, అంటోంది.
ఇంతలో మహేంద్ర కపూర్, తుం అగర్ సాథ్ దేనేకా యె వాదా కరో, అంటూంటే, మన్నాడే, ఎయ్ మెరె జొహ్ర జభీ, అంటూ వూగిపోతున్నాడు.

ఆశాభోస్లె ఉల్ఝన్ సుల్ఝేనా, అని బాధపడుతూంటే, సల్మా, దిల్ కె అర్మాన్ ఆసువోమె బహెగయే అంటోంది.

మహేంద్రకపూర్ ఇంతలో పాట మార్చి, బీతే హువె లమ్హోంకి కసక్ సాథ్ తొ హోగీ అంటున్నాడు. రఫీ తానేమీ తక్కువతినలేదన్నట్టు, హుస్ను వాలే తెరా జవాబ్ నహీ, అని రొమాంటిక్ గా పాడుతున్నాడు. లతా అడుగు ముందుకేసి, గైరోంపె కరం, అప్నొంపె సితం, ఏయ్ జానెవఫా యే జుల్మునకర్ అని ప్రాధేయపడుతోంది. అంతలో రఫీ ఆశాతో, యె పర్దా హటావో, అని బ్రతిమిలాడటం ఆరంభిస్తే, మహేంద్ర కపూర్, చలో ఎక్ బార్ ఫిర్సే అజ్ఞబీ బన్ జాయె హం దోనో, అంటూ, కొత్తగా రొమాన్స్ ఆరంభిస్తున్నట్టు , ఇన్ హవావొనె ఇన్ ఫిజా వోనె తుఝ్ కొ మెరా ప్యార్ పుకారే అని పాడటం మొదలుపెట్టాడు. వెంటనే రఫీ తుమ్హారీ నజర్ యూ ఖఫా హోగయి అని అందుకున్నాడు. ముకేష్ రంగంలో దూకుతూ, యే మౌసం రంగీన్ సమా అని ఉత్సాహం చూపాడు. బిఖ్రాకె జుల్ఫె చమన్ మే న జానా, అని చమత్కరించాడు.

హే నీలె గగన్ కె తలే, అని మహేంద్రకపూర్ అంటే, యె వాదియా, యె ఫిజాయే బులారహీహై తుమ్హే అని పిలుస్తూ, న ఝట్కో జుల్ఫు సే పానీ, అని రఫీ రాగం తీశాడు. కౌన్ ఆయా కె నిగాహో మె చమక్ జాగ్ ఉఠీ అంటూనే ఆగే భీ జానేన తుం అని తత్వం పాడుతూ, తొర మన్ దర్పన్ కహె లాయే అని నిజాలు పాడాతోంది ఆశా. చూలేనేదొ నాజుక్ హోటోంకో, అని, అంతటితో ఆగక, లగ్ జా గలే దిల్రుబా, అని వెంటపడ్డాడు రఫీ. చివరికె భరీ దునియామె ఆఖిర్ దిల్ కొ కొ సంఝానె కిధర్ జాయే అంటూ రహ గర్దిశోమె హర్ దం అని వాపోయాడు. నమూ చుపాకె జియో అని మహేంద్ర కపూర్ అంటున్నా వినక ఇస్ భరీ దునియామె కోయీభి హమారా న హువా అని రోదించాడు.
లో ఆగయీ ఉంకి యాద్ వో నహీ ఆయె, అని లతా అంటే, ఆప్ ఆయె తొ ఖయాలె దిలె నాషాద్ ఆయా అని మహేంద్రకపూర్ అన్నాడు. బాబుల్ కి దువాయే లేతీజా అని రఫీ అంటే, తుఝె సూరజ్ కహూ యా చందా అని మన్నాడే అన్నాడు.
ఇంతలో మహేంద్ర కపూర్ సంసార్ కీ హర్ షయ్ కా ఇత్నాహీ ఫసానా హై, ఎక్ ధుంద్ సే ఆనాహై, ఎక్ ధుంద్ మే జానాహై అని అదృశ్యమయితే, వక్త్ సే దిన్ ఔర్ రాత్ అంటూ రఫి నీడల్లో కరిగిపోయాడు.

ఇదంతా చూస్తో, ఇంకా అనేక మనసుమెచ్చిన గీతాలను గుర్తుచేసుకుంటూ, తుఝ్ కో పుకారే మేర ప్యార్, అనుకుంటూ నిలిచిపోయాను.

మ్రుదువయిన పాటలకు సున్నితమయిన చిరునామ రవి పాటలు.

March 9, 2012 · Kasturi Murali Krishna · 2 Comments
Posted in: సంగీత మహారధులు

గుల్జార్ పాటలవిశ్లేషణ.

ఈ వ్యాసం డిసెంబర్ నెల ఈభూమిలో ప్రచురితమయింది.

December 17, 2011 · Kasturi Murali Krishna · One Comment
Posted in: సంగీత మహారధులు

అనిల్ బిస్వాస్– పరిచయం.

అనిల్ బిస్వాస్– పరిచయం.

ఇది జనవరి నెల ఈభూమిలో ప్రచురితమయింది.

January 30, 2011 · Kasturi Murali Krishna · No Comments
Posted in: సంగీత మహారధులు

మహమ్మద్ రఫీ- శ్రద్ధాంజలి.

ఈవేళ సాయంత్రం ఆరున్నరకు, త్యాగరాయ గాన సభ మినీ హాలులో మహమ్మద్ రఫీకి శ్రద్ధాంజలి అర్పిస్తున్నాము.

రఫి పాటలలోని వంపులను, సొంపులను, ఇంపులను, కెంపులను నేను వివరిస్తూంటే, రాధాకృష్ణ గారు గానం చేస్తారు.

అందరికీ ఇదే ఆహ్వానం.

టీవీ కార్యక్రమాల శ్రద్ధాంజలుల్లా అవగాహన రాహిత్యాలు, పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు, పైపై మాటలు వండవు. రఫీ పాటలను మనసుతో విని, మనసులోలోతుల స్పందనలను మాటలలఒ వ్యక్త పరచే వ్యాఖ్యలతో వుంటుందీ కార్యక్రమం.

తప్పకుండారండి. మీ అభిప్రాయాలను, సూచనలనూ నిర్మొహమాటంగా తెలపండి.

July 30, 2010 · Kasturi Murali Krishna · No Comments
Posted in: సంగీత మహారధులు