Archive for the ‘నా రచనలు.’ Category

ఈరోజు వార్త ఆదివారం అనుబంధంలో, చరిత్ర పుటల్లోంచి చదవండి.

క్రీస్తు పూర్వం 3500 ప్రాంతంలో ఆ నాగరికతకు లిపి ఇంకా సంపూర్ణంగా ఆవిర్భవించలేదు. వారి భాష కూడా సరిగా ఆవిష్కృతం కాలేదు. కానీ, వారు లెక్కించే విధానాన్నే కాదు, ఆధునిక నాగరికతలోని ధ్రువీకరణ పత్రాలు, డాక్యుమెంట్ల పద్ధతికి నాందీప్రస్తావన చేశారు. ఇదెలా సాధ్యమయిందో ఊహాత్మకంగా వివరించే హిస్టారికల్ ఫిక్షన్ కథ ను ఈరోజు వార్త ఆదివారం అనుబంధంలో, చరిత్ర పుటల్లోంచి శీర్షికలో చదవండి.

March 23, 2014 · Kasturi Murali Krishna · No Comments
Posted in: నా రచనలు.

ఆధునిక నరకాసురుల క్రైం కథ, నవ్య వార పత్రికలో…

ఇటీవలె ఒక సభలో నేను ఆంధ్రజ్యోతి దిన పత్రిక ఎడిటర్ కే శ్రీనివాస్ ఒకే వేదిక పైన కలిశాము. మాటల సందర్భంలో ఆయన, నవ్య పత్రిక రాగానే నేను ముందుగా మీ క్రైం కథ చదివుతాను అన్నారు.

వెంటనే నేను, ఈ విషయం నవ్య ఎడిటర్ జగన్నాథ శర్మ గారికి చెప్తే నేనూ సంతోశిస్తానన్నాను. అభ్యంతరం లేకపోతే ఈ విషయం, ఫేస్ బుక్ లోనూ, నా బ్లాగులోనూ పెడతానన్నాను.

ఆయన సరే అన్నారు.

అదీ కథ.

రేపు విడుదలయ్యే నవ్య వార పత్రికలో, సైబర్ క్రైం కథ వుంటుంది. ఆధునిక నరకాసురుల కథ అది. చదవండి.

March 18, 2014 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized, నా రచనలు.

నాగరికతలెలా అంతరిస్తాయంటే….

మెక్సికో లోని చాకో లోయలో కొన్ని క్రీశ 7 వ శతాబ్దం నుండి, 14వ శతాబదం వరకూ విలసిల్లిన నాగరికత ఎందుకని, ఎలా అంతరించింది? తెలుసుకోవటం కోసం, ఈనాటి వార్త ఆదివారం అనుబంధంలో చదవండి, చరిత్ర పుటల్లోంచి..

February 2, 2014 · Kasturi Murali Krishna · No Comments
Posted in: నా రచనలు.

చిత్ర మాస పత్రికలో ముస్సోలిని నవల ప్రచురితమయింది

చిత్ర మాస పత్రికలో ముస్సోలిని నవల ప్రచురితమయింది.తెలుగులో రెండవ ప్రపంచ యుద్ధం కేంద్రంగా సృజించిన తొలి నవల ఇది. చదివి మీ అభిప్రాయాన్ని తెలపండి

.

January 30, 2014 · Kasturi Murali Krishna · No Comments
Posted in: నా రచనలు.

ముస్సోలిని జీవిత చరిత్ర నవల రూపంలో…

తెలుగులో భయానక కథలు తొలిసారిగా రాసింది..నేనే.

తెలుగులో జోతిష శాస్త్రాన్ని పెర్సొనాలిటీ దెవెలప్ మెంట్, పాసిటివ్ థింకింగ్ కు ఎలా వాడుకోవచ్చో కథల రూపంలో తొలిసారిగా రాసింది……..నేనే.

తెలుగులో, కళణుడి రాజతరంగిణిలోని రాజవంశావళి మొత్తం ప్రతిబింబించేట్టు తొలి సారిగా కథలు రాసింది…నేనే.

మైకెల్ జాక్సన్ మరణం తరువాత అతని జీవిత చరిత్ర ప్రథమంగా ప్రచురితమయింది తెలుగులోనే…అది రాసింది….నేనే.

రోషనారా జీవిత చరిత్రను చారిత్రక ఆధారాలతో, సత్యానికి దగ్గరగా వుంచుతూ రచించిన ఏకైక తెలుగు నవల రాసింది….నేనే.

వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులూ, భగవద్గీత, సుమతి, భాస్కర శతకాలతో సహా ఇతర ప్రాచీన వాఙయం ఆధారంగా భారతీయ వ్యక్తిత్వ వికాసాన్ని నిర్వచించి నిరూపించినది తెలుగులో తొలిసారిగా…నేనే…

ఇంకా ఇలాంటి వెన్నో వున్న నా నేనేలకు మరో కొత్త నేనే జోడిస్తున్నాను.

రెండవ ప్రపంచం యుద్ధాం ఆధారంగా, అప్పటి యూరొపియన్ నాయకుడి జీవితాన్ని నవలికలా తెలుగులో తొలిసారిగా రచించిందీ ……నేనే..(ఇంకెవరయినా నా కన్నా ముందే ముస్సోలిని జీవితాన్ని తెలుగులో నవల రూపంలో రచించారని నిరూపిస్తే..నేనే ను నేను కాదుగా మారుస్తాను.)

ఇటలీ నియంత, ముస్సోలిని జీవితాన్ని నవల రూపంలో రచించాను. అది ఫిబ్రవరీ నెల చిత్ర మాసపత్రికలో అనుబంధ నవలికగా ప్రచురితమవుతోంది.నవల చదివి మీ అభిప్రాయాన్ని తెలపండి.

చిత్ర మాస పత్రిక అడ్రెసు..డోర్ నంబర్; 40-26-7, శ్రీ సై బృందావనం, 4వ అంతస్తు, చంచ్రమౌళీపురం, శ్రీ రామ నగర్ కాలనీ, విజయవాడ-10–ఫోను; 0866-2479944.

January 28, 2014 · Kasturi Murali Krishna · One Comment
Posted in: నా రచనలు.

చరిత్రపుటల్లోంచి వార్త ఆదివారం అనుబంధంలో…

గ్రీకు, రోమన్ నాగరికతలు వర్ధిల్లుతున్న సమయంలో అనాగరిక తెగలుగా భావించే సెల్టిక్ తెగలు నాగరీకుల తలదన్నే రీతిలో కోట నిర్మించారని తెలిసింద్. వారు కోటలు ఎలా నిర్మించారు, అందుకు దారి తీసిన పరిస్థితులు, సెల్టిక్ తెగల జీవన విధానాలు తెలిపే కథ ఈ ఆదివారం వార్త దినపత్రిక అనుబంధంలో, చరిత్ర పుటల్లోంచి, శీర్షికలో చదవండి.

January 26, 2014 · Kasturi Murali Krishna · No Comments
Posted in: నా రచనలు.