Archive for the ‘సభలూ-సమావేశాలు.’ Category

హాసం సభ విశేషాలు!

ప్రతి నెల చివరి శనివారం, త్యాగరాయ గాన సభ మినీ హాలులో హాసం సభ్యుల సమావేశం జరుగుతుంది. ఇందులో జోకులు, పాటలు వుంటాయి. ఈసారి సభలో విన్నకోట మురళీ కృష్ణ గారిని నారాయణ రెడ్డి గారు సన్మానించారు. విన్నకోట గారు లలిత సంగీతం గురించి సోదాహరణంగా వివరించారు. తరువాత నేను రాధాకృష్ణ గారూ ముకేష్ కు స్మృత్యంజలి సమర్పించాము. మా కార్యక్రమం అందరినీ అలరిస్తోందని సభలో పెరుగుత్న్న సంఖ్య నిరూపిస్తోంది. సభ యిన తరువాత మమ్మల్ని చుట్టుముట్టి అభినందనలు, సూచనలు ఇస్తున్న వారి ఉత్సాహం మా కార్యక్రమం ఎంతగా అలరిస్తోందో తెలుపుతోంది. అందుకే కార్యక్రమ నిర్వహణలో మారింత శ్రద్ధ తీసుకుంటున్నాను. ప్రేక్షకులు మా కార్యక్రమం కోసం చివరివరకూ వుండడం ఆనందన్ని కలిగిస్తోంది. ఈసారి సభకు అద్దేపల్లి రామమోహనరవుగారు వచ్చి, అభినందించారు. ప్రతినెలా తప్పకుండా వచ్చి మా కార్యక్రమాన్ని చూస్తానన్నారు.

వచ్చేనెల 22న షమ్మికపూర్ పుట్టిన రోజు. ఆ సందర్భంగా షమ్మికపూర్, తుం ముఝే యూన్ భులానపావోగే, అన్న కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాను. అందరూ వచ్చి అభిప్రాయాన్ని తెలపాలి.

నిన్నటి కార్యక్రమ వివరాలు ఫోటోల్లో….

Image031

Image021

Image012Image013Image020Image032

Image001

September 27, 2009 · Kasturi Murali Krishna · 3 Comments
Posted in: సభలూ-సమావేశాలు.

ఆహ్వనం

ఈ రోజు త్యాగరాయగాన సభ మిని హాలులో హాసం క్లబ్ నిర్వహించే కార్యక్రమంలో ముకేష్ స్మృత్యంజలి. ఆహ్వనపత్రికinvitation

September 25, 2009 · Kasturi Murali Krishna · No Comments
Posted in: సభలూ-సమావేశాలు.

శ్రీకాకుళంలో తీవ్రవాదం, మైకెల్ జాక్సన్…

ఈ ఆదివారం అంటే 13.09.2009 రోజున శ్రీకాకుళంలో తీవ్రవాదం, మైకెల్ జాక్సన్ పుస్తక పరిచయ సభ. అందరికి ఇదే నా అహ్వనం.invitation

September 10, 2009 · Kasturi Murali Krishna · No Comments
Posted in: సభలూ-సమావేశాలు.

నిడదవోలు మాలతి గారి సభ!

లేఖిని సంస్థ ఆధ్వర్యంలో త్యాగరాయగానసభ మినీ హాలులో ఒక సభ జరిగిందీవేళ. తెలుగు సాహిత్యాన్ని అంతర్జాతీయస్థాయికి అనువాదాలద్వారా తీసుకువెళ్తున్నందుకు అభినందన సభ ఈసభ.

సభలో వాసా ప్రభావతీ దేవి గారు, సుధామ, పోరంకి దక్షిణామూర్తి గార్లు పాల్గొన్నారు.

మంకలవాటయిన సభల్లో ముందుగా వక్తలు తమ వక్తృత్వ ప్రఙ్నా ప్రావీణ్యాలను సభికుల ఓపిక నశించినా పట్టించుకోకుండా ప్రదర్శిస్తారు. ఆతరువాత రచయిత కుటుంబ సభ్యులు, లైట్లార్పి తాళాలేసుకునేందుకు హాలువారు తప్ప ఎవరూ మిగలని పరిస్థితిలో రచయితను మాట్లాడమంటారు.

ఇందుకు భిన్నంగా, వాసా ప్రభావతిగారు, పోరంకి దక్షిణామూర్తి గారు మాట్లాడగానే నిడదవోలు మాలతిగారిని మాట్లాడమన్నారు.

నిడదవోలు మాలతిగారు చక్కగా మాట్లాడారు. అనువాద రచనల అనుభవాలను పంచుకున్నారు. సాధకబాధకాలను వివరించారు. తన బ్లాగులోని రచనలను కాపాడుకునే బాధ్యత పాఠకులది, రచయితల్ది అన్నారు. అందుకు స్పందించిన లేఖిని వారు, అనువాద కథల పుస్తక ప్రచురణకు ప్రయత్నిస్తామన్నారు. దక్షిణామూర్తిగారు, తన వంతుగా 1116/- ప్రతి పుస్తకానికీ ఇస్తామని వాగ్దానం చేశారు.

తరువాత మాలత్గారికి ఙ్నాపికను అందించారు.

సభలో మాలతిగారు, బ్లాగులను, బ్లాగర్లను ప్రస్తావించారు.

అయితే, సభకు రెండురోజులముందే మాలతిగారిని సుజాతగారింట్లో కలిసినప్పుడు ఒక విషయం అర్ధమయింది.

తెలుగు రచయితలు, అమెరికాలోవున్నా, ఆంధ్రప్రదేశ్ లో వున్నా, ఏ ఉద్యమాలకు, గుంపులకు చెందకపోతే వారి బాధలన్నీ ఒకేరకం.  అందుకే మాలతి గారిని కలిసిన తరువాత ఇంటికి వెళ్తూంటే సాహిర్ పాటలోని పంక్తులు మాటి మాటికీ గుర్తుకువచ్చాయి.

అప్నా సుఖ్ భీ ఏక్ హై సాథీ, అప్నా దుఖ్ భీ ఏక్
అప్నీ మంజిల్ సచ్ కీ మంజిల్, అప్నా రస్తా నేక్.

మన సుఖ దుహ్ఖాల స్వరూపమొక్కటే. మన గమ్యం సత్యం. మన దారికి స్వచ్చం.

కాబట్టి ఆపాటలో సాహిర్ చెప్పినట్టు, ఏ ఉద్యమాలకు, సిద్ధాంతాలకు, గుంపులకు చెందని రచయితలంతా, సాథీ హాథ్ బఢానా, ఏక్ అకేలా థక్ జాయేగా, మిల్ కర్ బోఝ్ ఉఠానా( ఒంటరిగా ఒక్కరే బరువు ఎత్తటం కష్టం. ఒకరికొకరు చేయి చేయి కలిపి సమిష్టిగా బరువుమోయాలి) అని కలవాలి. సాహిత్యాన్ని బ్రతికించాలి. అందుకు, మాలతిగారి రచనలను రచయితలంతా కలసి ప్రచురించటమనే చర్య ప్రేరణ అవుతుందేమో చూద్దాం.

సభ విశేషాలు ఫోటోల్లో…..

Image000Image014Image007Image008

August 11, 2009 · Kasturi Murali Krishna · 7 Comments
Tags: , ,  · Posted in: సభలూ-సమావేశాలు.

ఎస్వీరామారావుగారికి స్వర్ణకంకణం!

ఇవాళ్ళ సాయంత్రం త్యాగరాయగానసభలో ఎస్వీరామారావుగారికి స్వర్ణకంకణ ప్రదానం జరిగింది.

ఎస్వీరామారావుగారు సినీ విఙ్నాన విశారద. రేడియోలో, టీవీలో, పత్రికలలో ఆయన సినిమా సంబంధిత సమాచారాన్ని విశ్లేషణాత్మకంగా, వినోదాత్మకంగా వివరిస్తున్నారు.

సభలో తితిదేకు చెందిన రమణమూర్తి గారు, ఆంధ్రప్రదేశ్ పత్రిక సంపాదకులు వల్లీశ్వర్ గారు, ఎంబీయస్ ప్రసాద్ గారు, కేబీ లక్ష్మి గారు, ముదిగొండ శివప్రసాద్ గారు, దూరదర్శన్ యాంకర్ విజయదుర్గ గారు, సినీ నటులు గుమ్మడి గారూ పాల్గొన్నారు.

సభకుముందు సినిమా పాటల కార్యక్రమం జరిగింది. ఇది రాత్రి ఎనిమిది వరకు సాగటం విసుగు కలిగించింది.

ఆతరువాత సభ మూడును వల్లీశ్వర్ గారు నిర్దేశించారు. ఆయన తరువాత ఎవరుమాట్లాడినా వల్లీశ్వర్ గారు చెప్పినవే చెప్పాల్సివచ్చింది. అంత అద్భుతంగా వుంది వారి ఉపన్యాసం.

సభ హాయిగా, కులాసాగా సాగింది.

ఆ సభ విశేషాలు ఫోటోల్లో…..

Image010Image020

Image028Image029

Image030Image031

Image032Image033

Image034Image035

Image036

Image037Image038

Image041

August 3, 2009 · Kasturi Murali Krishna · One Comment
Tags: , , , , , ,  · Posted in: సభలూ-సమావేశాలు.