Archive for March, 2008

కాలయంత్రంలో క్లార్క్

ఈ రోజు (30 మార్చ్ 2008) వార్త ఆదివారం అనుబంధంలో నేను రాసిన ‘ కాలయంత్రంలో క్లార్క్ ‘ అనే కథనం ప్రచురితమైంది. ఆ కథనాన్ని ఇక్కడ చదివి మీ వ్యాఖ్యలు రాయండి

arthur-clark.pdf

March 30, 2008 · Kasturi Murali Krishna · No Comments
Tags:  · Posted in: కవర్ స్టోరీ

కురిసింది వానా నా గుండె లోనా……

వరుసగా మూడు రోజులనుంచీ హైదరాబాదు లో వర్షం కురుస్తోంది.ఇన్ని రోజులూ ఇంట్లో కూర్చుని పడుతున్న వర్షాన్ని చూస్తూ గడిపాను.నిన్న వర్షంలో తడిసాను.ధారాపాతంగా వర్షపు నీటి చుక్కలు శరీరం మీదపడుతూంటే అప్రయత్నంగా,నా ప్రమేయం ఏమీ లేకుండా గుండె లోతుల్లోంచి అనేక పాటలు ఒకదాని వెనుక మరొకటి తన్నుకు వచ్చాయి.కరువుతీరా పాడుకుంటూ ద్రైవ్ చేసుకుంటూ వర్షంలో తడిసా.
ముందుగా పెదిమలపైకి వచ్చింది…కురుసింది వానా నా గుండె లోనా…అంతలో,ఒక జంట వర్షంలో నీడ కోసం పరుగెత్తుతూ కనిపించారు.చిట పట చినుకులు పడుతూ వుంటే…నవ్వుకుంటూ సంతోశంగా పాడుకున్నాను.
ఇంతలో, ముగ్గురు పిల్లలు వర్షంలో తదుస్తూ కనిపించారు.కళ్ళముందు రాజ్ కపూర్,నర్గీస్ లు మెదిలారు.ప్యార్ హువా ఇక్రార్ హువా……వహ్ ,నిజంగా ధన్యజీవులు అనిపించింది.రొమన్స్ కు నిర్వచనం ఇచ్చరు.
కాస్తముందుకు వెళ్ళగానే,ఒక చెట్టు చాటున ఒక యువ జంట రొమాన్స్ కనిపించింది.వెంటనే నా మన్సులో దెవానాంద్,వహీదా లు మెదిలారు.రింఝింకే తరానే లేకే అయీ బర్సాత్,యాద్ అయీ కిసీసే వో పహ్లీ ములాకాత్…అహాహా…బర్సాత్ మే బర్సాత్ మే హంసె మిలే తుం సజన్ తుంసె మిలే హుం బర్సాత్ మే…….
ఇంతలో సరిపొయీ సరిపొని షెల్టెర్ కింద ఓ జంట కనిపించింది.నా కళ్ళముందు,దెవానంద్,నూతన్ కదిలారు .యే బహారే యే పుహారే యే బరస్తా సావన్ ధర్ధర్ కాంపే తన్మన్ మొరె బయ్యా ధర్లో సాజన్ అంది నూతన్.అజీఅనా దిల్‌మే సమానా అన్నడు దెవ్.రొమన్స్ కి పరాకష్ట అది.చోడ్ దో ఆంచల్ పట అది.పేయింగ్ గెస్ట్ సినెమా లోది.

అయితే,ఇంతలో నాకోసం, ఇంట్లో, వర్షాన్ని చూస్తూ,ఒకో నీటి చుక్కన్ని చూస్తూ, ఎదురుచూస్తున్న అమ్మాయి గుర్తుకువచ్చింది.ఓ సజ్ఞా……..ముత్యలు జాలువారినట్టు జాలువారుతునా నీటి బిందువులను సంగీతం ద్వార కనిపింపచేస్తాదు సలీల్ చౌధరీ.ఓ సజ్ఞా,బర్ఖా బహార్ అయీ,రస్కీ పుహార్ లయీ,అఖియోమె ప్యార్ లయీ ఓ సజ్ఞా.ఇక నాకు మరో పాట గుర్తుకు రాలేదు.ఈ పాటలోని ప్రతి అక్షరం,ప్రతి పదం,ప్రతి శబ్దం తలుచుకుంటూ,వింటూ,పాడుకుంటూ,మైమరచి పోయాను.వర్షం తగ్గితే బాధ అనిపించింది.ఫిర్కే వొ సావన్ అబ్ క్యూ న అయే..అనిపించింది.
వర్షంలో నా అనుభూతిని మీతో పంచుకోవాలనిపించింది.అయితే,ఇంత ఆనందంలోనూ ఒక అలోచన వచ్చింది…ఒకవేళ ఈ సినెమాలు,పాటలు మనకు ఈ రొమాంటిక్ వూహలు ఇవ్వకపోయివుంటే?బహుశా,మనము స్వంతంగా మన మనసులోని భావాలను వ్యక్త పరిచే ప్రయత్నం చేసేవరమేమో?అరువుభవాలతో అలౌకిక అనాందం పొందే బదులు,స్వంత ఆలోచనలతో ఆనందించే వారమేమో?కానీ,దేవ్,రాజ్కపూర్లు లేకపోతే రొమాన్స్ ఏమయిపోతుంది?అందుకే ఆ అలోచనని పక్కకు నెట్టి హాయిగా ఓ సజ్ఞా అంటూ ఇంట్లో అడుగుపెట్టా. 

March 27, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

నేను చదివిన మంచి పుస్తకం-1

మన తెలుగు సాహిత్య ప్రపంచములో విమర్శ అన్నది అంతగా విశాలం కాలేదు.దీనికి అనేక కారణాలు వున్నాయి.వుద్యమ సాహిత్యానికిచ్చిన ప్రాధాన్యం మానవతా విలువలున్న సాహిత్యానికి ఇవ్వటంలేదు.పేరున్న రచయితలకు ఇచ్చిన ప్రాధన్యం కొత్త రచయితలకు ఇవ్వటం లేదు.తెలిసినవారు,ఎవరినయినా పొగిడితే లాభం వుండేవారు,తాము నమ్మిన ఇజాన్నే నమ్మేవారు ఇటువంటి వారి రచనలను ఆకాశానికి అర్హత లేకున్న ఎత్తేయటం జరుగుతొంది.ఇవన్నే లేకపోతే మంచి రచన చేసినా అవి మరుగున పడిపోతున్నాయి.ఎందుకంతే విమర్శకులు వాటిని పాథకుల ద్రిష్టికి తేవటం లేదు.వారికి తమ లాభం తప్ప సాహిత్య అభివ్రుద్ధితో పని లేదు.అందుకే తెలుగు లో ఇప్పటికే కొంతమంది పాత రచయితల పేర్లే వినిపిస్తూంటాయి.కొత్త రచయిత పేరు వినిపిస్తే ఆ రచయిత పేరు వినపదటం వెనుకు బోలేడన్ని కథలుంటాయి.ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే రచయిత పేరుతో,పార్టీ తో, సామజిక స్థాయితో సంబంధం లేకుండా చూస్తే ఎక్కువమందికి తెలియని అనేక రచయితలు అద్భుతమయిన కథలు రచిస్తూ కనిపిస్తారు.అటువంటి రచనలను పరిచయం చేస్తాను నేను వీలున్నప్పుడల్లా.నా వాదనకు రుజువుగా పరిచయం చేస్తున్న మొదటి కథా సంకలనం “అమ్మకు అభినందనలు.రచయిత్రి పేరు “ం.హేమలత”.

ఈ సంకలనంలో కథలు చదువుతూంటే ఆశ్చర్యం కలుగుతుంది.ఎందుకని ఈ రచయిత్రి కథలగురించి చర్చలు జరగటంలేదు?ఎందుకని ఈమె పేరు మంచి రచయితల జాబితాలో వినిపించదు?ఎందుకని ఏ విమర్శకుడూ ఈమె పేరు ప్రస్తావించడు?

ఈ సంకలనం లోని కథలన్నీ ఒక ప్రయొజనం వున్నవే.ప్రతి కథలో నిత్యజీవితంలో మనము ఎదుర్కొనే సమస్యల చిత్రణ,వాటి వివరణ,పరిశ్కారాలూ ప్రతిభావంతంగా ప్రదర్శితమవుతాయి.సాద్గారణంగా మన రచయితలు కథాంశాలుగా ఎంచుకోని వైద్య సంబంధిత అంశాలు కేంద్ర బిందువుగా అనేక కథలు నడుస్తాయి.మన అపోహలు తొలగించి సరయిన ద్రుక్కోనాన్ని ఇస్తాయి.అల్జేమియర్,మ్ర్సీ కిల్లింగ్,హిస్టెరెక్టొమీ వంటి విశయాలను వివరించి సందేహాలు తీరుస్తాయీకథలు.ఇంత మంచి కథలగురించి ఏ విమర్శకుడూ విశ్లేశించడు.ఏ సంస్థా బహుమతులివ్వదు.కాబట్టి విమర్శకులతో సంబంధం లేకుండా పాథకులే మంచి కథలను వెతుక్కోవాలి.వాటిని బ్రతికించు కోవాలి.కథకులకు ఉత్సాహాన్నీ,ప్రోత్సాహాన్నీ ఇవ్వాలి.తెలుగు సాహిత్యాన్ని పరిపుశ్టం చేయాలి.

March 25, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: pustaka paricayamu, పుస్తక పరిచయము

ఒక హోలి-రెండుసినిమాలు-రెండు పాటలు.

హోలి పండుగ అనగానె రెండు అద్భుతమయిన సినిమాలు గుర్తుకు వస్తాయి.ఎందుకంతే,హోలి పాటలు అనేక సినిమల్లో వున్న,ఈ రెండు సినిమాలలో హోలి పాటలు.హెరో హెరొఇనుల సరసాలకు పరిమితంకావు.ఇవి సినిమా గమనములో కీలకమయిన పాత్రను వహిస్తాయి.పాత్రల వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తూ,కథను కొత్త మలౌపు తిప్పి,సినిమా స్వరూపాన్ని సంపూర్ణంగా మారుస్తాయి.
ఆన్,కోహినూర్,గోదాన్ వంటి సినిమాలలొని హోలి పాటలు మధురంగా వుండటమే కాదు,మంచి ప్రాచుర్యం పొందాయి.అలాగే,కటీ పతంగ్,సిల్సిలా లాంటి సినిమాలలో పాటలు హిట్ అయ్యాయి.అయినా ఆ పాటలు సినిమాలోంచి తొలగించినా పెద్ద నశ్టం ఏమీ వుండదు.కానీ,మదర్ ఇండియా లోని హోలీ పాటను తొలగిస్తే సినిమా ముందుకు నడవదు.ఆ పాట సందర్భం కీలకమయినది.పాట ఆరంభంలో పలీటూరి వారి సరసాలు ఆహ్లాదకరంగా చూపుతాదు.కాని,నెమ్మదిగా అది సునీల్ దత్ పాత్రకూ,జమీందారు కూతురి పాత్రకూ నడుమ చెలగాటంలా మారుతుంది.ఆమె కావాలని సునీల్‌దత్ తల్లి కుదువబెట్టిన బంగారు గాజులను అతనికి చూపి రెచ్చగొడుతూంటుంది.చివరికి సునీల్‌దత్ ఆమె చేతినుంచి గాజులు లాక్కోవాలని ప్రయత్నిస్తాడు.అంతా అపార్ధం చేసుకుంటారు.చివరికి ఎటువంటి పరిస్థితివస్తుందంటే,సునీల్‌దత్ వూరినుంచి పారిపోవాల్సివస్తుంది.దొంగలతో కలసి వూరిమీదకు దడికివస్తాడు.తల్లి చేతిలో మరణిస్తాదు.ఈ జరగబోయే కథకు హోలి పాట నాంది పలుకుతుంది.
అలాగే,షోలే సినిమాలో హోలీ పాట కీలకమయినది.ఇదికూడ ముందు హేమా,ధరం ల శ్రుంగార గీతంలా వున్నా పాట అయిపొయేసరికి ద్రుశ్యం మారిపోతుంది.గబ్బర్ సేన వూరిపయి దాడి చేస్తుంది.గబ్బ్ర్కు హీరోల పరిచయం అవుతుంది.హీరో లకు గబ్బర్ తెలుస్తాడు.ఒకరి శక్తి మరొకరు అంచనా వేసుకుంటారు.హాయిగా ఆడుతూ,పాడుతూ సాగె ద్రుశ్యం హథాత్తుగా గందరగోళంగా మారటం చాలా ఎఫెక్టివ్ గా వుంటుంది.
ఒక రకంగా చూస్తే మదర్ ఇండియా సినెమా పాటకూ,శోలే సినెమా పాట్కూ బణీలో లేక పోయినా సన్నివేశ స్రుష్టీ కరణలో పోలికలు కనిపిస్తాయి.అయినా ఈ రెండు పాటలు ఈతర హోలీ పాటలకు భిన్నంగా స్క్రిప్టు లో బాగా వొదిగి సినెమ్మ లను ఉన్నత స్థాయికి చేరుస్తాయి.

March 22, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: sinemaa vishleashaNaa.

మన సినెమాలు నిజంగా మారుతున్నాయా?

(మన సినెమాలు అంటే నా ఉద్దేశ్యంలో తెలుగు,హిందీ సినెమాలు}.ఈమధ్య చాలా మంది విమర్శకులు మన సినిమాలు మారుతున్నాయని అంటున్నారు.ఇందుకు ఉదాహరణగా వారు కొన్ని హిందీ సినిమాలను చూపిస్తారు.బ్లాక్,రంగ్‌దే బసంతీ,తారే జమీన్ పర్,ఇంకా ఇటువంటి కొన్ని సినెమాల జాబితా చెప్తారు.ఇవన్నీ మామూలు మూస సినిమాల కన్న భిన్నమయినవే అయినా మౌలికంగా మన ధోరణిలో మార్పు రాలేదనిపిస్తుంది.ఎందుకంటే, మన ఇండస్ట్రీ లో ఒరిజినల్ స్క్రిప్టులు లేవు. ఈ కొత్త సినెమాలలో మన వాతావరణం కనబడదు.అవి హాలీవుడ్ సినిమాల స్థాయిలోనేకాదు,అవి హాలీవుడ్ సినిమాలలాగే వుంటున్నయి.అందులో కనపడే పాత్రలు,సన్నివేశాలు,వారి మనస్తత్వాలు అనే అరువువే.అవి చూస్తూంతే మనము వారిలాగా అయిపోయామా అనిపిస్తుంది.రంగ్‌దె బసంతీ,తారే జమీన్ పర్, గాంధీ మై ఫాదెర్ లాంటి కొన్నిటిని వదిలేస్తే మిగతావన్నీ పాత సినెమాల కాపీలో ,హాలీవుడ్ కు నకళ్ళో అవుతాయి.ముఖ్యంగా భట్ సినెమాలు,సంభాషణలతో సహా హలీవుడ్ దిగుమతులే.కొందరు ఈ సినెమాలను తెలివిగా మనకు తగ్గట్టు మారుస్తే ఇంకొందరు అంత కశ్టం కూడా పడటంలేదు.మాటల్లో కూడా ఆంగ్ల పదాలు బోలెడన్ని దొర్లుతాయి.కొన్ని సినిమాలలోనయితే నటీ నటులు అనర్గళంగా ఆంగ్లంలోనే మాట్లాడేస్తారు. ఎన్ని కొత్త కొత్త హాలీవుడ్ కథలు దిగుమతి చేస్తున్నా వాటిలో ప్రేమ,ఐటం పాట వంటివి తప్పటంలేదు.తారే జమీపర్ సినిమాలో కూడా మన పాత సినిమల్లోలాగ హీరో సకల సద్గుణాల రాశి.అతడికితప్ప పిల్లలగురించి ఇంకెవరికి తెలియదు.మిగతా టేచర్లు పనికిరానివారు.ఆ సినిమా ఆమీర్‌ఖాన్ కబట్టి ధైర్యం చెయగలిగాడు.మరెవ్వరూ అది తీయగలిగేవారు కారు.అంటేనే అర్ధం అవుతుంది మనం మారలేదని.
ఇక తెలుగు సినెమాల దగ్గరకు వస్తే,హిందీలో కనీసం మారె ప్రయత్నం జరుగుతోంది.మన చిన్న హీరోలు ఇంకా వందమందిని తంతూనే వున్నారు.గాలిలో ఎగుర్తూ ఫైటింగులు చేస్తూనే వున్నారు. నాయికలు వొళ్ళు చూపేందుకు, ముద్ద్లు వొలికేందుకే వుపయోగపదుతున్నారు.కథతో సంబంధం లేకుండా హస్యగళ్ళు వెకిలి వేశాలు వేస్తూనే వున్నారు. సాంకేతికంగా మనం హాలీవుడ్ స్థాయిలో వున్నా స్క్రిప్ట్ పరంగా మాత్రం ఎటువంటి అభివ్రుద్ధి లేదు.హీరొయిజం కు వున్న ప్రాధన్యం సినిమాకు లేదు.హిందీ అయినా తెలుగు అయినా అందుకే మనం మారుతున్నామనీ,మన స్థాయి హాలీవుడ్ స్థాయి అని అనుకుంటూన్నా మనం మాత్రం మన పాత సినిమాలతో పోల్చుకుంటే దిగజారుతున్నము తప్ప ఎదగటం లేదు.పాత వాళ్ళు పరాయి సినెమాలను స్ఫూర్తిగా తీసుకున్నా వాటిని స్వంత సినెమాలుగా మలచేవారు.టేమింగ్ ఆఫ్ ద శ్రూ అనే డ్రామా హిందీ లొ ఆన్ గా,తెలుగులో గుండమ్మ కథ గా మరిందంటే నమ్మలేము.అలాగె బెక్కెట్ అనే సినెమా తెలుగులో ప్రా
న స్నేహితులు గా,హిందీలో నమక్ హరాం గా మారిందటేకూడా నమ్మలేము.అందుకే మనము మారుతున్నమా దిగజారుతునామా అని నా సందేహం. 

March 21, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: sinemaa vishleashaNaa.

ఆర్థర్ సి క్లార్క్-అద్వితీయ ద్రష్ట

ఆర్థర్ సి క్లార్క్ మరణించాడు.తాను స్రుజించిన రచనలలో ప్రదర్షించిన ఊహలన్నీ నిజమవటం చూస్తాడని నమ్మకంగా అనుకుంటూంటే అనూహ్యమయిన రీతిలో క్లార్క్ మరణించాడు.పుట్టింది బ్రిటన్‌లో నయినా క్లర్క్ విశ్వమానవుడు.ఎల్లలు లేనివి అతని రచనలు.విశాల విశ్వంలో విచ్చలవిడిగా విహరించాయి అతని వూహలు.అయితే అతని వూహలన్ని వైఙ్నానిక సిద్ధాంతాల ఆధారంగా ఎదిగినవే.తన జీవిత కాలంలో ఎన్నో ఊహలు నిజమయి ప్రపంచంలో జన జీవితంలో విడదీయరాని భాగమవటం ఆయన చూశారు.ఇంకా మానవుడు అందని ఆకశం వయిపు ఆశగా చూస్తూన్నప్పుడే ఆయన భూమి చుట్టూ నిర్ణీత కక్షలో తిరుగుతూ తరంగాల ద్వార సమాచారాన్ని అందించే ఉపగ్రహాల ప్రతిపాదన చేశాడు. ఆ ప్రతిపాదన ఆధారంగా పరిశోధనలు చేసి శాశ్త్రవేత్తలు ఉపగ్రహాలకు రూపకల్పన చేశారు.ఆకాశంలో విహరించాలన్న అయన కోరిక అతడిని సైన్స్ ఫిక్కన్ రచయితగ మలచింది.2001 స్పేస్ ఒడిసి ఈనటికీ సైన్స్ ఫిక్షన్ సినెమా లకు ప్రామాణికం.రెండవూ విత్ రామా అద్భుతమయిన రచన.ఇతర రచయితలకు భిన్నంగా గ్రహాంతర వాసులను ఆయన శత్రువులలా చూడలేదు.ఆయన ద్రుశ్టిలో వారూ మనలాగే స్నేహ హస్తాం సాచే వారు.ఆయన ప్రతిరచనలో అనేక వైఙానికాంశాలు పఠకులకు తెలుస్తాయి.సామాన్యులే కాదు శాస్త్రవేత్తలు కూడా ఆయన రచనల కోసం ఎదురుచూసేవారు.తన రచనలలో ఆయన ప్రతిపాదించిన సిధాంతాల ఆధారంగా పరిశోధనలు చేసేవారు.అందుకే అమెరికాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆయనను గౌరవించారు.ఆయన శ్రీలంక లో స్థిరపడ్డారు.మన దేశంలో ఉపగ్రహ ప్రసారాలు ఆరంభమయ్యే సమయంలో అప్పటి ప్రధాని రాజీవ్ క్లార్క్ కు డిశ్ ను గౌరవ సూచకంగా సమర్పించాడు.అమెరికన్లు చంద్రమండ్ల ప్రయోగాలు చేసెటప్పుదు క్లార్క్‌ను గౌరవ అతిథిగా పిలిచారు.క్లార్క్ కు అంతరిక్షంలో విహరించాలని ఎంత కోరికగా వుండేదంటే సముద్రగర్భంలో పరిశోధిస్తూ అంతరిక్షంలోని భారరహితస్థితిని అనుభవిస్తున్నననుకును ఆనందించేవాదు.అతిగా సముద్రంలో వుండటంవల్ల అయన కళ్ళు దెబ్బతిన్నాయి.అయిన అతడి పరిశోధనాసక్తి తగ్గలేదు.ప్రపంచమానవుల నడుమ శంతిని అవగాహనను కాన్కించిన క్లార్క్ విశ్వమానవుడు.వైఙానికాంశాల ఆధరంగా భవిశ్యద్దర్శనం చేసిన క్లార్క్ ద్రశ్త.సైన్స్ ఫిక్షన్ కు శాస్త్రవేత్తల గౌరవం లభించేట్టు చేసి సహిత్యంలో ఉన్నత స్థనన్ని ఆపదించిన క్లార్క్ నిజంగా ద్రశ్టనే.అతడికి నా నీరాజనాలు.  

March 20, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: neerajanam