Archive for March, 2008

అయ్యో పాపం తస్లీమా!

అనాది నుంచి మన దేశం ఎందరెందరికో ఆశ్రయమిచింది.ప్రపంచవ్యాప్తంగా అత్యాచారాలకు గురయిన ఎన్నెన్ని జాతులో భారత దేశంలో ఆశ్రయంపొందాయి.స్వేచ్చగా,గౌరవంగా వర్ధిల్లాయి. వినదగునెవ్వరు చెప్పినా అంటూ అన్నిరకాల అభిప్రాయలను గౌరవించాము.అందరినే ఆదరించాము.మనలను వ్యతిరేకించిన వారిని కూడ ప్రేమించాము.మనల్లో ఒకరిగా చేసుకున్నాము.గ్రేకులు,హూణులు,శకులు,దరదులు,బాహ్లేకులు,యూదులు,పార్సీలు ఒకరేమిటి భార్తదేశమనే మహా సముద్రంలో ఎన్నెన్నో ఉపనదులు మిళితమయి పోయాయి.దేశాన్ని సుసంపన్నం చేశయి.కాని ఇప్పుడిది ఏమిటి?భిన్నభిప్రాయలను వాదన ద్వారా,చర్చల ద్వారా,తర్కం ద్వారా ఎదుటి వాడి అభిప్రాయాన్ని తప్పని చూపించి ఒప్పించేవారు.వాదనలో ఓడిపోయినవారు సైతం ఎటువంటి అసూయలు,ద్వేశాలు లేకుండా నిజం ఒప్పుకునేవారు.కానే ఇదేమిటి,ఒక మహిళకు ఆశ్రయం ఇవ్వలేని దుస్థితిలో వున్నము మనము.కొందరి బెదిరింపులకు లొంగి పోయి ఒక స్రుజనాత్మక రచయిత్రిని మానసికంగా హింసించటం మన భారతేయులందరికి సిగ్గుచేటు.ఇంత పెద్ద దేశంలో అడిగిన వారికి రక్శణనివ్వటం కోసం ప్రాణాలనయినా ధారపోసే సంప్రదయం కల దేశంలో ఒక మహిళ భారం అయిపోవటం అన్యాయమయిన విశయం.ఇలా బెదిరింపులకు లొంగిపోతూవుంతే ప్రభుత్వం ఎంతగా చులకన అయిపోతుంది?ఎవరికయినా బెదిరింపులతో పనులు సాధించుకోవచ్చన్న అభిప్రాయం కలుగుతుంది.ఇక ప్రభుత్వాన్ని ఎవరు గౌరవిస్తారు?ఇప్పతికే కోర్కెల సాధనకు బెదిరింపులు,అల్లర్లు బందులు ఆనవాయితేలయ్యాయి.ఇలా కొందరి నిరసనకు ప్రభుత్వం తలవంచటం ఇలాంటి ఇంకెందరికో ధాఇర్యాన్ని ఇస్తుంది.నువ్వన్నదానితో ఎకీభవించకపోయినా నే అభిప్రాయాన్ని వ్యక్తపరిచే హక్కును గౌరవిస్తాననే మన సాంప్రదాయం పోయి,బెదిరిస్తే భయపది లొంగిపోయే పిరికి ప్రభుత్వాల కాలం మొదలయింది.ఇంత దేశం,ఇంత సైన్యం,ఇంతమంది పొలీసులు వున్నా ఒక మహిలకు భద్రత కల్పించలేకపోవటం సిగ్గుచేటు.రేపు ఇంకేవరయినా బెదిరిస్తే దేశన్నే అమ్మెసినా,మనం చూస్తూ వుండిపోయినా అశ్చర్యం లేదు.     

March 19, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

పాపం డూపు హీరోలు

మన హీరోల అసలు గుట్టు అందరికీ తెలిసినదె అయినా నిన్న ఒక దూపు మరణం గుట్టును రట్టు చెసింది.సినెమ అంటేనే లేనిదన్ని వున్నట్టుభ్రమ పెట్టటం.హీరొ కొండచివరికి వచ్చి ఆగితె డూపు డూకుతాడు.కొండ కింద హెరొ తల ఎగరెస్తాడు. మనం చప్పట్లు కొట్టి హెరొను పొగడుతాము.కొరియొగ్రఫెర్ స్టెప్స్ చూపిస్తే బాగా ప్రక్తిస్ చేసి ఎంతో ఎడిట్ చేస్తే మనం చూసే క్లిప్స్ తయారవుతాయి.మనం హీరొను పూజించి,అనుకరించి,కొట్టుకు చచ్చిపోతాం.కానీ, రచయిత స్క్రిప్ట్ రాస్తె,దర్శకుడు సూచనలిస్తె,సంగీతకరుడు బాణీకడితే,గాయకులు పాడితే ఇంకా అనేకులు ఎంతో ఎంతెంతో చేస్తే వారి శ్రమ ఫలితం హీరో అనుభవించెస్తూన్నడు.ఈ అభిమనాన్ని అంతా తన గొప్పలాగా స్వీకరించటమే అసలు నటన అయితే మన హీరోలు గొప్ప నటులే.అవునా?

March 18, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

నటన అంటే ఏమిటి?-ఒక ఆలొచన

ఒకో సారి ఆలొచిస్తే మనకు నటన అంటే సరి అయిన అభిప్రాయం లేదేమో అనిపిస్తుంది.ఎందుకంటె, ఒక నటుడు న్రుత్యాలకు పేరు పొందితే మరొక నటుడు యుధ్ధాలకు.ఒక నటుడు ముద్దులకు పేరుపొందితే ఇంకొకడు అద్రుశ్టం వల్ల.అంతే కాని నిజంగా నటనకు పేరుపొందినవారు బహు తక్కువ.పాత తరం లో ఎస్ వి రంగారావు,నాగభోశణం వంటి వారుండే వారు.ఇప్పటి తరంలో హాస్య నటులు తప్ప నిజంగా నటులే లేరేమో అనిపిస్తోంది.ఒక కమలహాసన్, ఒక ఆమీర్ ఖాన్,ఒక పరేశ్ రావల్ ఇలా వేళ్ళ మీద  లెక్క పెట్టచ్చు.మీరు ఏమంటారు? 

March 17, 2008 · Kasturi Murali Krishna · 4 Comments
Posted in: Uncategorized

జోధా అక్బర్-మరి కొన్ని ఆలొచనలు

జోధ అక్బర్ పైన నా అభిప్రాయం పైన మీ స్పందన చూసిన తరువాత ఇంకా కొన్ని విషయాలు ప్రస్తావించాలనిపించింది.చారిత్రాత్మక సినిమాలలో ఊహ తప్పనిసరి.కాని ఈ ఊహ వల్ల ఆయా పాత్రల పైన గౌరవం కలగాలి.పాత్రల వ్యక్తిత్వం మనకు అర్ధమవాలి.ఈ విషయం లొ మన చరిత్ర సినెమాలు వెనుకబడి వున్నాయి.అశోకా సినెమాలొ అశోకుడు పిచ్చి గెంతులు వేస్తాడు.మంగళ్పాండె నయితే అతి ఘోరంగ చూపారు. రామదాసు,అన్నమయ్యల గతి ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు.అంటే మెలో ద్రామా కోసం చరిత్ర తో ఆటలాడటం అలవాటయింది మనకు.ఇది మంచిది కాదు.సినెమా ఎంత శక్తివంతమయిన మాధ్యమం అంటే ఒక సినెమా లో ఒక అసత్యం చూపితే,అది సమాజం లో సత్యంగా స్థిరపడుతుంది.ముఘలేఅజం ప్రభావంతొ అకర్ భార్య జోధానే అన్న ఆలోచన స్థిరపడింది,చరిత్రతో సంబంధంలేకుండ.జోధా లో కూదా అనేక సంఘటనలు చరిత్రపైన తప్పుడు అభిప్రాయాలు కలిగించెట్టు వున్నాయి.రాజపుత్ర రాజుల ప్రవర్తన ఈ సినెమా లో వారి స్థాయికి తగ్గట్టు లేదు.మామూలు సినెమలలో లాగా రహస్యాలు అందరికీ తెలిసెటట్టు మాట్లాదటం హాస్యాస్పదంగా వుంది.అక్బర్ యుధ్ధానికి వెళ్తూ రాణికి చెప్పడు.జెనానా లో వుండె రాణి ఓ గుర్రం మేద యుధ్ధానికి వచ్చేస్తుంది. అక్బర్ వికేత.రాజపుత్ర రాజు స్వచ్చందంగా తన కూతురిని  పెళ్ళి చేసుకొమని అడిగాడు.అటువంటప్పుడు జోధ శరతులు పెట్టటంలో, అక్బర్  వాటికి ఒప్పుకోవటంలో ఔచిత్యం లేదు.నేపధ్య సంగీతం ఆకర్శణీయంగా వున్నా అది సందర్భోచితంకాదు.ఈ విశయంలో నౌశాద్ ముఘల్ సంగీతం గురించి చెప్పిన విశయాలు గమనించాలి.మనం అల్ప సంతోశులం కాబట్టి,వినోదానికి ఇచ్చిన ప్రాధాన్యం నిజాలకు ఔచిత్యానికి ఇవ్వం కబట్టి మన కళాకారులు బ్రతికిపోతున్నరు.

March 16, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

సినెమా రివ్యూ -జోధా అక్బర్

జొధా అక్బర్ చూసాను.సినెమాను పొగడాలొ విమర్షించాలొ తెలియటంలేదు.ఎందుకంటె,సినెమగా చూస్తె బాగానె అనిపిస్తుంది.నిడివి ఎక్కువ అయింది.ఉపొద్ఘాతం,అక్బర్ బాల్యము అనవసరము.మొదలే రాజపుత్రులతొ యుధ్ధం తొ ఆరంభిస్తె సమయం మిగిలేది.సినెమా లొ ప్రేమ ప్రాధాన్యం ఉందటంతొ చరిత్ర వెనుకబడింది. టైటనిక్ లొ లా అయింది. అటు చరిత్ర సినెమ గా ఎదగలేక ఇటు ప్రేమ సినెమా గా మిగలలేకా రెంటికి చెడ్డా రేవడి  అయింది. హ్రితిక్,ఐష్వర్య బాగావున్నారు. ఖర్చు బాగా చేసినా ముఘాల్ ఎ ఆజాం తో ఏ మాత్రం సరిపోలదు.

March 13, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

na real story in vaarthana real story in vaartha

March 12, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized, రియల్ స్టోరీస్