Archive for April 2, 2008

ఈ సినిమా తప్పకుండా చూడండి!

తప్పకుండా చూడండి.స్టీవెన్ స్పీల్బర్గ్ సినిమా ఇది.సినిమా ఐంద్రజాలికుడు స్పీల్బర్గ్ అని మరోసారి ఈ సినిమా నిరూపిస్తుంది.కేవలం వినోదభరైతమయిన సినిమాలే కాక ఆలోచింపచేస్తూ సామకాలీన సమాజంలోని సమస్యాత్మక అంశాలను కూడా అంతే ఇంప్రెసివ్ గా తెరకెక్కించగలడని ఈ సినిమా నిరూపిస్తుంది.కలర్ పర్పుల్ సినెమా ఆర్ధికంగా విజయవంతం కాలేదు.షిండ్లెర్స్ లిస్ట్ సినెమా లో మానవీయ విలువలు అంతర్లీనంగా వుండటంతో దాన్ని తెరకెక్కించటం పెద్ద సమస్య కాదు.కానీ మ్యూనిచ్ సినెమా తో చాలా సమస్యలున్నయి.

ముందుగా ఇది నిజంగా జరిగిన సంఘటన ఆధారంగా తీస్తున్న సినెమా.అంటే గాయాలు ఇంకా తాజాగానే వున్నాయన్నమాట.ఇప్పటికే ఇటువంటి సంఘటనలు జరుగుతూన్నాయి.ముఖ్యంగా తీవ్రవాదంపయిన పోరు జోరుగా సాగుతున్న తరుణంలో ఇటువంటి సినెమా తేయటం కత్తి మీద సాము లాంటిదే.పాలెస్తేనా వారిని విమర్శిస్తే ఒక బాధ.ఇజ్రాయెల్ వారిని పొగిడితే ఒక బాధ.ఏమాత్రం అజాగ్రత్తగా వున్నా తీవ్రవాదాన్ని సమర్ధించినట్టు అవుతుంది.కాబట్టి ఈ సమయంలో ఇలాంటి కథతో సినెమా నిర్మించటం ఎంతో ధైర్య సాహసాలతో కూడినటువంటిది.అంతే కాదు,తన సామర్ధ్యంపై ఎంతో విశ్వాసం వున్నవాడే ఇటువంటి అంశాన్ని ఎంచుకుంటాడు.స్వయానా యూదు జాతికి చెందినవాడు కాబట్టి ఏంచేసినా విమర్శలు,తిట్లు తప్పవు.కానీ ఈ అసిధారా వ్రతాన్ని అత్యద్భుతంగా,దిగ్విజయంగా నిర్వహించాడు స్పీల్బర్గ్.
నిజంగా జరిగిన సంఘటన కాబట్టి అధికంగా డ్రమటయిజ్ చేయలేదు.అలాగని ఆసక్తి ఎక్కడా కుంటు పడకూడదు.అందుకోసమని సినెమాలో కరెక్టెరైజేశన్ ను త్యాగం చేసాడు.ఒకా కథా నాయకుడి పాత్ర తప్ప మిగతా పాత్రలన్నీ పూర్తిగా మన మన్సుకు పట్టవు.వారి మానసిక సంఘర్శణలు మనకు చూపడు.
సినెమా కథ చాలా మామూలు.ఒలంపిక్స్ సమయంలో పాలెస్తీనా తీవ్రవాదులు ఇజ్రాయెల్ ఆటగాళ్ళని చంపేస్తారు.ప్రతిగా ఇజ్రాయెల్ ప్రభుత్వం తమతో ఏమాత్రం సంబంధం లేకుండా ప్రతీకారం తేర్చుకునే జట్టును ఏర్పరస్తుంది.ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజల ప్రాణాలతో ఎవ్వరూ చెలగాటం ఆడకూడదన్న నిజాన్ని ప్రపంచానికి చూపాలన్నది వాళ్ళ వుద్దేశ్యం.ఇందుకు మన హీరో ను ఎన్నుకుంటారు. అప్పుడు అతని భార్య గర్భవతి.అయినా దేశంకోసం అతడు ఆపనికి ఒప్పుకుంటాడు.ఇక సినెమా ఆరంభమవుతుంది.
ఒక జట్టును ఏర్పరచుకుని,తీవ్రవాదనికి ప్రోత్సాహం ఇచ్చిన వారిని చంపేయటం సినెమా కథ.చూస్తే ఒక మాంచి సస్పెన్స్ సినెమా తీయవచ్చు.కానీ స్పీల్బర్గ్ అలా చేయలేదు.సినెమాని ఒక వయిపు నుంచి డక్యుమెంటరీ లా చూపుతో మరో వయిపునుంచి నాణేనికి రెండు వయిపులను చూపలని ప్రయత్నించాడు.
తీవ్రవాదులను చంపుతూన్నా పాత్రలు మనసులో సంఘర్శణకు గురీవుతూనే వుంటాయి.ముఖ్యంగా హీరో పాత్ర భయాలను చూపినతీరు ప్రశంసనీయం.ఆ సంధర్భాలలో వాడినా కెమేరా కోణాలు,నీడలు ద్రుశ్య ప్రభావన్ని పెంచుతాయి.మరో వయిపునుంచి పాలెస్తీనా వారి నిస్సహాయ స్థితిని,హింస తప్ప మరొక దారి లేని వారి దుస్థితినీ అద్భుతంగా చూపిస్తాడు.ఒక పాలెస్తీనా తీవ్రవాదికి హీరో కు నడుమ జరిగిన సంభాశణ ప్రస్తుత పరిస్థితికి దర్పణం పడుతుంది.ఒకరిని చంపితే ఆ స్థానన్ని మరో తీవ్రవాది ఆక్రమించుకుంటాడు,ఈ హింసకు అంతం వుండదని హీరో గ్రహించినతీరు మనకు కూడా అదే ఆలోచనను కలిగిస్తుంది.అయితే ఈ సినెమాలో రెండు ద్రుస్యాలు అద్భుతంగా వున్నాయి.
తన ప్రాణం ప్రమాదంలో వున్నదని గ్రహించిన హీరో తన నెలల బాబు చేసే శబ్దాలను ఫోనులో విని ఏడ్చే ద్రుశ్యం ఎదను కలచి వేస్తుంది.ఎంతమంది తమ ప్రమేయం లేకుండా హింస వలయంలో చిక్కుకుని బాధ పడుతున్నారో అనిపిస్తుంది.అలాగే అందరినీ చంపిన తరువాత హీరో మానసిక సంఘర్శణ చూపిన తీరు అమోఘం.ముఖ్యంగా,భార్యతో సెక్స్ చేస్తూకూడా అతనికి హత్యలూ మారణ కాండలే గుర్తుకురావటం మనసును కదిలించేస్తుంది.అందుకే ఒక కమర్శీల్ సినెమాను కూడా తలచుకుంతే ఒక కళాఖండంలా ఎలా మార్చవచ్చో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది.అయితే.వంద్లమందిని చంపినా ఇంకా దాహంతీరక రక్షసుల్లా చంపులాటలకు సిద్ధమయ్యే మన హీరోతో ఈ హీరో ని పోలిస్తే మన సినిమాలు సినిమాలే కావేమో అనిపిస్తుంది.ఎంత హింసను విశాన్నీ మనం సమాజంలోకి దబ్బులిచ్చి మరీ ఆహ్వానిస్తున్నామో తెలుస్తుంది.అందుకే అందరూ తప్పనిసరిగా చూడాల్సిన సినెమా ఇది.

April 2, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: sinemaa vishleashaNaa.