Archive for April 3, 2008

నేను చదివిన మంచి పుస్తకం-2

క్రితం సారి నేను పరిచయం చేసిన పుస్తకం వివరాలు
అమ్మకు అభినందన,
రచయిత్రి-ఎం.హేమలత
ప్రతులకు-202,గాయత్రి అపర్ట్మెంట్స్.
ర్ద్.నొ 1,బంజారా హిల్స్.హైదెరాబద్-34.
వెల-రూ.120/-

ఈ సారి నేను రెండు పుస్తకాలను ఒకే సారి పరిచయం చేస్తున్నాను.ఎందుకంటే,ఈ రెండు పుస్తకాలలో ఒక సారూప్యత వుంది.
సాధారణంగా,మాండలీకంలో రచనలు అనగానే కొంతమందిలో చిన్న చూపు వుంది.సరిగా అర్ధం కావని,చదవటానికి కష్టంగా వుంటాయని ఇలా కొన్ని అపోహలు వున్నాయి.చాలా మటుకు వారి అపోహలలు నిజం కూడా.ఈ అభిప్రాయాన్ని తప్పని,నామిని సుబ్రహ్మణ్యం తన కథల ద్వారా నిరూపించాడు.అయితే,ఆ కథలు కూడా,ఒక స్థాయిలో వున్న వారి జీవితాన్నే ప్రతిబింబిస్తాయి. ఆ జీవితంతో మనకు పరిచయం లేకపోవటం వల్ల,రచయిత భావ వ్యక్తీకరణ లోని చాకచక్యం వల్ల ఆ కథలు మాండలీక సాహిత్యానికి ప్రామణికంగా నిలచి పోయాయి.కానీ ఆ తరువాత రచయితలు మాండలీకమంటే,కులాల రచనలే అనే అభిప్రాయాన్ని కలిగించారు.దాంతో,మాండలీక రచనలు,విమర్శకుల పొగడ్తలు తప్ప పాథకుల ఆదరణకు అంతగా నోచుకోలేదు.కానీ,ఇద్దరు రచయితలు ఇందుకు భిన్నంగా,మాండలీకంలో రచనలకు ఉత్తమ సాహితీ గంధంపూసి,వాటిని,అత్యుత్తమ సాహిత్యం సరసన సగర్వంగా నిలిచే రీతులో రచనలు చేసారు.భాష ఏదయినా రచయితకు భావనా బలం,రచనా చాతుర్యం వుంటే ప్రతి అక్షరం సరస్వతీ దేవి కంథాన అలంకరించే మణి హారంలో మణులా వెలుగుతుందని నిరూపించారు.మండలీక కథలకు సార్వజనీనతను ఆపాదించారు.ప్రబంధాల స్థాయిలో మండలీక కథలను రచించారు.తెలుగు సారస్వతంలో చిరస్థాయిగా నిలిచే రచనలు చేసారు.
గోపిని కరుణాకర్,సం.వెం.రమేష్ అనే ఇద్దరు రచయితలగురించి విమర్షకులు పెద్దగా మాట్లాడరు.ఎందుకంటే,వీరు వుద్యమాల గురించి,ఇజాల గురించి రాయరు.వీరు మానవుల జీవితాలలోని మధురమయిన అనుభవాలకు అక్షర రూపం ఇస్తారు.మనిషి జీవితం లోని సంఘర్షణల స్వరూపాలను ప్రకటిస్తారు.ప్రక్రుతి తో కలసి సహజీవనం చేసే మనవుడి జీవితం లోని సౌందర్యాన్ని ప్రదర్షిస్తారు.వసుధైక కుతుంబ మనే అత్యుత్తమ ఆలోచనను తమ కథల ద్వారా వెల్లడిస్తారు.
గోపిని కరుణాకర్ దీపం చెప్పిన కథలు ఒక క్లాసిక్.ఇందులో దీపాలు తమ అనుభవాలను,తాము చూసిన సంగతులను చెప్తూంటాయి.ఈ కథలు చదువుతూంటే మనం మధురమయిన మనో ప్రపంచ ప్రవాహంలో ఓలలాడతాము. భారతీయ జీవన విధనంలొ అత్యున్నతమూ,అత్యుత్తమమూ, అమోఘమూ అయిన అమ్షలన్నీ ఈ కథలలో మనకు కనిపిస్తాయి.ఎదను పులకరింప చేస్తాయి.తప్పని సరిగా చదబ్వటమే కాకుండా,భద్రంగా దాచుకుని,మాటి మాటికీ చదువుతూ,అలోచిస్తూ, మన సన్నిహితులతో,మిత్రులతో చదివంపచేస్తూ చర్చిస్తూండాల్సిన పుస్తకం ఇది.
ఈ పుస్తకానికి ఏ విధంగానూ తీసిపోని అద్భుతమయిన పుస్తకం,సం.వెం. రమేష్ రచించిన ప్రళయ కావేరి కథలు.ఒక గతించిపోయిన జీవితం లోని సౌందర్యాన్ని మన కళ్ళకు కట్టినట్టు ప్రదర్షిస్తాడు రచయిత.మాండలీక భాషలోని సొంపులను, వయ్యారాలను,భావ గాంభీర్యాన్ని,చిలిపితనాన్నీ,వెరసి భాష విష్వరూపాన్ని మనం ఈ కథలలో చూడవచ్చు.కథలు అనే కన్నా వీటిని జీవితం అన వచ్చు.నదీ జలాలు జల జలా పారినట్తు,అప్పుడప్పుదు రాళ్ళ చుట్టూ గుడుసుస్ల్లు పోయినట్టు, నిర్మల నీటి ప్రవాహంలో జలకాలడిన అనుభూతిని కలైగిస్తాయి ఈ కథలు.
దీపం చెప్పిన కథలు పుస్తకాన్ని,ఎమెస్కో వారు ప్రచురించారు.ప్రళయ కావేరి కథలను,మీడియా పబ్లిషింగ్ హౌస్ వారు ప్రచురించారు.
నేను రాసిన రచనలు కాక,సమకాలీన రచయితలలో,వందేళ్ళ తరువాత కూడా సజీవంగా వుండే రచనల జాబితాలో ఈ రెండు రచనలు అగ్రస్థానం వహిస్తాయి.తప్పకుండా చదవండి.నేను కథలు ఎందుకు చెప్పలేదంటే,పుస్తకం పయిన కుతూహలం కలిగించటమే నా పని.దాన్ని చదివి కథలలో నిగ్గు తేల్చుకోవలసింది పాథకులే.అదీకాక,ఈ కథల గురించి చెప్పేకన్నా చదివి తెలుసుస్కోవటంలోనే మజా వుంది.  

April 3, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: pustaka paricayamu