Archive for April 6, 2008

సంకుచితమూ-మన దేశమూ!

చూస్తూంటే మన దేశం సంకుచితానికి పాథ్య పుస్తకంలా తయారయేట్టు వుంది.భిన్నత్వంలో ఏకత్వం గురించి గర్వంగా మాట్లాడే మనము ఏకత్వంలో అనేకనేకత్వం గురించి బాధపడాల్సి వచ్చేట్టువుంది.ఈమధ్య మన దేశంలో జరుగుతున్న అనేక సంఘటనలు,దానికి మేధావుల ప్రతిక్రియలు చూస్తూంటే తమ తాత్కాలిక లాభాల కోసం దేశానికి శాశ్వత నష్తం చేసేందుకు మనవారు వెనుకాడటంలేదని స్పష్టం అవుతోంది.ఇందుకు తమిళనాడు,కర్నాటక ల నడుమ గొడవ,అమితాభ్ పయిన సామ్నా వ్యాఖ్యలు మంచి నిదర్షనాలు.
హోగెంకెనాల్ విషయంలో గొడవే లేదసలు.అందరూ ఒప్పందాలకు వచ్చిన తరువాతే పనులు ప్రారంభమయ్యాయి.కాని ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయంటే ఏదో వివాదం కావాలి.ఆవేశాలు చెలరేగాలి.ఈ గొడవలోకి సినిమా నటులు నవసరంగా దూరారు.సినిమావారికి ఇప్పుడు ఎంత పలుకుబడి వుందంటే వారి మాటను దేవవాక్కుల్లా భావించేవారు బోలెడంత మంది వున్నారు.అటువంటి పరిస్థితిలో సినిమా వారు విచక్షణను చూపాలి.రాజకీయ వివాదాలలో తలదూర్చవద్దు.సంకుచిత భావాలకు తావు ఇవ్వవద్దు.కర్నటక లో తమిళ సినిమాల పయి దాడి జరిగితే దాన్ని ఖండించాలి.ఆ ఋఆష్ట్రంలోని నటులతో కళాకారులతో చర్చించాలి.తమ నడుమ గొడవలు లేవని ప్రకటించాలి.దేశమంతా ఒక్కటేనని.ఒక భాషా చిత్రాలపయి దాడిని దేశంలో సినిమా వారంతా ముక్త కంథంతో ఖండించాలి.కాని తాత్కాలిక భావావేశాలకు లోనయి సినిమా వారు కూడా రాజకీయ నాయకులకన్న హీనంగా ప్రవర్తిస్తునారు.సూపర్ స్టార్ అయిన రజనీకంత్ కూదా ఇటువంటి వొత్తిళ్ళకు లొంగి పోయాడు.గమనిస్తే,గతంలో తెలంగాణా వాదం తీవ్రంగా వున్నప్పుడు ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా,ఎన్.టి.రామారఒ,పాలు పొంగు మన తెలుగు గడ్డనూ పగులగొట్ట వద్దు అంటూ,సినిమా లో పాటను జొప్పించాడు.తెలుగు జాతి మనది,నిండుగ మెలుగు జాతి మనది అంటూ సమయ్క్యత ను బోధించాడు.అది,నిజమయిన కళాకారుడి ఆత్మ విశ్వాసం.సామాజిక బాధ్యతా నిర్వహణ.
అమీతాభ్ పయి సామ్నా దాడిని కూడా తీవ్రంగా ఖండించాలి.ఎందుకంటే,మన దేశంలో ఏ ప్రాంతంలో నయిన స్థిరపడే స్వేచ్చ ప్రతి పౌరుడికీ వుంది.అమితాభ్ మహారశ్ట్రాకి ఏంచేశాడు అని అదుగుతున్న బాల్ థక్రే మహారాశ్ట్రా కోసం ఏం చేసాదూని ఎవ్వరూ అడగరెందుకని.సంకిచిత వాదం ఎన్నికలలో వోట్లకోసం ప్రోత్సహించటం తప్ప, థాక్రే చేసిందేమిటి?అయినా ఎవరు మాత్రం ఏం చేయాలి?రజని కన్నడ వాడయిన నిరసనలో పాల్గొన్నడు .అందువల్ల ఏమి ఒరిగింది?రాజకీయ నాయకులు ఎన్నికల దాకా పోస్ట్పోన్ చేసారు.ఇలా అనవసరంగా సినిమా వారు రాజకీయాలలో పావులు అయి తమ వ్యక్తిత్వాన్ని కోల్పఓతూ ప్రజలకు అన్యాయం చేస్తున్నారు.వీరికన్నా,మాఫియా వారిని ధైర్యంగా ఎదిరించిన ప్రీతీ జింటా నిజమయిన మనిషి.
మనం ఒకటి గమనించాలి.విడి పోవటం సులభం.కలిసివుండటంలోనే వ్యక్తిత్వం తెలుస్తుంది.ఏ వేర్పాటు వాదమయిన దాని వల్ల లాభంలేదు.ఇలా మనలో మనమే ప్రతివిసయానికి భెధాలు తెచ్చుకుంటూవుంటే మనము వున్న కొమ్మనే నరుకుకున్న మూర్ఖులమవుతాము.ఒక్క సారి బాల్కన్ దేశాల వయిపు చూస్తే వేర్పాటు వాదల విచ్చిన్నకర శక్తి అర్ధమవుతుంది.అది చేసే వినాశనం తెలుస్తుంది.  

April 6, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized