Archive for April 11, 2008

ఆలోచనా లోచనాల సమాలోచన!

కొత్తపాళి గారి ఆలోచన కు నాలోచనాల పయిన వచ్చిన స్పందన ఎంతో ఆనందం కలిగించింది.అందరికీ ధన్యవాదాలు.అయితే,కొందరు వ్యక్తపరచిన సందేహాలకు సమాధానాలు ఇవ్వాలని అనుకున్నాను.కానీ ఈ సమాధానం వ్యక్తిగతంగా కన్నా మరో పోస్టు ద్వారా బహిరంగంగా ఇస్తే,అందరూ చూసే వీలుంటుంది,చర్చ మరింత లోతుగా సాగే వీలుంటుంది అనిపించింది.
ముందుగా,ఒక విశయం స్పశ్టంగా అర్ధం చేసుకోవాల్సి వుంటుంది. మనిషి కూడా జంతువే.జీవ పరిణామ క్రమంలో ఒక ఉన్నత మయిన దశ మానవుడు.కిరణ్ అన్నట్టు,నిర్జీవమయిన రాయి నుంచి,విఙ్నాన వంతుడయిన మానవుడి వరకు అంతా ఒకే పరిణామ క్రమంలో ఎదుగుతూ వస్తున్న వారమే.అందుకే,ప్రపంచంలో ప్రతి అణువులోనూ భగవంతుడు వున్నాడంటుంది తత్వం.ఈశావాస్యమిదం సర్వం అంటుంది ఉపనిశత్తు.ఇద్ చెప్పటం సులభం.అనుభవించి ఆఛరించటం కష్టం.అందుకే మానవుడు తన ఇంద్రియాలను అదుపులోకి తెచ్చుకోవాలంటుంది శాస్త్రం.ఇందుకోసం సాధన చేయాల్సి వుంటుంది.ఆ సాధనలో మనకు భక్తి యోగం,కర్మ యోగం,!మ్నాన యోగం వంటి మార్గాలు వున్నాయి.అయితే,తాను భగవంతుడి అంశనన్న ఆలోచన కేవలం మనిషికే వుంది.రాయి,చెట్టు,ఇతర జీవులకు ఈ తెలివి వుండదు.ఈ తెలివి వల్ల మనిషి ఇతర జీవులకన్నా భిన్నంగా భావించుకుంటాడు.ఇక్కడే మరో ప్రధానాంశన్ని ప్రస్తావించుకోవాల్సివుంటుంది.
జీవులన్నిటికన్నా వుత్తమ స్థాయిలో వున్నా మానవుడికి అనేక పరిమితులున్నాయి.అన్నిటికన్న ప్రధానమయిన పరిమితి భౌతిక శరీరం.భౌతికత అన్నదే పరిమితి.ఈ భౌతిక శరీర పరిధులను నిర్ణయించేవి ఇంద్రియాలు.ఆ పరిమితులను అధిగమించే శక్తిని ఇచ్చేది మేధ.మేధను నియంత్రించేది బుద్ధి.ఇలా మనిషిలోనే అపరిమితమయిన శక్తులు వున్నాయి.ఆశక్తిని పరిమితం చేసే ప్రతికూల శక్తులూ వున్నాయి.
జంతువులకూ ఇంద్రియాలు వున్నాయి.అవి పూర్తిగా ఇంద్రియాల మీద ఆధారపడి బ్రతుకుతాయి.వాటికి ఆశ,అసూయ,కోపం వంటివి లేవు.ఆలోచనలు లేవు.ఙ్నాపకాలు లేవు.అందుకే వాటికి పాపం పుణ్యం లేవు.తమ చర్యల పట్ల వాటికి కర్త్రుత్వం లేదు.కాని మనిషికి బుద్ధి వుండటంతో పరిస్థితి మారింది.
మనిషికి ఇష్టాయిశ్టాలు ఏర్పడ్డాయి.పాప పుణ్యాలు వున్నాయి.ఎందుకంటే,ఇతర జీవులకు లేని ఇచ్చా శక్తి మనిషికి వుంది కాబట్టి.ఇతర జీవులకు భిన్నంగా తన ఇంద్రియాలను నియంత్రించటమే కాక వాటి పరిమితులను అధిగమించగలడు కనుక.కానీ ఈ శక్తులు వుండి కూడా వాటి స్ప్రుహ లేని వ్యక్తి చూసేందుకు మనిషి అయినా పశువే నన్న మాట.అందుకే,ఏదీ మన నియంత్రణ లో లేకున్నా అన్నీ తానే చేస్తున్నానన్న భ్రమకు గురవుతాడు. తన బుద్ధి తద్వారా మెదడు తన అధీనంలో వుంచే వీలున్నా ఇంద్రియాలు అందుకు అడ్డు పడతాయి.కాబట్టి ఇచ్చా శక్తి తో ఇంద్రియాలను నిగ్రహించి,ఆపయి బుద్ధిని ఉపయోగించి మెదడును స్వాధీనంలోకి తెచ్చుకుని భౌతిక ప్రపంచ పరిమితులను దాటగలిగే వాడు అసలు మనిషి.ఇది అందరికీ సాధ్యంకాదు.అయినా,ప్రయత్నించేవాడు ఇంకా పశు స్థాయికి దిగజారలేదని అర్ధం.అటువంటి ప్రయత్నాలు చేయక తింటూ తిరుగుతూ ఇష్టం వచ్చినట్టు ఇంద్రియాల వశంలో బ్రతికే వాడు మనిషి అయినా పషువే.అయినా వాడిలో వున్న ఆధ్యాత్మికత వల్ల అప్పుడప్పుడూ వాడికీ ఆలోచనలు కలుగుతాయి.అందుకు ప్రేరణ అవసరం.మనిషిగా ఎదగాలని ప్రయత్నించే వారికి,ఒక మాట చాలు,ఒక పాట చాలు,ఒక అందమయిన ద్రుశ్యం చాలు,వారిలోని అత్మ రెక్కలువిప్పుకుంటుంది. వారికి అనుక్షణం వారి అసలు లక్ష్యాన్ని గుర్తు చేస్తూంటుంది.
మన పూర్వీకులు ఈ నిజాన్ని గ్రహించి మనకోసం బోలెడన్ని మార్గాలు,సూచనలు ఏర్పాటు చేసారు.వాటిని అనుసరించి మనిషి లా ఎదగమన్నారు.అందుకే దోమ, మనిషి స్థూలంగా వేర్వేరు అయినా సూక్ష్మంగా వొకటే.
మనిషికి జన్మతహ ఈ ఆధ్యాత్మిక భావనలు వస్తాయి.అందుకే వీటికి వయసుతో సంబంధం లేదు.పసిపిల్లవాడికి వైరాగ్యం రావచ్చు.ముసలివాడయినా పరిణతి పొందక పోవచ్చు.
మరొక సూక్ష్మాంశం ఏమిటంటే అందరిలో ఒకటే ఆత్మ వుంటుంది.మనిషిగా జన్మించి విచక్షణను ఉపయోగించని వాడు వాడి పాపాలను అనుసరించి అందుకు తగ్గ అల్ప జీవిగా జన్మిస్తాడు.తగిన శిక్ష అనుభవించి మళ్ళీ మనిషిగా జన్మిస్తాడు.అయినా విచక్షణ రాక పోతె మళ్ళీ మరో అల్ప ప్రాణిగా పుడతాడు.అందుకే మనము చెట్లను,పుట్టలను,చీమలను దోమలను కూడా పూజిస్తాము.గౌరవిస్తాము.ఇది జైనులలో మరీ ఉన్నత స్థాయికి చేరింది.ఈ సారికి ఇంతే.అందరికీ ధన్యవాదాలు.

April 11, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized