Archive for June 5, 2008

పురాణ ప్రలాపం-ఒక విలాపం!

ఈ మధ్య పత్రికలలో,నెట్ లో పురాణ ప్రలాపం అనే పుస్తకం గురించి చాల వింటున్నాం.ఇదొక అద్భుతమయిన పుస్తకమనీ,దీన్ని పిల్లలకు పాఠాలుగా పెట్టాలనీ అనేస్తున్నారు.ఈ పుస్తకాన్ని విమర్శించిన వారు,కరుడు గట్టిన చాందస వాదులనీ,అభ్యుదయ నిరోధకులనీ నానా దూషణలు చేస్తున్నారు.అందుకే ఒక సారి పురాణ ప్రలాపంలో కనబడే విలాపాన్ని మన నెటిజన్ లకు పరిచయం చేస్తున్నాను.విస్తారమయిన విమర్ష త్వరలో చేస్తాను.
ఇది విహంగ వీక్షణం లాంటి పరిచయం మాత్రమే!
ఈ పుస్తకావిష్కరణ సభకు నేనూ వెళ్ళాను.ఒక పంచ నక్షత్రాల పూటకూళ్ళ ఇంటిలో జరిగింది.పెద్ద పెద్ద పేర్లున్న మనుషులే వచ్చారు.అందరూ,భారతీయ ధర్మాన్నీ,సాంప్రదాయాన్నీ,పద్ధతులనూ,ప్రాచీన సంస్కారాలనూ ఆడిపోసుకున్నారు.మీరెవరయినా కాస్త వెనక్కు వెళ్ళి,నా సగటు మనిషి స్వగతం-1 లో ఒక పుస్తకావిష్కరణ సభ గురించి రాసినది చదివితే ఈ సభలో జరిగింది తెలుస్తుంది. వీళ్ళు ప్రాచీన సంస్కృతిని తిడుతూ ఎంత వొళ్ళూ పై మరచిపోయారంటే,మన సమస్యలకన్నిటికీ సంస్కృతమూ,రామాయణమూ,భారతమూ,బ్రాహ్మణులే కారణమని ప్రకటించేశారు.
విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక మాటన్నారు.’ఈ దేశంలో భారతీయ ధర్మాన్ని తిట్టూ,దేశమంతా నీ వెనుక నిలబడుతుంది.భారతీయ ధర్మాన్ని పొగడితే,నువ్వొంటరివాడవవుతావు,అంతా నీ పై రాళ్ళు విసుర్తారు.నేను అందుకు సిద్ధం.మీరూ సిద్ధమయితేనే భారతీయ ధర్మాన్ని సానుభూతితో చూసి ప్రజలకు తెలపండి.లేకపోతే మీరూ ఓ రాయి విసరండి ‘.
ఇప్పుడు జరుగుతున్నది ఇదే.హేతు వాదం పేరిట,అభ్యుదయ వాదం పేరిట,ఇంకా ఎన్నెన్నో వాదాల పేరిట,ఎవరికి వారు తమ తమ స్వార్ధాన్ని చూసుకుంటూ,స్మాజంలో గౌరవమూ.ఆమోదమూ పొందేందుకు పనిగట్టుకుని,మనసులో లెంపలేసుకుంటూ,మనదన్న ప్రతిదానిపైనా బురద జల్లుతున్నారు.తాత్కాలికంగా లాభాలు పొందుతున్నారు.శాశ్వతంగా సమాజానికి నష్టం చేస్తున్నారు.
శ్రీ శ్రీ గొప్ప కవి.ఆయన కవితల్ శక్తి ప్రచీన సాహిత్యంలోంచి వచ్చింది.కానీ ఆయన ప్రాచీన సాహిత్యాన్ని తరువాత తరానికి దూరం చేయటంలో ప్రధాన పాత్ర పోషించాడు.అందుకే ఆతరం తరువాత మనకు కవి అన్నవాడులేక కపులే మిగిలారు.
నేను పోతే నాతో పాటూ నన్నయ్య,తిక్కన్న లు పోతారు అన్నారు విశ్వనాథ.అందరూ ఆయనది అహంకారం అన్నారు.ఆయన పోతే నన్నయ్య,తిక్కన్న లే కాదు,తెలుగు సాహిత్యం లోంచి జీవం పోయింది.పాండిత్యం పోయింది.నిజం చెప్పి అందరినే ఎదిరించి నిలిచే ధైర్యం పోయింది.అందుకు నిదర్శనం ఈ పురాణ ప్రలాపాన్ని ఇంతగా ప్రచారం చేస్తున్న ఆధునిక సాహిత్య కారులు,విమర్శకులూ,వారి అడుగులకు మడుగులొత్తుతున్న వారు.
ఈ పుస్తకం ముందు మాటలోనే పాత ఆచారాలనూ,అలవాట్లనూ,నమ్మకాలనూ విమర్శించి,బుద్ధుడి ఆలోచనను మెచ్చుకుంటారు.నీ విచక్షణాధికారాన్ని ఉపయోగించు అని బుద్ధుడు చెప్పినట్టు,ప్రాచీనులు తెలివిని అణగదొక్కినట్టు రాస్తారు.
మన దగ్గర చిక్కేమిటంటే,ఎవరో ఒకటి రాస్తారు.మిగతా అంతా దాన్ని నమ్మి వల్లె వేస్తారు తప్పించి స్వయంగా నిగ్గు తేల్చుకోరు.
భారతీయ ధర్మం ఎప్పుడూ గుడ్డిగా ఏదీ నమ్మ మనదు.ప్రతి దాన్నీ ప్రశ్నించమంటుంది.వేదంలొనీ అడుగడుగునా రుషులు తమని తాము ప్రశ్నించుకోవటం,విష్లేషించుకోవటం కనిపిస్తుంది.వేదం చదివిన వారెందరు?
పాశ్చాత్యుడెవడో,వేదాలు కల్లు తాగిన మత్తులో రుషులు చేసిన ఉన్మత్త ప్రేలాపనలు అన్నాడు.మన వాళ్ళు దాన్నే వల్లె వేసి కాలర్లెగరేస్తున్నారు.
వొచ్చిన చిక్కేమిటంటే వీళ్ళు రామయణం విషవృక్షమన్న,భారత్మ్ బొంకు అన్నా,జ్యోతిషం బూటకం అన్న వాటి విలువ పెరుగుతోందే తప్ప తరగటం లేదు.వీళ్ళు ఎంతెంతగా వికృత ప్రచారం చేస్తే ప్రజలలో అంతంతగా భక్తి,పాప భీతులు పెరుగుతున్నాయి. అయితే,వీళ్ళ దుష్ప్రచారం వల్ల ప్రజలు అసలు విషయాలను వదిలి పై పై మెరుగులకు లొంగుతున్నారు.శబ్దాలు మిగిలి పదాల అర్ధాలు మరచిపోతున్నారు.
వొచ్చిన చిక్కేమిటంటే,ఇంత హేతువాదాన్ని ప్రచారం చేస్తూ,అందరి కన్న తమేదొ మెట్టు పైనున్నట్టు భావిస్తున్నారు తప్ప వీళ్ళ హేతు వాదంలో వాదం వుంది తప్ప హేతువు లో స్వార్ధం తప్ప హితవు లేదు.
ఏ వ్యక్తి కయినా తల్లితండృలౌ ఆత్మ విశ్వాసం.ప్రాచీనులు ఆత్మ గౌరవం.సమాజం  వారి ఆత్మ శక్తి.కానీ మన సమాజంలో తల్లితండృలకు ఎదురు తిరగటం అభ్యుదయం.ప్రాచీనులను దూషించటం ఆధునికం.సమాజాన్ని చులకన చేయటం గొప్పతనం.ప్రగతి.అందుకే ఆత్మ విశ్వాసం,ఆత్మ గౌరవం లేక మనం ఇలా వున్నాం.ఇంకా దిగ జారతాం.ఇంగ్లీషు వాడు.వామ పక్ష భావాలు ఎంత ప్రయత్నించినా భారతీయ సంస్కృతికి ఏమీ ఢోకా లేదు.కానీ సమాజంలో సందిగ్ధాలు పెరుగుతాయి.అసలు మరుగున పడి వికృతాలు వెలికి వస్తాయి.చారిత్రికంగా ఇదే జరిగింది.ఇప్పుడూ ఇదే జరుగుతోంది.
పురాణ ప్రలాపం గురించి విస్తృతంగా మరో సారి.   

June 5, 2008 · Kasturi Murali Krishna · 8 Comments
Posted in: Uncategorized