Archive for June 19, 2008

యజ్ఞం-ఒక విమర్శ!

యజ్ఞం కథను పలు కోణాల్లో అర్ధం చేసుకుని విశ్లేహించి విమర్శించాల్సి వుంటుంది.ఈ కథలో పలు పొరలున్నాయి.ఒకో పొరను చీల్చుకుని ముందుకు సాగుతూంటే కథ స్వరూపం మారుతూంటుంది.
ముందుగా సులభంగా కనిపించే అంశం.
ఈ కథ చదవగానే ముందుగా కలిగే భావన్ అణచివేత.ఒక పేద నిరక్షరాస్యుడిని,ఊరి పెద్దలు,విద్యావంతులు,సమాజోద్ధారకులు అంతా కలసి మోసం చేయటం,మెడలు వంచి అతడితో అప్పు కట్టించాలనుకోవటం కనిపిస్తుంది.తనకు అన్యాయం చేసే వారిని కూడా ఆ నిరుపేద గౌరవించటం కనిపిస్తుంది.అది పద్ధతని,ఊరి సాంప్రదాయమని,రకరకాల కారణాలవల్ల ఆ పేదను అన్యాయం చేయటం కనిపిస్తుంది.అయితే,పెద్ద తరం ఊరి పెద్దల మాటకు కట్టుబడి వుండేందుకు సిద్ధంగా వున్నా,నవతరం అందుకు ఒప్పుకోడు.అప్పల్రాముడి కొడుకు ఎట్టి పరిస్థితులలో భూమి అమ్మి అప్పు తీర్చేందుకు ఒప్పుకోడు.అటువంటి నిర్ణయానికి లొంగద్దని తండ్రిని ముందే హెచ్చరిస్తాడు.అతడి ఆవేశం అందరికీ తెలుసు.అయితే,తండ్రి పెద్దల మాటకు కట్టుబడి వుండటంవల్ల తనకేకాదు,తన సంతానానికి శాశ్వత నష్టం కలుగుతుందని అర్ధం చేసుకున్నవాడు.తండ్రి లాగా భారం దేవుడి మీద వేసి నిబ్బరంగా వుండలేడు.అలాగని జరిగే అన్యాయాన్ని మౌనంగా భరిస్తూ వుండలేడు.కానీ,ఒక్కడే వూళ్ళో వాళ్ళందరినీ ఎదిరించలేడు.అందుకని ఆ కోపం,కసి తన సంతానం మీదే తీర్చుకుంటాడు.
ఈ కథలో ప్రముఖంగా కనిపించే పాత్ర శ్రీరాములు నాయుడుది.అతడి మాటంటే ఊళ్ళో అందరికీ గురి,గౌరవం.అతని మాట ఎవ్వరూ కాదనరు.అతడి వల్ల ఊరు అభివ్ర్ద్ధి చెందుతుంది.అతడు తలచుకుంటే అప్పు తీర్చనవసరం లేదని,అప్పల్రాముదిని అప్పునుంచి గట్టెక్కించగలదు.కానీ అతదుకూడా అప్పల్రాముడికి వ్యతిరేకంగా తీర్పు చెప్తాడు.తానూ,అణచివేత వ్యవస్థలో భాగమేనని నిరూపించుకుంటాడు.
మొదతిసారి కథ చదవగానే కథ ఇల్ల అర్ధమవుతుంది.వీటితో పాటూ కొన్ని అస్పష్ట భావాలూ కలుగుతాయి.దాంతో కథ మళ్ళీ చదవాలనిపిస్తుంది.మళ్ళీ చదవటంతోటే మొదటిసారి సరిగా అర్ధంకాని అంశాలు,కథ ముగింపు తెలియతంతో ఈ సారి స్పష్టమవుతాయి.
ఈ కథ అణచివేతకన్న ఆక్రోషానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది.ఇందులో అప్పల్రాముదు అప్పు తీసుకున్నాడన్న విషయంలో సందేహంలేదు.తీసుకున్న అప్పు తీర్చాలీ అన్నదాన్లోనూ సందేహం లేదు.అప్పల్రాముదు అప్పు తీర్చాలంటే భూమి అమ్మటం తప్ప మరో గత్యంతరంలేదన్నదీ తెలుస్తుంది.
ఇదొక చిక్కుముది.
గోపన్న ఒకప్పుదు ధనవంతుడు.ఇప్పుడు అతడు పేదవాడు.అతడికి దబ్బు అవసరం వుంది.దాంతో తన ఆపు తీర్చమని అప్పల్రాముడిపైన ఒత్తిడి తెస్తాడు.గోపన్న ప్రవర్తనలో కూడా దోషంలేదు.ఎందుకంతే ఇచ్చిన డబ్బు అతడికి కావాలి.మరి తప్పు ఎవరిది?
కథలో ప్రధాన పాత్రలా కనిపిస్తాడు శ్రీరాములు.అక్కడ వున్న వారిలో చదువుకున్నవాడు,తెలివయినవాడు అందరి మన్నన పొందేవాడు అతడు.అతడి ప్రవర్తన ఉన్నతంగా,ఔచితీపరంగా వుంది.
కథ మొదట్లోనే అతడు,మన ఈనాటి తీర్పులు ముందు తరాలకు వరవళ్ళవుతాయి అంటాడు. గ్రామంలో ఐకమత్యం కోసం తమ ఊరి గొడవలు తమదగ్గరే సమసిపోవాలంతాడు.మంచి ఆదర్శం.
అంతే కాదు,ఆ దర్శం క్రియల్లో కనిపించాలంతాదు.శ్రీరాములు ఈ ఉపన్యాసం అతది ఉత్తమ వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది.ప్రజల పట్ల వారి మనస్తత్వాల పత్ల అతడికి వుండే అవగాహన తెలుస్తుంది.మొదతి సారి చదువుతున్నప్పుదు ఈ పాత్రలో మనకు రచయిత కనిపిస్తాడు.ఎంతలేదన్న రచయిత తన ప్రమేయంలేకుందా తన పాత్రల్లో దూరతాడు.అందుకే,శ్రీరాములు సమన్వయ వాదం,నిజాయితే,అందరికీ మంచి చేయాలన్న తపన,ఆదర్శం,ఎవరినీ నొప్పిన్వ్చకూడదన్న మనస్తత్వం అన్నీ చూస్తే ఈ పాత్రలో మనకు రచయిత మనస్తత్వం తొంగి చూస్తున్నట్టు తోస్తుంది.కథ పూర్తయ్యే సరికి ఆ అభిప్రాయం మారుతుంది.
శ్రీరాములు నాయుడు పాత్ర మహాత్మా గాంధీకి ప్రతిరూపంలా తోస్తుంది!దాంతో కథ స్వరూపం సంపూర్ణంగా రూపాంతరం చెందుతుంది.కథ కాన్వాస్ విస్ట్ర్తమవుతుంది.ఇప్పుడీ కథను ఆంధ్రప్రదేశ్ లో ఒక చిన్న గ్రామంలో జరుగుత్న్న సంఘటనలా కాక ఆ గ్రామం దేసానికి పరతీకలా అక్కడ జరుగుతున్నది దేసంలో జరుగుతున్న సంఘతనలా అనిపిస్తుంది.
మిగతా రేపు.

June 19, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: pustaka paricayamu