Archive for July 5, 2008

బ్లాగుకు దూరమైన హృదయ గానం- ఆజ్ తుంసె దూర్ హోకర్!

నాందేడు చేరినప్పటి నుంచీ నా హృదయం ఎంతగా రోదిస్తోందంటే, ఆ ఏడుపువల్ల ఉద్భవించిన నీటి బిందువులనొక చోట పేర్చి, ఘనీభవింపచేసి, తుషార మాలలాగా, అక్షరాలతో అల్లిన కవిత సుమాలమాలను ఏర్పాటు చేయాలని అనుకున్నాను.అలా జరిగితే కానీ నా ఏడుపు వడ గాడ్పుల ఊడ్పు తగ్గదని అనుకున్నాను. అయితే, నా కన్నీళ్ళన్నీ నాందేడ్ ఎండలకు ఆవిరయి, మేఘాల మాలల్యి, వీచిన గాలికి నా కన్నా ముందు, హైదరాబాదు చేరి నిన్న వర్షంలా కురిసాయి. అయ్యూఅ, నా కన్నీళ్ళను అక్షరాలుగా మార్చేలోగా ఇలా జరిగిందేమిటని మరింత ఏడ్చేలోగా, ముఖేష్ కూపంగా చూస్తూ దిగి వచ్చాడు. ఏడుపు పాటలకు పెట్టని కోటను, ఎండని గోడను, ఎప్పటికీ మండలేని తడిసిన కన్నీటి పాటల పేటీని నేనుండగా, నువ్వింకా విషాద గీతాలకోసం ఏడుస్తావా? అంటూ నిలదీశాడు. దాంతో గొంతెత్తి ముఖేష్ స్వరంతో స్వరం కలిపి నాందేడులో ఉన్నన్ని రోజులూ ఈ పాట పాడుకుంటూనే వున్నాను. ఇంకో రెండు మూదు నెలలు ఈ పాట పాడుతూనే వుంటాను. ఇదిగో ఇదీ నా ఏడుపు:-

ఆజ్ తుంసే దూర్ హోకర్ ఐసా రోయా మేర ప్యార్
చాంద్ రోయా సాథ్ మేరేఆత్ రోయీ బార్ బార్!

ఎంత వీర ఏడుపు. నిజంగా బ్లాగుకు దూరమయి నేను ఏడ్చే ఏడ్పుకు చందృడు, రాత్రే కాదు, నా కంప్యూటర్ కూదా ఏడుస్తూనే వుంది.

కుచ్ తుమ్హారే బందిషేహై కుచ్ హై మేరే దాయెరే
జబ్ ముఖద్దర్ హీ బనే దుష్మన్ తో కోయీ క్యా కరే
హాయే జోయీ క్యా కరే,
ఇస్ ముఖద్దర్ పర్ కిసీకా క్యాహై ఆఖిర్ ఇఖ్తియార్
చాంద్ రోయా సథ్ మేరే రాత్ రోయీ బార్ బార్

నిజం, కొన్ని కంప్యూటర్ పరిమితులు, కొన్ని నా నిస్సహాయతలు. కాబట్టి దూరమవటం తప్ప లేదు. పైగా, అదృష్టమే శతృవయితే ఎవరు మాత్రం ఏమి చేయగలరు. విధితో తప్ప ఇంకా దేనికయినా ఎదురుపోరాడి గెలవవచ్చు. కానీ విధి కక్ష కడితే ఏం చేయగలం! ఏమీ చేయలేము, ఏడుస్తూ, చందృడినీ, రాత్రినీ ఏడిపిస్తూ కోచోటం కన్న ఇంకేమి చేయగలం.

హర్ తమన్నా సే జుదామై హర్ ఖుషీ సే దూర్ హూ
జీ రహాహూ క్యూన్ కి జీనేకే లియే మజ్బూర్ హూ
హాయే మై మజ్బూర్ హూ
ముక్జ్ కో మర్నే భీ న దేగా యే తుమ్హారా ఇంతిజార్
చాంద్ రోయా సాథ్ మేరే రాత్ రోయీ బార్ బార్

నిజం, ఇంక ఒక్కడిని నాందేడ్ లో వుంటే, ఇంక కోరికన్నదే నషిస్తుంది. సుఖమన్నదే లేదు.జీవచ్చవం లా బ్రతుకుతున్న వాడికి కోరికలేమిటి, సుఖమేమిటి? అయితే, ఇలా బ్రతకటం చావ లేక బ్రతకటం లాంటిదే.ఎందుకు చావలేమంటే, మళ్ళీ ఎప్పుడో కలవగలమన్న ఆశ ఉండటంతో, ఆ రోజుకోసం ఎదురుచూపులు చావనివ్వవు. అదీ, మళ్ళీ మంచి రోజులొస్తాయన్న ఆశ చావ నివ్వదు. అప్పటి వరకూ, చావలేక బ్రతికి ఉండటమే.

మరి, ఇంత దుర్భర విషాదానికి ప్రకృతి సర్వం స్పందించి నాతో పాటూ ఏడుస్తుందంటే ఏడవదా మరి? అందుకే నిన్న సాయంత్రం వర్షం హైదెరాబాదులో పడింది.

మరో పాటలో

ఘటావో తుమ్హే సాథ్ దేనా పడేగా, మై ఆజ్ ఆసూ బహానే చలాహూ
అంటాడు ముఖేష్.
హృదయ పూర్వకంగా గొంతెత్తి గుండెలనిండా ఏడుస్తూంటే ఎంత ఆనందంగా వుంటుందో! ఆ ఏడుపుతో ప్రకృతి గొంతు కలిపితే ఇంకెంట ఆనందంగా వుంటుందో! మనసారా ఏడ్వనివ్వరునన్ను అని ఆరివీర భయంకరంగా ఏడ్చిన కృష్ణ శాస్త్రి ఏడ్పును నాందేడ్ లో వున్నన్ని రోజుల్లో మించాలన్నది నా ప్రయత్నం.ఏడ్పులోనూ మజా అనుభవించాలన్నదే నా లక్ష్యం.
అందుకే, పాడుతున్నాను ప్రపంచమంతా ఘూర్ణిల్లగా,

ఆజ్ తుంసే దూర్ హోకర్!

July 5, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: sinemaa vishleashaNaa.