Archive for September 9, 2008

హలో, మళ్ళీ వచ్చేశా!!!

కొన్నాళ్ళు సెలవు పెట్టి హైదెరాబాదు వచ్చేశాను. నా ఏడుపు చూశారుగా, హైదెరాబాదు దాటి నేపాల్ చేరింది. అమెరికాలో తుఫానులు కలిగించింది.బీహారును ముంచెత్తింది. అంతగా ఏడుస్తూన్నా మా ఆఫీసులో వారికి నా మీద జాలి కలగలేదు. ఏ ఆఫీసులోనయినా అందరికన్నా కాస్త భిన్నంగా వుండేవారు పడే బాధలు నేను ప్రత్యేకంగా చెప్పనవసరము లేదు. అందుకే ఇక ఏడవలేను, బాధలు పడలేను అని సెలవు పెట్టి వచ్చేశా. ఇకపయిన మళ్ళీ కసి కసిగా రాతలూ-కోతలూ కొనసాగిస్తా.ఫిర్ వహీ దిల్ లాయాహూన్ అని పాడుతూ రేపటినుంచీ రోజూ కలుస్తానని వాగ్దానం చేస్తున్నాను. మీ ఉత్సాహ ప్రోత్సాహాలు నా వెంటే వుంటాయన్న నమ్మకంతో మళ్ళీ బ్లాగు ప్రపంచంలోకి అడుగిడుతున్నాను బోలెడన్ని కథలతో, ఆలోచనలతో, అంతులేని రాతలతో, కోతలతో!

September 9, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized