Archive for October 3, 2008

మన మహాత్ముడు, విమర్శ-9

బ్రహ్మ చర్యం అనేది కేవలం మంచం పొత్తు మాత్రమే కాదు. చాల క్రింది స్థాయి ఆలోచన అది. బ్రహ్మచర్యం స్త్రీ పురుష సంబంధానికి మాత్రమే చెందినది కాదు. బ్రహ్మచర్యమనేది ఒక జీవన విధానం. అనేక భారతీయ సిద్ధాంతాలలాగే ఈ సిద్ధాంతం కూడా సంకుచితమయి అసలు అర్ధాన్ని కోల్పోయింది. శృంగారం, సంపర్కాలలానే బ్రహ్మచర్యం మంచం పొత్తుకు పరిమితమయింది.

బ్రహ్మచర్యమనేది మనసా, వాచా, కర్మణా చెడు తలపును మనసులోకి రానీయక పోవటం. చెదు మాట పెదవులపైకి రానీయక పోవటం. చెడును చూడక పోవటం. చెడును సమర్ధించక పోవటం.

అందుకే, మను ధర్మ శాస్త్రంలో విద్యార్థి బ్రహ్మచర్యం పాతించాలన్న నియమం వుంది. ఎప్పుడయితే చెడు అన్నది దరిదాపులకు కూడా రాదో అప్పుడు వ్యక్తి మనసు నిర్మలంగా వుంటుంది. ఏకాగ్రత కుదురుతుంది. ఎప్పుడయితే ఈ నిర్మలంగా వుండటం అలవాటుగా మారుతుందో అప్పుదు వ్యక్తి వ్యక్తిత్వానికి ఒక విధమయిన పవిత్రత కలుగుతుంది. అతని మాతకు శక్తి వస్తుంది. అతని చేత మార్గదర్శకమవుతుంది. ఇది బ్రహ్మచర్యమంటే.బ్రహ్మచర్యం వల్ల వ్యక్తి ఏకాగ్రత స్థిరపడుతుంది. అతని సర్వేంద్రియాలు ఉత్తేజితమయి ఉన్నత స్థాయిలో పనిచేస్తాయి. అనేక యోగులు, మహానుభావులు ఏ విషయాన్ని నిరూపించారు కూడా. ఇంకా ఎవరికయినా బ్రహ్మచర్య వైషిష్ట్యం తెలియాలంటే వివేకానంద రచనలు చదివితే చాలు.

బ్రహ్మచారి అంటే చెడు తలపులు రానీయక పోవటం. కానీ ఒక వయసు వచ్చిన తరువాత వ్యక్తి ప్రమేయం లేకుండానే అతనిలో స్పందనలు కలుగుతాయి. స్వప్న స్ఖలనం సంభవిస్తుంది. మను ధర్మ శాస్త్రం దీన్ని కూడా పరిగణనలోకి తీసుకుంది. స్వప్న స్ఖలనం స్వాభావికంగా అయితే, వ్యక్తిలో వాంచ్చ లేకపోతే, తెల్లరి లేచి స్నానం చేస్తే వ్యక్తి పరిశుద్ధుడవుతాడంటుంది. అది పాపం కానే కాదు. అంటే,  లైనిగికపరంగా ఉత్తేజితుడవటం తప్పు. కానీ బయాలజికల్ గా స్వాభావికంగా జరిగితే తప్పులేదు. ఇంత సూక్ష్మంగా ప్రతి విషయం గురించీ మన పూర్వీకులు ఆలోచించారు. గమనిస్తే, బ్రహ్మచర్యమంటే, ధార్మ పరంగా భార్యను కలవటమనే అర్ధంకూడా వుంది. అందుకే అనేక మునులు వైవాహితులు. దాంపత్యధర్మ సక్రమంగా నిర్వర్తించటం కూడా ఒక స్థాయి బ్రహ్మచర్యమే. రామకృష్ణ పరమహంస వివాహితుడే. కానీ, ఆయన ఆధ్యాత్మిక శక్తి అసమానం.  అలాంటి బ్రహ్మ చర్యాన్ని రచయిత మంచంపొత్తు అని చులకన చేయటం రచయిత దృష్టిని తెలుపుతుంది. గాంధీని చుకలన చేయాలన్న తపనలో ఆయన బ్రహ్మచర్య ధర్మాన్నే చులకన చేస్తున్ననని గ్రహించలేక పోయారు. ఎలాగయినా గాంధీని చులకన చేయాలి. అతడిని పూజించటం ఎంత మూర్ఖత్వమో చూపి, ప్రజలెంత మూర్ఖులో నిరూపించాలి. ఇందువల్ల రచయితకు ఒరిగేదేమీ లేదు. ఈనాడు మనం గాంధీని మహాత్ముడన్నా మాయగాడన్నా గాంధీకేమీ నష్టం లేదు. కానీ అందరూ మోసపోయారు, ఈ మోసాన్ని గుర్తించింది నేనే అని నిరూపించుకోవటంద్వారా రచయిత అహం సంతృప్తి చెందుతుంది. దీన్ని మించి ఏ వ్యక్తి అయినా ఆశించేది ఏమితి? ఈ పుస్తకంలో అడుగడుగునా ఇలా రచయిత తన అహాన్ని సంతృప్తి పరచుకునేందుకు గాంధీజీ ప్రతిచర్యనూ విపరీతమయిన దృష్టితో చూసి విశ్లేశించి అవహేళన చేసి అహాన్ని సంతృప్తి పరచుకోవటం చూడవచ్చు. ఒకతి రెండు ఉదాహరణలు చాలు ఈ నిజాన్ని నిరూపించేందుకు.

రచయిత గాంధీని బ్రిటీష్ వారి ఏజెంటని నిరూపించాలని నానా తాపత్రయ పడ్డారు. ఇది కొందరి ఆలోచన. గాంధీ గారిని బ్రిటీష్ వారే గొప్ప చేసారు. అందుకే ఆయన ఎక్కడవెళ్తే అక్కడ ఎర్ర తివాచీలు పరచారు. జైళ్ళలో రాజ భోఅగాలు అమర్చారు అని కొందరి వాదన.

ఏ విషయంలోనయినా మమ్మూలు కార్యకర్తలను చూసినట్టు నాయకుడిని చూడరు. రిపోర్టర్లను అరెస్టు చేస్తే కాని గొడవ ఎడితర్ ను అరెస్ట్ చేస్తే అవుతుంది. ఎడిటర్ కన్నా ఎండీని అరెస్టు చేస్తే మరింత గొడవ అవుతుంది. అందరినీ ఒకే లా చూడరు. గాంధీ సమస్త భారతావనికి నాయకుడు. ఆయనపైన ఏగ వాలినా పరిస్థితి అదుపు తప్పుతుంది. అందుకోసమే తప్ప బ్రిటీష్ వాడు గాంధీని పాంపర్ చేసి గొప్ప ఏజెంతుగా నియమించుకోలేదు. మంచి తనాన్ని కూడా అనుమానంగా చూడటం అలవాటయిన మనకు గాంధీ మంచితనం బ్రిటీష్ వారికి కొమ్ము కాయటంగా అర్ధమయితే అది గాంధీ దోశం కాదు.

గౌతమ బుద్ధుది దగ్గరకు అంగుళి మాలి అనే నేరస్తుడు వస్తే బుద్ధుడు ప్రేమతో అతనిని మార్చాడు. గాంధీ చేయాలనుకున్నది అదే. అయితే బుద్ధుడికాలంలో వ్యక్తి గొప్ప తనాన్ని గుర్తించే సహృదయం కర్కోటక నేరస్తులలో కూడా వుండేది. ఈ కాలంలో గొప్పను కూడా చిప్ప అని చూపించటం మేథావుల లక్షణం అయింది., ఇదీ గాంధీ తప్పు కాదు.

ఇక చౌరా చౌరి ఉదంతం చూపుతూ గాంధీ ఉధ్రుతంగా ఉన్న ఉద్యమాన్ని నీరుకార్చేశాడని విమర్శిస్తారు. శాస్త్రి గారు దీన్ని ఉన్మాదం అన్నారు.

క్రమశిక్షణతో సాగుతున్న ఉద్యమాన్ని నిలువునా బలిచేయటం ఏరకమయిన ఉన్మాదం? అని ప్రశ్నిస్తారు.

దీన్నిపై వ్యాఖ్యానిస్తూ, హింస తలెత్తితే చాలు నడిచే ఉద్యమానికి సడన్ బ్రేక్ వేస్తానని కండిశను పెడితే ఉద్యమాన్ని నడపటం దేవుడి వల్లకూడా కాదు. అంటారు. దీనికి నెహ్రూ వ్యాఖ్యలు సమర్ధనగా చూపి, ఆయన పెట్టే శరతులతో జాతీయ పోరాటం సాగించటమంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఏదటంలాంటిదే అని మెడమీద తలకాయ ఉన్న ప్రతివాడికీ అర్ధమయ్యేవుండాలి అని తీర్మానిస్తారు.

రచయిత రచన విధానం ఆయన అహంకారానికి నిలువెత్తు దర్పణం పడుతుంది. అంటే ఆ కాలంలోనే కాదు. ఆతరువాతకూడా గాంధీగారి నేతృత్వంలో పోరాటం సాగించిన కోట్లాది ప్రజలకు, ఇతర నాయకులకూ మెడమీద తలకాయల్లేవన్నమాట!అందుకే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టు గాంధీగారిని నాయకుడిలా అంగీకరించారు. ఎప్పుడయితే వారిమెడమీద తలకాయలొచ్చాయో కుక్కతోక వదిలి దేశవిభజనకు ఒప్పుకున్నారు. గాంధీని పక్కకు నెట్టారు.

హింస లేనిదే ఉద్యమం నడవదని వ్యాఖ్యానించి రచయిత గాంధీగారిని దెబ్బతీసినట్టు భావించారేమో కానీ ఉద్యమాలలో హింసను సమర్ధిస్తున్నట్టయ్యిందని మరచిపోయారు. రేపు ఎవరు ఏమికోరి ఉద్యమం లేవదీసి హింసను జరిపినా ఆ హింసను ఖండిస్తే, ఆయన రాసిన ఈ మాటలు చూపి ఆయనను నిలదీయవచ్చు. హింసగురించి రాస్తూ,  హింస లేకుండా ఉద్యమం నడపాలంటే కల్పాంతం వరకూ వేచి ఉన్నా హింస వాసన సోకని సుముహూర్తం దొరకదు అని తీర్మానించేసారు. ఒకవైపు విదేశీయులు గాంధీ గారి ప్రరణతో అహింస నిరసనలు చేస్తూంటే ఇక్కడ మనం హింసలేని నిరసన ఏమిటి అని గాంధీగారిని ఏసడించేందుకు వాదిస్తున్నామన్నమాట.

అయితే, ఉద్యమాల స్వరూపాలు, గాంధీగారి లక్ష్యము ఏకాస్త తెలిసిన వారయినా ఆయన ఉద్యమం కొనసాగటానికి అహింసను ప్రాతిపదిక చేయటాన్ని అర్ధంచేసుకుంటారు.

ఇది రేపు.

October 3, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: pustaka paricayamu