Archive for March 6, 2009

నెట్ లో నా కొత్త శీర్షిక ఇది!

హల్లో, బ్లాగరులందరికీ నమస్కారాలు.

మళ్ళీ వచ్చేశా!

సినిమా అయివుంటే ఫిర్ వహీ దిల్ లాయాహూ అని పాడుతూ వచ్చేవాడిని.

మా ట్రిప్పు చాలా బాగా జరిగింది. ఆ ప్రయాణ విశేషాలతో బ్లాగు సెలవులయిపోయినట్టు ప్రకటిద్దామని అనుకున్నాను.

కానీ, ఇంటికి రాగానే కంప్యూటర్ కు వాతావరణ మార్పువల్ల కాస్త జలుబు చేసింది. అందుకని, దాని ఆరోగ్యం బాగయ్యేవరకూ ఆగాల్సివచ్చింది.

ఇంతలో, నెట్ లో నాది కొత్త శీర్షిక ప్రారంభమయింది.  ఇది నెట్ లో నా తొలి శీర్షిక కూడా.

కౌముది. నెట్, వెబ్ పత్రికలో ఈ నెల నుంచి, కథా సాగర మథనం అనే శీర్షిక ప్రారంభమయింది. ఈ శీర్షికకు ఉపోద్ఘాతం మార్చ్ సంచికలో ప్రచురించారు.

ఈ శీర్షికన, నెలలో అన్ని పత్రికలలో ప్రచురితమయిన కథలను వీలయినంత నిష్పాక్షికంగా విశ్లేషించి, వాటిలోంచి కొన్ని మంచి కథలను ఏరి పాఠకులకు పరిచయం చేయటం వుంటుంది.

దీనితో పాటూ, ఆ నెలలో నా డ్ర్ష్టిలో , ప్రచురితమయిన కథలలో ఉత్తమ కథను పూర్తిగా పాఠకులకు అందిస్తాము.

ఈ శీర్షిక ఉపోధాతాన్ని చూసి మీ అభిప్రాయాన్ని, సూచనలను అందించ ప్రార్ధన.

ఈ శీర్షిక గతంలో జాగృతి వార పత్రికలో మూడేళ్ళపాటూ నిర్వహించాను. గత మార్చ్ లో నాందేడ్ ప్రభావంతో ఆపాల్సివచ్చింది. ఇప్పుడు కౌముదిలో కొత్తగా ఆరంభిస్తున్నాను.

ఈ శీర్షిక ద్వారా, గోపిని కరుణాకర్, సం వెం రమేష్ వంటి వారి కథలు ప్రచురితమయిన వారంలోనే వాతి గొప్ప తనాన్ని గుర్తించి పాఠకులకు పరిచయం చేయటం జరిగింది.
ఇప్పుడు కూడా, అంతే నిర్మొహమాటంగా, అంతే నిష్పాక్షికంగా, కథా విశ్లేషణ చేయాలన్నది లక్ష్యం.

మీ అభిప్రాయాలు, సలహాల కోసం ఎదురుచూస్తూ……

March 6, 2009 · Kasturi Murali Krishna · No Comments
Posted in: నా రచనలు.