Archive for March 8, 2009

ఈ వారం నా రచనలు!

ఈ వారం, అంటే, ఇవాళ్టి వార్త ఆదివారం అనుబంధం లో ఎప్పటిలాగే నా బ్లాగ్ స్పాట్ శీర్షిక వుంటుంది. ఈ శీర్షికన, ఇవ్వాళ్ళ, సుచిత్రా కృష్ణ మూర్తి బ్లాగు పరిచయం వుంటుంది.

ఆంధ్ర ప్రభ ఆదివారం అనుబంధంలో, సగటు మనిషి స్వగతం వుంటుంది. ఈవారం, మన సగటు మనిషి కొందరు రచయితలను కలుస్తాడు. ఆ అనుభవం తాలూకు స్వగతం ఈవారం చదవవచ్చు.

ఆంధ్ర భూమి వార పత్రికలో, పవర్ పాలిటిక్స్ శీర్షికన, ఆర్ధిక మాంద్యం వల్ల అంతమవుతున్న ప్రపంచీకరణ గురించి విశ్లేషణ వుంటుంది. మన రాజకీయ నయకులు చేపడుతున్న చర్యల గురించి చర్చ వుంటుంది.

ఈ నెల విడుదలయిన దివ్య ధాత్రి మాస పత్రికలో, ద్రష్ట సీరియల్ మరో భాగం వుంటుంది. అదే పత్రికలో, దివ్య వ్యక్తిత్వాలు శీర్షికన, ఖనీ నేత్రుడి వ్యక్తిత్వ విశ్లేషణ వుంటుంది.

రసమయి, త్రై మాస పత్రికలో హస్రత్ జైపురి, శంకర్-జైకిషన్ ల కోసం రాసిన పాటల వివరణ వస్తుంది. వచ్చే సంచిక రసమయి చివరి సంచిక కావటంతో, హస్రత్ ఇతర సంగీత దర్శకులకు రాసిన పాటల విశ్లేషణతో ఈ శీర్షిక ముగుస్తుంది. ఈ శీర్షికన వచ్చిన గేయ రచయితల గీతాల పరిచయాలను హాసం ప్రచురణల వారు పుస్తక రూపంలో తెస్తున్నారు.

అయితే, వారు ఈ వ్యాసాలన్నీ ఒకే పుస్తకంలా కాక, సాహిర్ మీద వచ్చిన వ్యాసాలన్నీ ఒక పుస్తకంలా, మజ్రూహ్, షకీల్, హస్రత్ ల మీద వ్యాసాలు చెరో పుస్తకంలా వేయాలనుకుంటున్నారు. అంటే, త్వరలో మరో నాలుగు పుస్తకాలు వస్తాయనమాట. షైలేంద్ర గేయాలపీన ఒకే సంచికలో రాయటంతో, ఇప్పుడీ శీర్షికన పుస్తకంలా రావటం కోసం, మళ్ళీ ప్రత్యేకంగా రాస్తున్నాను.

వీటికి తోడు, 2001 నుంచీ, 2008 డిసెంబరు వరకు, పవర్ పాలిటిక్స్ శీర్షికన తీవ్రవాదం పై ప్రచురితమయిన వ్యాసాల సంకలనం తయారవుతోంది. ఈ మాసాంతానికి సిద్ధం అవుతుంది. దాదాపుగా 300 పేజీల పుస్తకం అది. తెలుగులో తీవ్రవాదంపైన వస్తున్న తొలి పుస్తకం ఇదే కావచ్చు!

ఇవీ ఈవారం నా రచనల వివరాలు. మీకు వీలయీవి చదివి మీ అభిప్రాయాలను నిర్మొహమాటంగా తెలియబరచాలని మనవి. 
ట్

March 8, 2009 · Kasturi Murali Krishna · No Comments
Posted in: నా రచనలు.