Archive for June, 2009

పుస్తకావిష్కరణ ఫోటోలు!

21.06.2009 సాయంత్రం ఏ ఎస్ రావ్ నగర్ లో తీవ్రవాదం పుస్తకావిష్కరణ సభ జరిగింది. పుస్తకాన్ని అమ్మ ఆవిష్కరించారు. గుడిపాటి, కేపీ అశోక్ కుమార్ గార్లు ప్రసంగించారు. మునిపల్లె రాజుగారికీ సభలో సన్మానం జరిగింది. ఇంకా అద్దేపల్లి రామమోహనరావు, గుర్రంకొండ శ్రీకాంత్ గార్లు శ్రీశ్రీ గురించి మాట్లాడారు. సభ పూర్తయిన తరువాత ఆచార్య ఫణీంద్రగారు కలిశారు. ఇది అత్యంత ఆనందం కలిగించిన విషయం.

సభ విశేషాలను మాటలకన్న ఫోటోలు బాగా చెపుతాయి. చూడండి.

 

 

DSC01279DSC01277

 

DSC01310

 

 

DSC01366

 

 

DSC01407

June 23, 2009 ·  · 10 Comments
Posted in: నా రచనలు.

తీవ్రవాదం- పుస్తకావిష్కరణ సభ విశేషాలు!

ముందు ప్రకటించినట్టుగా, నిన్న సాయంత్రం, ఏ ఎస్ రావ్ నగర్ లో తీవ్రవాదం పుస్తకావిష్కరణ సభ జరిగింది.

కోకిలం సంస్థ ఆధ్వర్యంలో ఈ సభలో శ్రీశ్రీ శత జయంతి సందర్భంగా అద్దేపల్లి రామ మోహన్ రావుగారు, గుర్రం కొండ శ్రీకాంత్ గార్లు ప్రసంగించారు.

మధ్యలో పుస్తకావిష్కరణ జరిగింది. పుస్తకాన్ని అమ్మ ఆవిష్కరించింది.

సభ పొర్తయిన తరువాత, మన బ్లాగ్మితృడు ఆచార్య ఫణీంద్ర గారు వారి సతీమణితో వచ్చి కలవటం అత్యంత ఆనందం కలిగించింది.

సభ విశేషాలు మాటల కన్నా బొమ్మలే బాగా చెప్తాయి.

DSC01277

DSC01279

DSC01310

DSC01333

DSC01366

DSC01407

June 22, 2009 ·  · No Comments
Posted in: నా రచనలు.

ఈవారం నా రచనలు-16

ఈవేళ సాయంత్రం ఏఎస్ రావ్ నగర్ లో ఆరున్నరకు నా పుస్తకం, తీవ్రవాదం, ఆవిష్కరణ సభవుంది. అందరికీ ఆహ్వానం.

ఇవాళ్ళ వార్త ఆదివారం అనుబంధంలో బ్లాగ్ స్పాట్ శీర్షికన, హాంగ్ కాంగ్ దర్శకుడు కెన్నెత్ బీ బ్లాగు పరిచయం వుంటుంది. హాంగ్ కాంగ్ సినిమాను ప్రపంచానికి పరిచయం చేయటం ఈయన బ్లాగు వుద్దేశ్యం.

ఆంధ్రప్రభ సగటు మనిషి స్వగతంలో ఈవారం సగటు మనిషికి మరో సందేహం వచ్చింది. దేహాన్ని దేవాలయాలంత పవిత్రంగా వుంచాలంటారు. కానీ, మన దేవాలయాలను ఎంత పవిత్రంగా వుంచుతున్నాము? ఇదీ సగటుమనిషి స్వగతం ఈవారం.

చిత్రప్రభలో ప్రస్తుతం నవలలను సినిమాలుగా మార్చటం గురించి చర్చ జరుగుతోంది. ఈవారం వివిధ దేవదాసుల గురించి చర్చ కొనసాగుతుంది.

ఆంధ్రభూమి వార పత్రికలో పవర్ పాలిటిక్స్ శీర్షికన రాజకీయమ్షాల విశ్లేషణ వుంటుంది.

ఈ శనివారం అంటే, 27వ తారీఖున త్యాగరాయ గాన సభ మినీ హాలులో తీవ్రవాదం పుస్తక పరిచయ సభ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ పత్రిక సంపాదకులు శ్రీ వల్లీశ్వర్ గారు పుస్తకాన్ని విశ్లేషిస్తారు. అందరికీ ఇదే ఆహ్వానం.

ఇవీ ఈవారం నా రచనలు. మీ అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా తెలియచేయాలని ప్రార్ధన.

June 21, 2009 ·  · No Comments
Posted in: నా రచనలు.

సాహిర్- ఒక సవరణ- ఒక విన్నపం!

సాహిర్ లూధియానవీ వ్యాసాన్ని ప్రచురించిన తరువాత చూసుకుంటే మొదటి రెండు పేజీలు చివరలో వచ్చాయి. వ్యాసం మూడవ పేజీతో ఆరంభమవుతోంది. కాబట్టి, నా కంప్యూటర్ సాకేంతిక పరిఙ్నాన అఙ్నానికి నా అపీ జాలి తలచి, నన్ను క్షమించి, వ్యాసాన్ని ముందు చివరికి వెళ్ళి రెండు పేజీలు చదివి, మళ్ళీ మొదటికి వచ్చి మూడవ పేజీనుంచి చదువుకోవాలని సిగ్గుపడుతూ వేడుకుంటున్నాను.

అయితే, పెద్ద మనసుతో బ్లాగరులు నా తప్పును మన్నించి, ముందు వెనకయితే పొరపాటులేదోయ్, వ్యాసం మారిపోలేదోయ్, అని, వ్యాసాన్ని తిప్పిచదువుకుని, తమ అభిప్రాయాన్ని నిక్కచ్చిగా తెలియపరుస్తారని ఆశిస్తున్నాను.

అందరినీ, మరోసారి, క్షమార్పణలు వేడుకుంటున్నాను.

వ్యాసం నాణ్యతను చూసి నన్ను క్షమించేస్తారన్న విశ్వాసంతో   సెలవు.   

June 20, 2009 ·  · 3 Comments
Posted in: నా రచనలు.

సాహిర్ లూధియానవీ- ఒక పరిచయం!

PAGE 3PAGE 4PAGE 5PAGE 6PAGE 7PAGE 8PAGE 9ఇది నేను ఈభూమి పత్రికలో పాడుతా తీయగా శీర్షికకోసం రాసిన వ్యాసం. అయితే, పత్రికలో ఈ శీర్షికకోసం రెండే పేజీలు కేటాయించటంతో వ్యాసాన్ని కుదించి వేసుకున్నారు. ఇప్పుడు ఆ వ్యాసాన్ని మొత్తంగా ప్రచురిస్తున్నాను. ఇది నా రాతప్రతి కావటంతో నా రాతను చూసేవీలుకలగుతుంది.

చదవండి.

 

PAGE 1PAGE 2

June 20, 2009 ·  · One Comment
Tags: , , , , , ,  · Posted in: నీరాజనం

పుస్తకావిష్కరణ సభకు అందరికీ ఆహ్వానం!

నేను రచించిన పుస్తకం ‘తీవ్రవాదం’ ఈనెల 21వ తారీఖున ఏఎస్ రావ్ నగర్ లో ఆవిష్కృతమవుతున్నది. పుస్తకాన్ని ఆవిష్కరించేది మా అమ్మ. ఈసభకు అందరూ వీలుచూసుకుని వచ్చి ప్రోత్సహించాలని మనవి. ఆహ్వాన పత్రం ఇదిగో!

INVITATION

June 17, 2009 ·  · No Comments
Posted in: Uncategorized