Archive for June 7, 2009

ఈవారం నా రచనలు-14

ఈవారం వార్త ఆదివారం అనుబంధంలో బ్లాగ్ స్పాట్ శీర్షికన ఏ ఆర్ రహెమాన్ బ్లాగు పరిచయం వుంటుంది. ఏఆర్ రహిమాన్ బ్లాగు అనేకన్నా అఫీషియల్ వెబ్ సైటు అనవచ్చు. పనిలోపనిగా బ్లాగుకూ వెబ్ సైటుకూ వుండేతేడానుకూడా వ్యాసంలో వివరించాను.

ఆదివారం ఆంధ్రప్రభ అనుబంధంలో సగటు మనిషి స్వగతం వుంటుంది. ఈసారి సగటు మనిషికి ఒక గంభీరమయిన అనుమానమే వచ్చింది. మానవహక్కుల సంఘాలవారూ, మేధావులూ, తీవ్రవాదులు చస్తే, నక్షలైట్లు చస్తే మాత్రమే మానవహక్కులగోలపెడతారు. మామూలు మనుషులు తీవ్రవాదుల దాడుల్లో పోతే కిక్కురుమనరు. వీళ్ళ దృష్టికి మామూలు మనుషులు మనుషులుకారు, వారికి హక్కులుండవు. తీవ్రవాదులకూ, నక్షలైట్లకే మానవ హక్కులుంటాయి. ప్రభాకరన్ మరణానికి వీరి స్పందన, కవులు కవితలు రాసేయటం చూసి సగటు మనిషికీ సందేహం వస్తుంది.

ఆంధ్రభూమి వార పత్రికలో పవర్ పాలిటిక్స్ శీర్షికన ఎన్నికల ఫలితాలను ఓత్ల శాతం ఆధారంగా విశ్లేషించటం వుంటుంది.

ఆంధ్రప్రభ గురువారం చిత్రప్రభ అనుబంధంలో, ఈవారం నుంచి నవలలను సినిమాలుగా మలచటంలో సాధక బాధకాలు, స్క్రిప్టు రచనాపధతులగురించి చర్చ మొదలవుతుంది. మొదటి మూడువారాలు దేవదాసుల చర్చవుంటుంది. తరువాత పథేర్ పాంచాలి, గయిడ్ లతో సహా అనేక క్లాసిక్ ల నవలలు, సినిమా స్క్రిప్తు రచనల చర్చ ఈ శీర్షికన కొనసాగుతుంది.

తీవ్రవాదం పుస్తకావిష్కరణ ఏఎస్ రావు నగర్ లో 21వ తారీఖున అని అనుకుంటున్నాము. త్యాగరాయగాన సభలో 27వ తారీఖు స్థిరమయినట్టే.

ఇవీ ఈవారం నా రచనల వివరాలు. చదివి మీ నిర్మొహమాటమయిన అభిప్రాయాలను చెప్పాలని ప్రార్ధన.

June 7, 2009 ·  · No Comments
Posted in: నా రచనలు.