Archive for June 13, 2009

ఈవారం నా రచనలు-15

ఈవారం వార్త ఆదివారం అనుబంధంలో బ్లాగ్ స్పాట్ శీర్షికన, హారీపోటర్ సృష్టికర్త్రి జేకే రౌలింగ్స్  బ్లాగు పరిచయం వుంటుంది. ఈమె బ్లాగును చూడటమే ఒక మాయలాంటి అనుభవం.

ఆదివారం ఆంధ్రప్రభ అనుబంధంలో సగటుమనిషికి ఈసారి ఓ గంభీరమయిన ఆలోచన వచ్చింది. మానవుడు సంఘ జీవి అంటారు. కానీ, తరచి చూస్తే మనిషి ఎవ్వరితో కలసివుండలేడు. అందరితో పోట్లాడి వొంటరిగా వుండేందుకే తాపత్రయపడుతూంటాడు. ఇదీ సగటుమనిషి స్వగతం ఈవారం.

ఆంధ్రభూమి వార పత్రికలో పవర్ పాలిటిక్స్ లో ప్రపంచవ్యాప్తంగా, ప్రపంచీకరణ వల్ల పెరుగుతున్న సంకుచితత్వం, జాత్యహంకారాలను ప్రకోపింపచేయటంవల్ల కలిగే రాజకీయ లబ్ధులగురించిన విశ్లేషణ వుంటుంది.

ఆంధ్రప్రభ గురువారం చిత్రప్రభ అనుబంధంలో నవలలను సినిమాలుగా మలచటంపై చర్చ కొనసాగుతుంది. ముందుగా దేవదాసు గురించి చర్చవుంటుంది. బారువా దేవదాసు, బిమల్ రాయ్ దేవదాసు, నాగేశ్వరరావు దేవదాసు, కృష్ణ దేవదాసు, సంజయ్ లీలా భన్సాలి దేవదాసు, అనురాగ్ కాష్యప్ దేవ్ డీ ల గురించి విశ్లేషణ వుంటుంది.

21వ తారీఖున పుస్తకావిష్కరణ నిశ్చయమయినట్టే. ఏ ఎస్ రావ్ నగర్ లో ఈ పుస్తకావిష్కరణ జరుగుతుంది.

27న త్యాగరాయ గాన సభ మినీ హాలు లో పుస్తక పరిచయ సభ వుంటుంది. వివరాలు త్వరలో అందిస్తాను.

ఇవీ ఈవారం నా రచనలు. మీ అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా తెలియజేయ ప్రార్ధన.

June 13, 2009 ·  · No Comments
Posted in: నా రచనలు.