Archive for July, 2009

మహమ్మద్ రఫీ స్మృత్యంజలి!

ప్రతి నెలా చివరి శని వారం, హాసం క్లబ్బు సభ్యులు త్యాగరాజ గాన సభ (మినీ హాలు) లో సమావేశమవుతారు. ఈనెల 25వ తారీఖు సమావేశంలో నేను ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని సమర్పించాను.

జూలై 31, 1980న మహమ్మద్ రఫీ మరణించారు.  ఈ జూలై కి 303ఏళ్ళు అవుతాయి.  ఈ సందర్భంగా ఒక కార్యక్రమం సమర్పించాలనుకున్నాను. నాతో డాక్టర్ రాధాకృష్ణ చేతి కలిపారు. నా మాటకు ఆయన పాట తోడయింది.

మా కార్యక్రమం ఎంతగా ప్రేక్షకులను అలరించిందంటే ఇకపైన ప్రతి నెలా తప్పనిసరిగా హాసం సభలో మా కార్యక్రమం వుండాలని తీర్మానించారు.

వొచ్చేనెల చివరి శనివారం జరిగే సభలో కిషోర్ కుమార్ పైన ప్రత్యేక కార్యక్రమం వుంటుంది.

25న జరిగిన జరిగిన కార్యక్రమ విశెషాలు ఈనాడు లో ఈక్రింద చదవండి.

rafi swaraarchana

July 28, 2009 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

యాంకరమ్మలూ, యాంకరయ్యలూ…

sagatu manishi(2)ఇది 19.7.2009, ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో ప్రచురితమయింది.

July 26, 2009 · Kasturi Murali Krishna · No Comments
Posted in: నా రచనలు.

ఈవారం నా రచనలు-19

క్రితం వారం ఎంత బిజీగా వున్నానంటే కనీసం ఆవారం నా రచనలు కూడా  పోస్టు చేయలేక పోయాను.

ఈవారం వార్త ఆదివారం అనుబంధంలో నోం చోంస్కీ బ్లాగు పరిచయం వుంటుంది. అమెరికా వ్యతిరే మేధావులలో అగ్రస్థానం చోంస్కీదే.

ఆదివారం ఆంద్ర ప్రభ లో సగటు మనిషి స్వగతం వుంటుంది. ఎప్పతిలాగే ఈసారీ సగటుమనిషికో పనికిరాని సందేహం వస్తుంది.

ఆంధ్రభూమి వార వార పత్రికలో పవర్ పాలిటిక్స్ శీర్షికన వోడిపోయిన పార్టీల రాజకీతాల విశ్లేహణ వుంటుంది.

ఆంధ్రప్రభ గురువారం చిత్రప్రభలో సినిమాలుగామారిన నవలల చర్చ కొనసాగుతుంది.

ఈనెల విడుదలయ్యే ఈభూమిలో పాడుతా తీయగా శీర్షికన రాజ్ కపూర్ స్వంత సినిమాలలో పాట్ల విశ్లేషణ వుంటుంది.

కౌముది లో కథాసాగరమథనం శీర్షికన 82 కథలనుంచి పాథకుల పరిచయం కోసం ఎంచుకున్న కథల విశ్లేషణ వుంటుంది.

సినీగేయ రచయితలు సాహిర్ లూధియానవీ, మజ్రూహ్ సుల్తాన్ పురి, షకీల్ బదాయునిల పాట్ల విశ్లేహణ వ్యాసాలు రామయిలో వరుసగా వచ్చాయి. వాతి సంకలనం తయారీలో వుంది. త్వరలో విడుదలవుతాయి.

ఇవీ ఈవారం నా రచనలు. చదివి మీ నిర్మొహమాటమయిన అభిప్రాయం తెలపాలని ప్రార్ధన.

July 25, 2009 · Kasturi Murali Krishna · No Comments
Posted in: నా రచనలు.

తీవ్రవాదం- ఈనాడు రివ్యూ!

ఆదివారం అంటే 12.07.2009 ఈనాడు ఆదివారం అనుబంధంలో తీవ్రవాదం పుస్తక పరిచయ సమీక్ష ప్రచురితమయింది. అది ఈ క్రింద చదవండి.

your book review0

July 16, 2009 · Kasturi Murali Krishna · No Comments
Posted in: నా రచనలు.

శ్రీశ్రీ-నా వ్యాసం!

sri srisri 2

July 12, 2009 · Kasturi Murali Krishna · One Comment
Tags: , ,  · Posted in: నా రచనలు.

ఈవారం నా రచనలు-18

ఈవారం చాలా బిజీ బిజీగా గడచింది.

ఆఫీసులో కూడా చాలా పనివుండటంతో, రాత పనులు ఇంకా వుండటంతో కంప్యూటర్ దగ్గరకు వచ్చే తీరిక లభించలేదు.

ఈవారం నేనో పుస్తకం రాశాను. అది అతి త్వరలో విడుదలవుతుంది. పుస్తకం వివరాలు ఇప్పుడే చెప్పటంలేదెందుకంటే, ఇది తిన్నగా పుస్తక రూపంలోనే వస్తోంది. విడుదలయ్యేవరకూ ఎవ్వరికీ పుస్తకం గురించి తెలియకూడదని ప్రచురణకర్త ఆదేశాలు.

ఈవారం వార్తలో బ్లాగ్ స్పాట్ శీర్షికలో అరుంధతీరాయ్ బ్లాగు పరిచయం వుంటుంది. రంగుటద్దాల మేధావులకు ఆమె ప్రతీక. ఆమె బ్లాగు అందుకు నిదర్శనం.

ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో సగటు మనిషికీసారి మరో సందేహం వచ్చింది. అవినీతి ఆరోపణలక్రింద ఎప్పుడూ వంద వెయ్యి తీసుకునేవారే పట్టుబడతారుకానీ, లక్షలు, కోట్లు తీసుకునేవారెందుకు పట్టుబడరన్నది అతడి సందేహం.

ఆంధ్రభూమి వార పత్రికలో పవర్ పాలిటిక్స్ శీర్షికన రాజకీయ విశ్లేషణ సాగుతుంది.

గురువారం ఆంధ్రప్రభ అనుబంధం చిత్రపభలో సినీసిత్రాలు శీర్షికన సినిమాలుగా మారిన నవలల చర్చ కొనసాగుతుంది. ఈసారి చర్చ ఆర్ కే నారాయణ్ నవల గైడ్ సినిమా నవలల గురించి.

ఇవీ ఈవారం నా రచనల వివరాలు.

నేను కొత్తగా రాసిన పుస్తకం గురించి చర్చించాలని ఆత్రంగా వుంది. కానీ, ప్రచురణకర్త కిచ్చిన మాట నోరు కట్టేస్తోంది. పుస్తకం బాగా వచ్చింది. ప్రస్తుతం బాగా చర్చలోవున్న అంశం ఆధారంగా రచించినది. పాఠకులను విపరీతంగా ఆకర్శిస్తుందన్న నమ్మకం నాకుంది. ఎందుకంటే తెలుగులో ఇంతవరకూ ఇలాంటి రచన సంవిధానాన్ని ఎక్కువగా వాడలేదు. డీటేపీ కూడా వేగంగా సాగుతోంది. బహుషా వచ్చేవారానికల్లా ముద్రణ అయిపోతుంది. వివరాలను ఇలా కష్టపడుతూ దాచుకునే బాధ తీరిపోతుంది.

ఈవారం నా రచనలపైన మీ అభిప్రాయం నిర్మొహమాటంగా తెలపాలని ప్రార్ధన.

ఇంతకీ, నా కొత్త సొంతగూడు ఎలావుంది?

July 11, 2009 · Kasturi Murali Krishna · No Comments
Tags: , , , , , , ,  · Posted in: నా రచనలు.