Archive for August, 2009
వర్షం బాబోయ్ వర్షం
August 31, 2009
·
Kasturi Murali Krishna ·
No Comments
Posted in: నా రచనలు.
మైకెల్ జాక్సన్ పుస్తకావిష్కరణ సభ విశేషాలు!
అనుకున్నట్టుగానే 29.8.09 సాయంత్రం మైకెల్ జాక్సన్ పుస్తకావిష్కరణ సభ జరిగింది. బాగా జరిగింది.
ఆంధ్రప్రభ ఎడిటర్ విజయబాబుగారు చివరి క్షణంలో పనిరావటం వల్ల రాలేకపోయారు.
అనుకోకుండా డాక్టర్ సీ నారాయణ రెడ్డి గారు సభకు వచ్చారు.
అస్సలనుకోకుండా మైకెల్ జాక్సన్ ఫైబెర్ విగ్రహాన్ని తయారుచేసిన దేవికారాణిగారు విగ్రహంతో సహా సభకు వచ్చారు.
ముఖ్యంగా, పుస్తకం ముందుమాటలో నేను నారాయణ రెడ్డి గారు రచించిన పాటలోని పంక్తులను ఉదాహరించటం, ఆ సభలో వారేవుండటం చాలా గమ్మత్తుగా, అద్భుతంగా అనిపించింది.
ఆవిష్కరణ తరువాత పొట్టి వీరయ్యకు సన్మానం జరిగింది.
ఆతరువాత కిషోర్ కుమార్ యాదోం కీ బారాత్ కార్యక్రమాన్ని సమర్పించాము. అందరికీ చాలా నచ్చిందీ కార్యక్రమం.
నారాయణ రెడ్డి గారు శ్రద్ధగా విని ఆనందించటమే కాదు, మధ్య మధ్యలో సందేహాలు అడిగి తెలుసుకున్నారు. చివరికి స్వచ్చందంగా ఆయన కొన్ని అనుభవాలను వినిపించారు.
ఇలా హాయిగా, ఆనందంగా, ఆడుతూ, పాడుతూ సభ గడచింది.
సభ వివరాలు, ఫోటోల్లో….
August 29, 2009
·
Kasturi Murali Krishna ·
3 Comments
Tags: డాక్టర్ సీ నారాయణ రెడ్డి, పుస్తకావిష్కరణ, మైకెల్ జాక్సన్ · Posted in: నా రచనలు.
మైకెల్ జాక్సన్ పుస్తకావిష్కరణకు ఆహ్వానం!
రేపు జరిగే మైకెల్ జాక్సన్ పుస్తకావిష్కరణ సభకు ఆహ్వాన పత్రిక ఇది.
August 27, 2009
·
Kasturi Murali Krishna ·
One Comment
Posted in: నా రచనలు.
పుస్తకావిష్కరణ సభకు ఆహ్వానం!
ఈ శనివారం, అంటే 29.08.2009 నాడు, సాయంత్రం ఆరుగంటలకు, త్యాగరాయగానసభ మినీ హాలులో నేను రచించిన, పాప్ ప్రపంచానికి రారాజు, మైకెల్ జాక్సన్, అనే పుస్తకావిష్కరణ సభవుంది.
ఈ సభకు బ్లాగరులందరికీ ఇదే నా ఆత్మీయపూర్వక ఆహ్వానం!
పుస్తకాన్ని శ్రీ ఈలపాట శివప్రసాద్ గారు ఆవిష్కరిస్తారు.
ఆంధ్రప్రభ సంపాదకులు శ్రీ విజయబాబుగారు పుస్తకాన్ని పరిచయం చేస్తారు.
హాసం క్లబ్ ఆధ్వర్యాన జరిగే ఈ సభలో ఎస్వీరామారావుగారు కూడా పాల్గొంటారు.
సభానంతరం, నేను సమర్పించే కిషోర్ కుమారె స్మృత్యంజలి కూడా వుంటుంది.
ఎట్టి పరిస్థితులలో సభ రాత్రి 8.30 లోపల అయిపోతుంది.
కాబట్టి అందరూ వీలు చేసుకుని రావాలి. సభను జయప్రదం చేయాలి.
August 26, 2009
·
Kasturi Murali Krishna ·
2 Comments
Posted in: నా రచనలు.
రాజ్ కపూర్ సినిమాల పాటలు!
ఆగస్ట్ నెల ఈభూమి పత్రికలో పాడుతా తీయగా శీర్షికన ప్రచురితమయిన వ్యాసం ఇది.

August 23, 2009
·
Kasturi Murali Krishna ·
No Comments
Tags: అవారా, నర్గీస్, బర్సాత్, మేరానాం జోకర్, రాజ్ కఊర్, శంకర్-జైకిషన్, శ్రీ420. సంగం · Posted in: నా రచనలు.
ఈవారం నా రచనలు-24
ఈవారం వార్తలో బ్లాగ్ స్పాట్ శ్ర్ర్షికన ఇంగ్లాండ్ ప్రధాని గార్డన్ బ్రౌన్ బ్లాగ్ పరిచయం వుంటుంది.
ఆంధ్రప్రభలో సగటు మనిషికి ఓ సందేహం వస్తుంది. గుడికి వెళ్ళటాన్ని తప్పుగా, చులకనగా చూస్తారెందుకన్నది సగటుమనిషి సందేహం.ఇప్పుడు ఆంధ్రప్రభను నెట్ లో కూ డా చూడవచ్చు. www.andhraprabha.com
ఆంధ్రభూమి వారపత్రికలోని పవర్ పాలిటిక్స్ శ్ర్ర్షికన ఈవారం చదువుల పవర్ పాలిటిక్స్ విశ్లేషణ వుంటుంది.
గురువారం ఆంధ్రప్రభ చిత్రప్రభలో నవలలను సినిమాలుగా మలచటం గురించి చర్చ కొనసాగుతుంది. నా కొత్త పుస్తకం విడుదలవుతోంది.
ఆగస్ట్ 29 న త్యాగరాయ గాన సభ మినీ హాలులో నేను రాసిన డైరెక్ట్ జీవిత చరిత్ర విడుదలవుతోంది. ఇంతకీ నేను రాసిందెవరి జీవితచరిత్రనో ఊహించండి?
ఒక క్లూ… ఆరోజే అతడి పుట్టినరోజు!
వివరాలు త్వరలో!!11
August 22, 2009
·
Kasturi Murali Krishna ·
No Comments
Tags: ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, పవర్ పాలిటిక్స్, బ్లాగ్ స్పాట్, వార్త, సగటుమనిషిస్వగతం, సినిమా సిత్రాలు · Posted in: నా రచనలు.


























