Archive for August, 2009

చిత్ర మాసపత్రికలో నా కథ!

ఆగస్ట్ నెల చిత్ర మాసపత్రికలో ప్రచురితమయిందీ కథ. చదివి మీ అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా తెలపండి.

page 1page 2

page 3page 4

August 20, 2009 · Kasturi Murali Krishna · 2 Comments
Posted in: Uncategorized

రెండుపుస్తకాల ఆవిష్కరణ సభ విశేషాలు!

ఆదివారం, అంటే, 17.8.2009 నాడు, రాజమండ్రి లోని బ్రౌన్ మందిరంలో ఒకేసభలో రెండు పుస్తకాల ఆవిష్కరణ జరిగింది. నిజానికీ పుస్తకాలు ఇంతకుముందే ఆవిష్కృతమయ్యాయి. కానీ, రాజమండ్రి వాసులకోసం మరోసారి ఆవిష్కరించాలని నిర్ణయించారు. పుస్తకావిష్కరణ చేసింది, శ్రీ అవంత్స సోమసుందరం గారు. ఆవిష్కృతమయిన పుస్తకాలు, దేవులపల్లి కృష్ణమూర్తిగారు రచించిన, ఊరు వాడ బ్రతుకులు, కేపీ అశోక్ కుమార్ రచించిన, కథావలోకనం లు. ఊరువాడబ్రతుకులు పుస్తకం గురించి, యెండ్లూరి సుధాకర్ గారు, కోడూరి శ్రీ రామ మూర్తిగారు మాట్లాడేరు. కథావలోకనం గురించి, మనోజ గారు, నేను మాట్లాడేము. సభాధ్యక్షత బాధ్యతను శ్రీ జయధీర్ తిరుమలరావుగారు నిర్వహించారు. పుస్తకాలను ఆవిష్కరిస్తూ అవంత్స సోమసుందరం గారు చాలా గొప్పగా మాట్లాడేరు. విమర్శకుడు పుస్తకంలోని మంచిని మాత్రమే కాదు, లోపాలను కూడా ఎత్తిచూపించాలన్నారు. విమర్శకుడు రచనను చదవటంలో పాథకుడికి దృష్టిని ఇస్తూనే, రచనను మరింత మెరుగులు దిద్దటంలో రచయితకూ సూచనలివ్వాలన్నారు. అని, ఊరువాడబ్రతుకులు పుస్తకంలోని గుణాలను వివరించారు. తాననుకుంటున్న లోపాలను ఎత్తిచూపారు. రెండవ ప్రతిలో రచయిత ఈదోషాలను సవరించుకోవాలన్నారు. దానికి స్పందిస్తూ, యెండ్లూరి సుధాకర్, ఆ రచనలోని పద్మశాలీల, దళితుల జీవన సంస్కృతులను వివరించిన విధానాన్ని ప్రకటిస్తూ, రచనలోని సామెతలను, దాదాపుగా 40 పైన, వివరించారు. ఆవెంటనే కోడూరి శ్రీరామమూర్తి మాట్లాడుతూ, ఈరచనను మెమోయిర్స్ గా పరిగణించాలన్నారు. మనోజగారు అశోక్ కుమార్ కథావలోకనంలోని నాలుగు వ్యాసాలను లోతుగా విశ్లేషించారు. ఈ పుస్తకం రీసెర్చ్ చేయాలనుకునేవారికి ఆలోచనలనిస్తుందన్నారు. అప్పటికే ఆలస్యమయిపోయింది. రాత్రి ఎనిమిదిన్నరకు మేము తిరుగు బళ్ళు పట్టుకోవాలి. అందుకని నేను రెండు ముక్కల్లో నా ఉపన్యాసాన్ని ముగించాను. ప్రస్తుతం ఉన్న విమర్శకులను వర్గీకరించి, వివరించి, ఇలాంటి విమర్శకులున్న పరిస్థితిలో అశోక్ కుమార్ లాంటి అసలయిన విమర్శకుల పుస్తకాల అవసరం ఎంతో వుందని చెప్పి, నా మాటలలో నిజం ఈ పుస్తకం చదివి తేల్చుకోండి అని ముగించాను. నేను చేసిన విమర్శక వర్గీకరణను భవిష్యత్తులో వీలుననుసరించి ప్రత్యేక టపాలో రాస్తాను. అలాగే, అవంత్స సోమసుందరం గారు ఊరువాడబ్రతుకులపైన చేసిన విమర్శ, దానికి యెండ్లూరి సుధాకర్, కోడూరిల సమాధానాలకు నా స్పందనను త్వరలో ఆ పుస్తక సమీక్షలో తెలుపుతాను. సభ కాగానే గబ గబా భోజనం ముగించి పరుగెత్తి బస్సులోకి దూకాము. హైదెరాబాదు వచ్చి కళ్ళు తెరిచాము.

ఊరువాడ బతుకు, దేవులపల్లి కృష్ణమూ,ర్తి హైదెరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురణ  ,వెల- 40/- కథావలోకనం, కేపీ అశోక్ కుమార్, పాలపిట్టప్రచురణ, వెల- 50/-.

August 18, 2009 · Kasturi Murali Krishna · No Comments
Posted in: పుస్తక పరిచయము

ఈవారం నా రచనలు-23

ఈవారం వార్త ఆదివారం అనుబంధంలో బ్లాగ్ స్పాట్ శీర్షికన ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు, కార్టూనిస్టు, సంగీతకారుడు జెఫ్ బ్రిడ్జెస్ బ్లాగు పరిచయం వుంటుంది. నాకు చాలా నచ్చిన బ్లాగు అది.

ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో సగటు మనిషి స్వగతం శీర్షికన ఈసారి సగటు మనిషికి వచ్చిన సున్నితమయిన భావాల ప్రకటన వుంటుంది. ఆంధ్రభూమి వారపత్రికలో పవర్ పాలిటిక్స్ శీర్షికన రాజకీయ విశ్లేషణ కొనసాగుతుంది.

గురువారం ఆంధ్రప్రభ సినిమా అనుబంధం చిత్రప్రభలో నవలలను సినిమాలుగా మార్చటం గురించి చర్చ కొనసాగుతుంది.

నేను రాసిన తాజా పుస్తకం, ఇది ఎక్కడా ప్రచురితం కాలేదు, డైరెక్టుగా పుస్తకంగా ప్రచురించటంకోసమే రాసినది, ఒక పుస్తకం త్వరలో వెలువడుతోంది. పుస్తకావిష్కరణ తేదీని 29 ఆగస్టుగా నిర్ణయంచారు. ఆ వివరాలు త్వరలో….

ఇవీ ఈవారం నా రచనల వివరాలు. వీటిపై మీ అభిప్రాయాన్ని నిక్కచ్చిగా తెలపండి.

August 15, 2009 · Kasturi Murali Krishna · No Comments
Posted in: నా రచనలు.

చీర మ్యూజియానికి, మనం…?

ఇది సగటుమనిషిస్వగతం శీర్షికన ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో ప్రచురితమయింది.

sagatu manishi

August 14, 2009 · Kasturi Murali Krishna · No Comments
Posted in: నా రచనలు.

తీవ్రవాదం-ఆంధ్రప్రభ రివ్యూ.

ఆంధ్రప్రభలో నా పుస్తకం తీవ్రవాదం రివ్యూ ప్రచురితమయింది. ఇది ఆ రివ్యూ.

review on teevravadam

August 12, 2009 · Kasturi Murali Krishna · No Comments
Posted in: నా రచనలు.

నిడదవోలు మాలతి గారి సభ!

లేఖిని సంస్థ ఆధ్వర్యంలో త్యాగరాయగానసభ మినీ హాలులో ఒక సభ జరిగిందీవేళ. తెలుగు సాహిత్యాన్ని అంతర్జాతీయస్థాయికి అనువాదాలద్వారా తీసుకువెళ్తున్నందుకు అభినందన సభ ఈసభ.

సభలో వాసా ప్రభావతీ దేవి గారు, సుధామ, పోరంకి దక్షిణామూర్తి గార్లు పాల్గొన్నారు.

మంకలవాటయిన సభల్లో ముందుగా వక్తలు తమ వక్తృత్వ ప్రఙ్నా ప్రావీణ్యాలను సభికుల ఓపిక నశించినా పట్టించుకోకుండా ప్రదర్శిస్తారు. ఆతరువాత రచయిత కుటుంబ సభ్యులు, లైట్లార్పి తాళాలేసుకునేందుకు హాలువారు తప్ప ఎవరూ మిగలని పరిస్థితిలో రచయితను మాట్లాడమంటారు.

ఇందుకు భిన్నంగా, వాసా ప్రభావతిగారు, పోరంకి దక్షిణామూర్తి గారు మాట్లాడగానే నిడదవోలు మాలతిగారిని మాట్లాడమన్నారు.

నిడదవోలు మాలతిగారు చక్కగా మాట్లాడారు. అనువాద రచనల అనుభవాలను పంచుకున్నారు. సాధకబాధకాలను వివరించారు. తన బ్లాగులోని రచనలను కాపాడుకునే బాధ్యత పాఠకులది, రచయితల్ది అన్నారు. అందుకు స్పందించిన లేఖిని వారు, అనువాద కథల పుస్తక ప్రచురణకు ప్రయత్నిస్తామన్నారు. దక్షిణామూర్తిగారు, తన వంతుగా 1116/- ప్రతి పుస్తకానికీ ఇస్తామని వాగ్దానం చేశారు.

తరువాత మాలత్గారికి ఙ్నాపికను అందించారు.

సభలో మాలతిగారు, బ్లాగులను, బ్లాగర్లను ప్రస్తావించారు.

అయితే, సభకు రెండురోజులముందే మాలతిగారిని సుజాతగారింట్లో కలిసినప్పుడు ఒక విషయం అర్ధమయింది.

తెలుగు రచయితలు, అమెరికాలోవున్నా, ఆంధ్రప్రదేశ్ లో వున్నా, ఏ ఉద్యమాలకు, గుంపులకు చెందకపోతే వారి బాధలన్నీ ఒకేరకం.  అందుకే మాలతి గారిని కలిసిన తరువాత ఇంటికి వెళ్తూంటే సాహిర్ పాటలోని పంక్తులు మాటి మాటికీ గుర్తుకువచ్చాయి.

అప్నా సుఖ్ భీ ఏక్ హై సాథీ, అప్నా దుఖ్ భీ ఏక్
అప్నీ మంజిల్ సచ్ కీ మంజిల్, అప్నా రస్తా నేక్.

మన సుఖ దుహ్ఖాల స్వరూపమొక్కటే. మన గమ్యం సత్యం. మన దారికి స్వచ్చం.

కాబట్టి ఆపాటలో సాహిర్ చెప్పినట్టు, ఏ ఉద్యమాలకు, సిద్ధాంతాలకు, గుంపులకు చెందని రచయితలంతా, సాథీ హాథ్ బఢానా, ఏక్ అకేలా థక్ జాయేగా, మిల్ కర్ బోఝ్ ఉఠానా( ఒంటరిగా ఒక్కరే బరువు ఎత్తటం కష్టం. ఒకరికొకరు చేయి చేయి కలిపి సమిష్టిగా బరువుమోయాలి) అని కలవాలి. సాహిత్యాన్ని బ్రతికించాలి. అందుకు, మాలతిగారి రచనలను రచయితలంతా కలసి ప్రచురించటమనే చర్య ప్రేరణ అవుతుందేమో చూద్దాం.

సభ విశేషాలు ఫోటోల్లో…..

Image000Image014Image007Image008

August 11, 2009 · Kasturi Murali Krishna · 7 Comments
Tags: , ,  · Posted in: సభలూ-సమావేశాలు.