Archive for October, 2009
హాసం సభకు ఆహ్వానం!
ప్రతినెలా చివరి శనివారం హాసం సభ త్యాగరాయగానసభ మినీహాలులో జరుగుతుంది. అందరికీ ఆహ్వానం.
October 30, 2009
·
Kasturi Murali Krishna ·
No Comments
Posted in: Uncategorized
చిత్ర మాసపత్రికలో తీవ్రవాదం రివ్యూ!
ఈనెల చిత్ర మాస పత్రికలో నేను రచించిన తీవ్రవాదం పుస్తకం రివ్యూ ప్రచురితమయింది. ఆరివ్యూ ఇది.
October 20, 2009
·
Kasturi Murali Krishna ·
No Comments
Posted in: pustaka paricayamu
పుస్తకావిష్కరణ విశేషాలు!
ప్నిన్న సుందరయ్య విఙ్నాన కేంద్రం మినీహాలులో బీపీ కరుణాకర్ కథల సంకలనం నిర్నిమేషం పుస్తకావిష్కరణ సభ జరిగింది. ఈ సభ విశేషమేమిటంటే సభలో వేదికపైన సహితీమూర్తులే వేదిక క్రింద సహితీ దురంధరులే. వేదిక పైన కొలకలూరి ఇనాక్, యెండ్లూరి సుధాకర్, దార్ల, ధేనువకొండ శ్రీరామమూర్తి, గుడిపాటి, కేపీ అశోక్ కుమార్ వంటివారు వేదికపైన వుంటే, శీలావీర్రాజు, శివారెడ్డి, యెలనార, యెలనాగ, నాళేశ్వరం శంకరం, వేదగిరి రాంబాబు, జింబో, సలీం స్వాతి శ్రీపాద వంటివారు వేదిక క్రింద వున్నారు.
అయితే సభ ఆలస్యంగా ఆరంభమయింది. సుదీర్ఘ వుపన్యాసాలతో, మధ్య మధ్యలో అనుకోని అతిథుల ప్రసంగాలతో సాగింది. వుండి వుండి ఫోటోగ్రాఫర్లు వచ్చినప్పుడల్లా వుపన్యాసాలు మధ్యలో ఆపి అందరూ పుస్తకాలు పుచ్చుకుని ఫోటోల కోసం పాత పోసునే కొత్త కొత్తగా ఇచ్చేసి మళ్ళీ వుపన్యాసాలారంభించటం కామిక్ రిలీఫ్.
సభ విశేషాలు ఫోటోల్లో.
October 16, 2009
·
Kasturi Murali Krishna ·
2 Comments
Tags: ఇనాక్, దార్ల, పుస్తకావిష్కరణ · Posted in: pustaka paricayamu
వనిత టీవీలో నా కార్యక్రమం!
ఈవేళ వనిత టీవీలో రాత్రి 10గం 30 నిలకు వెండితెర వెన్నెల కార్యక్రమంలో నేను స్క్రిప్టు రాసిన కార్యక్రమం వస్తుంది. పాత హిందీ సినిమా నజ్రానా సినీకథను విశేషాలతో పరిచయం చేశాను. ఈ కార్యక్రమం చూసి మీ అభిప్రాయాన్ని, సూచనలను నిర్మొహమాటంగా తెలపండి.
October 15, 2009
·
Kasturi Murali Krishna ·
No Comments
Posted in: sinemaa vishleashaNaa.
మనసు మాట – ముఖేష్ పాట
పాడుతా తీయగా శిర్షికన ఈ భూమి మాస పత్రికలో ముఖేష్ వ్యాసం

October 12, 2009
·
Kasturi Murali Krishna ·
One Comment
Posted in: నా రచనలు.
ఈవారం నా రచనలు-27
ఈమధ్య అటు ఆఫీసులో ఇటు ఇంట్లో ఎంత బిజీగా వుంటున్నానంటే సరిగ్గా కంప్యూటర్ ముందు కూచునే తీరిక వుండటంలేదు. ఈవారం నా రచనల వివరాలు చెప్పేముందు కొన్ని వేరే విషయాలు టూకీగా చెప్తాను. ఈమధ్య వనితా టీవీలో ప్రతి శుక్రవారం రాత్రి 10-30గం లకు వచ్చే వెండితెర వెన్నల కార్యక్రమానికి స్క్రిప్టు రాస్తున్నాను. విజువల్స్ విషయంలో సూచనలు ఇస్తున్నాను. గత మూడువారాలుగా కార్యక్రమం మెరుగయిందని ఫీడ్ బాక్ వస్తోంది. సమయం కాస్త ఇబ్బంది కరంగా వున్నా ఓపిక చేసుకుని చూసి మీ సూచనలు తెలియపరచండి. ఇంతవరకూ శ్రీ 420, సత్యజిత్ రాయ్ దేవి, జోధా అక్బర్ సినిమాలను పరిచయం చేశాను. నిన్న చేగువేరా గురించి స్టూడియో ఎన్ లో ఒక చర్చ కార్యక్రమంలో పాల్గొన్నాను. మైకెల్ జాక్సన్ పుస్తకమేకాదు, అక్షరాంజలి, రియల్ స్టోరీ, తీవ్రవాదం పుస్తకాలు బాగావున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అమ్మకాలు కూడా ప్రోత్సాహకరంగానే వున్నాయి. ఈసారి వార్త ఆదివారం అనుబంధంలో దాదాఫాల్కే అవార్డు గ్రహీత మన్నాడే పైన కవర్ స్టోరీ వుంటుంది. హిందీ గాయకుడిపై కవర్‌స్టోరీ తెలుగు పత్రికలు చేయటం నాకు తెలిసి చాలా అరుదు. ఆంధ్రప్రభలో సగటుమనిషి స్వగతం వుంటుంది. వార్త బ్లాగ్ స్పాట్ శీర్షికలో పర్యావరణ బ్లాగు climate progress నడుపుతున్న జో రోం బ్లాగు పరిచయం వుంటుంది. ఆంధ్రభూమి వార పత్రికలో పవర్ పాలిటిక్స్ శీర్షికన రాజకీయ విశ్లేషణ వుంటుంది. గురువారం చిత్రప్రభలో నవలలనుంచి సినిమాల రూపాతరం చర్చ సాగుతుంది. ఈనెల ఈభూమిలో గాయకుడు ముకేష్ పరిచయం వుంటుంది. పత్రిక మార్కెట్ లో వుంది. కౌముదిలో కథాసాగరమథనం వుంటుంది. ఈవారం నవ్య వార పత్రికలో నేను రాసిన హారర్ స్టోరీ ఊర్మిళ ప్రచురితమయింది. చదివి మీ అభిప్రాయం చెప్పండి. సైన్స్ ఫిక్షన్ కథలు, పవర్ పాలిటిక్స్ శీర్షికన భారతీయ రాజకీయ సమస్యల విశ్లేషణల సంకలనాలు తయారవుతున్నాయి. త్వరలో విడుదలవుతాయి. హాసం ప్రచురణల వారు ముద్రిస్తున్న సాహిర్ పాటల విశ్లేషణ ( రసమయి సీరియల్) తయారీ చివరి దశలో వుందని తెలిసింది. వచ్చే హాసం సమావేశానికి పుస్తకం విడుదల కావచ్చు. ఈసారి హాసం సమావేశాంలో షమ్మీ కపూర్ పాటల గీత మాలిక తుం ముఝే యూన్ భులానపావోగే కార్యక్రమం సమర్పిస్తున్నాను. దానికి తయారీలోవున్నాము. ఇవీ ఈవారం నా రచనల వివరాలు. చదివి మీ అభిప్రాయాన్ని తెలపండి.
October 10, 2009
·
Kasturi Murali Krishna ·
No Comments
Tags: ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, ఈభూమి, కథ., చిత్రప్రభ, దాదాఫాల్కే, మన్నాడే, ముకేష్, వార్త, సగటుమనిషి స్వగతం. పవర్ పాలిటిక్స్, సినీసిత్రాలు · Posted in: నా రచనలు.






















