Archive for December, 2009

హాసం సభకు ఆహ్వానం!

ప్రతి చివరి శనివారం, త్యాగరాయ గాన సభ మినీ హాలులో హాసం సభ జరుగుతుంది. ఈవేళ హాసం సభలో నేను సాహిర్ పాటల విశ్లేషణ పై నేను రాసిన పుస్తకం గురించి మాట్లాడతాను. ఈ పుస్తకం త్వరలో విడుదల అవుతుంది.

invitation copy

December 25, 2009 · Kasturi Murali Krishna · One Comment
Posted in: pustaka paricayamu

సురీలీ సురయ్య- పరిచయం.

డిసెంబర్ నెల ఈభూమి లో పాడుతా,తీయగా, శీర్షికన ప్రచురితమయిందీ వ్యాసం. మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచండి.

surayyasrya

December 24, 2009 · Kasturi Murali Krishna · No Comments
Posted in: నా రచనలు.

పుస్తక ప్రదర్శనలో బ్లాగర్లకు గొప్ప తగ్గింపు!

ఈసారి పుస్తక ప్రదర్శనలో నేను క్రితం సంవత్సరంలోలా ప్రత్యేకంగా అమ్మే ప్రయత్నాలు చేయటంలేదు. నా స్నేహితుడు పాలపిట్ట ప్రచురణల పేరిట ఒక స్టాల్ తీసుకోవటంతో నా పుస్తకాలూ ఆ స్టాలులోనే  వుంచుతున్నాను. పాలపిట్ట ప్రచురణకర్తలతో మాట్లాడి బ్లాగరులకు ప్రత్యేకంగా తగ్గింపుధరలో పుస్తకాలిచ్చే ఏర్పాటు చేశాము.

స్టాల్ నంబర్ 81 పాలపిట్ట ప్రచురణల స్టాలు. ఈ స్టాలులో బ్లాగరులు కొన్న పుస్తకాలపై ప్రత్యేక తగ్గింపు లభిస్తుంది. అయితే, ఆ స్టాలులో పుస్తకాలు కొని, బిల్లు చెల్లించేసమయంలో బ్లాగర్లు తమ బ్లాగు వివరాలివ్వాలి. అప్పుడే తగ్గింపు ధర లభిస్తుంది. అంతేకాదు. ఇకపై పాలపిట్ట ప్రచురణలన్నీ తగ్గింపుధరలో లభిస్తాయీ బ్లాగర్లకు. దానితోపాటు పాలపిట్ట పుస్తకాల ప్రచురణల వివరాలూ అందుతాయి.

బ్లాగరులీ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని అభ్యర్హిస్తున్నాను.

ఈ స్టాలులో నా పుస్తకాలు లభిస్తాయి. ముఖ్యంగా పాప్ ప్రపంచానికి రారాజు మైకెల్ జాక్సన్ కూడా లభిస్తుంది. ప్రచురితమయిన మూడు నెలలో ద్వితీయముద్రణకు నోచుకుందీ పుస్తకం. అయితే, ఎమెస్కో వారు ప్రచురించిన పుస్తకాలు మాత్రం ఆ స్టాలులోనే దొరుకుతాయి.

December 19, 2009 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

ఇవాళ్ళ జంజీర్ చూడండి!

zanjeer1ఇవాళ్ళ వనిత టీవీలో రాత్రి 10గంటల 30 నిముషాలకు వెండితెరవెన్నెల కార్యక్రమంలో అమితాభ్ సినిమా జంజీర్ పరిచయం వుంటుంది. సినిమా విశేషాలు, కథలతో పాటూ కొన్ని సన్నివేశాలూ చూపిస్తారు. ఈ కార్యక్రమానికి స్క్రిప్టు రాసింది నేనే. తప్పక చూడండి. చూసి మీ అభిప్రాయాన్ని, సూచనలను చెప్పండి.

zanjeer2

December 17, 2009 · Kasturi Murali Krishna · No Comments
Posted in: నా రచనలు.

రెండు సీరియళ్ళు ఒకేసారి!

జనవరి నెలనుంచీ నేను రాసిన రెండు నవలలు రెండు వేర్వేరు పత్రికలలో సీరియళ్ళుగా వస్తున్నాయి.

చిత్ర మాస పత్రికలో ఉపక్రమణము అనే నవల ఆరంభమవుతోంది. తీవ్రవాద నేపధ్యంలో రాసిన థ్రిల్లర్ నవల ఇది.

కౌముది.నెట్ లో చారిత్రాత్మక నవల ద్రష్ట సీరియల్ గా ఆరంభమవుతోంది. మాలిక్ కాఫర్ దక్షిణ భారత దండయాత్ర కేంద్రమీ నవలకు. ఈ చారిత్రక నవల కథను, కాల్పనిక పాత్రలు చెప్తాయి.

ఈ రెండు నవలలు చదివి మీ అభిప్రాయాలనూ, సూచనలనూ నిర్మొహమాటంగా తెలియచేస్తారని ఆశిస్తున్నాను.

December 17, 2009 · Kasturi Murali Krishna · No Comments
Posted in: నా రచనలు.

ఆత్మగౌరవాలు-దేశం ముక్కలు!

astramఇది మార్చ్ 2005 నాటి విపుల మాస పత్రికలో నా శీర్షిక వ్యంగ్యాస్త్రం లో ప్రచురితమయిన వ్యంగ్య కథ. ఇప్పటి పరిస్థితిని చక్కగా ప్రతిబింబిస్తుంది. చదివి మీ స్పందనను తెలపండి.

 

vastram1

December 15, 2009 · Kasturi Murali Krishna · No Comments
Posted in: నా రచనలు.