Archive for January, 2010

విలక్షణ సంగీత దర్శకుడు!

ఈభూమి మాస పత్రికలో పాడుతా తీయగా శీర్షికన జనవరి నెలలో నేను రాసిన వ్యాసం ఇది. చదివి మీ అభిప్రాయాన్ని చెప్పండి.

sad

SAJ

January 31, 2010 · Kasturi Murali Krishna · No Comments
Tags: , ,  · Posted in: Uncategorized

అయ్యయ్యో ద్రౌపది!

ఆంధ్రభూమి వార పత్రికలో అద్దం లో మనం శీర్షికన శ్రీమతి ఏ ఎస్ లక్ష్మి రాసిన వ్యాసం ఇది.

సాహిత్య పరిఙ్నానం లేని వారు సైతం సులభంగా చదివి అర్ధం చేసుకుని విషయం తెలుసుకోగలరీ వ్యాసం చదివితే. పుస్తకం చదవని వారు, చదవకూడదనుకున్న వారు కూడా విషయం గ్రహించగలరు. ఒక అభిప్రాయానికి రాగలరు.

చదివి నిర్మొహమాటమయిన అభిప్రాయాన్ని తెలపండి.

addam

January 21, 2010 · Kasturi Murali Krishna · 11 Comments
Posted in: Uncategorized

అయ్యో ద్రౌపది!

ఈ వారం ఆంధ్రభూమి వారపత్రికలో అద్దం లో మనం శీర్షికన శ్రీమతి ఏ ఎస్ లక్ష్మి గారు రచించిన అయ్యో ద్రౌపది వ్యాసం చదవండి. ద్రౌపది రచన పట్ల మరో దృక్కోణాన్ని చూపిస్తుందీ వ్యాసం.

January 19, 2010 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

అపచారానికే అవార్డు!

ద్రౌపడి నవలకు అకాడెమీ అవార్డు ఇవ్వటాన్ని సమీక్షిస్తూ నేను ఆంధ్రభూమి వార పత్రికలో రాసిన వ్యాసం ఇది.

నవలను చదవకుండా, విషయ విమర్శన లేకుండా, తనకు తోచిందే జగదేక సత్యమని నోటికి వచ్చింది రాసేస్తూ అదే నిజమని విర్రవీగే వారికీ, వారిని సమర్ధించటమే అభ్యుదయమని, ఆధునికమనీ, అభివృద్ధి అని , గొప్ప తనమనీ, తెలివయిన తనమనీ, భ్రమపడే వారికీ నమస్కరిస్తూ, ఇలాగే చదవకుండా ఆలోచించకుండా అవార్డులిచ్చే ప్రపంచంలో ద్రౌపదికి లాంటి రచనలకు అవార్డులురావటం సబబేఅనిపిస్తుంది.( చదివేవారికి బాధ. ముందు వెనుక ఆలోచించేవారికి బాధ.)

ఇదంతా చూస్తూ, చిందులు వేయకురా, తెలిసీ తెలియని అఙ్నానముతో ప్రజలను వంచన చేయకురా… అని పాడుకుంటూ, ఈ సమీక్షను చదివి మీ నిర్మొహమాటమయిన అభిప్రాయాన్ని తెలపమని ప్రార్ధన.

పుస్తకం చదివిన వారు ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తపరచినా దానికి విలువ వుంటుంది, కనీసం వారు పుస్తకం చదివారు కాబట్టి.. అలా చదవకుండానే అమూల్యమయిన అభిప్రాయాలను తెలియచేసేవారి అభిప్రాయం ఎంత గొప్ప దయినా దానికి  nonsense value  తప్ప, కనీసం nuisance value కూడా వుండదు. అలాంటి అభిప్రాయానికి ఎవరయిన విలువనిచ్చి ప్రామాణికంగా భావించి ఆవేశపడిపోతూంటే అది వారిష్టం!

dropadi 1draupadi2

draupadi 3

January 15, 2010 · Kasturi Murali Krishna · 10 Comments
Tags: , , ,  · Posted in: pustaka paricayamu

అపచారానికి అవార్డా?

అపచారానికి అవార్డా? అన్న శీర్షికతో ఆంధ్రభూమి వార పత్రికలో ద్రౌపది నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి ఇవ్వటాన్ని నిరసిస్తూ రాసిన వ్యాసం ప్రచురితమయింది.

రచయిత నిరంకుశుడు. రచయితకు ఇది రాయాలి, అది రాయొద్దు అని ఎవ్వరూ చెప్పకూడదు. ఆంక్షలు విధించకూడదు. అలాగని, తమకు వచ్చిన ప్రతి ఆలోచననూ అక్షరబద్ధం చేయకూడదు రచయితలు. స్వీయ నియంత్రణ, విచక్షణలను ఉపయోగించాలి.

రచయితలు విచక్షణను విస్మరించినప్పుడు, రచయిత భావ వ్యక్తీకరణ స్వేచ్చను పరిరక్షిస్తూనే, ఆ వ్యక్త పరచిన భావంలోని అనౌచిత్యాన్ని, అది సమాజంలో కలిగించగల దుష్పరిణామాలను గమనించిన విఙ్నులు, ఆ ఆలోచనలకు ప్రామాణికతను కల్పించకూడదు.

విఙ్నులు ఆ విఙ్నతను ప్రదర్శించనప్పుడు, సమాజంలోని సామాన్యులే ఆ బాధ్యతను నిర్వహించాల్సివుంటుంది. ద్రౌపది నవలకు సాహిత్య అకాడెమీ అవార్డు రావటం ఇలాంటి పరిస్థితిని నెలకొల్పింది.

ద్రౌపది రచనలోని అనౌచిత్యాలను సహేతుకంగా విమర్శిస్తూ, నవలకు అవార్డివ్వటంలో సాహిత్య అకాడెమీ వారి ప్రమాణాలను, విలువలను ప్రశ్నిస్తూ రాసిన వ్యాసం ఈ వారం విడుదలయిన ఆంధ్రభూమి వారపత్రికలో చదవండి. చదివి నిర్మొహమాటమయిన అభిప్రాయాన్ని తెలపండి.

January 11, 2010 · Kasturi Murali Krishna · One Comment
Tags: , , ,  · Posted in: pustaka paricayamu

still me- పుస్తక పరిచయం.

అవి నేను రియల్ స్టోరీలు రాస్తున్న రోజులు.

రియల్ స్టోరీలు అనగానే క్రైం కథలన్న అభిప్రాయం వుండేది. నాకు మాత్రం ఎలాగయినా క్రయిం నుంచి రియల్ స్టోరీలను మానవత్వం కథలవైపు మళ్ళించాలని వుండేది. వీలు దొరికినప్పుడల్లా , రియల్ స్టోరీలంటే నిజంగా జరిగిన కథలు, అవి క్రయిం కథలే కానక్కరలేదని వాదిస్తూండేవాడిని. క్రైం కాకపోతే ఎవరూ చదవరని నా వాదనను కొట్టేస్తూండేవారు. అందరూ చదివేది రాయటంలో గొప్ప లేదు. మనము రాసింది అందరూ చదివేట్టు చేయటంలోనే మన గూప వుంటుందని వాదించేవాడిని.

చివరికి నా వాదన భరించలేక, నెలకొక క్రయిం స్టోరీ, ఒక క్రయిం రహిత కథను  రాసేందుకు ఒప్పుకున్నారు. అలా రియల్ స్టోరీలను ప్రేరణనిచ్చే వాస్తవ విజయ గాథలుగా మార్చాను. వారం విడిచి వారం కాకుండా ప్రతి వారం ఇలాంటి కథలే కావాలని పాఠకులు కోరటం, విపరీతంగా ఆదరిస్తూండటంతో రియల్ స్టోరీలు వాస్తవ విజయగాథలయిపోయాయి.

పాఠకులకు ఆసక్తిపెరిగేందుకు  పేరున్నవారి జీవిత గాథలకోసం వెతికేవాడిని. అలాంటి సమయం లో సూపర్ మాన్ గా నటించిని క్రిస్టఫర్ రీవ్ జీవితంలోని విశద గాథ తెలిసింది. ఆ విషాదానికి క్రుంగిపోకుండా ఎలా దాని ద్వారా సమాజానికి ఉపయోగపడేట్టు తన జీవితాన్ని మలచుకుంటున్నాడో తెలిసింది. అతడి జీవితం ఆధారంగా రియల్ స్టోరీ రాయాలనుకున్నాను. సమాచారం సేకరించటం మొదలుపెట్టాను. అప్పుడే అతను తన అనుభవాలను still me అనే స్వీయ జీవిత గాథగా రచించాడని తెలిసింది. ఆ పుస్తకం చదివితే కథను మరింత బాగా రాయగలననిపించింది. ఆ పుస్తకం కోసం వేట ప్రారంభించాను.

ఎంత వెతికినా పుస్తకం దొరకలేదు. విసిగి, పుస్తకం చదవకున్నా, నా దగ్గర వున్న సమాచారంతో కథ రాయవచ్చనుకున్నాను. కానీ మనసొప్పలేదు.

ఇంతలో ఒక రోజు ఫుట్ పాత్ పైన  కనిపించాడు క్రిస్టఫర్ రీవ్.

book review పది రూపాయలకు చక్కటి హార్డ్ బవుండ్ ఎడిషన్ కొన్నాను. ఆత్రంగా చదివాను.

కథ రాసేందుకు సిద్ధమయ్యాను.

కానీ, మళ్ళీ రియల్ స్టోరీలను క్రయిం కథలుగా రాయమనటంతో నేను ఆ శీర్షిక రాయటం మానుకున్నాను. ఫలితంగా క్రిస్టఫర్ రీవ్ కథను రియల్ స్టోరీ సిరీస్ లో రాయలేదు.

still me అద్భుతమయిన పుస్తకం అనటంలో ఎలాంటి సందేహం లేదు.

ఈ పుస్తకం గొప్పతనం క్రిస్టఫర్ రీవ్ వీలయినంత నిజాయితీగా తన భావాలను వ్యక్తపరచటంలో వుంటుంది.

ఆయన వర్తమానం  లోని సంఘటనలు చెప్తూ గతం లోకి వెళ్తూ తన జీవిత కథ చెప్పటం చాలా గొప్పగా వుంటుంది. గతానికీ, వర్తమానానికీ నడుమ వున్న అంతరం మనసులో ముల్లులా గుచ్చుకుంటూంటుంది. జీవితంలో ఒక్క క్షణం ఎంత మార్పుతేగలదో మనసుకు అర్ధమవుతుంది. భయం వేస్తుంది. అంతలోనే, రీవ్ కు జరిగిన దానికన్నా ఘోరం ఇంకేమవుతుందనిపిస్తుంది. అంత ఘోరాన్నుంచి రీవ్ తనకి తాను ధైర్యం చెప్పుకోవటం, ఇతరులకు అండగా నిలవటం, ఆ స్థితిలో వుండి ఒక సినిమాకు దర్శకత్వం వహించటం ధైర్యాన్నిస్తాయి. స్ఫూర్తినిస్తాయి.

ఒకవైపు తనకు జరిగిన ప్రమాదం  గురించి వివరిస్తూ, మరోవైపు నటుడిగా తన జీవితాన్ని నిజాయితీగా విశ్లేషిస్తాడు.

తనకు నటన గురించి సరిగ్గా తెలిసేసరికి నటనావకాశాలు తగ్గిపోయాయంటాడు. తన నటన జీవితం గురించి ఆసక్తి కరమయిన విశేషాలు చెప్తాడు. ఇవి చదువుతూంటే హాలీవుడ్ లో నటనను ఎంత సీరియస్ గా తీసుకుంటారో తెలుస్తుంది. ఒక వేషం కోసం ఎంత తపన పడతారో, ఒక పాత్రను అర్ధం చేసుకుని దాన్ని కొత్తగా ఆసక్తిగా చూపేందుకు ఎంత ప్రయత్నిస్తారో తెలుస్తుంది. అంతేకాదు హాలీవుడ్ పైకి కనిపిస్తున్నంత అందమయిన స్థలం కాదనీ తెలుస్తుంది.

ప్రెట్టేఎవుమన్ సినిమాలో హీరో పాత్రకోసం ఆదిషన్ అనుభవం చదువుతూంటే బాధగా అనిపిస్తుంది. నటులు సక్సెస్ కోసం ఎందుకు తాపత్రయపడతారో అర్ధమవుతుంది.
మోర్గన్ ఫ్రీమాన్, రాబర్ట్ రెడ్ ఫోర్డ్ వంటి నటుల గురించి వెల్లడించిన విషయాలు ఆసక్తికరంగా వుంటాయి. రాబిన్ విలియంస్ కూ క్రిస్టఫర్ కూ వున్న అనుబం,ధం తెలుస్తుంది.

ఈ రచనలో తన కుటుంబ సభ్యులతో తనకున్న అనుబంధం, వివాహం పైన వున్న అపోహలు, తన శక్తి, తన బలహీనతలను రీవ్ అంచనా వేఇన తీరు తెరపైన కనిపించే నతుడికీ నిజజీవితంలోని మనిషికీ మధ్య వున్న తేడాను చూపుతాయి.

అయితే, ఈ రచనలో ఉత్తమ భాగం ప్రమాదం తరువాత రీవ్ ఎలా తనపైన తన ఆలోచనలపైన నియంత్రణ సాధించి, తనలాంటి ఇతరుల సహాయానికి ప్రేరణ పొందాడన్నది.

ప్రతి ఒక్కరూ తప్పని సరిగా చదవవలసిన పుస్తకం ఇది. కష్టాలలో ఏడుస్తూ తిట్టుకుంటూ కూచునేబదులు కష్టాలను జీవితాన్ని సార్ధకం చేసుకునేందుకు సోపానాలుగా వాడుకోవటం తెలుస్తుందీపుస్తకం ద్వారా.

నేను రాసిన రియల్ స్టోరీ పుస్తకం బాగా అమ్ముడవుతోంది. మంచి మాటలే చెప్తున్నారందరూ ఆ పుస్తకంలోని కథల గురించి.  స్టీవ్ రీవ్ రియల్ స్టోరీ నేను రాయని అధ్బుతమయిన స్ఫూర్తినిచ్చే వాస్తవ విజయ గాథ. బహుషా, కథకాదు, దీని ఆధారంగా నవలనే రాస్తానేమో!

January 4, 2010 · Kasturi Murali Krishna · One Comment
Posted in: pustaka paricayamu