Archive for April, 2010

సౌశీల్య ద్రౌపది పుస్తకావిష్కరణ సభ!

సౌశీల్య ద్రౌపది పుస్తకావిష్కరణ సభ! తెనాలిలో మేనెల రెండవ తారీఖున జరుగుతోంది. అందరికీ ఇదే ఆహ్వానం.

నేను హైదెరాబాదులో వుంటాను. నేను రచించిన పుస్తకావిష్కరణ సభ, హైదెరాబాదులో కన్నా ముందు ఎనాలిలో జరుగుతోంది.

నిజానికి ఒకటో తారీఖున విజయవాడలో జరగాల్సి వుంది. కానీ, హాలు దొరకనందున అది 22వ తారీఖుకు వాయిదా వేశారు. . దాంతో సౌశీల్య ద్రౌపది పుస్ర్తకావిష్కరణ సభల పరంపర తెనాలితో ఆరంభమవుతోంది.  8 న హైదెరాబాదులో, 9 న వరంగలు లోనూ సభలు జరుగుతాయి,

తెనాలి పుస్తకావిష్కరణ సభ ఆహ్వాన పత్రం ఇదిగో……

invitation

April 30, 2010 · Kasturi Murali Krishna · No Comments
Posted in: pustaka paricayamu

మధురగీతాల మదన్ మోహన్!

ఏప్రిల్ నెల ఈభూమి మాస పత్రికలో పాడుతా తీయగా శీర్షికన ప్రచురితమయిన వ్యాసం ఇది. చదివి మీ అభిప్రాయాన్ని తెలపండి.

madanmada

April 29, 2010 · Kasturi Murali Krishna · 3 Comments
Tags: , , ,  · Posted in: నా రచనలు.

13 ఏళ్ళ వయసులో ఎవరెస్టా?

ఇది సగటు మనిషి స్వగతం శీర్షికన ఆదివారం ఆంధ్రప్రభ 25.4.2010 నాటి సంచికలో ప్రచురితమయింది. చదివి మీ అభిప్రాయాన్ని తెలపండి.

svagatam

April 27, 2010 · Kasturi Murali Krishna · No Comments
Posted in: నా రచనలు.

ఒక అత్యద్భుతమయిన పాట……

రచయిత లేకపోతే సినిమాలు ఆరంభమే కావు. కానీ రచయితలంటే సినిమావారికి చిన్నచూపు ఎక్కువ. స్క్రిప్టు రచయితలు, కథా రచయితల పరిస్థితే ఇలా వుంటే ఇక గేయ రచయితల పరిస్థితి చెప్పనే అక్కర్లేదు. అలాంటి సినీ ప్రపంచంలో హీరో, హీరోయిన్లు, దర్శకులు, సంగీత దర్శకులకన్నా ఎక్కువ మన్ననలను పొందిన గేయ రచయిత సాహిర్ లూధియాన్వీ.

సాహిర్ గొప్పతనమేమిటంటే అతని గేయాలవల్ల సినిమాలు సూపెర్ హిట్ లయ్యేవి. ఎలాగయితే ఇది రాజ్ కపూర్ సినిమా, ఇది శంకెర్ జైకిషన్ సినిమా అని చెప్పుకుంటారో అలాగే ఇది సాహిర్ సినిమా అని కూడా అంటారు.

తన గేయాలవల్ల సినిమాల విలువను పెంచగలగటంతో సినిమావారు సాహిర్ కు ఎంతో గౌరవమచ్చారు. అలా గౌరవమిచ్చిన వారితోనే పనిచేశాడు సాహిర్.

సినిమా కథ దగ్గిరనుంచి సంగీత దర్శకుడు, నటీనటులవరకూ సాహిర్ ఇష్టం ప్రకారమే కానిచ్చేవాడు బీ ఆర్ చోప్రా. అందుకే ఈనాటికీ అతడి సినిమాలు సినీ ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని పొందుతున్నాయి.

నయాదౌర్, సాధన,  ధూల్ క ఫూల్, ధర్తీపుత్ర, వక్త్, గుమ్రాహ్, హం రాజ్ వంటి సినిమాలన్నీ సాహిర్ కవితలవల్లే హిట్ అయ్యాయనటం అతిశయోక్తి కాదు. సాహిర్ కవిత విశ్వరూపాన్ని ప్రదర్శించి, ఎలా ఒక గేయ రచయిత సినిమా విజయానికి కారకుడవుతాడో నిరూపిస్తుంది గుం రాహ్.

గుం రాహ్ సినిమా కథ సాహిర్ జీవితాన్ని పోలివుంటుంది. సాహిర్ జీవితానుభవాల ప్రభావంతో వచ్చినన్ని సినిమాలు మరే కళాకారుడి జీవితానుభవాల ఆధారంగా రాలేదు.

మాల సిణా, సునీల్ దత్ లు ప్రేమించుకుంటారు. ఇన్ హవావోమె ఇన్ ఫిజావోమె తుఝ్ కొ మేరా ప్యార్ పుకారే, అని పాడుకుంటారు. కానీ, సోదరి మరణంతో, పిల్లల కోసం , మాలా సిణా పాత్ర, అశోక్ కుమార్ పాత్రను పెళ్ళిచేసుకుంటుంది.

భగ్న హృదయుడయిన సునీల్ దత్, వారి పెళ్ళయి సంవత్సరం పూర్తయిన సందర్భంలో, అదే ఇన్ హవావోమే ను విషాదంగా పాడతాడు. ( ఈపాట గురించి మరో పోస్టులో) . అత్యద్భుతమయిన సాహిత్యం, మానవ హృదయ స్పందనలను ప్రతిబింబిస్తుందా పాట.
మళ్ళీ వారిద్దరి ప్రేమ చిగిరిస్తుంది. ఇంతలో ఆమె భర్త వస్తాడు. ఆమె కోసం ఎదురుచూస్తూ, యేహవా హై ఉదాస్ జైసె మేర దిల్, అనే మరో ఎదకరిగించే పాట పాడతాడు. హీరో. ఇక్కడా సాహిత్యం ప్రధాన పాత్ర వహిస్తుంది.

ఆమె భర్తతో ఆమె ఇంటికి వస్తాడు. చలో ఎక్ బార్ ఫిర్ సే అజ్ఞబీ బన్ జాయె హం దోనో, అని పాడతాడు. సాహిత్యాపరంగా అత్యుత్తమమయినదీ పాట. సినీ సందర్భంలో వొదుగుతూ సార్వజనీన భావాలను ప్రదర్శించి ఆ పాటను చిరంజీవి చేశాడు సాహిర్.

ఆతరువాత హీరోకు పాడే అవకాశం వస్తుంది. తాను పాడేటప్పుడు స్టూడియోలో ప్రేయసి ఎదురుగా వుండాలంటాడు సునీల్ దత్. ఆమె భర్తకు తెలియకుండా ఆమె వచ్చి అతని ఎదురుగా కూచుంటుంది. ఆమె భర్త కూడా అక్కడికి వస్తాడు. ఆ సందర్భంలో సాహిర్ రాసిన పాటలాంటి పాట ఇంతవరకూ ఎవరూ రాయలేదు. ఇక రాయరు.

అది నిజానికి పాట కాదు. హృదయ స్పందనలకు అక్షర రూపం. అక్కడ హీరో నాయికను చూస్తూ పాడుతున్నాడు. సినిమా సందర్భానికి చక్కగా సరిపోతుంది.

కానీ, పాట విన్నవారికి సాహిర్ భగ్న ప్రేమ గుర్తుకు వస్తుంది. అతని ఎదురుగా భర్తను వదలి వచ్చి నిలచిన అతని ప్రేయసి గుర్తుకు వస్తుంది.

పాటను విన్న ప్రతి ఒక్కరికీ తమతమ భగ్న ప్రేమలు గుర్తుకు వస్తాయి. తమ మనసుల్లో కలిగిన భావాలు తాజా అవుతాయి. ఇలా తన ప్రేయసికి తన మనసులో భావాలు వినిపించాలన్న కోరిక కలుగుతుంది.

దాంతో సినిమా స్వరూపమే మారిపోతుంది. సినిమాలో పాత్రల ఆవేదనలు, సంఘర్షణలు, భావాలు, స్పందనలు అన్నీ ప్రేక్షకుల వ్యక్తిగతమయిపోతాయి. ఇలా సినిమాను వ్యక్తిగత అనుభూతిలా ఎదిగేట్టు చేసిన సాహిర్ గేయాలు  ఆయన పాటలు రచించిన సినిమాలను ఇతర సినిమాలకు ప్రత్యేకంగా నిలుపుతాయి.

ప్రేయసి ఎదురుగా వున్నప్పుడు నాయకుడు పాడేపాట ఇది.

ఆప్ ఆయీ తొ ఖయాలే దిల్ ఎ నాషాద్ ఆయా
కిత్నె భూలే హువె జక్షోంక పతా యాద్ ఆయా…

ఆమెను చూస్తే గాయపడిన హృదయ వేదన తాజా అయిందట. మరచిపోయిన అనేక గాయాలు తలలెత్తాయట.

అత్యద్భుతమయిన సున్నితమయిన ఆలోచన. ఎద ఝల్లుమంటుంది ఈ భావం మనసును తాకగానే. హృదయానికయిన గాయాలు గుర్తుకు వచ్చాయట!

ఆప్ కే లబ్ పే కభీ అప్న భి నాం ఆయాథ
షోక్ నజ్రే మొహబ్బత్ క సలాం  ఆయాథ
ఉమ్ర్ భర్ సాథ్ నిభానేక పయాం ఆయాథ

ఆమె పెదవులపై ఒకప్పుడు తన పేరుండేది. ఆమె కనులనుండి ప్రేమ సందేశాలు అందేవి. కీవితాంతం కలసివుండే వాగ్దానాలందేవి.

ఇన్ని చెప్పి దెబ్బ కొడతాడు.

ఆప్ కో దేక్ కె వొ ఎహదే వఫా యాద్ ఆయా..

ఆమెను చూస్తే ఆమె అతనిలో కలిగించిన విశ్వాసం గుర్తుకు వచ్చిందట. చావు దెబ్బ. తనని కాదని వేరే వాడిని పెళ్ళిచేసుకుందామె! అందుకే ఆమెని చూస్తే అచంచల విశ్వాసం గురుకువస్తోంది కవికి.

రూహ్ మే జల్ ఉఠె బుఖ్తీ హువి యాదోంకె దియే
కైసె దీవానె థె హం ఆప్ కొ పానేకె లియే
యూన్ తొ కుచ్ కం నహి జో ఆప్ నె ఎహెసాన్ కియే

ఆమెని చూడగానే ఎదలో ఆరిపోతున్న ఝ్నాపకాల దీపం ఒక్క సారిగా భగ్గుమన్నదట. ఆమెను పొందాలని అతనెంత పిచ్చివాడయ్యాడో గురుతుకువచ్చిందట. అంతేకాదు, ఆమె అతనిపై చూపించిన జాలీ గుర్తుకు వచ్చిందట.

ఎంత వ్యంగ్యం. కసి తీర్చుకుంటున్నాడు కవి. ప్రేమించి మోసం చేసినందుకు వాగ్బాణాలతో లోతయిన గాయాలు చేస్తున్నాడు. కానీ ఆమెపైన చెరగని తన ప్రేమను ప్రకటిస్తున్నాడు.

ఈ చరణంలో కూడా చివరి పాదం అత్యద్భుతమయినది.

పర్ న మాంగేసె న పాయా వొ సిలా యాద్ ఆయా

కోరి పొందలేని ఆ కథ ఝ్నాపకం వచ్చిందట.

చివరి చరణం మహాద్భుతమయినది. చిత్రీకరణ పాట అర్ధాన్ని భాష రానివారికి కూడా తేట తెల్లం చేతుంది.

ఆజ్ వో బాత్ నహి, పర్ కొయి బాత్ తొ హై

ఇప్పుడు ఒకప్పటి ప్రేమలేదు. కానీ ఇంకా ఏదోవుంది తమ మధ్య.

మేరె హిస్సేమె హల్కీసి ములాకాత్ తొ హై

తనవంతుకు కాస్త కలయిక ఇంకా వుంది. ఎందుకంటే…

గైర్ కా హోకె భీ ఆజ్ మెరే సాథ్ తొ హై

పరాయిదయికూడా ఆమె తన ఎదురుగా వుంది.

హాయె ఇస్ వక్త్ మ్య్ఖే కబ్ కా గిలా యాద్ ఆయా..

అయినాసరే అతడికి ఎప్పటెప్పటి ఆరోపణలు ఆవేదనలో గుర్తుకు వస్తున్నాయి.

ఈపాట విన్న తరువాత ఇక వేరే పని చేయలేము. పాటవింటూ పాట అర్ధాన్ని అనుభవిస్తూ, మనసులో కలిగిన గాయాలను నెమరువేసుకుంటూంటే సినిమా పాట ఎలా సినీ పరిథి దాటి వ్యక్తి కి catharsis గా మారి సాంత్వననిస్తుందో, అతనిలో నిద్రాణంగా వున్న సున్నిత భావనలను తట్టి లేపుతుందో అర్ధమవుతుంది. ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు. ఎంత అనుభవించినా సరిపోదు. అలాంటి అద్భుతమయిన గేయాలు రచించిన సాహిర్ తన కలం పేరు తగ్గట్టు పెట్టుకున్నాడు.

సాహిర్ అంటే ఐంద్రజాలికుడు అని అర్ధం.
అక్షరాలతో అనంతమయిన భావాలను సృజించి మామూలు మనుషులు కూడా లోతయిన భావనలను అనుభవించేట్టు చేసే సాహిర్ నిజంగా ఐంద్రజాలికుడే. ఎవరికయినా సందేహముంటే ఎ పాట వినండి. అనుభవించి పలవరించండి.

April 24, 2010 · Kasturi Murali Krishna · 4 Comments
Posted in: sinemaa vishleashaNaa.

సౌశీల్య ద్రౌపది-పుస్తకావిష్కరణ సభలు!

సౌశీల్య ద్రౌపది పుస్తకావిష్కరణ సభలు రాష్ట్రం లో పలు ప్రాంతాలలో జరుగుతున్నాయి. ఏ సంస్థకూ చెందని వ్యక్తులు స్వచ్చందంగా ముందుకు వచ్చి సభలు నిర్వహిస్తున్నారు.

సౌశీల్య ద్రౌపది తొలి ఆవిష్కరణ సభ విజయవాడలో మే 1వ తారీఖున జరుగుతుంది.

మే 2 వ తారీఖున తెనాలిలో ఆవిష్కరణ సభ జరుగుతుంది.

మే 8 న హైదెరాబాదులో సౌశీల్య ద్రౌపది పుస్తకావిష్కరణ సభ జరుగుతంది.

మిగతా వివరాలు త్వరలో….

April 20, 2010 · Kasturi Murali Krishna · No Comments
Posted in: నా రచనలు.

పాలపిట్ట- కొత్త సంచిక విడుదలయింది…..

పాలపిట్ట- కొత్త సంచిక విడుదలయింది.

ఏప్రిల్ నెల పాలపిట్ట మాస పత్రిక విడుదలయింది.

ఆలస్యంగా విడుదలయినా, ఆననందం కలిగిస్తుంది.

కొత్త పత్రిక క్రెడిబిలిటీ పెరగాలంటే సమయానికి విడుదలవటం అత్యంత ప్రధానమయిన అంశం. ఆలస్యం అయిన కొద్దీ రక రకాల వ్యాఖ్యలు వినిపిస్తాయి. కాబట్టి పత్రికను సకాలం లో ప్రచురించటం పత్రిక విజయవంతమవటానికి తొలీడుగు అని ప్రచురణ కర్తలు గ్రహించాలి. పాఠలుల విశ్వాసాన్ని చూరగొనాలి.

papittaఈ నెల సంచికలో ప్రధానంగా శ్రీ శ్రీ గురించి, గోరటి వెంకన్న గురించి ప్రత్యేక వ్యాసాలున్నాయి. గోరటి ఇంటెర్వ్యూ కూడా వుంది. ఈ రెండు విశయాలు ఈ నెల పత్రిక ప్రత్యేక ఆకర్షణలు.

ఇవికాకేన్ సదాశివ, ముకుంద రామారావు, కాత్యాయని విద్మహే, అఫ్సర్, ఎస్ నారాయణ స్వామి, కేపీ అశోక్ కుమార్, వెల్చేరు నారాయణ రావ్ వంటి రచయితల వ్యాసాలు, రూప్ కుమార్ డబ్బీకార్, వైదేహి శశిధర్, ఎలనార వంటి కవుల కవితలు, సమీక్షలు వున్నాయి.

కొల్లూరి సోమ శంకర్ అనువాద కథ వుంది.

ఇలా విభిన్నమయిన సాహిత్యాంశాలను పొందుపరచుకున్న పత్రిక విడుదలయింది. కొనండి. చదవండి. అభిప్రాయాలు తెలిపి పత్రికను ప్రోత్సహించండి. తెలుగు పత్రికా రంగంలో సాహిత్య పత్రికలకూ మనుగడ వుందని నిరూపించండి..

April 15, 2010 · Kasturi Murali Krishna · 3 Comments
Posted in: pustaka paricayamu