Archive for April 11, 2010

సౌశీల్య ద్రౌపది- త్వరలో…..

సౌశీల్య ద్రౌపది పుస్తకం తయారయిపోయింది.

మొత్తం 112 పేజీలున్నాయీ పుస్తకంలో.

నా పద్ధతి ప్రకారం ముందుమాట నేనే రాసుకున్నాను. పుస్తకం చివరలో ఆంధ్రభూమి వార పత్రికలో నేను రాసిన అపచారానికి అవాడా? అనే వ్యాసం పొందుపరచాను.

నవలలో సందర్భోచితం అనిపించిన చోట కవిత్రయ భారతం నుంచి పద్యాలను ఉదాహరించాను. దీనివల్ల, మన పురాణాలను, పురాణ పాత్రలను ఎంత పవిత్రంగా భావించారో, ఎంత జాగ్రత్తగా వాటిని సమకాలీన సమాజానికి అన్వయించాలో అర్ధమవుతుంది.

పుస్తకం అట్ట తయారవుతోంది.

ఈవారాంతానికి పుస్తకం అచ్చయి చేతికి వస్తుంది.

సౌశీల్య ద్రౌపది పుస్తకం అందరికీ అందుబాటులో వుండాలని వెల 50/- రూపాయలు మాత్రమేగా నిర్ణయించాను.

కాబట్టి, పుస్తకాన్ని కొని, చదివి, నిర్మొహమాటంగా మీ అభిప్రాయాన్ని తెలిపి నన్ను ప్రోత్సహించాలని ప్రార్ధన.

మిగతా వివరాలు త్వరలో…..

April 11, 2010 · Kasturi Murali Krishna · No Comments
Posted in: నా రచనలు.