Archive for June, 2010

నాన్సీ ఫ్రైడే రచనలు-ఒక విశ్లేషణ.

నాన్సీ ఫ్రైడే రచనలు-ఒక విశ్లేషణ. ఈ వ్యాసం పాలపిట్ట జూన్ నెల సంచికలో ప్రచురితమయింది. చదివి మీ అభిప్రాయాలను నిర్మొహమాటంగా తెలపండి.

June 30, 2010 · Kasturi Murali Krishna · No Comments
Posted in: నా రచనలు.

గుంటూరు సభ విశేషాలు.

గుంటూరులో సౌశీల్య ద్రౌపది పరిచయ సభ బ్రహ్మాండంగా జరిగింది.

25వ తారీఖు ఉదయం జన్మభూమిలో బయలుదేరాము, నేనూ, హనుమాన్ చౌదరి గారూ.

ఇద్దరివీ పక్క పక్క సేట్లే అయినా, గుంటూరు చేరేవరకూ ఒక్క మాటా మాట్లాడుకోలేదు. నేనే, ఆయనను బ్రేక్ ఫాస్ట్  ఎలా? అనడిగా. ఆయన తినివచ్చా, అన్నారు.Image0252

ప్రయాణమంతా ఆయన, డాక్టర్ ఏ ఎస్ రావు జీవిత చరిత్ర చదువుతూ నోట్స్ రాసుకుంటూన్నారు. నేను రాస్తున్న కొత్త నవలకు సంబంధించిన అంశాల రెఫెరెన్సులు చూస్తూ, అది విసుగు రాగానే శాంతారాం అనే ఇంగ్లీషు నవల చదువుతూ కూచున్నాను.

గుంటూరు చేరుతూండగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న, బొల్లేపల్లి సత్యనారాయణ గారినుంచి ఫోను వచ్చింది. కారుతో సిద్ధంగా వున్నామని.

నేను ఆయనను అంతవరకూ చూడలేదు. ఆయన మమ్మల్ని వెతుకుతూ ప్లాట్ ఫారం మీదకు వచ్చారు. సెల్లులో మాట్లాడుతూ రావటం వల్ల సులభంగా గుర్తుపట్టాము.

పలకరింపులయ్యాయి. ఆయన కారులో తిన్నగా వారింటికి వెళ్ళాము. ఆయన ప్రచురించిన మహాభారత వైజయంతి అనే పుస్తకాల తొమ్మిది భాగాలు, భారత రహస్యాలనే పుస్తకం రెండు భాగాలు ఇచ్చారు. అవి ఉట్టిగా తిరగేస్తేనే కళ్ళు తిరిగాయి.

mahaనిజంగా ఎంతమంది ఎంత నమ్మకంతో నిస్స్వార్ధంగా మన సంస్కృతీ సాంప్రదాయాల ఔన్నత్యాన్ని ప్రజలకు వివరించి, మన సనాతన ధర్మాన్ని సజీవంగా వుంచాలని పనిచేస్తున్నారో అనిపించింది.

భారతీ ధార్మిక వి~ంనాన పరిషత్ అనే సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా య~ంనాలు యాగాలు చేస్తూ, భారత రామయణ భాగవత శ్రవణ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతో సేవ చేస్తున్నారు శ్రీ సత్యనారయణ గారు. ఆయన ప్రచురించిన పుస్తకాలన్నీ ఉచితంగానే ఇస్తున్నారు ఆసక్తి ఉన్నవారికి.

ఆ పుస్తకాలు మహభారతంలోని ప్రతి పాత్ర ప్రతి అంశమూ, ప్రతి విషయం గురించి ఖ్సుణ్ణంగా పరిశోధించి రాసినవి. ఆ పుస్తకాలను చదువుతూంటే అనేక అపప్రధలు, అపవాదులు, మన పురాణాల గురించి చేసే దుర్వ్యాఖ్యానాలకు సమాధానాలు దొరుకుతాయి.

ఆ పుస్తకాలు చదువుతూంటే ఇంత స్పష్టంగా అనేక విషయాలు ఎదురుగా వున్నా ఇంకా ఏవేవో కొత్త కోణాలంటూ, పరిశోధనలంటూ నోతికొచ్చినట్టు మట్లాడతరేమితి మనుషులు? అనిపించింది.

అటునుంచి వారు నిర్మించిన వేంకటేశ్వర దేవాలయానికి తీసుకువెళ్ళారు.Image0250

అక్కడ గెస్ట్ హౌస్ లో నా బస.
గుడికి ముందున్న స్థలంలో ఒక యఙ్న శాల కట్టిస్తున్నారు. ఒక వృద్ధుల విశ్రాంతి స్థలం వుంది. పిల్లలకోసం పార్కువుంది.

Image0249ఇంకా వారు, ఒక అనాథ శరణాలయం, వృద్ధాశ్రమం కూడా కట్టిస్తున్నారుImage0251. ఇదంతా చూస్తూంటే ఎంతమంది ఎన్నిరకాలుగా మన ధర్మాన్ని నిలపటంకోసం ప్రయత్నిస్తున్నారో అనిపించింది. కానీ, ఇది సరిపోదు.

గెస్ట్ హౌస్ లో దింపుతూ ఆయన ఒకటే మాట అన్నారు. ఈ మర్యాద ద్రౌపదిని మీరు అర్ధం చేసుకుని ప్రదర్శించిన విధానానికి అన్నారు.

అప్పతి నుంచి సాయంత్రం సభ సమయమయ్యేవరకూ నేను ఆ గదినుంచి కదలలేదు. ఆయన ఇచ్చిన పుస్తకాలు చదువుతూ కూచున్నాను. మధ్య మధ్య మన బ్లాగరు గీతాచార్యకు ఫోను చేస్తూవున్నాను. కానీ ఆయన అందే వీలులేదని ఫోన్లోంచి ఒక మహిళా స్వరం విసుగురాకుండా చెప్తూనే వుంది.

సాయంత్రం గుడి  తెరిచే సమయానికి నేను తయారయి దర్శనం చేఉకున్నాను. అప్పటికే కొందరు మహిళలు వచ్చి విష్ణు సహస్రనామాలు చదువుతున్నారు రాగయుక్తంగా.

ఆ గుడిలో ప్రతిరోజూ ఏదో కార్యక్రమం జరుగుతూనే వుంటుంది.

గుడిముందున్న ఖాళేఎ స్థలమే బృందావన్ గార్డెన్స్ అన్నమాట. ఆకడి వారు ఆవరణ అంతా కుర్చీలు వేస్తూంటే ఇంతమంది వస్తారా? అనుకున్నాను. అంత మందీ వచ్చారు.

సభ ఆరంభమయ్యేసరికి మొత్తం నిండి పోయింది.

సభలో శ్రీ కూర్మనాథ్ గారు, హనుమాన్ చౌదరి గారు, హరనాథ రెడ్డి గారు, నేనూ ప్రసంగించాము.

నేను మోయలేక కేవలం 80 కాపీలు తీసుకెళ్ళాను. ఆ కాపీలు మొదటి గంటలోనే అయిపోయాయి. కావాలని ఇంకా చాలమంది అడిగారు. త్వరలో మరో సభ ఏర్పాటు చేస్తానని ఆయన అన్నారు.

సభ ఒక కల లాగా జరిగింది. నారాయణాద్రి రైలులో తిరిగివస్తూంటే నిద్రపట్టలేదు.

ఇంతమంది ఇంతగా పుస్తకాన్ని ఆదరించటం, నన్ను గౌరవించటంలో నా గొప్ప ఏమీలేదనిపించింది. అది మన ప్రాచీన సాహిత్యంలోనే వుంది. రామాయణ, భారతాలలోనే వుంది.

వాటిపైన కువిమర్శలు చేసి లాభపడినా అది తాత్కాలికమే. వాతిని నమ్మినవాడు నష్టపోయినట్టు కనిపించినా అదీ తాత్కాలికమే. శాశ్వతంగా నిలిచేది ధర్మమే!!!!!.
శాస్వతవిజయమూ ధర్మానిదే.

June 29, 2010 · Kasturi Murali Krishna · 2 Comments
Posted in: నా రచనలు.

గుంటూరులో సౌశీల్య ద్రౌపది పుస్తక పరిచయ సభ…

రేపు అంటే 25వ తారీఖున గుంటూరులోని బృందావన్ గార్డెన్స్ ఫంక్షన్ పాలాస్, వేంకటేశ్వర స్వామి దేవస్థానం లో సౌశీల్య ద్రౌపది పుస్తక పరిచయ సభ జరుగుతుంది.

అందరికీ ఇదే ఆహ్వానం1111

June 23, 2010 · Kasturi Murali Krishna · No Comments
Posted in: pustaka paricayamu

వార్తలో తీవ్రవాదం సమీక్ష.

వార్తలో ఆదివారం ఎడిట్ పేజీలో  తీవ్రవాదం  పుస్తక సమీక్ష ప్రచురితమయింది. అది ఈ క్రింద చదవండి.

teevra

June 21, 2010 · Kasturi Murali Krishna · 2 Comments
Posted in: తీవ్రవాదం, పుస్తక పరిచయము

జాగృతి వార పత్రికలో సౌశీల్య ద్రౌపది పరిచయం.

జాగృతి వార పత్రికలో సౌశీల్య ద్రౌపది పరిచయం.ఈవారం జాగృతి వార పత్రికలో సౌశీల్య ద్రౌపది పరిచయం ప్రచురితమయింది. ఆ పరిచయాన్ని ఈ క్రింద చదవండి.

RIVIEW  1RIVIEW  2 JPG

June 17, 2010 · Kasturi Murali Krishna · One Comment
Posted in: pustaka paricayamu, నా రచనలు.

ప్యాసా, కాగజ్ కే ఫూల్- ఒక విశ్లేషణ.

ప్యాసా, కాగజ్ కే ఫూల్- ఒక విశ్లేషణ.- ఇది ఏప్రిల్ నెల పాలపిట్ట మాస పత్రికలో ప్రచురితమయింది. చదివి మీ నిర్మొహమాటమయిన అభిప్రాయాన్ని తెలపండి.

gurudutgurudut1gurudutt2gurudutt3

June 16, 2010 · Kasturi Murali Krishna · 2 Comments
Posted in: sinemaa vishleashaNaa., నా రచనలు.