Archive for March, 2011

శ్రీకృష్ణదేవరాయలు పుస్తకం తయారయింది.

నా సరికొత్త నవల శ్రీకృష్ణదేవరాయలు పుస్తక రూపంలో తయారయింది.

మొత్తం 124 పేజీల పుస్తకం ఇది. వెల మాత్రం 50 రూపాయలు మాత్రమే.

ముఖ చిత్రం తయారయింది కానీ తుదిమెరుగులు దిద్దుతున్నాడు చిత్రకారుడు. రేపు ముఖ చిత్రాన్ని ప్రచురిస్తాను.

ఈనెల ఎనిమిదవ తారీఖున గుంటూరులో పుస్తకావిష్కరణ సభ జరుగుతుంది. గుంటూరులో బృందావన్ గార్డెన్స్ లో ఈ సభ జరుగుతుంది.

ఈ పుస్తకం ఉగాది నుంచీ www.kinige.com  లో లభ్యమవుతుంది.

అంటే పుస్తకాల దుకాణాల్లో కన్నా ముందే నెట్ లో ఈ పుస్తకాన్ని చదివే వీలుందన్నమాట.

ఇంకొన్ని వివరాలు త్వరలో.

March 30, 2011 · Kasturi Murali Krishna · One Comment
Posted in: నా రచనలు.

ఈనాడులో సైన్స్ ఫిక్షన్ కథలు సమీక్ష.

ఇవాళ్టి ఈనాడులో  ప్రచురితమయిన  సైన్స్  ఫిక్షన్ కథలు సమీక్ష ఇది.

March 27, 2011 · Kasturi Murali Krishna · No Comments
Posted in: నా రచనలు.

మార్క్స్ , ఎంగెల్స్ ప్రథమ భారత స్వతంత్ర్య సంగ్రామం- సమీక్ష.

మార్క్స్ , ఎంగెల్స్ ప్రథమ భారత స్వతంత్ర్య సంగ్రామం- ఈ పుస్తకం పైన నేను రాసిన సమీక్ష ఇది. ఆంధ్రభూమి దినపత్రికలో ఆదివారం అక్షర పేజీలో ప్రచురితమయింది.

March 25, 2011 · Kasturi Murali Krishna · No Comments
Posted in: పుస్తక పరిచయము

ఒక కొత్త పత్రికలో నా సరికొత్త సీరియల్.

మచిలీపట్నం నుంచి ఒక కొత్త వార పత్రిక వస్తోంది.  సన్ ఫ్లవర్ వీక్లీ దాని పేరు.

మచిలీపటానికి చెందిన సన్ ఫ్లవర్ దినపత్రికవారే ఈ వార పత్రికను ఆరంభించారు.

ఇప్పుడీ వార పత్రికలో వచ్చే వారం సంచికనుండి నా సరికొత్త సీరియల్ ఆరంభమవుతోంది.

ఈ సీరియల్ పేరు మారణహోమం డాట్ ఆర్గ్.

ఇది సమకాలీన సామాజిక పరిస్థితులను , ప్రపంచ రాజకీయాలాటలను ప్రతీకాత్మకంగా చూపుతూ, ఎలా సామాన్యులు కొందరి స్వార్ధాలాటలలో పావులవుతున్నారో, ఆసక్తికరంగా వారం వారం చూపుతుంది.

తప్పక చదవండి. చదివి మీ అభిప్రాయాన్ని తెలపండి.

మరిన్ని వివరాలు త్వరలో.

March 10, 2011 · Kasturi Murali Krishna · No Comments
Posted in: నా రచనలు.

మెమొయిర్స్ ఆఫ్ ఎ గైషా.

ఇది  మార్చ్ నెల ఈభూమి మాస పత్రికలో ప్రచురితమయింది.

March 8, 2011 · Kasturi Murali Krishna · No Comments
Posted in: నా రచనలు.

ఆంధ్రభూమి స్పెషల్ ఇష్యూ…

ఇది ఆంధ్రభూమి వార పత్రిక ప్రత్యేక సంచిక ముఖచిత్రం. 101వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తయారయిందీ ప్రత్యేక సంచిక. తెలుగు పత్రికలలో ఇంత వరకూ ఇలాంటి ప్రయోగం నాకు తెలిసి జరగలేదు. ముఖచిత్రం కూడా ఇలాంటిది రాలేదు. ఇది ట్రెండ్ సెట్టర్ సంచిక అవుతుందని నా నమ్మకం. తప్పక చదవండి. చదివి మీ అభిప్రాయాలను నిర్మొహమాటంగా తెలియచేయండి.

March 6, 2011 · Kasturi Murali Krishna · No Comments
Posted in: pustaka paricayamu