Archive for April, 2011

శ్రీకృష్ణదేవరాయలు, పుస్తకావిష్కరణ సభ.

ఈనల 3ఒవ తారీఖున గుంటూరులోని బృందావన్ గార్డెన్స్ లో నేను రచించిన శ్రీకృష్ణదేవరాయలు పుస్తకావిష్కరణ సభ జరుగుతుంది. సమయం సాయంత్రం 6 గంటల 30 నిముషాలు.

శ్రీ బొల్లేపల్లి సత్యనారాయణగారు పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు.

నేను రేపు రాత్రి నర్సాపుర్ ఎక్స్ప్రెస్ లో బయలు దేరి ముందు విజయవాడ వెళ్తాను. విజయవాడలో కొందరు పత్రికల  ఎడిటర్లను కలుస్తాను. మధ్యాహ్న భోజనం తరువాత గుంటూరు ప్రయాణమవుతాను.

గుంటూరులో పుస్తకావిష్కరణ సభ జరిగిన తరువాత మళ్ళీ రాత్రి నర్సాపుర్ ఎక్స్ప్రెస్ లో తిరిగి హైదెరాబాద్ వచ్చేస్తాను.

ఇది నా గుంటూరు ప్రయాణ ప్రణాళిక.

అయితే, ఈ పుస్తకావిష్కరణ సభ వల్ల నేను ఈనెల హాసం క్లబ్ సభకు హాజరు కాలేక పోతున్నాను.

ఈనెల 26 న శంకర్ జైకిషన్ లలో శంకర్ మరణించిన రోజు. ఎంతో అన్యాయానికి గురయ్యాడు శంకర్ తన జీవిత కాలంలో. అతని వల్ల లాభం పొందిన వారందరూ అతడికి అన్యాయం చేశారు. అతడిని అణగ ద్రొక్కటానికి మొత్తం సినీ పరిశ్రమ ఒకటయింది. అయినా, ఆయన వీలు చిక్కినప్పుడల్లా అత్యద్భుతమయిన సంగీతాన్ని సృజిస్తూ, కళా నైపుణ్యాన్ని ఎవరయినా తాత్కాలికంగా అణగద్రొక్కగలరు కానీ శాశ్వతంగా అణచివేయలేరని నిరూపించాడు. అనేక కారణాలవల్ల ఆయన శంకర్ జైకిషన్ బ్యానర్ కు పునర్వైభవాన్ని సాధించలేక పోయినా, సంగీత దర్శకుల జంటలో ఒకరు పోతే ఇంకొకరు వొంటరిగా మనలేరన్నదాన్ని తప్పని నిరూపించాడు.

ఒంటరిగా శంకర్ సృజించిన కొన్ని మధురమయిన పాటలు. ఇవి.

జబ్ భి యే దిల్ ఉదాస్ హోతాహై
గీత్ గాతాహు మై, గుంగునాతాహు మై
చలొ భూల్ జాయె జహాన్ కొ దొ ఘడీ
చత్రి న ఖొల్ ఉడ్ జాయెగీ
తుమ్హారె బిన్ గుజారేహై
పర్దేశియా తెరే దేశ్ మే
ఎక్ చెహెరా దిల్ కే కరీబ్ లగ్తా హై
పూచా జో ప్యార్ క్యా హై
హం నహీ భూలేంగే
గోరియా హై కలాయియా

ఇంకా బోలెడన్ని గొప్ప పాటలు సృజించాడు.

ఈ సారి హాసం క్లబ్ లో ఆయనకు శ్రద్ధాంజలి ఏర్పాటు చేశాను. కానీ నేనుండను. మీరయినా కార్యక్రమాన్ని చూసి ఆనందించండి.

April 28, 2011 · Kasturi Murali Krishna · One Comment
Posted in: నా రచనలు.

కథల సంకలనాలు- విశ్లేషణ.

ఇది ఒక పత్రికకోసం రాసింది. చాలా కాలమయింది పపంపి. చివరికి వారికి దీన్ని ప్రచురించవద్దని చెప్పి మీముందుంచుతున్నాను. చదివి మీ అభిప్రాయాన్ని తెలపండి.

April 24, 2011 · Kasturi Murali Krishna · One Comment
Posted in: నా రచనలు.

చినుకు ప్రత్యేక సంచికలో నా కథ.

చినుకు ప్రత్యేక సంచికలో ప్రచురితమయిందీ కథ. అచ్చుతప్పులను సరిచేసుకుని చదవగలరు. చదివి మీ అభిప్రాయాన్ని  తెలపండి.

April 16, 2011 · Kasturi Murali Krishna · One Comment
Posted in: నా రచనలు.

రాష్ట్రాయ స్వాహా- సమీక్ష.

ఇది ఆంధ్రభూమి దిన పత్రికలో ప్రచురితమయిన సమీక్ష.

April 14, 2011 · Kasturi Murali Krishna · No Comments
Posted in: పుస్తక పరిచయము

మొత్తానికి నాకూ ఓ అవార్డు వచ్చింది!

అవును ఇది నిజం!!1

ఈ ఉగాది రోజు ప్రొద్దున్నే వసుధ పత్రిక ఎడిటర్ ఫోను చేసి నాకు అభినందనలు తెలిపారు. ఎందుకో నాకు అర్ధం కాలేదు. అప్పుడాయన చెప్పారు, ఆంధ్ర సారస్వత సమితి వారు నాకు ఉత్తమ జర్నలిస్టు అవార్డిచ్చారని ఈనాడు స్థానిక ఎడిషన్ లో వచ్చిందని చెప్పారు.

నేను వృత్తిరీత్య జర్నలిస్టును కాను. మరి నాకు ఉత్తమ జర్నలిస్టు అవార్డేమిటా? అనుకున్నాను. ఆయన నాతో పరాచికాలాడరు. కాబట్టి అది నిజమే అయివుండాలి. కానీ నాకు ఎలాంటి సమాచారమూ లేదు. అందుకే ఆనందించాలో, జాగ్రత్త పడాలో అర్ధం కాలేదు. తొందరపడి ముందే కూసే కోయిలల పరిస్థితి గుర్తుతెచ్చుకుని మౌనంగా వున్నాను.

మధ్యాహ్నం కోడిహళ్ళి మురళీ మోహన్ ఫోను చేసి చెప్పాడు. సాక్షి దిన పత్రిక  లో  అవార్డు వచ్చిన వారి జాబితాలో నా పేరు వుందని చెప్పాడు. అప్పుదు పత్రిక తీసి నేనూ చూసుకున్నాను. దాన్లో ఎంబీయస్ ప్రసాద్, శ్రీవల్లి రాధికల పేర్లు వుండటం తో వారితో ఫోనులో మాట్లాడాను. కానీ అధికారికంగా నాకు ఎలాంటి సమాచారము లేదు. కనీసం ఫోనూ లేదు. అందుకని నేను ఎవ్వరితో ఇన్నాళ్ళూ చెప్పలేదు.

ఇవాళ్ళ వుత్తరం వచ్చింది. నన్ను ఉత్తమ జర్నలిస్టుగా గుర్తించారు. అవార్డు ఇచ్చారు.

ఇన్నిరోజులుగా నేను రకరకాల ప్రక్రియలలో పాఠకులు మెచ్చే రీతిలో రచనలు ఎన్ని చేస్తూన్నా, నాకు పాఠకుల మెప్పు , ఆదరణలు లభిస్తున్నాయి తప్ప సాహిత్య ప్రపంచంలో ఎలాంటి గుర్తింపు లభించలేదు. నేను అందుకోసం ఎలాంటి ప్రయత్నాలూ చేయలేదు.

ఇప్పుడు, నాకు ఎలాంటి పరిచయాలూ లేని మచిలీపట్నానికి చెందిన ఆంధ్ర సారస్వత పరిషత్ వారు నన్ను జర్నలిస్టుగా గుర్తించి , బహుమతినివ్వటం నాకు ఆనందాన్నే కాదు, సంతృప్తినీ ఇస్తోంది. నా ప్రతిభను గుర్తించేవారు, అభినందించేవారు వున్నందుకు ఎంతో ఆనందంగా వుంది. ఇదిగో నాకీ బహుమతిని ధ్రువీకరిస్తూ అందిన పత్రం. మే నెల 8వ తారీఖున మచిలీపట్నం వెళ్ళి అందుకోవాలీ అవార్డును.

అందరికీ ధన్యవాదాలు. బహు కృతఙ్నతలు.

April 11, 2011 · Kasturi Murali Krishna · 10 Comments
Posted in: Uncategorized

గుంటూరు సభ వాయిదా…..

గుంటూరులో ఈవేళ జరగాల్సిన సభ ఈనెల 30వ తారీఖు నాటికి వాయిదా పడింది.

ఏప్రిల్ నెల 30న గుంటూరులోని బృందావన్ గార్డెన్స్ లో శ్రీకృష్ణదేవరాయలు పుస్తకావిష్కరణ సభ
జరుగుతుంది.

April 8, 2011 · Kasturi Murali Krishna · No Comments
Posted in: నా రచనలు.