Archive for August, 2011

భారత పాక్ సరిహద్దువద్ద నేను- నా ఆలోచనలు.

ఈ ట్రావెలాగ్ వార్త ఆదివారం అనుబంధం లో 1997 సంవత్సరంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రచురితమయింది. ఇవాళ్ళ పాత కాగితాలు వెతుకుతూంటే కనబడింది. దీన్ని బ్లాగర్లతో పంచుకోవాలనిపించింది. ఈ వ్యాసం ప్రచురితమయిన సమయంలో వార్త ఆదివారం అనుబంధానికి రామిరెడ్డి ఇంచార్జ్ గా వుండేవాడు. ఇప్పుడాయన సాక్షి టీవీలో వున్నాడు.

August 25, 2011 · Kasturi Murali Krishna · One Comment
Posted in: నా రచనలు.

తెలకపల్లి రవి- గమనం, మరి రెండు పుస్తకాల సమీక్షలు.

తెలకపల్లి రవి గమనం పుస్తకం తోపాటు ఇతర రెండు వేరే పుస్తకాల సమీక్షలివి. ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురితమయ్యాయి.

August 17, 2011 · Kasturi Murali Krishna · No Comments
Posted in: పుస్తక పరిచయము

నేను-షమ్మీ కపూర్.

నిన్న ప్రపంచ తెలుగు మహా సభలో వుండగా అమ్మ ఫోను చేసింది.

నీకో విషాద వార్త, అంది.

నాకు విషాద వార్తలేవీలేవు, అయినా ఏమిటది? అని అడిగాను.

బాధపడవద్దు, నీ జంగ్లీ, జన్వర్, బద్ తమీజ్, పగ్లా కహీకా, ప్రిన్స్,రాజ్ కుమార్, చోటా సర్కార్, లాట్ సాహెబ్, ప్రొఫెసర్ పోయాడు. అంది.

అలాగా, అని పెట్టేశాను.

కళాకారులకు మరణం అంటూ వుంటే అది వాళ్ళు కళను సృజించటం ఆగొపోవటమే, అని నా అభిప్రాయం. అందుకే, నాకు ఎలాంటి బాధ అనిపించలేదు. ఎందుకంటే, షమ్మి కపూర్ కళాసృజన ఎప్పుడో ఆగిపోయింది.

జీవితాన్ని పూర్తిగా అనుభవించాడు. జీవించాడు.

షమ్మి కపూర్, హీరోగా నటించటం ఆపటంతోటే సినిమాలలో రొమాన్స్ అన్నది అంతం అయిపోయింది. ఇప్పుడు పోయింది, అనాటి అధ్భుతమయిన కళాకారుడి గుర్తుగా వున్న భౌతిక శరీరం మాత్రమే. తన సినిమాల ద్వారా, సినిమాలలో ప్రదర్శించిన అనేక హావభావాల ద్వారా తర తరాలను షమ్మి కపూర్ ప్రభావితం చేస్తూనేవుంటాడు.

నేను పదో తరగతి పరీక్ష  చివరిది రాసిన తరువాత అమ్మ నన్ను అమితాభ్ సినిమా ది గ్రేట్ గాంబ్లర్ కు తీసుకువెళ్ళింది. నాకా సినిమా నచ్చలేదు. ఇంటికి వచ్చి అన్నయ్యతో అదేచెప్పాను. అదేరోజు వాడు ఒక పాత సినిమా చూసి వచ్చాడు. వాడికి అది మరోసారి చూడాలని వుంది. నీకో అద్భుతమయిన సినిమా చూపిస్తానని, మరుసటి రోజు నన్ను ఒక హిందీ సినిమాకు తీసుకెళ్ళాడు.

అప్పటికి నాకు హిందీ సరిగ్గా రాదు. అన్ని సబ్జెక్టుల్లోకీ హిందీలోనే మార్కులు తక్కువ వచ్చేవి. 20 పాస్ మార్కంటే అతి కష్టం మీద 19 దాకా లాగేవాడిని. టీచర్లు దయ తలచి ఒక మార్కుకలిపి ముందుకు నెట్టేవారు.

అందుకే హిందీ సినిమా అంటే నేనంత ఇష్టం చూపలేదు. అదీ పాత సినిమా! కానీ, ఏదో ఒకటి సినిమా చూసే చాన్సు దొరుకుతుంది కదా, ఎందుకు వదలుకోవటం అని వెళ్ళాను.

ఆ సినిమా  నా పై ఎంతగా ప్రభావం చూపిందంటే, నేను, నా అభిప్రాయాలి, ఆలోచనలు, సర్వం మారిపోయాయి. జీవితాంతం నన్ను వెన్నంటి వుండే ముగ్గురు ప్రాణ స్నేహితులు నాకు పరిచయమయ్యారు. నా  వెంట వుంటూ, ప్రతిక్షణం ఎలాంటి పరిస్థితిలోనయినా, నాకు మార్గదర్శనం చేసే ముగ్గురు స్నేహితులు వారు.  మహమ్మద్ రఫీ, శంకర్ జైకిషన్, షమ్మీ కపూర్ అనే ఆ ముగ్గురు స్నేహితులు ఈనాటికీ నాతోనే వున్నారు. నా ఊపిరిలో ఊపిరయి, నా రక్తం లో రస్క్తమయి, ప్రతి ఆలోచనలో వారయిపోయారు.జంగ్లీ సినిమా నాలో రొమాంటిక్ ఆలోచనలకు ఊపిరి పోసింది. సైరాబాను అందానికి కొలబద్ద అయింది. ఈ సినిమాతో హిందీ సినిమాల , పాటల ప్రపంచాల ద్వారాలు తెరచుకున్నాయి. ఉర్దూ నా అభిమాన భాష అయింది.

నిజానికి రొమాన్స్ అన్నది నేను రఫీ పాటల ద్వారా, షమ్మీ నటన ద్వారా తెలుసుకున్నాను. అందుకే, అందమయిన యువతిని చూస్తే, ఏయ్ గుల్బదన్, ఫూలోంకి మహెక్ కాటోంకి చుబన్ అని పాడాలని పిస్తుంది, ఇస్ రంగ్ బదల్తీ దునియామే, ఇన్సాన్ కి నీయత్ ఠీక్ నహీ, నిక్ లాన కరో తుం సజ్ ధజ్ కే ఈమాన్ కి నీయత్ ఠీక్ నహీ, అని చెప్పాలని వుంటుంది, బదన్ పె సితారె లపేటె హువె, ఓ జానె తమన్నా కిధర్ జారహేహో, జరా పాస్ ఆవో, తొ చైన్ ఆజాయే, అని కవ్వించాలనుంటుంది. లాల్ చడీ మైదాన్ ఖడీ అని కవ్వించాలని వుంటుంది. తుం సె అచ్చా కౌన్ హై, అని ఏడ్పించాలని వుంటుంది. దిల్ లేగయీ. లేగయీ, లేగయీ, ఎక్ చుల్బులీ, నాదినీ అని పాడుకోవాలని వుంటుంది. జబ్ ముహబ్బత్జవాన్ హోతీహై, హర్ అదా ఇక్ జుబాన్ హోతీహై, అని చెప్పాలనుంటుంది. ఇషారో ఇషారోమె దిల్ లేనె వాలి, బతాయే హునర్ తూనె సీఖా కహాన్ సే అని అడగాలివుంటుంది. దీవాన హువా బాదల్, సావన్ కి ఘటా చాయీ, యేదేఖ్ కె దిల్ ఝూమా, లీ ప్యార్ నె అంగ్డాయీ అని ఆనందించాలని వుంటుంది. కాష్మీర్ వెళ్ళినప్పుడు, బోట్ లో కూచుని, ఒక వంక సైరాబానూను మరో వంకా షర్మీలా టాగోర్ ను ఊహిస్తూ, కిస్ కిస్కో ప్యార్ కరూ, కైసే ప్యార్ కరూ అని పాడుతూంటే దూరం నుంచి ఆశా పారేఖ్, ఓ మెరే సోనారె సోనారె సోనా అని పాడుతున్నట్టు ఊహించుకుని ఎంత ఆనందించానో.తారీఫ్ కరూ క్యా ఉస్కీ జిస్నె తుమ్హే బనాయా అని నా స్నేహితులను ఎంతగా పొగడుకున్నానో.

షమ్మీ కపూర్ పాటలు పాడుతూ, కిసీన కిసీసె కభీన కభీ కహీన కహీ దిల్ లగానా పడేగా అనుకుంటూ, జానె మెర దిల్ కిసె ఢూంఢ్ రహాహై ఇన్ హరీ భరీ వాదియోమె, అనుకుంటూ, మద్ హోష్ హవా మత్వాలె ఫిజా, సంసార్ సుహానా లగ్తాహై, కర్ లేన కిసీసె ప్యార్ కహీన్ దిల్ అప్న దివానా లగ్తాహై అని ఒక్కడినే పాడుకుంటూ, మనసంతా కళ్ళు చేసుకుని, హృదయమంతా రొమాంటిక్ ఊహలతో నింపుకుని, సౌ బరస్ కే జిందగీ సె అచ్చేహై, ప్యార్ కే దో చార్ దిన్, అని తపించిన రోజులెన్నో.

ఓ అందమయిన అమ్మాయివెంటపడి, అకేలే అకేలే కహా జారహెహో, హమే సాథ్ లేలో జహాన్ జారహేహో, అని ప్రాధేయపడాలనీ, దీవానేక నాం తో పూచో, ప్యార్ సె దేఖో కాం తో పూచో, చాహె ఫిర్ న మిల్నా, అని బ్రతిమిలాడాలనీ, యూ తో హమ్నే లాఖ్ హసీన్ దేఖే హై తుంసా నహీ దేఖా అని చెప్పాలనీ, బద్ తమీజ్ కహో యా కహో జాన్వర్, మెరా దిల్ తుఝీ పె ఫిదా హోగయా అనాలనీ, ముఝె అప్నా యార్ బనాలో ఫిర్ దేఖో మజా ప్యార్ కా అని సవాల్ చేయాలనీ ఎన్నెన్నో ఊహలకు జీవం పోశారు నా స్నేహితులు.

చివరికి ఒక రోజు నా కలలు రూపు పోసుకుని వస్తే, సలాం అప్కీ మీఠీ నజర్ కో సలాం, కియా హంసె జాదూ అసర్ కో సలాం అన్నాను. తుం నె ముఝే దేఖా హోకర్ మెహెర్బాన్, రుక్ గయీ యే జమీ, థం గయా ఆస్మాన్ అని మోకాళ్ళపై కూచుని కళ్ళల్లో చూస్తూ చెప్పాను.
.ఐసీతొ మెరీ తక్దీర్ నహీ, తుంసాజొ కొయీ మహ్బూబ్ మిలే దిల్ ఆజ్ ఖుషీ సే పాగల్ హై ఏయ్ జానె వఫా తుం ఖూబ్ మిలే అని ఆనందించాను. కభి హం నె నహీ సోచా థా ఐసా దిన్ భీ ఆయేగా అని ఎగిరాను. హం ప్యార్ కె తూఫానోమె గిరేహై, హం క్యాకరే అని గెంతాను. కొయి ప్యార్ హమేభీ కర్తాహై, హం పర్ భి కోయీ మర్తాహై, హమే తుం క్యాకహె, మొహబ్బత్ కే ఖుదా హం హై, అని పిచ్చిగా పాడుకున్నాను. మెరీ మొహబ్బత్ సదా రహేగీ, జవాన్ రహేగీ అని వాగ్దానం చేశాను. జనం జనం కా సాథ్ హై నిభానేకో, సౌ సౌ బార్ మైనే జనం లియా అని చెప్పాను. ఆమెకు కోపం వస్తే ఎహెసాన్ తెరా హోగాముఝ్ పర్ దిల్ చహతాహై జో కహెనేదో అని వేడుకున్నాను. కోపం తగ్గక పోతే హై దునియా ఉసీకీ జమానా ఉసీకా అని ఏడ్చాను.

ఇప్పుడు మా అమ్మాయితో రెమ్మామ్మా రెమ్మామ్మా రే పాడుతున్నాను. చక్కే మె చక్కా చక్కేకి గాడీ అని కారులో పాడుకుంటున్నాము. తనని నిద్ర పుచ్చుతూ మై గావూ తుం సోజావో పాడతాను. అందుకే షమీ కపూర్ ఎప్పుడో చెప్పాడు, తుం ముఝేయూ భులాన పావోగె, జబ్ కభీభీ సునోగె గీత్ మెరే సంగ్ సంగ్ తుం భి గుంగునావోగే అన్నాడు.

అందుకే ఇప్పుడు షమ్మీ మరణిస్తే నాకు విషాదం లేదు. బాధ లేదు. ఎందుకంటే, నా వ్యక్తిత్వం రూపు దిద్దుకుంటున్న సమయంలో నాకు సరయిన మార్గ దర్శనం చేసి నన్ను సరయిన దారిలో పెట్టి సరయిన ఊఅహలు, ఆలోచనలిచ్చిన అధ్భుతమయిన వ్యక్తులు నాకు పరిచయమయ్యారు. ఎప్పటికీ నన్ను వెన్నంటే వుంటారు.

యే మేల దోఘడీక దో దినోంకి హై బహార్
సమయ్ కి బహెతి ధార్ కహతి జాతిహై పుకార్,
మెహెమాన్ కబ్ రుకేంగె కైసె రోక్ జాయెంగె
కుచ్ లేకె జాయెంగె, కుచ్ దేకె జాయెంగె.సవేరే వాలి గాడీసె చలేజాయేంగే
అన్నాడు. ఉదయం 5 గంటల బండీకి వెళ్ళిపోయాడు.

అవును మన ప్రేమ భిమానం అనురాగాలను వెంట తీసుకుని వెళ్ళిపోయాడు షమ్మి కపూర్. మనకు జీవితాంతం మరువలేని అనుభూతులను ఎన్నెన్నో  ఇచ్చాడు.    అందుకే కళాకారులు భౌతుక శరీరాన్ని విడిస్తే బాధ కలుగదు. సృజన చేయలేని దుస్థితి నుంచి, నిర్వ్యాపార జీవితం నుంచి విముక్తి కలిగినందుకు ఆనందం కలుగుతుంది. వారి కళను తలుచుకోవటాన్ని మించిన నివాళి మరొకటి లేదు.

August 15, 2011 · Kasturi Murali Krishna · 3 Comments
Posted in: నీరాజనం

నేను విజయవాడ వెళ్తున్నాను, ప్రపంచ తెలుగు రచయితల సభకు….

మొత్తానికి నేను విజయవాడ వెళ్తున్నాను. ఇప్పటికి దాదాపుగా పది సార్లు నేను విజయవాడ టికెట్ కొని, రిజెర్వేషన్ చేఉకుని మరీ ప్రయాణాన్ని మానుకోవాల్సి వచ్చింది. దానికి అనేక కారణాలు. కొన్ని గంభీరమయినవి, కొన్ని పనికిరానికి. కానీ, అన్నిటి ఫలితం ఒక్కటే… నేను విజయవాడ వెళ్ళలేక పోవటం.

విజయవాడ మీదుగా, తెనాలి వెళ్ళాను పలుమార్లు. మచిలీపట్నం వెళ్ళాను. విశాఖ వెళ్ళాను. గుంటూరు వెళ్ళాను. కానీ, విజయవాడ అనుకోగానే ఏదో అడ్డంకి. అయితే ఈసారి, ప్రపంచతెలుగు రచయితల సమావేశానికి నన్ను పిలవటంతో ఎలాగయినా వెళ్ళాలని నిశ్చయించుకున్నాను. ఎందుకంటే, నన్ను రచయితగా గుర్తించటమే అరుదు. అలా గుర్తించినా సమావేశానికి పిలవటం మరీ అరుదు. పిలిచినా ఏదో కార్యక్రమంలో పాల్గొనటానికి పిలవటం ఇంకింకా అరుదు. అందుకనే ఎలాగయినా వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాను. ఇవాళ్ళ రాత్రికి నర్సాపూర్ ఎక్స్ప్రెస్ లో టికెట్ కొన్నాను. మళ్ళీ రేపు రాత్రి నర్సాపూర్ లో తిరిగి వచ్చేస్తాను. అయితే రెండు టికెట్లూ ఎదురుచూపుల జాబితాలో వున్నాయి. కాబట్టి చివరి క్షణం దాకా ప్రయాణం అనుమానాస్పదమే. కానీ ఎందుకో ఈసారి విజయవాడ వెళ్తానని నా ఆరవ తెలివి చెప్తోంది. ( నాకు బోలెడన్ని తెలివులున్నాయి.)

రేపు నేను పాల్గొనే కార్యక్రమం వివరాలివి. 52 మంది రచయితలలో నన్ను వెతుక్కోండి.

August 13, 2011 · Kasturi Murali Krishna · 3 Comments
Posted in: Uncategorized

ఆంధ్రభూమి దినపత్రికలో శ్రీకృష్ణదేవరాయలు సమీక్ష.

ఆదివారం ఆంధ్రభూమి దినపత్రికలో అక్షర పేజీలో ప్రచురితమయిన సమీక్ష ఇది.

August 11, 2011 · Kasturi Murali Krishna · 2 Comments
Posted in: పుస్తక పరిచయము

రాహుల్ ద్రావిడ్ ది మంచి నిర్ణయం.

వన్ డే ఆటలు, 20-20 ఆటలనుంచి రిటయిర్మెంటు ప్రకటించటం రాహుల్ ద్రావిడ్ లాంటివాడే ఇలా తీసుకోగలడు.

నిజానికి రాహుల్ ద్రావిడ్ అంత ఆవేశం ప్రదర్శించడు. దూకుడుగా వుండడు. దాంతో అందరూ అతడిని పక్కన పెడుతూంటార్య్. బాగా ఆడుతూ కూడా జట్టులోంచి తొలగించినా అతనేమీ అనడు. అతని అభిమానులూ మౌనంగా బాధపడతారు తప్ప బహిరంగంగా వారూ అతనిని సమర్ధించరు.

కానీ, రాహుల్ ద్రావిడ్ వ్యక్తిత్వంలో ఒక కాఠిన్యం వుంది. ఒక నిర్ణయాత్మకమయిన లక్షణం వుంది.

ఎలాగయితే మైదానంలో ఆట ఆరంభించిన తరువాత ఎలాంటి కఠినమయిన బౌలింగయినా పట్టుదలగా నిలబడతాడో, అక్కడ ఎంత నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తాడో, నిజ జీవితంలోనూ అవసరమయినప్పుడూ అంతే కథినంగా, నిర్ణయాత్మకంగా, ధైర్యంగా నిలుస్తాడు.

కెప్టెన్సీ తీసుకున్న తరువాత, జట్టులోకి యువకులను తీసుకురావటంకోసం రాహుల్ ద్రావిడ్ అనేక కఠినమయిన నిర్ణయాలను తీసుకున్నాడు. అవన్నీ గ్రెగ్ చాపెల్ నెత్తిన చుట్టుకున్నాయన్నది వేరే విషయం. కానీ, వాటి ప్రభావంతోనే, రాహుల్ ద్రావిడ్ కెప్టెన్ గా వున్నప్పుడు కొందరు అతనితో సహకరించలేదన్నది అందరికీ తెలుసు.

సచిన్ రెండువందల పరుగుల దగ్గర వున్నప్పుడు డిక్లేర్ చేయటం మరో కఠిన నిర్ణయం. ఆ సమయంలో అది సరయిన నిర్ణయం. ఆట కన్నా ఆటగాడు గొప్ప కాదని నిరూపించిందా నిర్ణయం.  ఆట త్వరగా ముగిసింది కాబట్టి అందరూ రాహుల్ ని విమర్శించారు కానీ, అదే, పాకిస్తాన్ వారు పట్టుదలగా ఆడివుంటే, త్వరగా డిక్లేర్ చేయలేదని తిట్టేవారు.

తనకెవరూ సహకరించటంలేదని, చివరికి బీసీసీఐ వారు కూడా అలాగే వ్యవహరిస్తున్నారని, రాహుల్ కెప్టేన్సీని వదలుకోవటం, తన శక్తినీ, బలహీనతలను తెలుసుకున్న వ్యక్తి తీసుకున్న నిర్ణయం.

ఆ నిర్ణయం ఫలితంగా కొందరు సెలెక్టర్ల అసలు రూపు బయటపడింది. ఫలితంగా బాగా ఆడుతున్న రాహుల్ ను వండే జట్టు నుంచి తొలగించారు. బాగా ఆడుతూన్నా, వేగంగా పరుగులు తీయటంలేదని జట్టునుంచి తొలగించినా మానసికంగా దెబ్బ తినని రాహుల్, సెలెక్టర్ల ఈ చర్యకు మానసికంగా గాయపడ్డాడు. పైగా, తాను ఎంచుకున్న ధోనీ, యువకులు కావాలని రాహుల్ నే పక్కన పెట్టటం కూడా అతడిని తీవ్రంగా గయ పరచింది. అందుకే, ఆ తరువాత చాలా కాలం రాహుల్ ద్రావిడ్ మమూలుగా తనకలవాటయిన ఆటను ప్రదర్శించలేక పోయాడు.

కానీ, సెలెక్టర్లకు రాహుల్ విలువ తెలుసు. అందుకే, కఠినమయిన విదేశీ పర్యటనల్లో వండే ఆటలకూ అతడిని ఎంపిక చేసి, భారత్ లో ఆడే ఆటలకు, మంచి ఆట ప్రదర్శించినా పక్కన పెడుతూ వచ్చారు.

గత రెండేళ్ళుగా తెస్టుల్లో తప్ప రాహుల్ మరో ఆట ఆడలేదు. వండేలు, 20-2 లలో అతడి పేరే ఎవ్వరూ తలవలేదు. ఇప్పుడు హఠాత్తుగా, ఇంగ్లాండులో కొత్త హీరోలేవరికీ సరిగ్గా ఆడరాదని స్పష్టమవగానే మళ్ళీ రాహుల్ అందరికీ గుర్తుకువచ్చాడు.

మళ్ళీ ఇండియాలో పటీలనగానే రాహుల్ అవసరం వుండదు. కాబట్టి ఇప్పుడు బాగా ఆడినా లాభం వుండదని ద్రావిడ్ కి తెలుసు. పైగా, ధోనీ ఇప్పుడు అవసరం వుంది కాబట్టి, రాహుల్ ఎంపికను వొప్పుకున్నా, క్రితం సారి వండేఅలలో రాహుల్ ను ఎంపిక చేసినప్పుడు చేసిన అవమానం రాహుల్ ద్రావిడ్ కాబట్టి బయట పొక్కలేదు. అందుకే, ఇప్పుడు తనని జట్టులోకి ఎంచుకోవటం ద్రావిడ్ కు షాక్ తగిలినట్టయివుంటుంది. గుడ్డి కన్ను తెరిస్తే ఎంత, మూస్తే ఎంత అనీ రాహుల్ ద్రావిడ్ కు తెలుసు. నిజానికి, జట్టులోంచి తీసేసిన తరువాత రిటయిర్మెంటు ప్రకటించే అవమానం కన్నా, జట్టులో వుండి రిటయిర్మెంటు ప్రకటించే అవకాశం ఇచ్చిన బీసీసీఐ వారికి ధన్యవాదాలు తెలుపుతూ, వారివల్ల తనకయిన గాయాన్ని తొలిసారిగా ప్రదర్శించాడు. అదీ నవ్వుతూ, మర్యాదగా, కానీ, అత్యంత నిర్ణయాత్మకంగా!. అదీ రాహుల్ ద్రావిడ్ అంటే.

బౌలర్ ఎంతటి భయంకరమయిన బంతి వేసినా, జాగ్రత్తగా దాన్ని ఎదురుకుంటూ, బౌలర్ కి విసుగురప్పించి, అతనితో తప్పులు చేయించి, ఒక పద్ధతి ప్రకారం, మానసిక యుద్ధంలో విజయం సాధించే రాహుల్ ద్రావిడ్ సరయిన నిర్ణయాన్ని అభినందిస్తూ, ఇక వండేఅలు, 20-20 లలో రాహుల్ పడే బాధను చూడటం తప్పి,దని సంతోషిస్తున్నాను. ఎందుకంటే, పరుగులకోసం రాహుల్, పిచ్చి షాట్లు కొడుతూంటే, ప్రేక్షకులను ఆకర్శించాలని ఒక శాస్త్రీయ విద్వాంసుడు, వెర్రి కూతలు కూస్తున్నట్టు వుంటుంది.

బయ్ రాహుల్ ద్రావిడ్. ఇక తెశ్తు క్రికెట్ మిగిలింది. అదీ త్వరలోనే వదిలేస్తాడనిపిస్తోంది.

August 7, 2011 · Kasturi Murali Krishna · One Comment
Posted in: క్రికెట్-క్రికెట్