Archive for September, 2011

వసుధ లో భారతీయ వ్యక్తిత్వ వికాసం సమీక్ష.

వసుధ మాస పత్రికలో భారతీయ వ్యక్తిత్వ వికాసం సమీక్ష ఇది.

September 29, 2011 · Kasturi Murali Krishna · No Comments
Posted in: భారతీయ వ్యక్తిత్వ వికాసం

నూజివీడు సభ విశేషాలు-2

కథకులమయిన నేను, పెద్దిభొట్ల, జానకీబాల, యం వేంకటేశ్వర రావులము స్టేజీ మీదకు ఎక్కటంతోటే ఇంతవరకూ జరిగిన సభ స్వరూపం మారిపోయింది.
పెద్దిభొట్ల గారు కథా రచనలో తన అనుభవాలను వివరించారు. వివరిస్తూ తాను ఎంతో కష్టపడతానన్నారు కథ రాస్తూ. అంతే కాదు రచయితలు ఎంతో కష్టపడుతూ కథలు రాస్తారన్నారు.
ఇంద్రగంటి జానకీబాల గారు మాట్లాడుతూ తాను శ్రీకాంత శర్మ గారి నీడ నుంచి వెలుపలకు వచ్చేందుకు పడ్డ కష్టాలను వివరించారు. తాను ఆయన భార్యగా సాహిత్య రంగంలో ఎదుర్కొంటున్న అపోహలను వివరించారు. అలా వివరిస్తూ కథలు రాసి సమాజాన్ని మార్చాలనుకోవటం అపోహ అనీ, కథల వల్ల ప్రయోజనం వుండదన్నట్టు అన్నారు.
ఆతరువాత నా వంతు వచ్చింది.
నేను మొదటగా సభలోని ఒక వైచిత్రిని చూపాను.
సాధారణంగా రచయిత కథ రాసిన తరువాత పరిశోధకుల పని ఆరంభమవుతుంది. వారు ఆ కథను విమర్శిస్తారు. విశ్లేషిస్తారు. పరిశోధిస్తారు. ఇందుకు భిన్నంగా ఆ సభలో పరిశోధకుల పని అయిపోయిన తరువాత కథకుల పని మొదలయింది.
ఆ తరువాత నేను రచయితకు అహంకారం వుండాలని అది వుంటేనే తానేదో ఎవరికీ తెలియని విషయలు చెప్పగలననీ, అవి రాసి అందరినీ చదివించగలనని రచనలు చేస్తాడని చెప్పి ఆ అహంకారంతోనే నేను నాకు  సీనియర్ రచయితలు చెప్పిన విషయాలతో విభేదిస్తున్నానని చెప్పాను.
నేను కథలు కష్టపడి కాదు ఇష్టపడి రాస్తానని చెప్పాను. రచయితను కథ రాయమని ఎవ్వరూ బ్రతిమిలాడరు. అతనిలో కలిగిన ఒక సంచలనాన్ని అక్షర రూపంలో వ్యక్త పరిస్తేకానీ నిలవలేని స్థితిలో రచయిత రచిస్తాడు. కాబట్టి రచయిత స్వచ్చందంగా రచిస్తాడు తప్ప దానికోసం కష్టపడితే అది రచయిత వ్యక్తిగత వ్యవహారం కానీ పాఠకులకు దాంతో సంబంధంలేదని చెప్పాను.
అలాగే, కథ ప్రభావం సమాజంపై వుండదనటాన్ని నేను ఒప్పుకోనని చెప్తూ, సమాజాన్ని ప్రభావితం చేసిన రచనలను ఉదాహరించాను. ముఖ్యంగా వేదాలు, రామాయణ భారత భాగవతాలు, శతకాల ఆధారంగా నిలుస్తున్న సమాజంలో రచనల ప్రభావం లేదనటం అర్ధరహితమని అన్నాను.

ఆతరువాత విమర్శకుల బాధ్యత. రచయితల పరిస్థితి, ప్రస్తుత సాహిత్య ప్రపంచంలోని మాఫియా ముఠాలు, రంగుటద్దల విమర్శకులవల్ల ఏర్పడిన పరిస్థితులను వివరించాను. దెవషాలు వెదజల్లి, నిరాశ కలిగించే కథలకు పెద్దపీ ట వేయటాన్ని వివరించాను. వున్నదున్నట్టు రాసినా. అలా రాసి సమాజాన్ని ప్రతిబింబిస్తున్నానని సమర్ధించుకున్నా అది పొరపాటని, వున్నదున్నట్టు రాస్తే అది వార్త అవుతుంది తప్ప కథకాదని కథా రచయిత ద్రష్టలా వ్యవహరించాలనీ సోదాహరణంగా వివరించాను. ఆపై వారణసి నాగలక్ష్మి కథల విశ్లేషనను వినిపించాను.
నా ఉపన్యాసమయిన తరువాత హాలులో నా పైన అభిమానం వెల్లువయింది.
నా తరువాత యం వెమకటేశ్వరరావు కాలేజీతో, ఎంవీయల్ తో తనకున్న అనుబంధాన్ని వివరించారు.
సభ అయిన తరువాత స్టేజీ దిగగానే అందరూ చుట్టుముట్టారు. అప్పుడు జరిగింది నా కాళ్ళు భూమి మీద నిలనివ్వని సంఘటన.
ఈ సమావేశాలకు వెళ్ళినప్పటినుంచీ ఎవరో ఒకరు నన్ను వెతుక్కుంటూ వచ్చి కలసి నా పుస్తకాలు చదివామని వాటిగురించి చర్చిస్తూ వచ్చారు. ఒక అధ్యాపకుడు భారతీయ వ్యక్తిత్వ వికసం ఆధారంగా రీసెర్చ్ చేస్తానని సలహా అడిగాడు. మరో ఉపాధ్యాయుడు శ్రీకృష్ణదేవరాయలగురించి చర్చించాడు. ఇంకో అధ్యాపకుడు సౌశీల్య ద్రౌపది గురించి సందేహాలు తీర్చుకున్నాడు. ఒక అధ్యాపకురాలు నా అంతర్మథనం నవల చదివి దాచుకుందని, దాన్ని యువత భగవద్గీతలా చదవాలని తాననుకుంటున్నదనీ చెప్పింది. కానీ, నేను ఇంకో పది సంవత్సరాల తరువత వస్తుందనుకుంటున్న పొగడ్త నాకు అప్పుడే అక్కడే లభించింది.
ఆ కాలేజీకి చెందిన విశ్రాంతాచార్యులు అత్తిలి వేంకట రమణ సభ అయినతరువాత నా భుజం మీద చేయివేసి అన్నారు. నీ ఉపన్యాసం వింటూంటే పాత కాలం నాటి సాహిత్య సభలు గుర్తుకు వచ్చాయి. నిర్దిష్టమయిన అభిప్రాయాలతో స్పష్టమయిన అవగాహనతో మాట్లాడే ఆ కాలం గుర్తుకువచ్చింది. కళ్ళు మూసుకుంటే విశ్వనాథ సత్యనారాయణ ఉపన్యసం వింటున్న అనుభూతి కలిగింది. ఆ స్పష్టత, నిక్కచ్చితనం, భారతీయత పత్ల గౌరవం అభిమానం నీలో కనిపిస్తున్నాయి అన్నారు.
ధన్యుడను. ఇలాంటి కాంప్లిమెంటు ఇంకో పదేళ్ళ తరువాత వస్తుందనుకున్నాను. కానీ, అందరూ అభిమానించే ఆయన, నాకు ఏమాత్రం పరిచయంలేని ఆయన, అలా అనటం, అన్నతరువాత నా కాళ్ళు భూమిమీద వుంటాయా………

September 26, 2011 · Kasturi Murali Krishna · One Comment
Posted in: Uncategorized

నాకాళ్ళు భూమి మీద నిలవటం లేదు; నూజివీడు సభ విశేషాలు.

ఆజ్ కల్ పావ్ జమీ పర్ నహి పడ్తే మేరా… అని ఒక హిందీ పాట వుంది. నూజివీడులో అది నా అనుభవానికి వచ్చింది.

నూజివీడు సభకు వెళ్ళే ప్రయాణం ఆరంభమే కష్టాలతో ఆరంభమయింది.
నూజివీడుకు తిన్నగా వెళ్ళే రైలు లేదు కాబట్టి విజయవాడలో దిగి బస్సులో వెళ్ళాలి లేకపోతే, తిన్నగా వెళ్ళే బస్సులో వెళ్ళాలని సలహా ఇచ్చారు. విజయవాడలో దిగి బస్ స్టేషన్ వెళ్ళి బస్సుపట్టుకుని వెళ్ళేకంటే డైరెక్ట్ బస్సులో వెళ్ళాలనుకున్నాను. ఇంతలో బస్సులన్నీ ఆపుతామని ప్రకటించటంతో చివరి క్షణంలో రైల్లో టికెట్ బుక్ చేసుకున్నాను. ప్రయాణాలకెవ్వరూ ఇష్టపడకపోవటంతో టికెట్ సులభంగానే దొరికింది. తిరుగు ప్రయాణంలో విజయవాడలో ఒక పూట వుండాలనుకున్నాను. కానీ 23 నుంచీ రైళ్ళూ బందనటంతో విజయవాడలో వుండాలన్న ఆలోచన వదలుకుని 22 రాత్రికే తిరుగు ప్రయాణం బుక్ చేసుకున్నాను.
తీరా ఆరోజు రాత్రి నర్సాపూర్ రైలు పట్టుకోవటానికి బయలు దేరి మా ఇంటినుంచి ఒక నాలుగు కిలోమీటర్లు దూరం రాగానే బండి ఆగిపోయింది. ఎంతగా తన్నినా అది కదలలేదు. తుస్సుమని నిట్టూరుస్తోంది తప్ప బుర్రుమని గర్జించటంలేదు. అప్పటికే తొమ్మిదయింది. దాంతో ఇక బండిని ఎక్కడయినా వుంచి ఆటో ఏదయినా దొరికితే పట్తుకుని స్టేషన్ చేరాలనుకున్నా,. బస్సులు నడవటంలేదు. దాంతో ఆటోవాళ్లు 300కు తగ్గటంలేదు. దాంతో బండిని దగ్గరలోనే వున్న ఒక కార్పొరేట్ అస్పత్రి ఎదుట వుంచి, పక్కింటాయనకు ఫోను చేసి ప్రిస్థితి వివరించి నన్ను స్టేషన్ దగ్గరకు తీసుకెళ్ళమని అడిగాను. ఆయన వస్తానన్నాడు.
ఇంతలో ఒక కాబ్ వాడు నా బ్యాగు చూసి ఆగి, పాట్నీ, అనండు. నేను స్టేషన్ అన్నాను. పాట్నీ అనేసి వచ్చిన వారిని ఎక్కించుకుని పోయాడు. ఇంతలో మరో కాబ్ వాడు వచ్చి పాట్నీ అని, సంగీత్ దగ్గర దింపేందుకు ఒప్పుకున్నాడు. ఇంతలో వారణాసి నాగలక్ష్మి గారినుంచి ఫోను వచ్చింది. ఆవిడ బస్సులో బుక్ చేసుకున్నారట, బస్సులు నడవటం లేదు కాబట్టి రాలేనన్నారు.
నేను మా పక్కింటాయనకు రావద్దని ఫోన్లో చెప్పి కాబ్ లో బయలు దేరాను. బస్సులు లేకపోవటంతో రోడ్లు ఖాళీగా వున్నాయి. దాంతో 9-30 కల్ల్ల్లా స్టేషన్ చేరాం.
అలా, ఆరంభమే ఒక ఇబ్బందితో నూజివీడు ప్రయాణం ఆరంభమయింది.
విజయవాడ చేరి స్నేహితుడి ఇంట్లో కాస్సేపు గడిపి ఎనిమిదికల్లా నూజివీడు ప్రయాణమయ్యాను.
నూజివీడులో ర్చయిత యం వేంకటేశ్వర రావు బంధువు ఇంట్లో వున్నాను. యం వేంకటేశ్వర రావు కూడా ఈ సభ కోసం వచ్చాడు.
సభ నిర్వాహకులు నాకోసం అకామిడేషన్ సిద్ధంగా వుందంటారు కానీ ఎంత్కూ చూపక పోవటంతో నేను తోటి రచయిత బంధువు ఇంట్లో వుండాల్సి వచ్చింది. ఒకవేళ నేను వారి మాట నమ్మి విజయవాడ నుంచి తిన్నగా నూజివీడు వచ్చినా, యం వేంకటేశ్వర రావు కలవకున్నా, పెద్ద మనసుతో వాళ్ళ బంధువు ఇంట్లో వుండమని అనకున్నా నేను నూజివీడులో హోటెళ్ళు వెతుక్కోవాల్సి వచ్చేది, లేకపోతే నిర్వాహకులు దయతలచి గది ఏదో చూపేవరకూ పాచి మొహంతో అలాగే కూచోవాల్సి వచ్చేది.
సభ ఆరంభమయింది.

మండలి బుద్ధ ప్రసాద్, శలాక రఘునాథ శర్మ వంటి వారు ప్రసంగించిన తరువాత పత్ర సమర్పణ ఆరంభమయింది. నాకు సభలలో ఉపన్యాసాలు వినటాం ఒక శిక్ష లాంటిది. ఎంతో బాగా వుంటే తప్పించి నేను కూచోలేను. అలాంటిది ఇక్కడకు వచ్చిందే ఉపన్యాసాలు వినటానికి. పైగా వేరే పనిలేదు. నచ్చకపోతే పోయి పడుకోటానికి స్థలం లేదు. దీనికి తోడు అందరూ తమ పత్రాలను చదువుతున్నారు. అది మరీ విసుగు కలిగించింది. దాంతో హాలు బయటకు వెళ్ళి గడ్డిలో పడుకుని  ఆకాశాన్ని చూస్తూ మైకులో వినిపిస్తున్న పత్ర పఠనాన్ని వింటూ హాయిగా గడిపాను.
ఇంద్రగంటి జానకీబాల గారు మరుసటి రోజు వస్తాననటంతో నేనూ పత్ర సమర్పణ తరువాత రోజు చేస్తానని చెప్పాను. ఎందుకంటే పత్ర సమర్పణ అయితే ఇక అక్కడ వుండటానికి కారణం వుండదు. మానవ సంబం,ధాల గురించి మాట్లాడాలని వచ్చినవారు తమ పత్రాలు చదివేసి పేపర్లు జేబులో కుక్కుకుని వెళ్ళిపోతున్నారు.

ఇదంతా చూసిన నేను నిర్వాహకుల దగ్గర నా నిరసనను తెలిపాను. అంత దూరం నుంచి వచ్చింది పేపరు చదివేసి వెళ్ళటానికి కాదు. ఒకరికొకరికి పరిచయం అవటం లేదు. అందరూ ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు. కాబట్టి పేపరు చదవటం బదులు వివరణ ఇస్తే దానిలో సందేహాలు అడుగుతూ ఆసక్తి కరంగా చర్చ నిర్వహించవచ్చని చెప్పాను. అదీకాక, అక్కడ మా గురించి ఎవ్వరికీ తెలియదు కాబట్టి కనీసం పరిచయం చేస్తేనయినా బాగుంటుందని అన్నాను. ఎందుకంటే అక్కడున్న వారిలో కథా రచయితలము మేమే కాబట్టి కథా సృజన గురించి వారితో చర్చిస్తే బాగుంటుందని సూచించాను.
ఆరోజు రాత్రి వేంకటేశ్వరరావు, అతని బంధువు మారుతిలతో వారింట్లో జరిగిన చర్చ ఎంతో ఆసక్తి కరంగా, సంతృప్తిగా అనిపించింది.

మరుసటి రోజు జానకీబాల గారితో, పెద్దిభొట్ల సుబ్బిరామయ్య గారితో పరిచయం జరిగింది. జానకీబాల గారు నా రచనలు చదివానన్నారు. కానీ, పెద్దిభొట్ల గారు నా పేరూ ఎక్కడా వినలేదన్నారు. అయితే మీరు పత్రికలు చూడటంలేదన్నమాట అన్నాను. నా దగ్గర వున్న పుస్తకాలిచ్చాను. ఇకపై నా పేరు తెలియదన్నా, పుస్తకాలు చూడలేదన్నా వొప్పుకోనని చెప్పాను. కానీ, ప్రస్తుతం వస్తున్న కథలు, రచనలు చదవకుండా   ఎలా సాహిత్యం పాడయిపోతోందని తీర్మానిస్తారో అనిపించింది.

ఆరోజూ పత్ర సమర్పణలు జరిగాయి. అయితే ముగింపు సభకన్నా ఒక గంట ముందు కథా రచయితలతో గోష్టి అన్నారు. పెద్దిభొట్ల గారు, జానకీబాల గారు, వేంకటేశ్వర్ రావు లతో నన్నూ స్టేజి మీద కూచో బెట్టారు. మాత్లాడండి అన్నారు.
మిగతాది రేపు……

September 25, 2011 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

నూజివీడు సభ ఆహ్వాన పత్రిక.

నూజివీడులో ఈనెల 21, 22 తేదీలలో జరిగే సభ ఆహ్వాన పత్రిక, కార్యక్రమ వివరాలు ఈవేళే నాకందాయి. నా కార్యక్రమం 22వ తారీఖున వున్నది.

 

September 18, 2011 · Kasturi Murali Krishna · 2 Comments
Posted in: Uncategorized

వార్త లో సైన్స్ ఫిక్షన్ కథలు, సాక్షిలో శ్రీకృష్ణదేవరాయలు-సమీక్ష.

ఈనాటి వార్త లో సైన్స్ ఫిక్షన్ కథలు, సాక్షిలో శ్రీకృష్ణదేవరాయలు, సమీక్షలు ప్రచురితమయ్యాయి.
సాక్షిలో సమీక్ష శ్రీకృష్ణదేవరాయలు సమీక్షలన్నిటిలోకీ నాకు నచ్చింది. సమీక్షకుడు నిర్మొహమాటంగా తన పరిశీలనను వ్యక్తపరచారు. ధన్యవాదాలు.
వార్తలో సైన్స్ ఫిక్షన్ కథలపై వచ్చిన సమీక్ష కూడా అతి చక్కని సమీక్ష. ఇంతవరకూ, నా ఏ కథనూ, ఎవరూ, ఇంతగా సమీక్షించలేదు. విహారి గారికి ధన్యవాదాలు.

ఈ రెండు పుస్తకాలూ, www.kinige.com లోనూ, నవోదయా పుస్తకాల దుకాణంలోనూ లభ్యమవుతున్నాయి.

 

September 11, 2011 · Kasturi Murali Krishna · No Comments
Tags: , , , ,  · Posted in: నా రచనలు.

భయపడటానికి సిద్ధంగా వుండండి. నా కొత్త పుస్తకం తయారవుతోంది.

నా కొత్త పుస్తకం అతి వేగంగా సిద్ధమవుతోంది.

శ్రీకృష్ణదేవరాయలు పుస్తకం చాలా బాగా పోతోందని నిన్ననే నవోదయ పుస్తకాల దుకాణంలో తెలిసింది. అడిగి కొనటమేకాదు, చదివిన తరువాత నా ఇతర పుస్తకాలూ కావాలని అడుగుతున్నరనీ, వీలయితే పాత పుస్తకాలూ కొన్ని తెమ్మనీ అడిగారు.

అయితే, నవోదయాలోనే కాక ఇతర పుస్తకాల దుకాణాలలోనూ, ఇతర ప్రాంతాలలోనూ నా పుస్తకాలు లభ్యమయ్యేట్టు చేయాలని ప్రయత్నిస్తున్నాను.

అయితే, కృష్ణదేవరాయల తరువాత నేను భారతీయ తత్వ చింతన ను అచ్చువేయాలని అనుకున్నాను. ఇంతలో, చిత్ర మస పత్రికలో హారర్ కథకు బహుమతి రావటంతో నా ఆలోచన మారింది.

సౌశీల్య ద్రౌపది, భారతీయ వ్యక్తిత్వ వికాసం, సైన్స్ ఫిక్షన్ కథలు, శ్రీకృష్ణదేవరాయలు, ఇలా ఒక్కొక్క పుస్తకం అందరి ఆదరణ పొందటం, అమ్ముడుపోవటం ఆననందాన్ని ఇస్తోంది. దాంతో, హారర్ కథలకూ మంచి ఆదరణ వుంటుందన్న విశ్వాసం వుంది. కాబట్టి ఈ ఆదరణ పొందే పుస్తకాల ప్రంప్రలో మ్రో అలాంటి పుస్తకం తెస్తే ఇంకా ఎక్కువ మంది పాఠకులను ఆకర్శించే వీలుంటుందని పించింది. అందుకనే, హారర్ కథల పుస్తకం తయారుచేస్తున్నాను.

నవ్యలో వరుసగా వచ్చినప్పుడే అవి ఎంతో ఆదరణను పొందాయి. ఎంతగా అంటే, ఒక పేరున్న సీనియర్ రచయిత, ఆబద్ధాలు చెప్పి మరీ ఆ కథలను అర్ధాంతరంగా ఆపిచ్చేంత!

ఆ కథలు డీటీపీ చేస్తున్న అమ్మాయి స్పందన చూశాక ఈ పుస్తకం తప్పకుండా పాఠకాదరణ పొందుతుందన్న విశ్వాసం మరింత పెరిగింది. ందుకే శ్ర వేగంతో తయారుచేస్తున్నాను. కవర్ కూడా భయపెట్టేట్టు వుండాలని ప్రయత్నిస్తున్నాను. బహుషా, అక్టోబర్ నెలకల్లా పుస్తకం మీ చేతుల్లో వుంటుంది.

భయపడటానికి సిద్ధంగా వుండండి. భయపడటంలో ఆనందాన్ని నుభవించండి.

September 10, 2011 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized