Archive for September, 2011

నేను నూజివీడు వెళ్తున్నాను.

ఈ నెల 21, 22 న నూజువీడులో కథ-మానవీయ విలువలు, అనే అంశం పై సెమినార్ జరుగుతోంది.

ఆ సెమినార్ లో నాకు నచ్చిన కథకుడి కథలను విశ్లేషించే అవకాశాన్ని నాకు ఇచ్చారు.  నేను విశ్వనాథ వారి కథలను ఎంచుకున్నాను. అయితే, ఒక రోజు నాకు ఫోను చేసి, వారణాసి నాగ లక్ష్మి గారి కథలను విశ్లేషించమని కోరారు.

వారణాసి నాగ లక్ష్మి గారి కథలు నాకూ ఇష్టమే. ప్రస్తుతం తెలుగు కథకులలో నేను ముందుగా చెప్పే ఉత్తమ కథకులపేరు వాడిదదే. ఆ తరువాత శ్రీవల్లీ రాధిక ఇలా వుంటుంది నా జాబితా.

కథకులు కొన్ని సిద్ధాంతాలకు, కొన్ని ఇజాలకు, ఆదర్శాలకు కట్టుబడో, కొన్ని మూస కథాంశాలకు మాత్రమే పరిమితమయ్యో రాస్తున్న సమయంలో కథను కథలా, మాన జీవితంలోని సంఘర్శణలు, సందిఘ్ధలు, ప్రదర్శిస్తూ, ఒక ఆలోచనను ఉత్తమ విలువలనూ ప్రదర్శిస్తూ రచిస్తున్న రచయిత ఆవిడ. అయినా, సాహిత్య ప్రపంచంలో మన విమర్శక శిఖామణులకు ఆవిడ కథలు కంబ్డావు.  అందుకే, ఒక మంచి సమకాలీన రచయిత గురించి పది మందికీ ప్రకటించే అవకాశాన్ని వదులుకోకూడదని,  నేనూ వారణాసి నాగల్క్ష్మి కథలను విశ్లేషించెందుకు ఉత్సాహం చూపాను.  నా వ్యాసం కార్యక్రమ నిర్వాహకులకూ నచ్చింది. వారు ప్రచురించే సావనీర్ లో ఆ వ్యాసం వుంటుంది.

ఈ సందర్భంగా. 21, 22 న నూజివీడులో నిర్వహించే సభలలో పాల్గొనేందుకు నేను నూజివీడు వెళ్తున్నాను. రెండు రోజులూ నూజివీడులో వుండి సాహితీ మిత్రులందరినీ కలవాలన్నది నా ఆలోచన. ఎవరయినా బ్లాగర్లు, నెటిజన్లు నూజివీడు దగ్గర్లో వుంటే వారినీ కలవాలని వుంది.

September 9, 2011 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

ఋషిపీఠం లో శ్రీకృష్ణదేవరాయలు సమీక్ష.

సెప్టెంబరు నెల ఋషిపీఠం మాస పత్రికలో శ్రీకృష్ణదేవరాయలు సమీక్ష ప్రచురితమయింది.

ఈ పుస్తకం ఈ కాపీ www.kinige.com లో లభ్యం.

September 5, 2011 · Kasturi Murali Krishna · No Comments
Posted in: పుస్తక పరిచయము

గాస్మండి లైబ్రరి మూతపడింది.

ఇవాళ్ళ హిందూ పత్రికలో డౌన్ టౌన్ పేజ్ చూడగానే ఈ వార్త కనబడింది. గాస్మండి లైబ్రరి మూతపడిండి.

గాస్మండి లైబ్రరీతో నావెన్నో ఙ్నాపకాలు ముడి[పడి వున్నాయి.

నేను స్కూలులో చదివేటప్పుడు, మెట్టుగూడా లైబ్రరీలో పుస్తకాలన్నీ అయిపోయాయని అన్నయ్యతో అన్నప్పుడు నాకు ఈ లైబ్రరీ గురించి చెప్పాడు అన్నయ్య. ఒక సారి తన సైకిల్ మీద తీసుకెళ్ళి చూపించాడు. అప్పటి నుంచీ అవకాశం దొరికినప్పుడల్లా ఈ లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు చదివేవావాడిని. ముఖ్యంగా ఫిల్మ్ ఫేర్ కోసం పడిగాపులు కాచేవాడిని. దాన్లో సుభాష్ కే ఝా రాసే పాటల విశ్లేషణలు, రాజు భరతన్ రాతలు ఎగబడి చదివేవాడిని.

ఈ లైబ్రరీలో రిఫెరెన్స్ సెక్షన్ లో చాలా మంచి పుస్తకాలుండేవి. వాటిని ఒక ఉద్యమంలా చదివేవాడిని. ఎండాకాలం సెలవులలో ఇంటినుంచి, లైబ్రరీవరకూ కాలినడకన వెళ్ళేవాడిని. అంతదూరం నడుస్తూ వచ్చినందుకు, ఎంత ఎక్కువసేపు పుస్తకాలు చదివితే గిట్టుబాటవుతుందో లెక్క చూసుకుని అంత కన్నా ఎక్కువసేపు గడిపేవాడిని. లంచి తినకుండా కూచునేవాడిని. లంచ్ తినాలంటే ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్తే మళ్ళీ ఇంత దూరం నడవాలి. ఆ కాలంలో నా దగ్గర డబ్బులుండేవి కావు. అమ్మని అడగాలంటే మొహమాటం.

ఇంటర్ లో వున్నప్పుడు, ఎండాకాలం సెలవులలో బస్ పాస్ వుండెది కాదు. అప్పుడు, మేము లాలాగూడాలో వుండేవాళ్ళం.
రైలుపట్టాల మీద పాటలుపాడుకుంటూ, ఆలోచించుకుంటూ నడిచేవాడిని. అలా ఒక రోజు లైబ్రరీలో ఒక రిఫెరెన్స్ పుస్తకం చదివాను. ఆ పుస్తకం ఎంత గొప్పగా వుందంటే నేను ఇంటర్ లో భూగర్భ శాస్త్రం చదవాలని నిశ్చయించుకున్నాను. కానీ డిగ్రీ నుంచే ఆ సబ్జెక్ట్ చదివేవీలుండటంతో, ఇంటర్ చదువుతూ దొరికిన ప్రతి పుస్తకం జియాలజీ గురించి చదివాను. అలాగే జెనెటిక్స్ పైన కూడా ఆసక్తి కలిగింది ఇక్కడే. జియాలజీ తీసుకోవాలో, జెనెటిక్స్ తీసుకోవాలో నని బోలెడంత ఆలోచించాను. ఈ రెండు సబ్జెక్టులూ నా అభిమాన సబ్జెక్టులు. కానీ అప్పటికే ఎంపీసీ తీసుకోవటంతో జెనెటిక్స్ తీసుకునే వీలులేకుండా పోయింది. దాంతో డిగ్రీలో జియాలజీ తీసుకున్నాను. కానీ, జెనెటిక్స్ గురించి చదువుతూ కొత్త కొత్త పరిశోధనల గురించి తెలుసుకుంటూనే వున్నాను ఇప్పటికీ.

చదువు పూర్తయిన తరువాతనయితే, ఒక రోజు సిటీ సెంట్రల్ లైబ్రరీలో గడిపితే, మరో రోజు గాస్మండి లో గడిపేవాడిని. వుద్యోగం వచ్చిన తరువాత ఉదయం డ్యూటీ చేసి మధ్యాహ్నం లైబ్రరీల్లో గడిపాను. ఇక్కడే నేను సోమ్రెసెట్ మాం. లారెన్స్ ల నవలలు ఇంకా అనేకానేక రచయితల నవలలు కూచుని చదివేను. ఉద్యోగంలో చేరిన తరువాత నేను సభ్యత్వం కట్టాను. నాలుగు కార్డులు. నా స్నేహితులను ఒప్పించి సభ్యత్వం కట్తించి, వాళ్ళ కాఋడులూ నేనే వాడేఅను.

ఈ లైబ్రరీకి కాలినడకన వచ్చాను. సైకిల్ లో వచ్చాను. స్కూటెర్ మీద వచ్చాను. కారులో వెళ్ళాను. అయితే, రాను రాను లైబ్రరీలో వున్న పుస్తకాలనేకం నా ఇంటిలోనే చేరుకున్నాయి నేను కొనుక్కోవటం వల్ల. ఏ పుస్తకం కావాలన్నా బయటకు వెళ్ళాల్సిన అవసరం తగ్గించి. నాకు నచ్చిన పత్రికలు కొనుక్కోసాగాను. నెట్ వచ్చినతరువాత ఇల్లుదాటి కదలాల్సిన అవసరము తగ్గింది. దాంతో దాదాపుగా రెండు సంవత్సరాలయింది లైబ్రరీలో అడుగుపెట్టి.

నేను చివరి సారి వెళ్ళినప్పుడే చదివేవారు తగ్గటం, పుస్తకాల మైంటెనన్స్ లేకపోవటం, ఉద్యోగులు లేకపోవటం గమనించాను. అందుకే, లైబ్రరీ మూశారన్న వార్త ఆశ్చర్యం కలిగించలేదు.

పుస్తకాలంటే పడిచచ్చే నేను. ప్రతిరోజూ ఏదో ఒక లైబ్రరీకి గుడికెళ్లినట్టు వెళ్ళకపోతే తోచని నేను ఈమధ్య లైబ్రరీల వైపు వెళ్ళి చాలా రోజులవుతోంది. మా తరం పరిస్థితే ఇలావుంటే ఇక కొత్త తరానికి లైబ్రరీల అలవాటు లేకపోవటంలో ఆశ్చర్యం లేదు. వారికి నెట్ వుంది. కాబట్టి లైబ్రరీలు ఒకటొకటిగా మూతపడటం, పుస్తకాల కొనుగోళ్లు తగ్గటం ఇదంతా ఒక సహజమయిన పరిణామాలలో భాగమే అనిపిస్తుంది.

మానవ జీవితంలో మార్పు అనివార్యం. కానీ, మార్పును ఆహ్వానిస్తూ, అర్ధం చేసుకుంటూ, మన జీవితాలలో లైబ్రరీలు ఎంత ప్రాధాన్యాన్ని వహించాయో గుర్తుచేసుకుంటూ, ప్రస్తూత సమాజంలో వాటి అవసరం అంతగా లేదన్న నిజాన్నీ అవగాహన చేసుకుంటూ ముందుకుసాగటమే మనపని. ఎందుకంటే ఏదో ఒక రోజు ఈ ప్రపంచానికి మన అవసరం కూడా తీరుతుంది. అప్పుడు మనమూ మనల్ని ఇష్టపడే వారికి ఒక ఙ్నాపకంలానే మిగిలుతాము. ఆ తరువాత………..

September 4, 2011 · Kasturi Murali Krishna · No Comments
Tags: ,  · Posted in: Uncategorized