Archive for October 2, 2012

బయోడైవర్సిటీ- రియల్ స్టోరీ.

ఆమధ్య  ఒక జర్నలిస్తు నాతో జర్నలిజంలో ఒక పెద్దలోటును నేను పూడుస్తున్నానని వ్యంగ్యంగా అన్నాడు. అప్పుడు కాస్త బాధగా అనిపించింది కానీ, ఆలోచిస్తే అతను అన్న మాట నిజమే అనిపిస్తోంది. (రాతల్లో కోతలిది)

సధారణంగా మన పాఠకులు ఇలాంటి కథలు చదవరు, మెచ్చరు, వారికి తేలికపాటి కథలు కావాలని, లేకపోతే విమర్శకులు మాత్రమే మెచ్చే ఉద్యమాల రంగుల కథలే  కావాలని అనేక విభిన్న కథలను మనవారు విస్మరిస్తున్నారు. కానీ, తెలుగు పాథకులకు పరిమితులు లేవని, ఎలాంటి కథనయినా పాథకులు మెచ్చేట్టు  రాయటం రచయిత బాధ్యత అన్నది నా నమ్మకం. అందుకని మూస కథలకు భిన్నంగా పలు రకాల కథలను రచిస్తున్నాను. పరిమితులు, సంకుచితాలు పాఠకులకు లేవని నిరూపిస్తూ వస్తున్నాను. ఇప్పుడు, వార్తలో రియల్ స్తోరీ శీర్షికన విభిన్నమయిన కథలు రచిస్తూన్నాను. పాథకాదరణ పొందుతున్నాను. అందుకు ఉదాహరణ క్రితం ఆదివారం వార్తలో ప్రచురితమయిన ఈ కథ. జీవ వైవిధ్యం వ్యాసాలేకదు, కథలకూ ఆస్కారంవుందని ఈ కథ రచించాను. దీనికి లభించిన పాథకాదరణ నా నమ్మకానికి బలాన్నిచ్చింది. నిజంగానే జర్నలిజంలోనూ, పత్రికలలోనూ ఒక పెద్దలోతును నేను పూడుస్తున్నానన్న ఆలోచనకు బలమిచ్చింది. ( నా గురించి నిజం  చెప్పుకున్నా గొప్పలు చెప్పుకున్నట్టుం,టుదన్నది  కోతలా తోచే నా రాతల డైలాగ్). 

నాది అహంకారమో ఆత్మవిశ్వాసమో ఈ కథ చదివి బ్లాగరులే చెప్పాలి.

October 2, 2012 · Kasturi Murali Krishna · 3 Comments
Tags: ,  · Posted in: రియల్ స్టోరీస్