Archive for January, 2013

వార్తలో ఆ అరగంటచాలు రివ్యూ.

ఈ సమీక్ష ఆదివారం వార్త అనుబంధంలో ప్రచురితమయింది.

January 30, 2013 · Kasturi Murali Krishna · No Comments
Posted in: నా రచనలు.

నేను హుబ్లి వెళ్తున్నాను.

tనేను 27న హుబ్లి వెళ్తున్నాను. 28 ఉదయం 12 గంటలకు,హుబ్లిలో జరిగే వందేళ్ళ దక్షిన భారత కాల్పనిక సాహిత్యం సభలో వందేళ్ళ తెలుగు కథ తీరు తెన్నుల గురించి ఒక విమర్సన పత్రం సమర్పించేందుకు వెళ్తున్నాను. నా అభిప్రాయాలను, ఆలోచనలను అందరికీ వినిపించేందుకు ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించే ప్రయత్నం చేస్తున్నాను. ఇంతవరకూ తెలుగు కథ విమర్సకులు విస్మరించిన కొన్ని స్వరాలనయినా వినిపించాలని, తెలుగు కథ విమర్శకులు ఒక పద్ధతి ప్రకారం ఎలా కొన్ని రకథలు, కొంతమంది రచయితలు, కొన్ని భావాలకే తెలుగు కథను పరిమితంచేసి తెలుగు సాహిత్య పరిథిని కుదించివేశారో వివరించటానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటున్నాను.
ఇంతవరకూ నేను ఏ సభలో మాట్లాడినా అప్పటికప్పుడు మాత్లాడటమే తప్ప ముందుగా తయారయి వెళ్ళిందిలేదు. కానీ, ఈసారి నేను పేపర్ సబ్మిట్ చేయాలని చెప్పటంతో ముందుగా వ్యాసాన్ని తయారుచేసుకుని వెళ్తున్నాను. అక్కడ పేపర్ ప్రెసెంట్ చేయటం అయిన తరువాత నా రాత ప్రతిని బ్లాగులో వుంచుతాను. నా ఈ ఉపన్యాసంలో విస్వనాథ వారి కథా సాహిత్య విశ్వరూపాన్ని సూక్షంలో ప్రదర్సిస్తున్నాను.
Programme Sheet

January 26, 2013 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

నేను అనంతపూర్ వెళ్తున్నాను.

20వ తారీఖున అనంతపూర్ లో నవ్య సాహితీ సంస్థవారు, ఆ అరగంటచాలు, కోడిహళ్ళి మురళీ మోహన్ సంపాదకత్వం వహించిన సాహితీ విరూపాక్షుడు విశ్వం, ఎం వెంకటేశ్వర్ రావ్ కథల సంపుటి అదివో అల్లదివో ల పరిచయ సభకోసం అనంతపూర్ వెళ్తున్నాను.
ఇది వెన్నెల సాహితీ సంస్థ వారి తొలి సమావేశం కావటంతో వారూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రచారం చేశారని, కనీసం 150 మంది వస్తారని తెలిసింది. దాంతో, ఆ అరగంట  చాలు తో పాటూ కొన్ని పాట పుస్తకాలు, అంటే శ్రీకృష్ణదేవరాయలు, సైన్స్  ఫిక్షన్ కథలు, తీవ్రవాదం, 4ఇంటూ 5,  అంతర్మథనం వంటి పుస్తకాలూ తీసుకువెళ్తున్నాను.

అక్కడ ఏం జరిగింది అన్నది  తిరిగి వచ్చిన తరువాత  సవివరంగా  రాస్తాను. మా ఈ ప్రయత్నం విజయవంతమవుతుందని ఆశిస్తున్నాను.

January 19, 2013 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

అంతా రొటీనే అంటున్న సగటుమనిషి.

ఇకపై ప్రతి గురువారం ఆంధ్రప్రభ ఎడిట్ పేజీలో సగటుమనిషిస్వగతం ప్రచురితమవుతుంది. ఇది ఈరోజు ప్రచురితమయిన వ్యాసం.

January 17, 2013 · Kasturi Murali Krishna · No Comments
Posted in: సగటుమనిషి స్వగతం.

అనంతపూర్ లో ఆ అరగంట చాలు పరిచయ సభ.

ఈ నెల 20వ తారీఖున అనంతపూర్ లో ఆ అరగంట చాలు పరిచయ సభ జరుగుతుంది. ఈ సభలో ఆ అరగంట చాలు పుస్తకంతో పాటూ సాగితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వం, అదివో అల్లదివో కథల సంపుటి ల పరిచయం కూడా జరుగుతుంది.

ప్రస్తుతం తెలుగు సాహిత్య ప్రపంచంలో ఒక రచయిత పని రచన చేయటంతోనే సరిపోదు. ఆ రచనను బ్రతికించుకోవటమూ, దాన్ని పదిమందికీ చేరవేయటమూ కూడా రచయిత బాధ్యతనే అవుతోంది. ముఖ్యంగా ఆ రచయితకు, మన సాహిత్య రంగంలో పేరు రావటానికి అవసరమయిన నాలుగు లక్షణాలలో ఏ వొక్కటీ లేకపోతే ఇక తన గురించి తానే చెప్పుకోవాలి. తన రచనల గురించీ తానే చెప్పుకోవాలి. వాటిని తానే ప్రచురించుకుని, తానే నెత్తికెక్కించుకుని వీధి వీధి తిరుగుతూ పాఠకులకు పరిచయం చేస్తూ వుండాలి. ఎందుకంటే ఇలాంటి రచయితలకు పాఠకులుంటారు కానీ, ఆ పాథకులు మౌన పాథకులు. చదువుతారు. మెచ్చుకుంటారు. వూర్కుంటారు. కానీ ఆ రచన గురించి రాయరు. వేదికలెక్కి చెప్పరు. దాంతో ఎంత మంచి రచన అయినా కొన్నాళ్ళకు మరుగున పడిపోతుంది. అందుకని మంచి రచనలను ఆదరించే పాఠకులున్నా వారికి మంచి రచనలున్నట్టు తెలిసేవీలు లేక రచయితలు నిరాశకు గురవుతున్నారు. వారి రచనలు మరుగున పడిపోతున్నాయి.

ఈ మాఫియా ముఠాల గుప్పిట్లో చిక్కిన వ్యవస్థలో నా రచనలను పాథకులకు చేరవేసేందుకు నేను రక రకాల పద్ధతులను అనుసరిస్తున్నాను. దాన్లో భాగమే, నా పుస్తకాల గురించి నేనే ప్రచారం చేసుకోవటం. అందుకని వీలయినన్ని వేదికలను ఎంచుకోవటం. వాతిని వుపయోగించుకోవటం.

ఈ ప్రయత్నంలో భాగమే పుస్తకం ప్రచురణ కాగానే దాని గురించి రాష్ట్రంలో పలు ప్రాంతాలలో సభలు జరపటం. అయితే, మన సాహిత్య సంస్థలూ అందరు రచయితలను గుర్తుంచుకుని చదివి మెచ్చి పిలిచి సభలు చేసే స్థితిలో వుండవు. విమర్సకులు ఇల్లెక్కి కూసే రచయితల నలిగిన పేర్లే వారికీ తెలుస్తాయి. అదీగాక, మన సాహిత్య సంస్థలకు నిధులుండవు. అందుకని వారిని సభ చేయమని అడిగితే మొహమాటానికి ఒప్పుకున్నా, ఇబ్బందులలో పడతారు. అందుకని, నేను తోటి రచయితలను కూడగట్టుకుని ఒక పథకం ఆలోచించాను. రచయితలు ఒక జట్టుగా ఏర్పడి సభలను ఆయా ప్రాంతాల సాహిత్య సంస్థల ఆధ్వర్యంలో జరిపించుకుంటారు. సభలు వీలయినంత సింపుల్ గా ఆర్భాటాలు లేకుండా జరుగుతాయి. సభలకయ్యే ఖర్చులను ఈ ముగ్గురు రచయితలు పంచుకుంటారు. ఇలా, ఎవరి పైనా భారం వేయకుండా, తనపైనా అధిక భారం పడకుండా రచయితకు తన పుస్తకం గురించి పది ప్రాంతాలలో పాథకులకు పరిచయం చేసే వీలు చిక్కుతుంది. ఆ తరువాత ఆ పుస్తకాన్ని పాథకులెలా ఆదరిస్తారో అది పుస్తకం నాణ్యత పైనే ఆధారపడివుంటుంది.

ఈ పథకంలో భాగంగా, నేను, కోడిహళ్ళి మురళీ మోహన్. ఎం. వెంకటేశ్వర్ రావు లము కలిసి అనంతపూర్ లో వెన్నెల సాహితీ సంస్థ ఆధ్వర్యంలో మా పుస్తకాల పరిచయ సభను నిర్వహిస్తున్నాము. సహృదయంతో మా తపనను అర్ధం చేసుకుని, మా ప్రయత్నానికి సహకరిస్తారని ఆశిస్తున్నాను. మా సాహిత్యం మీద మాకున్న నమ్మకంతో , పాథకుల విచక్షణపైన వున్న విస్వాసంతో ఈ ప్రయత్నాలను చేస్తున్నాము. ఈ సభకు అందరూ ఆహ్వానితులే.
ఆహ్వానపత్రం ఇదే.

January 16, 2013 · Kasturi Murali Krishna · One Comment
Posted in: నా రచనలు.

ఆంధ్రప్రభలో ఆ అరగంటచాలు, భయానక కథల సమీక్ష.

ఇవాళ్టి ఆంధ్రప్రభలో ఆ అరగంట చాలు, తెలుగులో భయానక కథల తొలిసంపుటి సమీక్ష ప్రచురితమయింది. ప్రింటులో ఇది తొలి సమీక్ష ఈ పుస్తకం పైన.

January 13, 2013 · Kasturi Murali Krishna · No Comments
Posted in: నా రచనలు.