Archive for January 2, 2013

ఆ అరగంట చాలు పై కౌముది సమీక్ష.

తెలుగులో తొలి భయానక కథల సంపుటి ఆ అరగంట చాలు పై ఈ నెల కౌముది మాస పత్రికలో సమీక్ష ప్రచురితమయింది. వీలయితే చదివి చూడండి. ఆ సమీక్ష నేను మరచిన ఒక అంశాన్ని నాకు గుర్తు చేసింది.

నేను ఆ అరగంట చాలు అనే కథను 1992 లో రాశాను. అది స్వాతి వార పత్రికలో ప్రచురితమయింది, 1993 లో. స్వాతి వార పత్రికలో ప్రచురితమయిన నా ఏకైక కథ ఇది.
కౌముదిలో కథలను సమీక్షిస్తూ ఒక విషయాన్ని పేర్కొన్నారు. 20ఏళ్ళ క్రితం రాసిన కథలోని ఊహలు ఇప్పుడు నిజాలు అని.

మరోసారి కథను చదువుకున్నాను. నిజమే, అప్పుడు నాకు ఇంకా నెట్ తెలియదు. కంప్యూటర్ అంటే రిజెర్వేషన్ టికెట్లిచ్చేది మాత్రమే. నా స్నేహితుడు శరత్ అప్పుడప్పుడు నా కు ప్రోగ్రామింగ్ గురించి ఏదో చెప్పేవాడు కానీ ఇప్పటికీ నేను కిల్లిటెరేట్ నే. అందుకే, ఇప్పుడది చదువుతూంటే నిజంగానే నేను కంప్యూటర్ ల గురించి ఏమీ తెలియకుండానే బాగానే ఊహించానే అనిపిస్తోంది. నిజానికి సమీక్షలో 20 ఏళ్ళ క్రితం అని చదివేవరకూ నేనాకథను రాసి రెండు దశాబ్దాలయిందని తట్టలేదు. ఇంకా నిన్న మొన్ననే రాసినట్టుంది.   ఇంకా బోలెడన్ని విభిన్నమయిన కథలు రాయాలన్న తపన అలాగేవుంది. ఈ ఊపుతో మరిన్ని సైన్స్ ఫిక్షన్ కథలను రచించాలని పథకాలు  వేస్తున్నాను.

మీరెంతగా నా కథల పుస్తకాన్ని ఆదరిస్తే నాకంతగా రచనాసక్తి పెరుగుతుంది. అంతగా మన విమర్షకుల పొరపాటు  స్పష్టమవుతుంది.  తెలుగులో మరిన్ని విభిన్న కథలు వస్తాయి. తెలుగు కథా పరిథి విస్తృతమవుతుంది.

January 2, 2013 · Kasturi Murali Krishna · 2 Comments
Posted in: నా రచనలు.