Archive for January 3, 2013

ఆ అరగంట చాలు గురించి తార్నాక బుక్ క్లబ్ లో…

తార్నాకా లో డాక్టర్ జ్యోతి గారు బుక్ రేడింగ్ క్లబ్ నిర్వహిస్తున్నారు. ప్రతి శని వారం సాయంత్రం అయిదు గంటల నుంచి ఆరు గంటల వరకు ఈ కార్యక్రమం వుంటుంది.

ఈ శనివారం అంటే అయిదో తారీఖు సాయంత్రం అయిదుగంటలకు నేను రచించిన  భయానక కథల  పుస్తకం ఆ అరగంట చాలు గురించి నేను మట్లాడతాను. ఒక కథను చదివి దానిలోని మర్మాలు, ప్రయోగాలు, ఏది ఎలా మలచాను  వంటి విషయాలను వివరిస్తాను. ఆసక్తి  కల వారు  వీలయితే ఆరోజు రావచ్చును.

తార్నాకాలో వాయుపురిలో ఏసేవ సెంటరు భవనంలో ఈ సమావేశం జరుగుతుంది. ఇంకా వివరాలు కావాలనుకున్నవారు, అడ్రసు తెలుసుకోవాలనుకున్న వారు 9885384740 కు ఫోను  చేయవచ్చు.

ఇన్నాళ్ళూ బ్లాగులోనే కలుసుకుంటున్న మనం ముఖాముఖీగా కలుస్తామని ఆశిస్తున్నాను.పుస్తకం లోని కథలు  చదివిన వారు వస్తే ప్రశ్నలు సమాధానాల కార్యక్రమం ఉత్సాహంగా వుంటుంది.

January 3, 2013 · Kasturi Murali Krishna · No Comments
Posted in: నా రచనలు.