Archive for February, 2013

లేరురా ఇటువంటి మాటలింకెందు అంటున్న సగటుమనిషి.

ఇది ఈనాటి ఆంధ్రప్రభ దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితమయింది.

February 14, 2013 · Kasturi Murali Krishna · No Comments
Posted in: సగటుమనిషి స్వగతం.

ఆ అరగంటచాలు పుస్తకం పై ఆచార్య ఫణీంద్ర సమీక్ష.

ఆచార్య ఫణీంద్ర కొత్త బ్లాగు పుస్తక పరిమళం లో ఆ అరగంట చాలును సమీక్షించారు. ఈ పుస్తకం కినిగే లో దొరుకుతుంది. ఈ పుస్తకాన్ని చదివి మీ అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా తెలపాలనిమనవి. పత్రికలు కళ్ళకు గంతలు తొడుక్కుని, మెదడుకు సిద్ధాంతాల ముసుగులు వేసుకుని రచనలను సాహిత్య దృష్టితో కాక వ్యక్తిగతాల దృష్టితో సమీక్షిస్తూన్న పరిస్థితులలో పాఠకులే సమీక్షల ఆధారంగా కాక తామే స్వయంగా చదివి ఇతరులకు నిజానిజాలు చెప్పాల్సివుంటుంది. అందుకే, ఆ అరగంట చాలు కథల గురించి మీ విమర్శను ఆహ్వానిస్తున్నాను. ఉత్తమ విమర్శకు బహుమతి వుంటుంది.
ఫణీంద్ర సమీక్షను ఇక్కడ చదవండి.

February 13, 2013 · Kasturi Murali Krishna · No Comments
Posted in: నా రచనలు.

ఆంధ్రజ్యోతిలో ఆ అరగంటచాలు రివ్యూ…

ఇవాళ్టి ఆంధ్రజ్యోతిలో ఆ అరగంట చాలు రివ్యూ ప్రచురితమయింది. రివ్యూ నేను ఊహించిన రీతిలోనే వుంది. పుస్తకం రివ్యూకి ఇచ్చేసమయంలో ఆదివారం ఇన్ చార్జ్ తో జరిగిన సంభాషణనుబట్టి ఇంతకన్నా ఘోరమయిన రివ్యూను ఊహించాను. ఎందుకనో నా మీద దయ తలచారు. ధన్యవాదాలు.

ఆంధ్రజ్యోతి దిన పత్రికలో సమీక్షకు నేను పుస్తకాలు ఇవ్వటం ఎప్పుడో మానేశాను. వారు నా పుస్తకాలను సమీక్షించకపోవటం, కనీసమందినవిలో వేయకపోవటం  వంటి అనుభవాలవల్ల నేను రెండు కాపీలు వ్యర్ధం చేయటమెందుకని ఇవ్వటం మనేశాను. ఇప్పుడీ పుస్తకాన్నిఎందుకిచ్చానంటే కనీసం రివ్యూ వేయకున్నా చదివి భయపడతారని. రివ్యూ చూస్తూంటే భయపడ్డట్టే అనిపిస్తోంది.
తెలిసో తెలియకో నేను రాసిన ముందుమాటను నిరూపించారు. నా స్వోత్కర్శ పూరిత, ప్రనిందా సహిత ఆరుపేజీల సుదీర్ఘ ముందుమాట లక్ష్యానికే తగిలిందన్నమాట.

February 10, 2013 · Kasturi Murali Krishna · 2 Comments
Posted in: నా రచనలు.

అంకెల్లో అయోమయమవుతున్న సగటుమనిషి.

ఇది ఇవాళ్టి ఆంధ్రప్రభ ఎడిట్ పేజీలో ప్రచురితమయింది.

February 7, 2013 · Kasturi Murali Krishna · No Comments
Tags:  · Posted in: సగటుమనిషి స్వగతం.

సాహిత్య అకాడెమీ సమావేశం లో నా ఉపన్యాస సారం.

>సాహిత్య అకాడెమీ సమావేశం లో నాకు వందేళ్ళ తెలుగుకథ వికాసం, ఉద్యమాలు, పరిణామాలు అన్న అంశం పై మాట్లాడే అవకాశం లభించింది.
నేను నా అలవాటుకు భిన్నంగా అకాడెమీ వారి కోరికననుసరించి ఒక ఉపన్యాసాన్ని తయారుచేసుకున్నాను. ఎందుకంటే వారికి రాత ప్రతి సమర్పించాలన్నారు.

అయితే, అక్కడ సమావేశంలో కన్నడ వారు కన్నడలోనే మాట్లాడేరు. హిందీ, ఇంగ్లీషు వద్దన్నారు. ఇంగ్లీషయినా ఫరవాలేదుకానీ, హిందీ అస్సలు వద్దన్నారు.

ఆరంభోపన్యాసాలు అయ్యే సరికి 1230 దాటింది. దాంతో లంచ్ అయ్యాక మా కార్యక్రమం జరిపితే బాగుంటుందనుకున్నాము. ఎందుకంటే అప్పటికే సగం మంది హాలు వదలి వెళ్ళిపోయారు. మళ్ళీ అందరూ వచ్చి కూచునేఅసరికి సమయం పడుతుంది. కానీ, కేతు విశ్వనాథ రెడ్డి గారు, లాగించేద్దాం అన్నారు. సరే అన్నాము నేను, వీరాజీ గారు.

దాంతో, ఇంకా అందరూ మాట్లాడుతూ, సగం హాలు బయటే వున్నప్పుడు మా సమావేశం మొదలయింది. ముందుగా వీరాజీ గారు తాను తయారు చేసుకొచ్చిన వందేళ్ళ నవలపైన ఇంగ్లీషులో చదివేరు.

ఆయన చదువుతున్నప్పుడే కేతు గారు నాతో అన్నారు. పేర్లు గీర్లు లేకుండా గెనెరల్ గా చెప్పేయి అని. తలూపాను.

నా పేరు పిలవగానే నేను రాసుకొచ్చింది అందరి ముందే పక్కన పెట్టాను. తెలుగులో ఆరంభించాను.
నేను మాట్లాడిన మొత్తం ఇవ్వలేను గానీ సారం ఇక్కడ పొందుపరుస్తాను.

ముందుగా అందరికీ నమస్కారం అన్నాను. నాకిలా మాట్లాడే అవకాశం ఇచ్చిన అకాడెమీకి కృతఙ్తలు చెప్పాను. నేను తెలుగు రచయితననీ, నాకు మాత్రుభాషాభిమానం వుందనీ, కానీ, ఎంత అభిమానం వున్నా, అది పదిమంది వేర్వేరు భాషలవారు ఆలోచనలు పంచుకోవటానికి ఒక చోట చేరినప్పుడు, నాకే అర్ధమయ్యే నా భాషలో మాత్లాడే బదులు అధిక సంఖ్యాకులకు అర్ధమయ్యే భాషలో మాట్లాడనివ్వని దురభిమానం కాదని అన్నాను. అయితే, భారతీయులమందరం కలసి మన అందరికీ అర్ధమయ్యే ఒక భారతీయ భాషను ఎంచుకోనంతవరకూ అందరికీ అర్ధం కావాలంటే ఇంగ్లీషులో మాట్లాడక తప్పదు కాబట్టి ఇక పై నేను ఇంగ్లీషులో మాత్లాడతానని చెప్పాను. ఆపై ఇంగ్లీషులో మాట్లాడేను.

నేను త్రెండ్ సెట్టర్లుగా చెప్పే వారిపేర్లు అందరికీ తెలియవు కాబట్టి రచయితల పేర్లు లేకుండా ట్రెండ్ ల గురించి వాతి ప్రణామాల గురించి వివరిస్తానని చెప్పాను.

తెలుగు కథ లోకి వెళ్ళేముందు తెలుగు సాహిత్య ఆవిర్భావాన్ని గమనిస్తే, ఆరంభమ్నుంచీ తెలుగు సాహిత్యం సామాజిక స్పృహను, సమాజ హితాన్ని ప్రదర్సించిందనీ, సాహిత్య అభివృద్ధి ఎలాంటి సంకుచితాలు లేకుండా దశ దిశల విస్తరిల్లిందనీ వివరించాను.
వివాదాలు, వాదాల జోలికి వెళ్ళకుండా నన్నయకన్నా సాహిత్యం వున్నా అధికుల అభిప్రాయం ప్రకారం నన్నయ్య తో తెలుగు రచన ఆరంభమయిందనుకుంటే భారత్ ఆంధ్రీకరణ వెనుక సామాజిక ఆవశ్యకత వుందనీ, ఆ వెంటనే బయలు దేరిన దేశీ కవిత భాశా సంకుచితాలకు ప్రతిస్పందన అనీ, సమాజంలో శివ కేశక భావాల సంకుచితాలకు తిక్కన హరిహరాద్వైతం విరుగుడయితే, పోతన భాగవతం, వేమన పద్యాలు, అన్నమయ్య కీర్తనలు ఇలా ఇవన్నీ ఏదో ఒక రీతిలో తెలుగు సామాజిక పరిస్థితులకు స్పందిస్తూ తమ దయిన రీతిలో సంకుచిత భావాలను ఖండిస్తూ సమాజ హితాన్ని కాంక్షించాయనీ, భారత్ జాతి ఎన్నడూ సంకుచిత భావాలను సమర్ధించలేదనీ స్పష్టం చేశాను.

అయితే అంతవరకూ లేని న్యూనతా భావం తెలుగు కథ ఆవిర్భావ సమయంలో సమాజంలో వుందనీ, ఈ నేపధ్యంలో ఆరంభమయిన తెలుగు కథ స్వీయ దూశణం, తనదయిన దాన్ని చులకన చేయటమే సమాజ హితమని, అభ్యుదయమనీ పొరపడుతూ ఆరంభమయిందని వివరించాను.

అయితే బానిస దేశాలలో ఒక వైపు తమదయిన దాన్ని చులకన చేసే సాహిత్యం వస్తూంటే మరో వైపు తమ గొప్ప్ప తనాన్ని వివరించే సాహిత్యం వస్తుందనీ, ఆపై ఈ రెందు భావాల నడుమ సమన్వయం సాధించే సాహిత్యం అటు న్యూనతా భావాన్ని ఇటు ఆధిక్య భావాన్ని సమన్వయ పరుస్తుందనీ వివరించాను. తెలుగులోనూ సాహిత్యం 1940 వరకూ ఈ దిశలో ప్రవహించిందని చెప్పాను.
అందుకే 1910 నుంచి 1940 వరకూ తెలుగులో అన్ని రకాల కథలు వచ్చాయి. సాంఘిక కథలు, డిటెక్టివ్ కథలు, క్రైం కథలు, ప్రేమ కథలు, దేస భక్తి కథలు, దయ్యాల కథలు, అనువాద కథలు, ఇలా, వికసించే సహస్ర దళ పద్మంలా తోచింది తెలుగు కథ ఆ కాలంలో.

అయితే, 1940 తరువాత వామపక్ష భావాలు పెద్ద ఎత్తున ప్రవేశించి, న్యూనతా భావాన్ని పెంచటంతో సాహిత్యమన్నా, అభ్యుదయమన్నా అర్ధం సంకుచితమయిపోయిందనీ, ఇది కథను తిరుగులేని రీతిలో ప్రభావం చేసిందనీ, తెలుగు కథ చుట్టూ ముళ్ళ కంచెలూ వెదురు పొదలూ ఏర్పడి కథ వికాసాన్ని కుచింప చేశాయనీ వివరించాను. అందుకే, తెలుగులో స్వాతంత్ర్య పోరాట కథల కన్నా భూస్వామ్య పోరాట గాథలు, అగ్రవర్ణాల అత్యాచార కథలు అధికంగా వచ్చాయనీ, సామాజిక సంస్కరణ అంటే అగ్రవర్ణాలు ఇతరవర్ణాల నడుమ వివాహము ప్రేమ అన్న అర్ధంలోనే కథలు వచ్చాయనీ వివరించాను. అయితే ఆ తరువాత మధ్యతరగతి కథలు, మానవ మనస్తత్వ కథలు, జీవితంలో పలు పార్శ్వాల కథలు వచ్చినా, మరో వైపు హాస్య రచనలు, మానవ సంబంధ రచనలు వచ్చినా అభ్యుదయము, ప్రోగ్రెసివ్ అన్న పదాలకే ప్రాధాన్యం హెచ్చిందనీ, చారిత్రక గాథలంటే ప్రేమ గాథలే అయ్యాయనీ, చరిత్రను నిక్కచ్చిగా రచించే బదులు ఊహలే అధికమై చివరికి మన చరిత్ర ఒక రొమాంటిక్ గాథ అయి ప్రామాణికత కోల్పోయి చారిత్రక కథలు వెనుకబడ్డాయనీ వివరించాను. ఇలాంటి పరిస్థితులలో రిలీఫ్ కోరిన ప్రజలను ప్రేమ సాహిత్యం వుర్రూతలూపిందనీ, మరో వైపు శ్రీకాకుళం పోరాటం, నక్సలైట్ వుద్యమ ప్రభావం కథపై పడటం తో సాహిత్యం వీరి గుప్పిట్లోకి వెళ్ళటంతో 1970 నుంచీ తెలుగు కథ క్షీణ దశ ప్రారంభమయిందనీ, ఈ దశలోనీ పాశ్చాత్య ప్రభావంతో స్త్రీ వాద రచయిత్రులూ వచ్చారనీ, పాస్చాత్యులలానే లైంగిక స్వేచ్చ కిచ్చిన ప్రాధాన్యం ఆత్మ గౌరవానికి ఆత్మవిశ్వాసానికీ ఇవ్వకపోవటంతో ఇలాంటి రచనలు మెచ్చుకునే గుంపువల్ల రచయితలకు ప్రాధాన్యం వచ్చి ఇలాంటి రచనలవైపే అందరూ మొగ్గతంతో నెమ్మదిగా పాథకులు తగ్గటం మొదలయిందనీ, వీరు పాపులర్ రచనలు పల్ప్ రచనలు అంటూ ప్రజలు ఆనందించే సాహిత్యాన్ని చులకన చేయతంతో నెమ్మదిగా ప్రజలు కోరే సాహిత్యానికీ ఉద్యమ ప్రేరేపిత సాహిత్య వేత్తలు మెచ్చి సృజిస్తున్న సాహిత్యానికీ నడుమ తేదా పెరిగిందనీ వివరించాను. ఫలితంగా చదివే వారు తగ్గుతూండటంతో పాఠకులను ఆకర్శించటంకోసం సరసం తెరపైకి వచ్చిందనీ, ఫలితంగా తెలుగు కథ దిగజారుతూ ఎంతసేపూ పడకగదుల చుట్టూ తిరుగుతూండటంతో సీరియస్ పాఠకులేకాదు, సౌమ్యులయిన సైలెంట్ పాథకులూ దూరమయ్యారనీ, ఇలాంటి పరిస్థితిలో 1990 నుంచీ తెలుగు కథ ఉద్ధరణ ఒక ఉద్యమంలా మొదలయిందనీ వివరించాను. ఒక వైపు, వేదగిరి రాంబాబు, మరో వైపు కథా నిలయం కథకో గుర్తింపు తేవాలని తపన పడుతూంటే ఇంకో వైపు ఇదే అదనుగా సాహిత్య మాఫియా ముఠాలు రంగ ప్రవేశం చేసి ఇదే కథ, వేడే కథకుడంటూ కథను సంకుచితం చేసి గుప్పెడు కథకులనే తెరపైన నిలిపారు. దాంతో తమ తమ గుర్తింపులకోసం రక్రకాల వుద్యమాలు కథా ప్రపంచంలో తీవ్రమయ్యాయి. దళిత కథలు, మైనారిటీ కథలు, ప్రాంతీయ కథలు, ఇలా కథా ప్రపంచంలో అడ్డుగోడలు, ముద్రలు కాటెగిరీలు మొదలయి కథలు కథకులూ సంకుచితమయిపోయాయి. కథకుడు కానీ, కథ కానీ, ఏదో ఒక వర్గానికి చెందకపోతే బతక లేని పరిస్థితి వచ్చింది. దాంతో ఒక రచయిత ఒక ప్రాంతానికి చెందినవాడుగా చెప్పుకోకపోతే గుర్తింపు లేదు, చెప్పుకుంటే ఇతర ప్రాంతాల వారు దగ్గర తీయరు, ఇది కథాంసానికీ వర్తించటంతో మెప్పుకోరి అందరూ ఒకేరకమయిన ఆలోచనలు ప్రదర్శిస్తూ వచ్చారు. కథలు పెరిగాయి. కథకులు పెరిగారు. విమర్శకులు పెరిగారు. కానీ పాథకులు తగ్గిపోయారు.

ఇలాంటి పరిస్థితిలో కొందరు రచయితలు వాదాలు వివాదాలకూ దూరంగా రచనలు చేస్తున్నారు. ఫెమినిస్ట్ సంకుచితత్వాని ప్రతిస్పందనగా మాన సంబంధాలలోని తాత్వికతను స్రీవల్లీ రాధిక చూపిస్తే, మానవ అనుబంధాలలోని గొప్పతనాన్ని అవగాహనను వారణాసి నాగలక్ష్మి చూపిస్తున్నారు. నేను నా పరిథిలో విభిన్నమయిన రచనలు చేస్తున్నాను. అంటూ నా హారర్ కథల గురించి చెప్పాను.

చివరలో ఈ పరిస్థితి మారాలంటే మేధవులూ, రచయితలూ, ఎడిటర్లూ అందరూ కూచుని కథల్లోని సంకుచితాలను సంకెళ్ళనూ వదిలించాలనీ, కథలు సప్థవర్ణ సమ్మిశ్రితమయిన ఇంద్ర ధనుస్సులా విలసిల్లేట్టు చేయాలనీ అన్నాను. పాథకుడు మూడున్నప్పుడు సీరియస్ సాహిత్యం చదువుతాడు. బోరు కొట్టినప్పుడు వినోదాత్మకం చదువుతాడు. ఇంకా మూడుంటే రొమాన్స్ చదువుతాడు. అన్ని రసాలనూ ఇవ్వగలిగినప్పుడే సాహిత్యం ఆదరణ పొందుతుంది. అభివ్రుద్ధి చెందుతుందని చివరగా మరో విషయం చెప్పాను.

సాధారణంగా ఇతర ఏ సాహిత్యంలోనయినా రచయిత స్వేచ్చగా రచన చేస్తాడు. ఆ తరువాత విమర్శకులు దాన్ని విశ్లేశిస్తారు. గుణ గణాలు విశ్లేషిస్తారు. అంతే తప్ప రచయిత ఎలారాయాలో, ఇలాగే రాయాలి అని టేచర్ కర్రపట్తుకుని చెప్పినట్టు చెప్పరు. ఇది ఒక్క తెలుగు సాహిత్యానికే ప్రత్యేకం అనీ, అయితే, రచయిత బ్రహ్మ కన్న గొప్పవాదు కాబట్తి ఎవ్వరి మాట వినాల్సిన అవ్సరంలేదన్నాను. ఎందుకంటే ఈ బ్రహ్మ సృష్టించిన ప్రపంచం మాయ అని గ్రహించలేక ఇందులో సుఖ ద్ఖాలు అనుభవిస్తాము. దాన్లో ఆస్చర్యం లేదు. కానీ, రచయిత రాస్తున్నది కల్పన అని తెలుసు. అయినా, అక్షరాల ద్వారా రచయిత పాథకుడి మనసులో సృష్టించిన మాయ ప్రపంచం కల్పన అని తెలిసి కూడా పాథకుడు పాత్రల ఉద్వేగాలు తానయి అనుభవిస్తాడు. కాబట్తి బ్రహ్మ కన్న రచయిత గొప్పవాడు. అలాంటి రచయిత ఎవరో ఏదో చెప్తే దాన్ని వినటం, మామూలు మనుషుల్లా, ఉద్యమాలల్లో దిగి అవేశకావేశాలు ప్రార్సించటం, తన చుట్టూ గిరి గీసుకుని పరిథిని సంకుచితంచేఉకోవటం కూడాని, ఎప్పుడయితే రచయిత బ్రహ్మలాగా, తన ద్ర్ష్టిని విషాలంచేఇ, పరిథిని విస్తృతంచేసి, అందరికన్న ఎత్తునుండి దూరం చూసి రచనలు చేస్తాడో అప్పుడు సాహిత్యం సరస్వతికంఠాభరణంగా విలైల్లుతుందనీ, త్వరలో తెలుగుకథ అన్ని సంకుచితాలూ, విచ్చిన్నకర ధోరణులనూ వదిలి సహస్రదళ పద్మం లా వికసిస్తుందనీ ముగించాను.

దీనిపై ప్రేక్షకుల ప్రతిస్పందన మరో పోస్టులో.

February 4, 2013 · Kasturi Murali Krishna · One Comment
Posted in: Uncategorized

మాయంటే మాయా కాదు, అంటున్న సగటుమనిషి.

ఇది నిన్న ఆంధ్రప్రభ ఎడిట్ పేజీలో ప్రచురితమయింది.

February 1, 2013 · Kasturi Murali Krishna · No Comments
Posted in: సగటుమనిషి స్వగతం.