Archive for March, 2013

ఈనాటి ఈనాడు, సాక్షిలలో ఆ అరగంట చాలు రివ్యూ..

ఇవాళ్టి ఈనాడు, సాక్షి దినపత్రికలలో తెలుగులో భయానక కథల తొలి సంపుటి ఆ అరగంట చాలు సమీక్షలు ప్రచురితమయ్యాయి.

March 31, 2013 · Kasturi Murali Krishna · No Comments
Posted in: నా రచనలు.

కథాకేళి మాస పత్రికలో కథాకళి.

విజయవాడ నుంచి వెలువడుతున్న కథాకేళి మాస పత్రికలో తెలుగు కథతో ఒక వినూత్న ప్రయోగం చేయబోతున్నాను.
ఒకే ఇతివృత్తంతో విభిన్నమయిన కథలను నెల నెలా స్ర్జించబోతున్నాను.
అంటే పాథకులకు ప్లాట్ ఏమిటో ముందే తెలుస్తుంది. కానీ, దాన్ని ఒక నెల బాలల కథగా, మరో నెల హాస్య కథగా, ఇంకో నెల సస్పెన్స్ కథగా, ఆతరువాత నెల సైన్స్ ఫిక్షన్ కథగా…..ఇలా ఒకే థీం ఆధారంగా పలు కథా రచన ప్రక్రియలలో కథలను రచించబోతున్నాను.
తెలుగులో కుక్క పిల్ల, అగ్గిపుల్ల లపై కథలు వచ్చాయి, అమరావతి కథలలా ఒక ప్రాంతం ఆధారంగా కథలు వచ్చాయి, బుడుగు లాంటి పాత్రల ఆధారంగా కథలు వచ్చాయి. కులం ఆధారంగా కథలు వచ్చాయి. కానీ, నాకు తెలిసి ఇలా ఒకే థీం ఆధారంగా వీలయినన్ని విభిన్న ప్రక్రియలలో కథలు రాసి మెప్పించే ప్రయత్నం ఎవ్వరూ చేయలేదు.
రచయితకు ప్రతిభ వుంటే, నైపుణ్యం వుంటే ఆకు రాలి క్రింద పడటాన్ని కూడా అత్యద్భుతమయిన కథగా రూపొందించగలడు. రచయిత తలచుకుంటే ఎలాంటి కథనయినా చెప్పి ఆనందింపచేయగలడు. పాథకులివే మెచ్చుతారు, రచయితలు ఇలాగే రాయాలి, ఇవే సబ్జెక్టుల గురించి రాస్తేనే మంచి కథ , ఒక రచయిత ఒకే విధంగా, ఒకే అంశం గురించి రాయాలి అని తీర్మానించే వారందరికీ నమస్కారం పెడుతూ, ఈ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుడుతున్నాను. అవధులు లేని మేధకు, ప్రతిభకు, అనంతమయిన సాహిత్యానికి అడ్డుగోడలు లేవని, అవి నిర్మించాలన్న ఆలోచన కూడదని నిరూపించాలన్నది నా ప్రయత్నం.

ఇంకో రెండు నెలల్లో ఈ కథ యాగం ఆరంభమవుతుంది. మీ అభిప్రాయాలకోసం ఎదురుచూస్తూంటాను.
ఎవరికీ తెలియని పత్రికలలో రాస్తానని ఆక్షేపించేవారికి, కథాకేళి కినిగే లో దొరుకుతుంది.

March 26, 2013 · Kasturi Murali Krishna · One Comment
Posted in: నా రచనలు.

రేడియో తరంగాలో నాతో రెండుగంటల ఇంటర్వ్యూ వినండి.

ఇవాళ్ళ రాత్రి ఎనిమిదిన్నర నుంచి పదిన్నర వరకూ నెట్ ఎఫ్ ఎం చానెల్ మీడియా తరంగాలో నా ఇంటెర్వ్యూ వస్తుంది. వీలు చూసుకుని వినండి.
మాత్ర్భాషా దినోత్సవం నాడు అనుకోకుండా తుర్లపాటి నాగ భూశణం గారొతో పరిచయమయింది. నేను నా రచనల గురించి చర్చ సాగింది. ఆయనదగ్గర రాజతరంగిణి ఇకథల పుస్తకం వుంది. మొత్తం మా మాటలయ్యాక ఆయన మీతో రెండుగంటల కార్యక్రమం చేయాలి అన్నారు. ఇదిగో ఇవాళ్ళ ఆ కార్యక్రమం లైవ్ ప్రసారమవుతుంది.

ఈ కార్యక్రమంలో ఫోన్ ఇన్ సౌకర్యం కూడా వుంది. మధ్య మధ్యలో పాటలూ వినిపిస్తాము. కార్యక్రమం వినండి. మీ అభిప్రాయాన్ని తెలపండి.

http://telugu.tharangamedia.com/kasthuri-murali-krishna/

March 16, 2013 · Kasturi Murali Krishna · No Comments
Posted in: నా రచనలు.

మనము గొర్రెలమంటున్న సగటుమనిషి.

ఇది సగటుమనిషిస్వగతం శీర్షికన ఆంధ్రప్రభలో ప్రచురితమయింది.

March 14, 2013 · Kasturi Murali Krishna · No Comments
Posted in: సగటుమనిషి స్వగతం.