Archive for April, 2013

నేరాలే చానెళ్ళకు పండుగలు-అంటున్న సగటుమనిషి.

ఇది గురువారం ఆంధ్రప్రభ ఎడిట్ పేజీలో ప్రచురితమయింది.

April 27, 2013 · Kasturi Murali Krishna · No Comments
Posted in: సగటుమనిషి స్వగతం.

కథా రచయితలకు ఒక వార్త

కథా రచయితలకు ఒక వార్త.

మీ అందరికీ తెలుసు నేను ఆరంభం నుంచీ మన కథా సాహిత్య ప్రపంచంలో కొందరు రచయితలకు, వారి కథలకు మాత్రమే ప్రచారం వస్తోందని, ఆయా ముఠాలలోకి పరిథులు ప్రమాణాలలోకి రాని రచయితలు ఎంతగా ప్రతిభావంతులయినా వారికి మనుగడ, గుర్తింపులు గగనకుసుమాలేననీ నాకు అవకాశం దొరికిన వేదిక మీదల్లా ప్రకటిస్తూనే వున్నాను.
నా పరిథిలో వీలయినంతవరకూ మంచికథలు రాసేవారందరికీ ప్రోత్సాహం ఇస్తూవున్నాను. కౌముది నెట్ మాస పత్రికలో, జాగృతి వార పత్రికలో కథాసాగరమథనం అనే శీర్షికన మన పత్రికలలో ప్రచురితమయిన కథలలోంచి, రచయిత పేరు , ఇతివృత్తం, ఇజాలు, ఉద్యమాలతో సంబంధం లేకుండా కేవలం కథను కథగా సాహిత్యంగా చూస్తూ నిషాక్షిక విమర్శ చేసే ప్రయత్నం చేశాను. మంచి కథకులకు ప్రోత్సాహాన్ని, గుర్తింపునూ ఇవ్వాలని ప్రయత్నించాను.
నా ఈ ఆలోచనను రేడియో తరంగా వారితో పంచుకోగా వారు వారానికి ఒక రోజు ఒక గంట కార్యక్రమాన్ని నేను నాకు నచ్చినట్టు తీర్చి దిద్ది అందించే స్వేచ్చనిచ్చారు. ఫలితంగా త్వరలో రేడియో తరంగా చానెల్ లో సృజన స్వరం అనే సరికొత్త కార్యక్రమం రాబోతోంది. ఇందులో ప్రతివారం ఒక కథా రచయిత తన కథా రచన గురించి, రచనల సంవిధానం గురించి, కథా సృజన గురించి మాట్లాడతాడు. నేను ఆర్ జే గా కార్యక్రమాన్ని నిర్వహిస్తాను. ఈరకంగా ఇంతవరకూ మన పత్రికలలో విరివిగా, విశిష్టంగా కథలు రాస్తూన్నా సాహిత్య ప్రపంచంలో సరయిన గుర్తింపు లభించని రచయితలను పాఠకులకు చేరువ చేయాలని ప్రయత్నిస్తున్నాను. ఇందులో కథకులు, విమర్శకుల సృజన స్వరం వినిపిస్తాను.
ఈ కార్యక్రమాన్ని వారం తరువాత తరంగా వారు దవ్న్ లోడ్ చేసుకునే రీతిలో ఆడియో ఫైల్ అందచేస్తారు. అలాగే కొన్నాళ్ళకు వారే ఈ కార్యక్రమాన్ని పుస్తకరూపంలోనూ అందిస్తారు.
ఈ కార్యక్రమం వారణాసి నాగలక్ష్మి గారి సృజన స్వరంతో ఆరంభమవుతుంది.
ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే రచయితలు, కవులు తమ మొబైల్ నంబరు నాకు మెయిల్ చేస్తే నేను వారికి ఫోన్ చేసి మాట్లాడతాను.
సాహిత్య సాగరంలో ఇజాలు, ఉద్యమాలు అలలే తప్ప అవే సాహిత్యం కాదు. అందుకే మనమందరం రచయితలం కలసి మన సృజన స్వరాన్ని వినిపిద్దాం. సాహిత్యం లో సృజనకు పెద్దపీట వేద్దాం.
నా ఈ ప్రయత్నానికి మీ అందరి ప్రోత్సాహం లభిస్తుందని ఆశిస్తున్నాను.

April 22, 2013 · Kasturi Murali Krishna · One Comment
Posted in: Uncategorized

నమస్తే తెలంగాణ లో ఆ అరగంట చాలు సమీక్ష.

నమస్తే తెలంగాణా పత్రిక ఆదివారం అనుబంధం బతుకమ్మ లో ఈ రోజు భయానక కథల సంపుటి సమీక్ష ప్రచురితమయింది.

April 21, 2013 · Kasturi Murali Krishna · No Comments
Posted in: నా రచనలు.

ఈ ఉగాది ఎంతో చేదు, కొంత తీపి…

ఈ సంవత్సరం ఉగాది రోజు ఎమో చేదు కొంత తీపిని అనుభవించాను.
నేను నాలుగేళ్ళుగా అతి ఇష్టంగా రాస్తున్నది, పాథకులు అమితంగా మెచ్చుతున్నదీ అయిన పాడుతా తీయగా శీర్షిక వస్తున్న ఈభూమి మాస పత్రిక ఈ నెల నుంచీ ఆగిపోతోంది. ఇదే పత్రికలో నాది పాథకులు మెచ్చిన మరో శీర్షిక నవల నుంచి సినిమా వరకూ కూడా వస్తోంది. ఈ భూమి ఆగిపోవటం గురించి మరోసారి తీరికగా చెప్తాను. కానీ, కస్స్త బాధగా అనిపించింది. సినిమా సంగీతం గురించి గతంలో రసమయి మాస పత్రికలోనూ రాశాను. అదికూడా సాహిర్ తో ఆరంభించాను. హస్రత్ దగ్గరికి వచ్చేసరికి ఆగిపోయింది పత్రిక. ఈ శీర్షికకూడా సాహిర్ తోనే ఆరంభించాను. హస్రత్ గురించి నాలుగేళ్ళుగా రాయలేదు. ఈ నెల రాసి పంపాను. పత్రిక ఆగిపోయిందని వార్త వచ్చింది.
చినుకు, కథాకేళి పత్రికలు కూడా ఈనెల ఇంకా ప్రచురితం కాలేదు. చినుకు ఉగాది ప్రత్యేక సంచికకోసమని నేను తెలుగు కథ గురించి ఒక వ్యాసం రాశాను. కథాకేళిలో కథాకళి ఆరంభించాల్సి వుంది.
పాలపిట్ట ఫిబ్రవరి సంచిక మార్చ్ లో విడుదలయింది. మార్చ్ సంచిక ఇంకా రాలేదు. మార్చ్ సంచికకు ఇవ్వాల్సిన వ్యాసం నేను ఇంకా ఇవ్వలేదు. వాళ్ళు నన్ను అడగలేదు.

ఈ చేదు వార్తల నడుమ తీపి వార్త ఏమిటంటే నేను రాసిన జీవితం జాతకం కథలు కన్నడలోకి అనువాదితమవుతున్నాయి. ఇథ్థాన అనే పత్రికలో గతంలో నా అసిధార ప్రచురితమయింది. ఆ పత్రికవారే ఈ కథలను వరుసగా ఏప్రిల్ నెల నుంచీ ముద్రిస్తున్నారు. అంతేకాదు, పత్రికతో సహా రాయల్టీ కూడా పంపారు. ఆ కథను స్కాన్ చేసి పెడతాను. కన్నడ వచ్చిన వారు చదవటానికి వీలుగా.
అందుకే ఈ ఉగాది ఎంతో చేదుగా, కొంత తీపితో ఆరంభమయింది.

April 13, 2013 · Kasturi Murali Krishna · No Comments
Posted in: వ్యక్తిగతం

అనువాదాలంటే భయమెందుకంటున్న సగటుమనిషి.

ఇది ఇవాళ్టి ఆంధ్రప్రభ ఎడిట్ పేజీలో ప్రచురితమయింది.

April 5, 2013 · Kasturi Murali Krishna · No Comments
Posted in: సగటుమనిషి స్వగతం.