Archive for January, 2014

చిత్ర మాస పత్రికలో ముస్సోలిని నవల ప్రచురితమయింది

చిత్ర మాస పత్రికలో ముస్సోలిని నవల ప్రచురితమయింది.తెలుగులో రెండవ ప్రపంచ యుద్ధం కేంద్రంగా సృజించిన తొలి నవల ఇది. చదివి మీ అభిప్రాయాన్ని తెలపండి

.

January 30, 2014 · Kasturi Murali Krishna · No Comments
Posted in: నా రచనలు.

ముస్సోలిని జీవిత చరిత్ర నవల రూపంలో…

తెలుగులో భయానక కథలు తొలిసారిగా రాసింది..నేనే.

తెలుగులో జోతిష శాస్త్రాన్ని పెర్సొనాలిటీ దెవెలప్ మెంట్, పాసిటివ్ థింకింగ్ కు ఎలా వాడుకోవచ్చో కథల రూపంలో తొలిసారిగా రాసింది……..నేనే.

తెలుగులో, కళణుడి రాజతరంగిణిలోని రాజవంశావళి మొత్తం ప్రతిబింబించేట్టు తొలి సారిగా కథలు రాసింది…నేనే.

మైకెల్ జాక్సన్ మరణం తరువాత అతని జీవిత చరిత్ర ప్రథమంగా ప్రచురితమయింది తెలుగులోనే…అది రాసింది….నేనే.

రోషనారా జీవిత చరిత్రను చారిత్రక ఆధారాలతో, సత్యానికి దగ్గరగా వుంచుతూ రచించిన ఏకైక తెలుగు నవల రాసింది….నేనే.

వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులూ, భగవద్గీత, సుమతి, భాస్కర శతకాలతో సహా ఇతర ప్రాచీన వాఙయం ఆధారంగా భారతీయ వ్యక్తిత్వ వికాసాన్ని నిర్వచించి నిరూపించినది తెలుగులో తొలిసారిగా…నేనే…

ఇంకా ఇలాంటి వెన్నో వున్న నా నేనేలకు మరో కొత్త నేనే జోడిస్తున్నాను.

రెండవ ప్రపంచం యుద్ధాం ఆధారంగా, అప్పటి యూరొపియన్ నాయకుడి జీవితాన్ని నవలికలా తెలుగులో తొలిసారిగా రచించిందీ ……నేనే..(ఇంకెవరయినా నా కన్నా ముందే ముస్సోలిని జీవితాన్ని తెలుగులో నవల రూపంలో రచించారని నిరూపిస్తే..నేనే ను నేను కాదుగా మారుస్తాను.)

ఇటలీ నియంత, ముస్సోలిని జీవితాన్ని నవల రూపంలో రచించాను. అది ఫిబ్రవరీ నెల చిత్ర మాసపత్రికలో అనుబంధ నవలికగా ప్రచురితమవుతోంది.నవల చదివి మీ అభిప్రాయాన్ని తెలపండి.

చిత్ర మాస పత్రిక అడ్రెసు..డోర్ నంబర్; 40-26-7, శ్రీ సై బృందావనం, 4వ అంతస్తు, చంచ్రమౌళీపురం, శ్రీ రామ నగర్ కాలనీ, విజయవాడ-10–ఫోను; 0866-2479944.

January 28, 2014 · Kasturi Murali Krishna · One Comment
Posted in: నా రచనలు.

షంకర్ జైకిషన్ అభిమానులకు ఒక గొప్ప అవకాశం. .

షనక్ర్ జైకిషన్ అభిమానులకు ఒక గొప్ప వార్త..ప్రపంచ వ్యాప్తంగా వున్న శంకర్ జైకిషన్ అభిమానులందరూ ఒకే వేదికపై కలిసే అత్యద్భుతమయిన చారిత్రాత్మక కార్యక్రమం థరంగా మీడియాలో ఈరోజు, సాయంత్రం 6 గంటలనుండి రాత్రి 10 గంటలవరకూ జరుగుతుంది.

ప్రపంచం నలుమూలల వున్న సంగీతాభిమానులు ఈ వేదికపై తమ అనుభవాలను, అభిప్రాయాలను, శంకర్ జైకిషన్ సంగీతం పై తమ అనురాగాన్ని ఈ కార్యక్రమంలో ప్రకటిస్తారు.

ఈ కార్యక్రమంలో భాగం పంచుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా వున్న సంగీతాభిమానులందరికీ ఇదే ఆహ్వానం.

ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు, రాత్రి 7 గంటల నుండి 10 గంటల వరకూ..040-66778406, 040-66778403 కు ఫోను చేయవచ్చు.

స్కైప్ ద్వారా మాట్లాడాలనుకునేవారు, hindi.tharanga లో లాగిన్ అవవచ్చు.

ఫోను ఎంగేజ్ వస్తూన్నా, స్కైప్ కనెక్షన్ దొరకకున్నా, థరంగమీడియా ఫేస్ బుక్ పేజీలో మీ అభిప్రాయాన్ని వ్యక్త పరిస్తే దాన్ని చదివి అందరికీ వినిపించేందుకు రేడియో జాకీలు సిద్ధంగా వుంటారు.

ఇంక ఆలస్యం దేనికి, మీ సంగీతాభిమానాన్ని ప్రకటించండి. ఈ మహత్తర కార్యక్రమంలో పాలుపంచుకోండి.

January 26, 2014 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

చరిత్రపుటల్లోంచి వార్త ఆదివారం అనుబంధంలో…

గ్రీకు, రోమన్ నాగరికతలు వర్ధిల్లుతున్న సమయంలో అనాగరిక తెగలుగా భావించే సెల్టిక్ తెగలు నాగరీకుల తలదన్నే రీతిలో కోట నిర్మించారని తెలిసింద్. వారు కోటలు ఎలా నిర్మించారు, అందుకు దారి తీసిన పరిస్థితులు, సెల్టిక్ తెగల జీవన విధానాలు తెలిపే కథ ఈ ఆదివారం వార్త దినపత్రిక అనుబంధంలో, చరిత్ర పుటల్లోంచి, శీర్షికలో చదవండి.

January 26, 2014 · Kasturi Murali Krishna · No Comments
Posted in: నా రచనలు.

పాడుతా తీయగా పుస్తకం తయారయిపోతోంది.

నా పుస్తకం పాడుతా తీయగా ప్రచురణ చివరి దశకు చేరుకుంటోంది. ఒక్క ముందుమాట తప్ప ఇతర రాతలపనులయి పోయాయి. నా పుస్తకాలకు ముందుమాట నేనే రాసుకుంటాను కాబట్తి అదో పెద్ద పని కాదు.

అయితే, ఇప్పుడిక పేజ్ మేకప్ చేయటం వుంది. 350పేజీల పుస్తకాన్ని వీలయినన్ని పేజీలు తగ్గించే ప్రయత్నంలో వున్నాను.

ఈ పుస్తకంలో మొత్తం, 14 మంది గేయ రచయితలు, 30 సంగీత దర్శకులు, 19 గాయనీ గాయకుల కళ విశ్లేషణలున్నాయి.

గేయ రచయితలు;

నీరజ్, కైఫి ఆజ్మీ, ఆనంద్ బక్షీ, ప్రదీప్, మజ్రూహ్, కేదార్ శర్మ, ఇందీవర్, రాజేంద్ర కిషన్, భరత్ వ్యాస్, సాహిర్, శైలేంద్ర, గుల్జార్, హస్రత్, డీ ఎన్ మధోక్..

సంగీత దర్శకులు;

సీ రామ చంద్ర, లక్ష్మీ ప్యారె, రోషన్, పంకజ్ మల్లిక్, ఓ పీ నయ్యర్, ఖయ్యం, ఎస్ డీ బర్మన్, అనిల్ బిశ్వాస్, మదన్ మోహన్, నౌషాద్, సజ్జాద్ హుస్సైన్, ఆర్ డీ బర్మన్, శంకర్ జైకిషన్, రవి, హేమంత్ కుమార్, కళ్యాణ్ జీ ఆనంద్ జీ, వసంత్ దేశై, సలిల్ చౌధరి, ఉష ఖన్నా, జయదేవ్, సరస్వతీ దేవి, ఖేం చంద్ ప్రకాష్, ఎస్ ఎన్ త్రిపాఠీ, సీ అర్జున్, ఇక్బాల్ ఖురేషీ, సర్దార్ మాలిక్, గులాం ముహమ్మద్, ఎన్ దత్తా, చిత్ర గుప్తా, హుస్నులాల్ భగత్ రాం..

గాయనీగాయకులు;

కిషోర్ కుమార్, నూర్జహాన్, శారద, సుమన్ కళ్యాణ్ పుర్, గీతాదత్, సైగల్, సురయ్యా, తలత్ మహమూద్, ముకేష్, షమ్షాద్ బేగం, రఫీ, మన్నాడే, ఆశా, మహేంద్ర కపూర్, సుధ మళోత్ర, జగజీత్ కౌర్, ముబారక్ బేగం, కమల్ బారోత్, లతా….

ఇంకా వీరిని ఒక పద్ధతిలో అమర్చాలి..ఫోటోలు పెట్టాలి.

మిగతా వివరాలు త్వరలో…

January 24, 2014 · Kasturi Murali Krishna · One Comment
Posted in: నా రచనలు.