Archive for March, 2014

ఈరోజు వార్త ఆదివారం అనుబంధంలో, చరిత్ర పుటల్లోంచి చదవండి.

క్రీస్తు పూర్వం 3500 ప్రాంతంలో ఆ నాగరికతకు లిపి ఇంకా సంపూర్ణంగా ఆవిర్భవించలేదు. వారి భాష కూడా సరిగా ఆవిష్కృతం కాలేదు. కానీ, వారు లెక్కించే విధానాన్నే కాదు, ఆధునిక నాగరికతలోని ధ్రువీకరణ పత్రాలు, డాక్యుమెంట్ల పద్ధతికి నాందీప్రస్తావన చేశారు. ఇదెలా సాధ్యమయిందో ఊహాత్మకంగా వివరించే హిస్టారికల్ ఫిక్షన్ కథ ను ఈరోజు వార్త ఆదివారం అనుబంధంలో, చరిత్ర పుటల్లోంచి శీర్షికలో చదవండి.

March 23, 2014 · Kasturi Murali Krishna · No Comments
Posted in: నా రచనలు.

ఆధునిక నరకాసురుల క్రైం కథ, నవ్య వార పత్రికలో…

ఇటీవలె ఒక సభలో నేను ఆంధ్రజ్యోతి దిన పత్రిక ఎడిటర్ కే శ్రీనివాస్ ఒకే వేదిక పైన కలిశాము. మాటల సందర్భంలో ఆయన, నవ్య పత్రిక రాగానే నేను ముందుగా మీ క్రైం కథ చదివుతాను అన్నారు.

వెంటనే నేను, ఈ విషయం నవ్య ఎడిటర్ జగన్నాథ శర్మ గారికి చెప్తే నేనూ సంతోశిస్తానన్నాను. అభ్యంతరం లేకపోతే ఈ విషయం, ఫేస్ బుక్ లోనూ, నా బ్లాగులోనూ పెడతానన్నాను.

ఆయన సరే అన్నారు.

అదీ కథ.

రేపు విడుదలయ్యే నవ్య వార పత్రికలో, సైబర్ క్రైం కథ వుంటుంది. ఆధునిక నరకాసురుల కథ అది. చదవండి.

March 18, 2014 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized, నా రచనలు.

వడ్డి ఓం ప్రకాష్ నారాయణ సృజనస్వరం, ఈరోజు, రాత్రి 8.30నిలకు థరంగా మీడియాలో.

ఈరోజు కథా రచయిత జర్నలిస్టు వడ్ది ఓం ప్రకాష్ నారయణ తన సృజనస్వరాన్ని, రాత్రి 8.30నిలకు థరంగామీడియాలో ప్రసారమయ్యే సృజనస్వరం కార్యక్రమంలో వినిపిస్తారు.

వడ్డి ఓం ప్రకాష్ నారయణ మంచి మనసున్న కథకుడు. తానేదే గొప్ప కథలు రాసేస్తానన్న అపోహలు ఏవీ లేని డౌన్ టు ఎర్త్ కథకుడు. కానీ, తాను మనసు కదిలించే మంచి కథలు రాస్తానన్న విశ్వాసం వున్న మంచి కథకుడు.

ఇతర జర్నలిస్టు కథకులకు భిన్నంగా తనకు కానీ, తన కథలకు కానీ, అనవసర ప్రచారమిచ్చుకుని, అనవసరపు ఆర్భాటాలేవీ చేయని, అవార్డుల మీద అవార్డులిప్పించుకుంటూ తనని మించిన వారెవరూ లేరన్నట్తు ప్రవర్తించే అవర్డాసుర జర్నలిస్టు కథకులకు పూర్తిగా భిన్నమయిన సహృదయుడయిన జర్నలిస్టు కథకుడు. తన కథనెవరయినా పొగిడితే, నిజంగా తన కథ నచ్చి పొగడుతున్నారా? తాను జర్నలిస్టు కాబట్టి తనను పొగదుతున్నారా? అని అలోచించే విచక్షణ చూపే ఉత్తముడు ఓం ప్రకాష్. నిజానికి జర్నలిస్టు కథకులంతా ఓం ప్రకాష్ సృజనస్వరం విని ఆత్మ విమర్శ చేసుకుని, కథా ప్రపంచంపై కథకులందరికీ హక్కుందని గ్రహించి, తమ కళ్ళకున్న ఆధిక్యపు పొరలను కరగించుకుని, సాటి రచయితలనూ రచయితలుగా గౌరవించటం నేర్చుకోగలరనిపిస్తుంది. తాము మెచ్చే వారు, తాము చదివిన కొద్దిపాతి విదేశీ రచయితలు తప్ప ఇతర రచయితలవైపు కన్నెత్తి చూడటమే తమ గౌరవానికి భంగం అన్నట్తు ప్రవర్తించే అహంకారపు ఊబిలో కూరుకున్న అంధ జర్నలిస్తు కథకులూ తప్పకుండా వినాలి ఓం ప్రకాష్ సృజనస్వరం. ఇక సాహిత్య పిపాసులు, కథకులు, కథలు రాయాలన్న ఉత్సాహం వున్న వారూ విని ఆనందించండి, వడ్డి ఓం ప్రకాష్ నారాయణ సృజనస్వరం, ఈరోజు, రాత్రి 8.30నిలకు థరంగా మీడియాలో.

March 15, 2014 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized