Archive for May, 2017

25ఏళ్ళ తెలుగు ఉత్తమ కథ విశ్లేషణ-18(4)

25ఏళ్ళ ఉత్తమ తెలుగు కథల సంకలనాల్లో ఎంపికయిన చివరి ఖదీర్ బాబు కథ( ఇంతవరకూ) గెత్ పబ్లిష్ద్. ఇది 2010లో ఉత్తమ కథలలో ఒకటిగా ఎంపికయింది. కనబదుతున్నదంతా నిజం కాదు. కనబడనిదంతా లేకుందా పోదు. ఈ కనబడీ కనబడకపోవతంలో నిజానిజాలను దర్శించటం వ్యక్తి దృష్టి మీద ఆధారపడివుంటుంది. ఒకరికి కనిపించినది మరొకరికి కనిపించకపోవచ్చు. ఆ కనిపించేది కూడా అందరిలో ఒకే రకమయిన భావనను కలిగించకపోవచ్చు. అంటే ప్రపంచంలో ప్రతీదీ సాపేక్షమే…..ఏ రిఫరెన్స్ పయింట్ నుంచి మనం చూస్తున్నామన్నదానిమీద మనం గ్రహించే సత్యం ఆధారపడివుంటుంది. అదీగాక, పది మంది ఒక ఆబద్ధాన్ని సత్యంగా పదే పదే అంటూంటే ఆ అబద్ధమే సత్యమని భ్రమపడే వీలూవుంటుంది. మైనారిటీ పొలిటికల్లీ కరెక్ట్ కథలు, ఒక వైపు నుంచి చూసే దృష్టికి, మరో వైపునుంచి ఒకే అబద్ధాన్ని పదే పదే ప్రచారంచేసి నిజమన్న భ్రమ కలిగించటానికి చక్కని నిదర్శనాలు. గెట్ పబ్లిష్డ్ అలాంటి మైనారిటీ పొలిటికల్లీ కరెక్ట్ కథ.
కథా రచన పరంగా చూస్తే, ఈ కథ ఖదీర్ ఇతర రచనలకు భిన్నంగా అనిపించినా, తాను నమలగలదానికన్నా ఎక్కువ కొరికి నమలాలని ప్రయత్నించాడీ కథలో అని కాస్త చదవగానే అర్ధమవుతుంది. ఖదీర్ తనకలవాటయిన పద్ధతికి భిన్నమయిన పద్ధతిలో ఈ కథ రాయాలని ప్రయత్నించాడు. ఒక వార్త…దానివెనుక ఉన్న అసలు కథలను చెప్తూ..ఈ వార్తలను కథలను పూసలు గుచ్చినట్టు ఒక మాలగా గుచ్చాలని, తద్వారా దేశంలో ముస్లిం మైనారిటీలపై జరుగుతున్న ప్రభుత్వ/పోలీసుల జులుం ప్రదర్శించాలనీ రచయిత ప్రయత్నించాడు. కానీ, ఆకట్టుకునే రీతిలో, మనసును కదిలించే రీతిలో కథను చెప్పటంలో రచయిత సంపూర్ణంగా విఫలమయ్యాడు. ముఖ్యంగా ఆయన ఏయే పాత్రలకు అన్యాయం జరిగిందని చూపిస్తూ పాఠకుల మనస్సులను కరిగించాలని ప్రయత్నించాదో ఆ పాత్రలే సరిగ్గా ఎదగక, కథ మొత్తం ఊహకు అందేరీతిలో సాగి ఇదొక డాక్యి కథలా, ప్రచార కథలా తయారయింది. మామూలుగా ఖదీర్ ఎంత అలసత్వంతో రచించినా(మెట్రో కథల్లాగా), ఎంత చులకన భావంతో రచించినా(బియాండ్ కాఫీ కథల్లాగా), ఆయా కథలలో చదివించేగుణంలో మాత్రం ఎలాంటి లోపం వుండదు. ఈ కథలో ఆ గుణం లోపించింది.

కథ ఆరంభంలోనే రచయిత తెలిసో తెలియకో ముసల్మానులంతా ఒకటని, వారు ఇతరులను మరో రకంగా చూస్తారనీ చెప్పకనే చెప్పాడు. మసీదుకు వెళ్ళే తొందరలో, బేరమాడుతున్న ఆటో డ్రైవర్తో రచయిత….అరె…నేను కూడా ముసల్మాన్ నే నయ్యా…అంటాడు. అప్పుడు డ్రైవర్…ఆప్ వైసా నై దిఖ్తే…ఎక్కండి ….అంటాడు…
ఇదే సంభాషణ…ఇతర, మతాలవారి మధ్య జరిగినట్టు కథరాస్తే, ఈ పాటికి లౌకికవాద శిబిరాలన్నీ ఆగ్రహాగ్నిజ్వాలల్లో మల మల మాడిపోయివుండేవి.
ఇది వదలి ఇంకో అడుగు ముందుకు వేస్తే….
షకీల్ మసీదుకు వెళ్తాడు. అక్కడ ముష్తాక్ పరిచయం అని ముష్తాక్ గురించి చెప్తడు. ముష్తాక్ చెప్పులకు కాపలా డబ్బులు వసూలుచేస్తాడు. దో రుపయ్యా అదుగుతాడు. పాంచ్ రుపయ్యా ఇస్తే నవ్వుతాడు.

ఇదే ముష్తాక్ గురించి కాస్సేపటి తరువాత వర్ణన మారిపోతుంది. దో రుపయ్యా అని దబాయించే ముష్తాక్…మందుల చీటీ చూపించి తన వారు బీమార్గా వున్నారని దీనంగా బ్రతిమిలాడి డబ్బులు వసూలు చేస్తాడు. దో రుపయ్యా అని దబాయించే ముష్తాక్,,,,, బీమార్ అని బ్రతిమిలాడే ముష్తాక్ ఒకరే…..!!! బహుషా..ముష్తాక్ పాత్ర చలాకీ తనాన్ని చిత్రించటంలో రచయిత ముందటి వర్ణనను మరచిపోయారేమే!!!! లేక, అక్కడ అంతే అవసరం, ఇక్కడ ఇంతే అవసరం అనుకున్నారేమో!!! ఎందుకంటే కథ చివరలో రచయితకు మళ్ళీ దో రుపయ్యా దబాయింపే గుర్తుకువస్తుంది కానీ, బీమార్ అంటూ బ్రతిమిలాడే ముష్తాక్ గుర్తుకురాడు. ఈ రెందో సారి వర్ణన కథ నిడివిని పెంచింది తప్ప కథకు ఏమాత్రం పనికిరాదు. అది తొలగించినా కథనానికి , కథకు నష్టం లేదు.
ఒక కథ ఎలావుండాలంటే, దాన్లోంచి ఒక పదం తీసినా కథలో అసంపూర్ణమన్న భావన కలగాలి. అలాకాక, ఎంత తీసిన ఏమీ లోపంలేదనిపిస్తే….అది కథకుడి రచనలోపం…అంటే, ఈ కథలో ఒకే వ్యక్తి గురించి రెండు పరస్పర విభిన్నమయిన వర్ణనలొస్తాయన్నమాట….
ఈ కథలో మరో రెండు ప్రధాన పాత్రలు ఫాతిమా, నయాబ్….ఫాతిమా వర్ణన మొదటి సారి ఒకరకంగా వుంటుంది. చదివితే….తరువాత కథలో వచ్చే ఫాతిమా వేరు ఈమె వేరు అనిపిస్తుంది. ఈ ఫాతిమా, ప్రతి శుక్రవారం, చెప్పులు పెట్టుకుని అలా వచ్చే చిల్లర డబ్బులకోస, పాతబస్తీ నుంచి ఎంతో దూరం నడిచి వస్తుంది. అలా వచ్చి, నమాజ్ అయ్యేవరకూ, కొదుకుని ఆడుకోటానికి వదలుతుంది. కానీ, కాస్త కథ చదివిన తరువాత ఆమె కొడుకు ముష్తాక్ అని తెలుస్తుంది. ఎందుకంటే, ముష్తాక్ కు తండ్రి నయీబ్ అంటే ప్రేమ. అతడిని పోలీసులు పట్టుకెళ్ళే సమయంలో ముష్తాక్ ను ఆమె బేటా ముష్తాక్ అని పిలుస్తుంది. ముష్తాక్ ఆమె కొడుకయినప్పుడు, మరి ఏ కొడుకుని ఆడుకోటానికి వదిలింది? ఆ కొడుకు ముష్తాక్ ఒకరే అయితే, ముష్తాక్ ఆబద్ధాలు చెప్పి బిచ్చమదుగుతున్నాడని, దబాయించి రెండు రూపాయలు తీసుకుంటున్నాడనీ ఆమెకు తెలియదా? అలాంటప్పుడు రచయిత, ఆమె కొదుకుని మసీదులో అడుక్కోవటానికి వదలి అని రాయాలి గానీ, ఆడుకోవటానికి వదలి అని రాస్తే, అది అయోమయాన్ని కలిగ్స్తుంది. లేక, ఈ ఆడే కొడుకు వేరే అనుకోవాలి. అలాంటప్పుడు, ఆ రాత్రి పోలీసులు నయీబ్ ని పట్టుకెళ్లే రాత్రి ముష్తాక్ మంచంక్రింద దూరితే ఈ పిల్లవాడు ఎక్కడపోయాడ్? ఇతడి ప్రసక్తి రాకపోవటంతో ముష్తాక్ ఒక్కడే కొడుకు అనుకోవాలి. కానీ, ముష్తాక్ ఒక్కడే కొడుకు అయితే, అతదిని మసీదులో వాళ్ళమ్మ ఆడుకోవటానికి వదిలిందని రాయటం తప్పు. పైగా, ఈ వర్ణనలో..ఆమె చెప్పుల కాపలా సంపాదన సరిపోదనీ పేద రికాన్ని వర్ణ్సితాడు రచయిత….ముష్తాక్ ఆమె కొడుకయితే..పదో పరకో అతడి సంపాదనా అందాలికదా..పైగా..అతడిలో ఏదో మాజిక్ వుందని డబ్బులివ్వకుండా వుండలేరనీ రచయితే వర్ణించాడు. ఫాతిమా ఆర్ధిక స్థితి గురించి చెప్పేటప్పుడు ముష్తాక్ ప్రసక్తి తేకపోవటం కూడా ఒక లోపం….ఎందుకంటే..ఆమె కంటే తానే ఎక్కువ వసూలు చేస్తానని అనుకుంటాడా పిల్లవాడు కాబట్టి అతని సంపాదన ప్రసక్తి రావటం తప్పనిసరి. అయితే, ముస్లీం దంపతులకు ఒకడే కొడుకు అనుకోవటమూ కష్టమే..కాబట్టి, రచయిత రాసి , వెనుక ఏమి రాశాడో చూసుకోకుండా, ముందుకు సాగి మళ్ళీ తోచింది రాశాడేమో అనుకోవాలి. లేకపోతే, రచయిత కథ చెప్పే కొత్త టెక్నిక్ ఇది. ఎలాగయితే, సినిమాలో కెమేరా….తాను చూపించదలచుకుందే చూపించి, హఠాత్తుగా, కమేరాను దూరం కదిలించి, అంతవరకూ చూపనివి చూపినట్టు, రచయిత, ఎక్కడ ఏది ఎంత అవసరమో అంతే చెప్పాడు తప్ప…దాన్లో లాజిక్కులు, లేనిపోని అర్ధాలు తీయవద్దంటే…..సరే కానీయ్ అని ముందుకు సాగచ్చు.

ఇక నయాబ్ కథకు వస్తే…అతని కథలో inconsistancies, contradictions తక్కువ. ఈ ముగ్గురి కథనూ …గోకుల్ చాత్ భండార్లో జరిగిన పేలుళ్లతో ముదిపెడతాడు రచయిత…గుల్బర్గా దర్గాకు వెళ్లివచ్చిన నయీబ్ను రాత్రి ఇంత్లో అన్నం తింతూంటే పోలీసులు వచ్చి పట్తుకెళ్తారు. అది చూసి ముష్తాక్ కు జ్వరం వస్తుంది. తండ్రిని చూడకుండా వుండలేకపోతాడు ముష్తాక్…తండ్రి తిరిగివచ్చినా, పిల్లవాడి మానసిక భయాందోళనలు, తండ్రి మానసివ గాయాలు మానవు. చివరికి ప్రభుత్వ సహాయమూ, మన జర్నలిస్టు సహాయమూ వద్దని వాళ్ళు ఎటో వెళ్ళిపోతారు. మన రచయిత ఇంకా మసీదుకు వెళ్ళి దూఅ చేస్తూంటాడు. అయితే, అతనికి ముష్తాక్ గుర్తొస్తూనేవుంటాడు…

ఈ కథలో మధ్యలో బాత్ల హౌస్ ప్రసక్తి వస్తుంది. లౌకికవాదుల్లాగే రచయిత అదంతా బూటకమన్న రీతిలో రాస్తాడు. తరువాత ముంబాయ్ దాడి ప్రసక్తి వస్తుంది. అప్పుదు మన కథకుదికి ముష్తాక్ గుర్తుకువస్తాడు.
ఈ కథ చదువుతూంటే ఒక రకమయిన శూన్య భావన కలుగుతుంది. ఎందుకని తెలివయిన వారూ, చక్కని ఆలోచనా పరులుకూడా, నలుగురితో పాటూ నారాయణా అన్నట్టు ఒకే విషయాన్ని ప్రచారం చేస్తూ కథలు రాస్తున్నారు? కనీసం తమ కథలు, ఈ దేశంలో ముస్లీములు అన్యాయమవుతున్నారు కాబట్టి తీవ్రవాదుల్లో చేరండని పాకిస్తానీ ప్రేరేపిత తీవ్రవాద సంస్థలు చేస్తున్న ప్రచారానికి సమర్ధననిచ్చే రీతిలో తమ కథలు, వాదనలు వుంటున్నాయన్న కనీసపుటాలోచనకూడా లేకుండా ఇలా ఎందుకు రాస్తున్నారు? అన్న ఆలోచన మదిని తొలిచేస్తుంది.
ప్రతి మైనారిటీ పొలిటికల్లీ కరెక్ట్ కథలో అమాయక ముస్లీములను పోలీసులు అక్రమంగా, అన్యాయంగా హింసిస్తున్నట్టు చూపుతారు. ఏ ఒక్క కథలోనయినా, తీవ్రవాద దాడుల్లో అనాథలయిన అభాగ్య ముస్లీముల జీవితాలు, వికలాంగులయిన నిర్భాగ్యుల కష్టాలు కనిపిస్తాయా? ఏ మైనారిటీ రచయిత కథలోనయినా, అమాయకులపై అమానుషంగా జిహాద్ పేరిట దాడులు చేస్తున్న ఇస్లాం తీవ్రవాద ఖండన కనిపిస్తుందా? ఏ మైనారిటీ రచయిత కథలోనయినా, ముస్లీంలు అధికంగా వుండే స్థలాలలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయుల ప్రస్తావన వస్తుందా? వారు దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని తెలిసికూడా తమ పిల్లలనిచ్చి పెళ్లిళ్లు చేసి దొంగ ధ్రువీకరణ పత్రాలు చూపి వారిని భారతీయ పౌరులుగా చలామణీ చేస్తూ పరోక్షంగా తీవ్రవాదానికి దోహదం చేసే ముస్లీం కుతుంబాల కథలు వస్తాయా? మలాలాను ఆదర్శం చేసి ఏ ఒక్కరయినా కథ రాశారా? ట్రిపుల్ తలాక్ గురించి ఏవీ కథలు? ప్రతి తీవ్రవాదీ ముస్లీం అవుతున్న తరునంలో, ముస్లీంల మనస్సుల్లో జరుగుతున్న సంఘర్షణలేవీ కథల్లో?
హిందు సమాజంలో కనిపిస్తున్న సంకుచితత్వాన్ని విమర్శిస్తూ బోలెడన్ని కథలు వస్తున్నాయి. నిజానికి ఒక దర్గా, ఒక మసీదు వద్ద బాంబులు పేలాయి. కానీ, ప్రధాన హిందూ మందిరాలన్నీ తీవ్రవాద దాదులకు కేంద్రాలయ్యాయి. తుపాకుల నీడల్లో దైవ దర్శనం చేసుకోవాల్సిన పరిస్థితి…అమర్నాథ్ యాత్ర ప్రతిసారీ ఒక యుద్ధమే…అయినా, ఈ పరిస్థిని వర్ణిస్తూ కథలేవి? తీవ్రవాద దాడులవల్ల అనుమానాలకుగురవుతూ, వ్యాపారాలు దెబ్బతింటున్న కాష్మీరీ ప్రజల కడగళ్ళేవే కథల్లో? ఎంతసేపూ..పోలీసులు అన్యాయంగా అరెస్త్ చేసి అమాయక ముస్లీములను బాధిస్తున్నారంటూ కథలు రాసి అవార్డులు కొట్టేయటమే తప్ప, సమాజంలో నెలకొని వున్న పరిస్థితులను వివరించేవీ, ప్రదర్సించేవీ కథలేవి?
ప్రతి అరెస్తూ అమాయకుదిని వేధించటమేనన్నట్టు చూపుతారీ మైనారిటీ లౌకిక పొలిటికల్లీ కరెక్ట్ కథకులు….
రిజర్వేషన్ ఆఫీసులో కొన్ని సంవత్సారక్రితం టిఫిన్ బాంబు పేలింది. పోలీసులు ఆరోజు డ్యూటీలో వున్న ప్రతివారినీ ప్రశ్నించారు. గ్రిల్ చేశారు. ఆడ మగ, హిందూ ముస్లీం అని చూడలేదు. అందరూ అనుమానితులే..ద్యోతీ లేకున్న ఆసమయంలో అక్కడున్న వారిని మరింతగా ప్రశ్నించారు. ఈ అనుమానానికీ, కులం మతం లేదు. కాంటీన్ నుందీ టే తెచ్చి అమ్మే వ్యక్తి ఆ సమయంలో అక్కడున్నాడు. అతడు ముస్లీం కాదు. కానీ, అతడక్కడెందుకున్నాడని పోలీసులు అరెస్ట్ చేసి కుళ్ళబొడిచారతడిని. చివరికి ఆఫీసర్లు ఎంతో కష్టపదితేకానీ అతడు విడుదల కాలేదు. అతడు ముస్లీం కాదు.
పోలీసుల పని అనుమానించటం..దానికి కులం, మతం, ప్రాంతంతో సంబంధంలేదు…కానీ, మైనారిటీ పొలితికల్లీ కరెక్ట్ కథకుల కథల్లో మాత్రం పోలీసులు ముస్లీములనే అనుమానంగా చూసి అన్యాయం చేస్తారు. తీవ్రవాదులంతా ముస్లీం బస్తీల్లోంచి వస్తూంటే, వారికి అక్కడే ఆశ్రయం లభిస్తూంటే, అనుమానంగా చూడక, పూలదండలు వేసి చంపండి నాయనా..అప్పుడు మీరు తీవ్రవాదులని అరెస్తు చేస్తామంటారా? అప్పుడూ వారు అమాయకులే అని మళ్ళీ ప్రదర్శనలు…
ఇక కథ పేరు దగ్గరకొస్తే..గెట్ పబ్లిష్డ్…అన్నది ఏరకంగానూ కథకు సరిపోని పేరు…..
రిపోర్ట్ పబ్లిష్ అవుతుందని నమ్మకమేమిటి? అన్న ప్రశ్నతో కథ ఆరంభమయితే, ఒక జర్నలిస్ట్ ఇచ్చిన రిపోర్ట్ పబ్లిష్ కాని కథేమో అనుకుంటాం…కానీ అలాంటిదేమీ లేదు…రిపోర్టులు పబ్లిష్ అవుతాయి. ఇంచార్జ్ సహృదయంతో స్పందిస్తాడు..రచయిత ఒక సందర్భంలో …తెలుగు సంగతి పక్కనపెట్టు కనీసం ఇంగీష్ మెయిన్ స్ట్రేం పత్రికలోనయినా ఇలాంటివి పబ్లిష్ అవటం చూశావా నువ్వు? అంతుందో పాత్ర..
ఒక జర్నలిస్టు రచయిత రాసిన కథలో ఇలాంటి సంభాషణ రావటం హిపోక్రసీకి పరాకష్ట!!!!
గుజరాత్ అల్లర్లు అందరికీ గుర్తున్నాయి..గోధ్రలో రైలులో కాలిన శవాలెందరికి గుర్తున్నాయి? ఎన్ని పత్రికలు దాని గురించి కథనాలు ప్రచురిస్తాయి? ఎందరు కవులు, ఎందరు కథకులు దాని గురించి కథలు కవిత్వాలు రాశారు? గుజరాత్ అల్లర్లలో చేతులు జోడించి ఏడుస్తున్న ముస్లీం వ్యక్తి బొమ్మ విదేశాల్లోనూ పాపులర్… అలా బ్రతిమిలాడుతూన్న ఒక్క మరో మతం వ్యక్తి ఫోతో వుందా? తీవ్రవాదుల దాడుల్లో గాయపడ్డ వారి కథలు, ప్రాణాలు కోల్పోయినవారి కుతుంబాల కథలూ ఎక్కడయినా వున్నాయా? అడవుల్లో తిరుగుతూ ప్రజల ఆస్తుల్ని ప్రాణాలను హరించే నక్సలైత్లను గ్లోరిఫై చేసే రచనలున్నాయి. మంచులో ఎండలో వానల్లో వరదల్లో దేశాన్ని రెప్పవాల్చకుండా కాపాడే సైనికులగురించిన కథలేవి? కాబట్టి ఇలాంటి కథనాలెక్కడయినా చూశావా? అన్న ప్రశ్నకి సమాధానం..ఇలాంటి కథలేచూశాను….నీకు కనబడకపోతే అది నీ దృష్టి దోషమయినా అయివుండాలి…లేక నీకు పత్రికలు చదివే అలవాటయినా లేకుండావుండివుండాలి…అంతే!!!!
ఇంతకీ కథ అంతా చదివిన తరువాత….రచయిత కథను ఒక యూనిట్ గా గుదిగుచ్చటంలోనూ విఫలమయ్యాడనిపిస్తుంది..
బాట్లా హౌస్ ప్రస్తావనకూ కథకూ సంబంధంలేదు…..కేవలం అది బూటకపు దాడి అని చెప్పటం తప్ప.
గోకుల్ చాట్ పేలుదు ప్రస్తావన అనవసరం..కేవలం….అమాయకులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని చెప్పటానికి తప్ప ఎందుకూ పనికిరాదా వార్త…
ముంబాయి పేలుళ్ళ ప్రసక్తిని నయీబ్ అరెస్టుతో ముదిపెట్టాలని రచయిత ప్రయత్నించాడు..కానీ, అతకలేదు..పోలీసులు గుడ్డిగా కనబడ్డవాదిని అరెస్టు చేయరు. అరెస్ట్ వెనుక ఏదో కారణం వుంతుంది..ఏదో అనుమానం వుంటుంది….
ఇలా తరచి చూస్తే, ఈ కథ ఒక అతుకుల బొంత అనీ, రచయిత…ఎప్పుడు ఏది గుర్తుకువస్తే అది రాసేశాడనీ అనిపిస్తుంది. అందుకే, కొన్ని కథల్లో పరిణతి చెందిన రచయితగా అనిపించిన ఖదీర్ ఈ కథలో కేవలం..అవార్ద్ కోసం తీసిన అవార్డ్ పిక్చర్ రచయితలా తోస్తాడు….
అంతే తప్ప, ఈ కథలో చదివించే గుణం లేదు..కదిలించే లక్షణం లేదు..అక్షరాలున్నాయి..వాతిలో జవం లేదు..జీవం లేదు…క్రిందనేల వుంది..నేలపై మట్తివుంది..మట్తిలో వానపాములున్నాయి..వానపాములు దేకుతాయి….అలావుందీ కథ
!!!!
వచ్చే వ్యాసంలో భగవంతం కథల విస్లేషణ వుంటుంది.

May 6, 2017 · Kasturi Murali Krishna · One Comment
Posted in: Uncategorized