బ్లాగరుల సలహా అవసరమీవిషయంలో!

ఈక్రింద, ఆదివారం సూర్య పత్రిక అనుబంధంలో నా అనుమతిలేకుండా, నా బ్లాగులోంచి, నా ఆత్మరంగిక ఆలోచనలను ప్రచురించారు. కనీసం, బ్లాగుపేరు చెప్పలేదు. న్నాపేరు వేయలేదు. కేవలం, మనసునవున్నదీ, అన్న శీర్శికన దీన్ని పచురించారు. అంతకన్నా అభ్యంతరం, ఈ ప్రచురించిన దానిలో కొందరు బ్లాగర్ల పేర్లున్నాయి. అసందర్భంగా చదివితే అపార్ధానికి తావుంది. ఈవిషయంలో ఎలాంటి చర్య తీసుకోవాలో బ్లాగరులు సూచించాలని మనవి. ఎందుకంటే, ఇప్పుడు మనము సరిగ్గా స్పందించకపోతే భవిష్యత్తులో మనము బ్లాగుకోసం రాసుకున్నవన్నీ, అనేక ఆంతరంగిక ఇషయాలతో సహా, మనకు తెలియకుండా, మన అనుమతిలేకుండా, మన పేరులేకుండా ప్రచురించేవీలుంది. అనవసర గొడవలకు వీలుకల్పిస్తుంది. కాబట్టి, ఈ విషయంలో ఆ పత్రికపై ఎలాంటి చర్యతీసుకోవాలో బ్లాగరులు సూచించాలి. నాకేరకంగా సహాయంచేయగలరో చెప్పాలి.

మరో ఆలోచన ఏమిటంటే, గొడవ చేసి దృష్టినాకర్శించటమా? మౌనంగా వుండటమా?

అలావుండిపోతే, రేపు, బ్లాగరులికరినొకరు వ్యక్తిగతంగా దూషించిన విషయాలూ బయటపడే వీలుంది. అది మరీ అసహ్యమవుతుంది. కాబట్టి, మీ సలహాను నిర్మొహమాటంగా చెప్పండి.

మీ అభిప్రాయాలకోసం ఎదురుచూస్తూ……. surya

Enter Your Mail Address

November 23, 2009 · Kasturi Murali Krishna · 15 Comments
Posted in: Uncategorized

15 Responses

 1. Ravi Chandra - November 24, 2009

  ఇది చాలా శోచనీయం. వార్తా పత్రికలు ఇంత దారుణంగా దిగజారిపోయాయా అనిపిస్తుంది. దీనిపై అధికారింగా ఎలా పిటిషన్ వెయ్యాలో నాకు తెలియదు. కానీ ఈ చర్య ఏ మాత్రం సమర్థనీయం కాదు.

 2. కొత్తపాళీ - November 24, 2009

  మీరు దీన్ని గురించి తీవ్రంగా ప్రొటెస్ట్ చెయ్యాల్సిందే.
  ఆ పత్రికతో మీకు వ్యక్తిగత పరిచయం ఉంటే, ప్రధాన సంపాదకుల పేరిట, పబ్లిషర్ పేరిట ప్రొటెస్ట్ చేస్తూ ఉత్తరాలు రాయండి. అదే ఉత్తరాన్ని ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతిలకి కూడా పంపండి.
  ఇది కనీస కార్యక్రమం.
  మీకున్న ఓపికని బట్టి లాయర్ నోటీసిప్పించడం వంటి ప్రతి చర్యలు కూడా చేబట్ట వచ్చు. హైఅదరాబాదులోనే ఉన్న ఇతర బ్లాగరులేమంటారో చూద్దాం.

 3. జ్యోతి - November 24, 2009

  ఇది నిజంగా వ్యతిరేకించవలసిన సమస్య. మీరు ముందు ఆ పత్రిక సంపాదకుడితో పోన్ చేసి మాట్లాడండి. ఇదే విషయం మిగతా పత్రికలకు పంపిస్తామని గట్టిగా చెప్పండి. తరవాత ఏంచేయాలో నిర్ణయించవచ్చు. కాని ఊరుకునేది లేదు..

 4. చక్రవర్తి - November 24, 2009

  నా దారైతే.. ముందు ఈ శీర్షికను నడిపేదెవ్వరో కనుక్కోండి. వీడ్ని ఓ నాలుగు తంతే, ఆ తరువాత వీనికి సహాయ పడిన వాడెవ్వడో వాడి వెనకాల ఉన్నదెవ్వరో తెలుస్తుంది.

  నా వంతు కర్తవ్యంగా నేను మొదటి రాయి వెయ్యగలవాడను. కాబట్టి మీరు ఎటువంటి చర్య తీసుకున్నా నేను ఉంటాను.

  ఇలా కాదు సౌమ్యంగా తేల్చుకుందాం అనుకున్నట్లైతే, ఇంకే పదండి ఆ పత్రికా కార్యాలయానికి. నేను వస్తా మీకు తోడుగా..

 5. సుజాత - November 24, 2009

  మీ బ్లాగులో మీరు రాసుకున్న వ్యక్తిగతానుభవాన్ని మీ అనుమతి లేకుండా, కనీసం బ్లాగు పేరు, మీ పేరు లేకుండా వాడుకోవడం ఎంతైనా గర్హనీయం!

  మీరు పత్రిక తో గట్టిగా వ్యవహరించవలసిందే!బ్లాగుల విషయంలో మరో పత్రిక ఇటువంటి సాహసాలకు తెగించకుండా ఉండేలా చూడాల్సిందే!

 6. చిలమకూరు విజయమోహన్ - November 24, 2009

  మీకెలాగూ పత్రికలతో సంబధాలున్నాయి కాబట్టి మీరు కాస్త ఘట్టిగా వ్యవహరించండి.

 7. పారదర్శి - November 24, 2009

  editpagesurya@gmail.com కు మీ నిరసన తెలియచేస్తూ ఒక జాబు రాయండి. ఎడిటర్ నుంచి మీకు జవాబు రాకపోతే, నేను ఎడిటర్ తో మాట్లాడగలను.

 8. tamilan - November 24, 2009

  జాబులు జవాబులు అవసరం లేదండి అదంతా లేట్ ప్రాసెస్ .నేరుగా ఎడిటర్ దగ్గరికి వెళ్లి గడ్డి పెట్టండి ”ఎవరు ఏది తీసుకొచ్చి ఇది నాదే అని చెప్పినా అచ్చు వేస్తావా ?” అని. అయినా రచయితలకి దైర్యం ఉండాలి మీకు ఈ విషయం తెలిసిన వెంటనే మీరు ఎడిటర్ తో మాట్లాడి ఉండాల్సింది తరువాత ఎలాగు విజయం మనదే కాబట్టి తరువాత ఈ విషయాన్ని మిగతా బ్లాగర్లతో పంచుకుంటే బాగుండేది. కాని మీరు ఇలా అందరిని సలహాలు అడిగి కాలాయాపన చేస్తున్నారు.

 9. శరత్ 'కాలం' - November 24, 2009

  ప్రొటెస్టు చేయవలసిందే. వారు పొరపాటున ఏమయినా మీకు క్రెడిట్స్ ఇవ్వడం మరిచారేమో లేక ఏ దశలోనన్నా అది మిస్సయిందేమో. ముందు సౌమ్యంగా కనుక్కుంటే బావుంటుంది. అలా అయినా వారు సవరణ వేయాల్సిందే. కావాలని చేస్తే క్షమాపణ పత్రికలో రావాల్సిందే.

  ఇలా నన్నా కాస్త తెలుగు బ్లాగులకి ప్రచారం, పనిలో పనిగా మీకూ మరింత ప్రచారం వస్తుంది. కానివ్వండి మాస్టారూ. వీలయితే టివి 9 మొదలయిన ఛానల్స్ కు కూడా రిపోర్ట్ చేయండి. కావాలని చేసిన తప్పు అయితే కేసు పెట్టడమే కాకుండా దానికి మాంఛి ప్రచారమూ కల్పించండి.

 10. nnmuralidhar - November 24, 2009

  ఈ విషయంలో గట్టిగా వ్యవహరించాల్సిందే లేకపొతే బ్లాగులన్నీ ఇక వారికి free source లా మారిపోతాయి.

 11. జవిక్ శాస్త్రి - November 24, 2009

  ఓస్ ఇంతేనా, దీనికే ఇంత అడావుడీ.. :)

  ఇలా బ్లాగ్ముఖంగా అడుగుతున్నారు అంటే కారణాలు ఇవే అని అనుకుంటున్నాను –

  1) మీరు మాడెష్టీ కలవారు అనిన్నీ
  2) మీరు గర్విష్టి కాదు అనిన్నీ
  3) మీరు సున్నిత మనస్కులు అనిన్నీ
  4) మీరు అసున్నిత మనస్కులు కాదు అనిన్నీ
  5) ఇంకా…అనిన్నీ…అనిన్నీ…అనిన్నీ…అనిన్నీ….

  ఇంతకీ మీరు చెయ్యవలసిన పనులు , మీకు సంప్రాప్తించవలసిన వరాలు ఇవీ
  1) సూర్య వాడి కార్యాలయానికి ఫోను చేసి – పైన మగానుబాగులు మీ బాగోగులు కోరి చెప్పినవి కనుక్కోవటం
  2) కనుక్కున్నాక సున్నిత మనస్కులు కాన మళ్ళీ బాధపడటం
  3) బాధపడ్డాక మళ్ళీ ఒక బ్లాగు టపా రాయటం
  3) బ్లాగు మగానుబాగులు మళ్ళీ మీ బాగోగులు కోరటం
  4) మీకు చివరాఖరిగా ఆవేశం రావటం
  5) ఆవేశం వచ్చాక ఏం చెయ్యాలో తెలియక మళ్ళీ బాధపడటం
  6) బాధపడ్డాక మళ్ళీ ఒక బ్లాగు టపా రాయటం
  7) రాసిన టపా పోష్టు చేసిన వేంఠనే పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళటం
  8) బయటకు వెళ్ళిన తరువాత సూర్యా వారి ఆఫీసు తంతి తపాలా చిరునామా మర్చిపోవటం
  9) మర్చిపోయానని అంతే వేగంగా మళ్ళీ ఇంట్లోకి రావటం
  10) ఇంట్లోకి వచ్చాముగా అని బ్లాగును మళ్ళీ చూడటం
  11) మగానుబాగుల తిరుగు కామెంట్లతో ఆవేశం మరింత పెరగటం
  12) గుండె వేగంగా కొట్టుకోవటంతో గ్లాసుడు నీళ్ళు తాగటం
  13) తాగాక సూర్యావారి చిరునామా కాయితంలో రాసుకోవటం
  14) ఆవేశంలో మర్చిపోయిన పని – సామ్రాట్ అనే వ్యక్తికి ఫోను చెయ్యటం
  15) ఆయన్ని “వ్రా” “వ్రా” అని పిలవటం
  16) ఆయన “వ్రచ్చేశా” “వ్రచ్చేశ్తున్నా” అనేసి ఆంజనేయుడిలా ఒక లంఘు లంఘించి మీ వద్దకుచేరటం
  17) ఇద్దరూ కలిసి సూర్యా ఆఫీసుకు ఫోను చెయ్యటం
  18) సూర్యా వారు చివరికి ఘాట్టిగా “అదంతే హైదరాబాదులో అంతే, సూర్యాలో ఇది రోజూ జరిగే తంతే” అనటం
  19) ద్విగుణీకృతమైన ఆవేశంతో ఫోను విసిరికొట్టటం
  20) ఆ ఫోను వెళ్ళి పక్కనే తరతరాల నుండి కాపాడుకుంటున్న సంపదకు తగలి, అది బద్దలవ్వటం
  21) అది చూసి పక్కనే ఉన్న సగభాగానికి ఆవేశం త్రిగుణీకృతం కావటం
  22) నా త్రప్పేమీ లేదు అని సామ్రాట్టు గారు “వ్రా”పోవటం
  23) సందు చూస్కుని సామ్రాట్టు చెయ్యట్టుకుని ఇంట్లోనుంచి బయటకు పఱుగులు తీయటం
  24) త్రిచక్రవాహనం ఎక్కటం
  25) సూర్యా కార్యాలయానికి వెళ్ళటం
  26) “ఆయన” ఎదురుగా కూర్చోవటం
  27) “ఇదీ సంగతి” అని చెప్పటం
  28) “ఇవే క్షమాపణలు” అని ఆయన చెప్పటం
  29) “వచ్చే సంచికలో మీ రాతలు ముందు పేజీలో వేస్కుని, చివరి పేజీలో చిన్న అక్షరాల్లో మీ పేరు వేస్తాం” అని అనటం
  30) ఆయన, సామ్రాట్టు ముఖాల్లో నవ్వులు పూయటం
  31) మీరు కుర్చీలో నుండి లేచి నటరాజు అయిపోవాలని ప్రయత్నించడం
  32) అది కుదరకపోవడంతో గౌరీనాథుడిగా మారిపోవటం
  33) అచ్చెరువొందిన ఆయన సాష్టాంగ నమస్కారాలు చెయ్యటం
  34) సాష్టాంగం తర్వాత “చివరి పేజీలో కాదు ,ముందు పేజీలోనే వేస్తాము” అని ఆయన అనటం
  35) మీ ఆవేశం మంచుకొండలా కరిగిపోవటం
  36) ఆయన ఉదార స్వభావానికి కళ్ళనీళ్ళ పర్యంతం అయిపోవటం
  37) ఆ కన్నీళ్ళతో నిండిన రెండు బొక్కెనలతో ఇంటికి రావటం
  38) బ్లాగటం…..
  39) మళ్ళీ మొదలు అవ్వటం….
  40) ఈ చరిత్రాత్మక సంఘటన తరువాత మీకు మాడెష్టీ పోయి “అది” ప్రాప్తించటం

  ఈ నలభై స్టెప్పుల్లో మీకు, మీ సోదరులకు ఏది నచ్చకపోయినా నా బాధ్యత లేదనిన్నీ, స్టెప్పులకూన్నూ, స్క్రిప్టులోనున్నూ కావలసిన మార్పులు చేర్పులూ మీరు చేసేసుకోవచ్చనిన్నీ, ఆ హామీ నేను ఇచ్చేస్తున్నాననిన్నీ , మీ టపాచూసి ఆవేశంతో కూడిన రక్తపోటు పెఱిగి రాసిందనిన్నీ…అర్థమైంది అనుకుంటున్నాననిన్నీ……అనిన్నీ…అనిన్నీ…అనిన్నీ…:) …:) :)

  జవిక్ శాస్త్రి

 12. జాల+అరి - November 25, 2009

  ఈ జవిక్ శాస్త్రి ఎవరో ఒక అసందర్భపు వ్యక్తిలా ఉన్నారు. సమస్య తీవ్రతని గమనించకుండా సరదాగా తీసుకోవడం ఖండించదగ్గ విషయం. నా సలహా అయితే – ఈ విషయమై కేసువెయ్యడం, అలా వేసినట్లు విలేఖరుల సమావేశం పెట్టి మరీ లోకానికి వెల్లడి చేయడం చాలా అవసరం.

 13. జవిక్ శాస్త్రి - November 25, 2009

  ఓ జాల+అరి- సమస్య – చూసేవాడి కళ్ళల్లో ఉంటుంది. ఇలాటివి బోలెడు అంతర్జాలంలో (ఇంటర్నెట్టు అన్న మాట!) – అది తెలుసో లేదో అని అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రింటు మీడియాకు పాకటంలో ఆశ్చర్యమేమీ లేదు.

  ఆ ప్రింటు మీడియాని ఖండాలు చెయ్యటానికి మీ పేరులోని జాలమూ సరిపోదు, అరి అని పేరు చివర అతికించుకున్నంతమూలానా పనీ అవ్వదూ.

  ప్రింటు మీడియాను వదిలేసి, ఉదాహరణకు అంతర్జాలమే తీసుకుంటే ఆంధ్రభారతి సైటులోని బోలెడు సమాచారం అప్పనంగా కాజేసి, (అక్కడున్న తప్పులతో సహా! – అవి తప్పులని తెలిస్తేగా ఆ మూర్ఖ శిఖామణులకు! ) వాళ్ళ సొంత పనిగా చెప్పుకున్న ప్రబుద్ధులు చాలా మందే వున్నారు – బ్లాగో”గుల” లోకంలో. ఇప్పుడు ప్రింటు మీడియాకు పాకింది.

  మీ పని మీరు చెయ్యండి అని అక్కడి స్క్రిప్టులో చెప్పాను. అది కనపడకో అర్థమవ్వకో మీ ముంజకాయ ఛిద్రం అయినట్టు ఉన్నది.. :) ఆ ఛిద్రితమైన ముక్కలు కూడదీసుకుని మళ్ళీ చదవండి. సందర్భం తెలుస్తుంది. అసందర్భం మాయమవుతుంది. అప్పటికీ అర్థం కాకపోతే మీ మొండి కత్తిని ఆ ఒరలోనుండి తీసి జాలంలో పడెయ్యండి. ఎవరో ఒకరు ఎత్తుకుపోతారు, అది కూడా పనికొచ్చేదే అని.. :)

  జవిక్ శాస్త్రి

 14. జాల+అరి - November 25, 2009

  జవిక్ శాస్త్రిగారూ ! అర్థం కాకుండా మాట్లాడ్డం గొప్ప తెలివితేటలనే భ్రమలో మీరున్నట్లు కనిపిస్తున్నది. ఈ రెండో వ్యాఖ్యలో చెప్పిన విషయం మీరు మొదటి వ్యాఖ్యలోనే నేరుగా చెప్పుంటే మీ అసందర్భత్వం వెలుగులోకి వచ్చేది కాదు. మీరు నా వ్యాఖ్యకి అవకాశమే ఇవ్వకుండా ఉండాల్సింది. నేను వ్యాఖ్య రాశాక కుళ్ళుకుని “ముంజకాయ మరో కాయ” అని నోరుపారేసుకోవడం తెలివితేటలు కాదు. ఏదేమైనా మీ ’ముంజకాయ’ కాస్త వంకరగా ఉంది.

 15. ramani - November 29, 2009

  ఈ టపా కొంచం ఆలస్యంగా చదివాను. ముందుగా ఒక చిన్న విషయం “మనసున ఉన్నది” అనే ఈ టపా పూర్తిగా మీ వ్యక్తిగతం. మీ మనసులో సహ బ్లాగర్లపై మీ ఆలోచనలను, వారిని మాట్లాడలన్నా, కలవాలన్న కుతుహలం రాసుకొన్నారు. అయితె మీ మనసులోని ఈ విషయాన్ని మీ పేరు లేకుండా పత్రికలకెళ్ళడం శోచనీయం. ప్రతిస్పందనకూడా “సౌజన్యంతో…” , ” గమనించగలరు” అన్న పొడి మాటలే తప్పితే “కస్తూరిగారి మనోగతం ఈ మనసున ఉన్నది” అని ప్రస్తావించలేదు. మరి మీరు ఆలొచించండి. వ్యక్తిగత విషయాలు రాస్తున్నప్పుడు పత్రికలు, మీడియా సదరు వ్యసాధిపతి అనుమతి తీసుకోకుండా “సౌజన్యం” అని రాయడం కూడా కరెక్ట్ కాదేమో కదా.

Leave a Reply