సూర్య దిన ఓత్రిక స్పందన

సూర్య పత్రిక ఇవాళ్ళ తన స్పందనను ప్రచురించింది. ఈ ప్రచురణ వెనుక జరిగిన కథ చెప్తాను.

నిజానికి ఇది బుధవారమే చెప్పాల్సింది. కానీ ఇతర పనులవల్ల సమయం చిక్కక ఇవాళ్ళ చెప్తున్నాను.

కథ క్రితం ఆదివారం ఆరంభమయింది.

నేను ఎలక్షన్ డ్యూటీలో వున్నాను. మా డిస్బర్సింగ్ సెంటర్ వద్ద బిజీగా వున్నాను. అప్పుడు కొల్లూరి సోమశంకర్ నుంచి ఫోను వచ్చింది.

సూర్యలో మీ బ్లాగులోని వ్యాసం ప్రచురించారు. మీపేరుకానీ, బ్లాగు పేరుకానీ రాయలేదు, అని చెప్పాడు.

నేను నమ్మలేదు. కానీ సోమ శంకర్ నాతో పరాచికాలాడడు.

అందుకే ఇంటికి ఫోనుచేసి సూర్య పత్రికకూడా కొనమని చెప్పాను.

సాధారణంగా ఆదివారం నేను అన్ని పత్రికలూ కొంటాను, ఒక్క సూర్య పత్రిక తప్ప.

ఎలక్షన్ డ్యూటీ ముగించుకుని సోమవారం అర్ధరాత్రి ఇల్లు చేరుకుని పడి నిద్ర పోయాను. మంగళవారం లేచి తిని మళ్ళీ పడి నిద్రపోయాను.

సాయంత్రం లేచి అప్పుడు చదివాను.

కొందరు మితృలను సలహా అడిగాను.  ఆ వ్యాసంలో ప్రస్తావించిన బ్లాగర్లకీవిషయం తెలిపాను.

ఎందుకంటే, ఒకవేళ గొడవ చేస్తే మహిళా బ్లాగర్లు అనవసరంగా తమ పేరు పదిమందికీ తెలిసిందని బాధపడకూడదు కాబట్టి.

బ్లాగర్లను సలహా అడగటంలో ప్రధానంగా నా వుద్దేశ్యం బ్లాగర్లకీ విషయం తెలియటం. పాత సూర్య సంచికలన్నీ వెతికి తమ బ్లాగుల పోస్టు చౌర్యం వెలికి తీస్తారన్న ఆలోచన వల్ల అందరికీ తెలిపాను. పైగా ఇలా జరుగుతోందని అందరికీ తెలియాలి. బ్లాగులను పత్రికలవారూ చూస్తున్నారు. కాబట్టి మనం చెప్పకుండానే వరికే కాదు, అన్ని పత్రికలకూ మన బ్లాగరుల మనోభావాలు మనం చెప్పకనే చెప్పినట్టవుతుంది.

బుధవారం బ్లాగరుల స్పందన, మితృల సలహాలను విశ్లేషించి, ఒక నిర్ణయానికి వచ్చాను. సూర్య పత్రికలో సీనియర్ రిపోర్టర్ ఫోను నంబరు తెలుసుకుని అతని ద్వారా, ఆదివారం అనుబంధం, ఇన్ చార్జి చారి, ఫోను నంబర్ తెలుసుకుని, ఫోను చేసి అడిగాను.

మాకు ఈమెయిల్ వచ్చిందని చెప్పాడు.

ఈ వ్యాసం పంపిన ఈమెయిల్ చెప్పమని అడిగాను. పది నిముషాలలో చెప్తానన్నాడు. గంటయినా ఉలుకులేదు పలుకులేదు.

మళ్ళీ ఫోను చేసి అడిగాను. బిజీగా వున్నానన్నాడు.

నేను లాయర్ నోటీసు ఇచ్చి ప్రెస్ కాంఫరెన్స్ పిలవటానికి సిద్ధంగా వున్నాను. మీరు ఈమెయిల్ చెప్పటం కోసమే ఎదురుచూస్తున్నాను. ఇవ్వకపోతే ఇంకా ఆనందంగా లాయర్ నోటీసు పంపుతానన్నాను.

అయిదునిముషాల్లో ఫోను వచ్చింది. మరో సీనియర్ రిపోర్టర్ వార్తలో ఆయన పనిచేసేటప్పుడు నాకు పరిచయం వున్న ఆయన ఫోను చేశాడు. ఎడిటర్ ప్రతినిధిగా మాట్లాడుతున్నానన్నాడు. విషయం అడిగాడు.

చెప్పాను. పొరపాటయిందని ఒప్పుకున్నాడు. కొందరు గతవారం సూర్యలో మానేసి ఆంధ్రజ్యోతిలో చేరారట. వారిపనయివుంటుందన్నాడు.

పని ఎవరిదయినా ఫలితం అనుభవిస్తున్నదినేను కాబట్టి, పత్రిక ముఖంగా అపాలజీ కావాలన్నాను. ఆదివారం ఆ శీర్షిక క్రింద అది ప్రచురించాలన్నాను. ఒప్పుకున్నాడు.

మీరు మా పత్రికకూ అప్పుడప్పుడు ఆర్టికల్స్ రాయవచ్చు, మీ పేరు మీదనే ప్రచురిస్తానన్నాడు.

నాకిప్పుడు కొత్త పత్రికకు రాసే సమయము లేదన్నాను. అదీగాక, నేను అప్పుడప్పుడు ఆర్టికల్స్ రాయను. రాస్తే కాలంలే రాస్తానన్నాను. నాపేరుతో కాక వేరే పేరుతో కథలు, వ్యాసాలూ ప్రచురించే అవసరమూ. అలవాటూ లేదన్నాను. చివరగా, కులం ఆధారంగా వుద్యమాలు నడిపే పత్రికలకూ రాయనని చెప్పి పెట్టేశాను.

ఈరోజు, ఆ శీర్షిక క్రింద, గతవారం వ్యాసం ఎక్కడిదో ప్రచురించారు. ఈవారం వ్యాసం ఎవరిదో పేరు ఇస్తూ, ఈమెయిలూ ఇచ్చారు.

అది ఈక్రింద చూడండి.

surya4

Enter Your Mail Address

November 28, 2009 · Kasturi Murali Krishna · 8 Comments
Posted in: వ్యక్తిగతం

8 Responses

 1. పారదర్శి - November 28, 2009

  సూర్య దినపత్రికలో మీకు (మనసున ఉన్నది వ్యాసం) credit ఇవ్వటం చూశాను. కధ సుఖాంతమైనందుకు అభినందనలు.

 2. venu - November 29, 2009

  nice work sir.. :) ..

 3. జ్యోతి - November 29, 2009

  హా..హా…హా… ఎలాగైతేనేమి కధ సుఖాంతమైంది. ఐనా మంత్రాలకు చింతకాయలు రాలతాయా??

 4. దుప్పల రవికుమార్ - November 30, 2009

  మురళీకృష్ణ గారు, నెమ్మదిగానే అయినా గట్టిగా అడగడం వల్ల, అక్కడ న్యాయం జరిగింది. అయితే ఈ సంగతి మిగతా పత్రికలవారికి కూడా తెలియాల్సివుంది. అడుగున ఒక చిన్న క్రెడిట్ ఇవ్వడంతో తెలుగు రచయిత ఎంతో సంతృప్తి చెందుతాడు కదా, ఆ మాత్రం కూడా మన సంపాదకులు గౌరవించరేమి?

 5. శరత్ 'కాలం' - November 30, 2009

  సంతోషం.

 6. Javik Sastri - December 5, 2009

  సంతోషం. ఆనందాతిరేకం. అభినందనలు. కొద్దిగా అయినా ఆవేశపడినందుకు ఫలితం దక్కింది.

  నా నలభై స్టెప్పుల్లో ఓ ఇరవై మాత్రమే పొల్లుపోకుండా పాటించినందుకు “ఖేదం” – అయినా కథ సుఖాంతంగా “నా” స్క్రిప్టు ప్రకారం అంతం అయినందుకు “మోదం”

  :) :)

  శాస్త్రి

 7. malathi - December 7, 2009

  మీరు అభ్యంతరం చెప్పి మీకార్యం సాధించుకున్నందుకు అభినందనలు. రచయితలు ఇలా తమ అభ్యంతరాలు గట్టిగా చెప్పినప్పుడే పత్రికలకి అకౌంటబిలిటీ (బాధ్యత?) తెలుస్తుంది. మనఃపూర్వకంగా అభినందనలు.

 8. Sowmya - December 29, 2012

  ఇది మూడేళ్ళ నాటి టపా అయినా, ఇంకా కూడా పర్మిషన్ అడక్కుండానే ఇలా వ్యాసాలు ప్రచురిస్తున్నట్లుగానే ఉన్నాయే పత్రికలు? వ్యాసకర్తల పేర్లు రాస్తున్నారు కానీ, మీరు పంపకపోయినా మా పత్రికలో మీ రచన వేసుకోవడం అసలు మీకిష్టమేనా? అని అడగనక్కర్లేదా?

Leave a Reply