హేతువాదులు, ఫాసిస్టులూ!

ఇటీవలె అనుకోకుండా ఒక హేతువాద ప్రతినిధితో చర్చ జరిపే అవకాశం నాకు కలిగింది. ఆయన పేరు గోగినేని బాబు. శాంభవి కేసు విషయంలో చర్చకు స్టూడియో ఎన్ వారు పిలవటంతో నకీ అమూల్యావకాశం లభించింది. హేతువాదమంటే హేతువులేని వాదమని, ఫాసిజానికి మరో రూపన్న భావన ఈ చర్చ ఫలితంగా నాకు కలిగింది.

శాంభవి స్కూలుకెళ్ళాలనీ, స్కూలుకెళ్ళటం ప్రతి శిశువు ప్రాథమిక హక్కనీ చాలా గొప్పవచనాలు పలికారాయన చర్చను ఆరంభిస్తూ.

నేను ఆయనతో ఏకీభవించాను. కానీ, స్కూలుకెళ్ళేహక్కు శాంభవికేకాదు, ప్రతి పిల్లవాడికీ వుంటుందన్నాను. వీధుల్లో అడుక్కునే పిల్లలదగ్గరనుంచి, మేస్త్రీల దగ్గర కూలీలు చేసే పిల్లలవరకూ, ఇంకా అనేక ఘోరమయిన పనులు బలవంతంగా చేసే పిల్లలకూ చదివే హక్కు వుంటుందన్నాను. మరి అలాంటి పిల్లల హక్కులు వదలి ఒక్క శాంభవి వెంటే పడటంలో ఔచిత్యమేమిటని అడిగాను.

అదీగాక, నిజానికి జనులకు విఙ్నానమే ఇవ్వాలన్న ఆలోచన వుంటే, సమాజంలో బోలెడంత అఙ్నానముంది. చదువుకున్న వారికే తమ హక్కులు తెలియవు. ప్రజలను, ప్రతివారూ మభ్యపెట్టి, భయపెట్టి పబ్బం గడుపుకుంటున్నారు. వారందరికీ అసలు నిజాలు చెప్పడి. ఇంకా, ట్రయివ్బల్స్ కోసం బోలెడన్ని చట్టాలూ, హక్కులూ వున్నా, వారు అనేక అణచివేతలకు గురవుతున్నారు, వారిని విఙ్నానవంతులను చేయండి. ఎందుకూ పనికిరాని శాంభవి కేసుకోసం అంతర్జాతీయ స్థాయిలో ఇన్ని సంస్థలు పోరాడేబదులు, ఇంకా అవసరమున్న వారికోసం ఇదే శక్తి, సమయమూ ఖర్చుచేయండి కాస్త అర్ధముంటుంది అన్నాను.

దానికాయనకు కోపం వచ్చేసింది.

ఏదో చేస్తున్నవారిని ఇదిచేయరు, అదిచేయరు అంటారు. మీరేం చేస్తున్నారు? అని నన్నడిగారాయన.

మీకు తెలుగు చదవటం రాదు కాబట్టి నేనేం చేస్తున్నానో మీకు తెలిసేవీలులేదు. నేను చెప్పినా మీకు అర్ధం కాదు. నా రచనల ద్వారా నేను నమ్మిన నిజాలను వివరిస్తున్నాను. శాంతి సమన్వయాలకోసం ప్రయత్నిస్తున్నాను. అంతేకానీ మీలా ప్రజల విశ్వాసాలతో చెలగాటాలాడటంలేదు, అన్నాను.

దానికాయన, మేము అన్ని కేసులూ చేపట్టలేము, కేవలం మతపరమయిన exploitation వున్నకేసులే చేపడతామూ అన్నాడు.

అయితే, మీకు ఇతర యే మతాలలోనూ మూఢనమ్మకాలు కనబడలేదా, అనడిగాను. నువ్వు చచ్చి పదిమందిని చంపితే స్వర్గానికెళ్తావని నమ్మించే మతాలు అమాయకులను ఎక్ష్ప్లాయిట్ చేయటం కనబడటంలేదా? వారికి తెలివినివ్వండి, మన దేశానికే కాదు, ప్రపంచానికి మంచి చేసినవారవుతారు అన్నాను.

దానికాయనకు మరింత కోపం వచ్చింది. దేశంలో ఒక పర్వెర్టెడ్ ఆలోచన మొదలయింది. ఈ మతాన్నే ఎందుకు తిడతారు, ఆమతాన్నెందుకు అనరు అంటారని పరుషంగా మాట్లాడాడు. శాంభవిని తల్లితండృలు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారన్నాడు.

శాంభవి కనీసం వేదాంతం పలుకుతోంది. ఆరేళ్ళ పసిపిల్లలు అర్ధనగ్నంగా, బూతు పాటలు పాడుతూ టీవీ చానెళ్ళలో గెంతుతున్నారు. ఇది తల్లి తండృలూ, చానెళ్ళూ కలసి చేస్తున్న ఎక్స్ప్లాయిటేషన్ కాదా? అనడిగాను. ఇంకా సినిమాల గురించి పట్టిలేదా? అనడిగాను. కనీసం శాంభవికి నీడ, కూడూ, గూడూ వున్నాయి. అవీలేక ఎంతో మంది అల్లల్లాడుతున్నారు. శాంభవి దలై లామా అవతారమయినా, జార్జ్ బుష్ అవతారమయినా నష్టంలేదు. కానీ, ఇలాంటి అనాథ పిల్లలు అసాంఘిక శక్తుల ప్రభావంలోకి వస్తే, వారికి వ్యక్తిగతంగా, సమాజానికి సామూహికంగా నష్టం, అంతర్జాతీయ స్థాయిలో దాన్ని పట్టించుకోండి, అన్నాను. అదీగాక విశ్వాసాన్ని దెబ్బ తీసేముందు ప్రత్యామ్నాయం చూపాలి. ఫ్రీగా దొరికే మందు పనికిరాదని ప్రత్యామ్నాయం చూపక పోవటం వల్ల కార్పొరేట్ ఆస్పత్రులు బాగుపడుతున్నాయి. సాయిబాబా మీదా వుండుండి ఆరోపణలు చేస్తూ ఏమి సాధించారు? ఆయన భక్తులలో ప్రేరేపిస్తున్న నిస్స్వార్ధ సేవా భావనలో వెయ్యవవంతుకూడా మీరు ప్రేరేపించగలరా? ఏదో పబ్లిసిటీకోసం కాకపోతే ఎందుకీ పనికిరాని వ్యర్ధ ప్రయాసలు, ఒకవేళ శాంభవి స్కూలుకి వెళ్ళటం వల్ల ప్రపంచంలో పిల్లలందరి చదివే హక్కు నిలబడుతుందంటే పదండి నేనూ మీతో వస్తాను. అందరం కలసి శాంభవిని స్కూలుకు పంపుదాం. లేకపోతే ఎలాంటి పబ్లిసిటీ దొరకని అనాథ పిల్లల పరిస్థితి మెరుగుకోసం ప్రయత్నిద్దాం, అన్నాను.

నాకు టైం లేదని వెళ్ళిపోయాడాయన. కార్యక్రమానికి వచ్చేముందే కార్యక్రమమెంత సేపో తెలుస్తుంది. అది గంట సేపుండే ఫోన్ ఇన్ కార్యక్రమం. కానీ, ఆరంభంలో అరగంట కన్నా ఎక్కువుండనని, వాదన సగంలో వుండగానే లేచి పోవటమనేది చూస్తూంటే, వ్యతిరేక వాదనను వినే ఓపిక, తీరిక ఈ హేతువాదులకు లేదనిపిస్తుంది. పైగా, శాంభవి స్కూలు హక్కే సర్వస్వం అన్నట్టు మాట్లాడుతూంటే, వీరు పట్టిన కుందేలుకు కాళ్ళేఅకాదు, చెవులు, కళ్ళు కూడా లేవని, తాము అనుకున్నదే కరెక్టనే అహేతుక మూర్ఖత్వం వీరి సొత్తనీ అనిపించింది.

అంతేకాదు, వాదనలో ఆయన నాకు మానవత్వం లేదనీ, శాంభవి దుస్థితి అర్ధం చేసుకోలేని నేను మనిషిని కాదనీ అన్నాడు.

మీరు నా మాట వింటే తెలివయినవారు, లేకపోతే మూర్ఖులు అనటంలో ఎంత హేతువాదము, విఙ్నానమూ వుందో నాకు అప్పుడే అర్ధమయింది. అలాంటి మానవత్వమూ హేతువాదమూ నాకు అక్కరలేదని అనిపించింది.

అప్పుడనిపించింది, ఈ హేతువాద్లంతా, ఏసీగదులలో కూచుని సమాజానికి విఙ్నానాన్ని పంచాలని కంకణం కట్టుకున్నారుకాబట్టి సరిపోయింది, లేకపోతే, వీరికి అనుచరులుండివుంటే ఫాసిస్టులకేమీ తీసిపోయేవారుకారు. తమను వ్యతిరేకించినవారిపై దాడులు చేసేవారు. మీరు, హేతువాదులపై ద్వేషంతో మాట్లాడుతున్నారని, ఆయన నన్నన్నప్పుడే నాకు వీరి ఫాసిస్టు లక్షణాలు తెలిసిపోయాయి.

అయితే, ఒక హేతువాదిని చూసి అందరూ ఇలాగే మూర్ఖంగా వుంటారని తీర్మానించటం, రేషనల్ ఆలోచన కాదంటారా. ఈయన హేతువాద, విఙ్నాన వేదికల అధ్యక్షుడు. తలను చూసేకదా మనం మొత్తం శరీరాన్ని గౌరవించేది. తలే ఇలావుంటే, ఇక మిగతావి ఊహించాలంటే ఎలాగో వుంటుంది.

ఈ కార్యక్రం స్టూడియో ఎన్ లో 22.11.2009 సాయంత్రం ఏడు గంటలకు ప్రసారమయింది.

Enter Your Mail Address

December 12, 2009 · Kasturi Murali Krishna · 24 Comments
Posted in: Uncategorized

24 Responses

  1. Praveen Sarma - December 12, 2009

    మురళీకృష్ణ గారు వ్రాసారు:
    >>>>>
    శాంభవి కనీసం వేదాంతం పలుకుతోంది. ఆరేళ్ళ పసిపిల్లలు అర్ధనగ్నంగా, బూతు పాటలు పాడుతూ టీవీ చానెళ్ళలో గెంతుతున్నారు. ఇది తల్లి తండృలూ, చానెళ్ళూ కలసి చేస్తున్న ఎక్స్ప్లాయిటేషన్ కాదా? అనడిగాను. ఇంకా సినిమాల గురించి పట్టిలేదా? అనడిగాను. కనీసం శాంభవికి నీడ, కూడూ, గూడూ వున్నాయి. అవీలేక ఎంతో మంది అల్లల్లాడుతున్నారు. శాంభవి దలై లామా అవతారమయినా, జార్జ్ బుష్ అవతారమయినా నష్టంలేదు. కానీ, ఇలాంటి అనాథ పిల్లలు అసాంఘిక శక్తుల ప్రభావంలోకి వస్తే, వారికి వ్యక్తిగతంగా, సమాజానికి సామూహికంగా నష్టం, అంతర్జాతీయ స్థాయిలో దాన్ని పట్టించుకోండి, అన్నాను.
    >>>>>
    శాంభవి అనాథ కాదు. ఒక దేవాలయం దగ్గర భూముల ధరలు పెంచుకోవాలని ఆ ప్రాంతంలోని రియల్ ఎస్టేట్స్ మాఫియా శాంభవి తల్లితండ్రులకి డబ్బులు ఇచ్చి ఆ దేవాలయంలో కూరోబెట్టింది. టి.వి. చానెల్స్ లో వస్తున్న డాన్సుల విషయానికీ, హేతువాదానికీ సంబంధం లేదు. ఆ డాన్సులని సామాజిక కోణంలో విమర్శిస్తాను. ప్రకృతి శాస్త్రాల హేతువాదులు ఆ డాన్సులని విమర్శిస్తారనుకోవాలా?

  2. మంచుపల్లకీ - December 12, 2009

    hmm.. ఇది 100% నా మనస్సులొంచి వచ్చినట్టు వుంది.. నేను ఎప్పుడూ ఏది వాదిస్తానొ అదే రాసారు, Super

  3. Vamsi M Maganti - December 12, 2009

    మీరు వాదించిన కొన్ని పాయింట్లకు.. శభాసో.. చప్పట్లు.. మాకు ఇక్కడ ఆ కార్యక్రమం చూసే అదృష్టం లేదు ..వీలుంటే ఎవరయినా రికార్డు చేసుంటే క్లిప్పు పెట్టండి మహాప్రభో! చూసి ఆనందిస్తాము.

  4. SIVARAMAPRASAD KAPPAGANTU - December 12, 2009

    బాగా వ్రాశారు మాష్టారూ. హేతువాదం అని నాస్తిఉలమని చెప్పుకోవటం ఒకప్పుటి ఫాషన్. వీళ్ళకు గురువు ఏ.టి కోవూర్ అని 1975 ప్రాంతాలలో భాతదేశానికి వచ్చి కొంత సంచలనం సృష్టించాడు. ఆ ఆవేశంలో చార్వాక అనే పత్రిక ప్రారంబించి (మన తెలుగు వాళ్ళే) కొంతకాలం ఏది కనపడితే దాన్ని విమర్సించి విమర్సించి సొమ్మసిల్లిపోయారు. ఆ పత్రిక స్వాబావిక మరణం పొందింది.

    ఇక ఇప్పుడు హేతువాదులం మేము అని చెప్పుకొనే వాళ్ళందరూ, ఎవో కొన్ని విషయాలను మాత్రమే భూతద్దంలో చూపించటానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు. వీళ్ళకి హిందూ మతం తప్ప ఇతర మతాలలో ఉన్న మూఢ నమ్మకాల జోలికి వెళ్ళే దమ్ము, ధైర్యం ఉండవు. మనం చవటలం కదా అందుకని.

    ఇలా అని పిచి పిచ్చి నమ్మకాలను పెంచి పోషించాలని కాదు నా ఉద్దేశ్యం. ఈ హేతువాదులమని చెప్పుకుంటూ సెలెక్టివ్‌గా దుమ్మెత్తి పొయ్యటమే నాకు నచ్చదు. పైగా వీళ్ళకొక మూఢ నమ్మకం ఉన్నది, తామేదో మేధావులమని, సంఘంలో ఉన్న వారందరికంటే ఉన్నతులమని, ఈ సంఘాన్ని తాము ఉధ్ధరించటానికి పుట్టామని.

    ఇటువంటి మూఢ నమ్మకంలోంచి బయటపడి, మీరు చెప్పినట్టుగా పనికి వచ్చే విషయాల మీద దృష్టి సారిస్తే వాళ్ళమీద వాళ్ళు చేసే ఈ ప్రచారం మీద కొంతలో కొంత సామాన్య జనానికి నమ్మకం గురి కుదిరే అవకాశం ఉన్నది. ఏదో గుప్తమైన ఎజెండా తో(వాళ్ళ ప్రవర్తన, మాటలు చూస్తే అలా అనిపిస్తుంది మరి) ఇలా సెలెక్టివ్‌గా ప్రవర్తిస్తే ఉన్న కొద్ది ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉన్నదని నా అభిప్రాయం

  5. మంచుపల్లకీ - December 12, 2009

    http://jeevani2009.blogspot.com/2009/12/blog-post.html

  6. Malakpet Rowdy - December 12, 2009

    Very well said Murali Krishna garu.

    నాకు టైం లేదని వెళ్ళిపోయాడాయన.
    __________________________

    They run away when they cant answer the questions – Brainless wonders :) )

  7. రాజశేఖరుని విజయ్ శర్మ - December 12, 2009

    చాలా బాగా చెప్పారు.

    అసలు చదువంటే ఏమిటనేది ఇక్కడ నిజమైన ప్రశ్న. శాంభవికి నలుగురితో ఎంత సభ్యతగా మాట్లాడాలో, ఎక్కడ ఎలా మెలగాలో, తనకు ఏమి కావాలో, తన జీవిత పరమార్థమేమిటో ఈ విషయాలపై స్పష్టమైన అవగాహన ఉంది. ఒకవేళ ఇప్పుడు లేక పోయినే ఆమె నడవడికను, పెరిగే వాతావరణాన్ని బట్టి అది వస్తుందనే నమ్మకం ఉంది. కానీ జనాలు తండోప తండాలు గా వెళ్లి ఆమెను కలవడం శాంభవి విద్యా పురోగతికి అంత మంచిది కాదు.

    ఇంతకంటే విద్య ఎవరికి కావాలి? విద్య యొక్క లక్ష్య మేమిటి? స్కూలుకు వెళ్లి చదివితేనే చదివినట్టా? మొదలైన ప్రశ్నలు వేసుకోవాలి మనమందరం.

    మీరొకసారి వీలైతే నేను రాసిన ఈ క్రింది టపాలు చదవండి.

    http://rajasekharunivijay.blogspot.com/2009/10/blog-post.html

    http://rajasekharunivijay.blogspot.com/2009/10/blog-post_23.html

  8. Praveen Sarma - December 12, 2009

    http://blogzine.sahityaavalokanam.gen.in/2009/11/blog-post_2870.html

  9. karthik - December 12, 2009

    కరెక్టుగా చెప్పారు మష్టారు..ఒక సారి టైం ఉంటే నా ప్రపంచం అని ఒక మూతబడ్డ బ్లాగును చూడండి వీళ్ళ పైత్యాలన్ని ప్రజలు ఎలా ఎండగట్టారో, ప్రజలకు సమాధానం చెప్పలేక వారెలా పారిపోయారో తెలుస్తుంది..

  10. Praveen Sarma - December 12, 2009

    గోగినేని బాబు గారు ఇన్నయ్య గారి మిత్రుడే. టి.వి. చానెల్స్ వాళ్ళు ఈ కార్యక్రమాలకి ఎక్కువగా ఇన్నయ్య గారిని పిలుస్తారు. ఇన్నయ్య గారి బ్లాగ్ మూతపడలేదు. అతను ఈ మధ్య నాస్తిక సంఘాల మీటింగ్ లలో బిజీగా ఉన్నారు.

  11. దుర్గేశ్వర - December 13, 2009

    చేతలలో లేని ఆచరణ చెప్పేందుకు పనికిరాదని వీళ్లకు అర్ధం కాదులెండి .అందుకే మీ నుంచి సూటి ప్రశ్నలకు తట్టుకోలేరు.
    ఇక శాంభవి విషయానికొస్తే ఆథ్యాత్మికత ,వ్యాపారుల అవసరాలకు ఎలా ఉపయోగపడుతుందో ఒక ఉదాహరణ అనేది .మనందరికీ తెలిసిన విషయమే .

    కాకుంటే హేతువాదం ముసుగులో హైందవ ధర్మం మీద మాత్రమే విమర్శలు చేయగలిగటానికి కారణం అంతర్గతంగా వేరే లక్ష్యాలవల్ల ,వేరేవాళ్ల సహకారం తో సాగుతున్నాయనేది తెలియాలి జనానికి

  12. Praveen Sarma - December 13, 2009

    ఇస్లాం మతాన్ని కూడా మేము విమర్శించాం. http://blogzine.sahityaavalokanam.gen.in/2009/12/blog-post_2447.html

  13. kumbh karan - December 13, 2009

    మీ వాదన వింటే నాకొ పాత జోక్ గుర్తొస్తుంది. ఒక త్రఫ్ఫిచ్ కాన్స్తేబుల్ ఒకడికి స్పీడింగ్ టికెట్ ఇస్తే, నా ఒక్కడికే ఎందుకు ఇచ్చవ్, మిగతా చాలా మంది స్పీడ్ గానే వెల్తున్నారుగా అన్నాడత. దానికి ఆ కాన్స్టేబుల్ ఇలా అన్నడు “మనం చేపలు పట్టడానికి చెరువు కి వెల్తాము, కానీ అన్ని చేపల్నీ మనమే పట్టలేము కదా?”.

    ఆ హేతువాదులు శంభవి గురించి చెప్పిందాంట్లో ఏమన్నా తప్పుంటే చెప్పండి, అంతే కానీ, మీరు ఇదెందుకు చెయ్యరు అదెందుకు చెయ్యరు అనడం చాలా విచిత్రమైన వాదనలా ఉంది. మిత్రుడు ముదే చెప్పినట్లు హేతువాదానికి, వీధి బాలలకి సంబంధం ఏమిటి, దాని గురించి ఎందుకు మాట్లాదొద్దనడానికి మీరవరు? మీకు చేతనయితే ఆ పని మీరు చేయండి.

    ఇక రెండోది, మీరు ఇలాం లో ఉన్న విశ్వాసాల గురించి అంతర్జాతీయంగా ఎందుకు పోరాడరు అని.. ఇదీ మరీ విచిత్రం…మన ఇల్లు బాగో లేదు కడుగుదాం అని అంటే, పెల్లాం మన ఇల్లేమిటి ప్రపంచంలో చాలా ఇల్లు ఇలానే ఉన్నాయి వెల్లి కదుగు అన్నదంట. మన సమాజం లో రుగ్మతల గురించి మాట్లాడితేనే మీరిలా ఇంటే, ఇక అంతర్జాతీయంగా ఆయన ఎమి చేస్తడు.. ఒక వేల అలాంటి విషయాల గురించి మనం మాట్లాదితే అప్పుడు వాల్లు “ముందు మీ సమాజం లో ఇలంటివి ఎన్నొ ఉన్నాయి, వాటిని బాగు చేసుకోండి,, ఆ తరువాత మాట్లాడండి అంటారు.

    అయిన వాల్ల సంఘం ఎమీ అంతర్జాతీయ లెవెల్లో లేదు, కాబాట్టి వాల్లు ఇక్కడ ఉన్న ఇష్యూస్ గురించి మాత్ళాడుతున్నారు.మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా రాసినందుకు మన్నించండి, నిజం ఎప్పుడూ కొంచెం ఇబ్బంది గా ఉంటుంది.

  14. kcubev - December 13, 2009

    ఈ మద్య బ్లాగులలో హేతువాదాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. ఏదో ఒకమతాన్నే టార్గెట్ చేసినట్లు ప్రచారం చేస్తున్నారు. నాస్తికులు రాసిన పుస్తకాలు చూడండి. క్రిస్టియన్, ఇస్లామ్ మతస్తుల మూఢనమ్మకాల గురించి కూడా రాసారు. నరబలి పేరుతో సి.వి.గారు రాసిన కావ్యంలో ఉపోద్ఘాతంలో ముందుగా రోమన్ కేథలిక్ చర్చి వారి నిరంకుశ విధానాల గురించే చర్చించారు. ఎక్కువ మంది అనుసరించే హిందూ మతంలోని మూఢనమ్మకాలపై మాట్లాడితే తప్పేంటి. మతవిశ్వాసం వేరు, మూఢనమ్మకం వేరు. శాంభవి పేరుతో కోట్లాది రూపాయల భూముల వ్యాపార కుంభకోణాలు, నిధుల సమీకరణాలు జరిగాయి కాబట్టే అది టీ.వీ.షోలో టాపిక్ అయ్యింది. అది హేతువాదులు స్పాన్సర్ చేసిన కార్యక్రమం కాదుకదా?

  15. sri - December 13, 2009

    I request you, please Praveen Sarma comments in your blog.
    Thanks in advance.

  16. kumbh karan - December 13, 2009

    హేతువాదులంటే అంత కోపమెందుకు? మన చందస భావాలు బట్ట బయలవుతున్నాయనే భయమా?

  17. మంచుపల్లకీ - December 13, 2009

    నిజమయిన నిజాయితి పరులయిన హేతువాదులు అంటే కొపం ఎందుకుంటుంది కుంభకర్ణా.. ఎటొచ్చి హిందుమత మీద ద్వెషం తొ విషం కక్కే అరగుండు వాళ్ళతోనే చిక్కంతా.. వాళ్ల హిందూమతద్వేషం హేతువాదులమనే ముసుగులొ వుంటుంది ..నీకు తెలీనదేముంది.. నువ్వి ఇచ్చిన ఊదహరణలాంటివి 100 ఇవ్వొచ్చు.. కానీ వాళ్ల నిజాయితీ నిరూపించుకొవడానికి ఇవి పనికి రావు కదా.. కుహానా హేతువాదుల గురించి ఎంత మట్లాడుకుంటే అంత మంచిది.. ఇక వెరే మతం అంటే వాళ్ళకి @$%& అదన్నమాట.. తస్లిమా నస్రీన్ ని హైదరబాద్ లొ తన్నినట్టు తంతారని భయం.. ఇంక ఇటలీ సంగతటావా అంటావా.. వాళ్లే కదా ఈ మాఫియా లేడర్.. హిందుమతాన్ని లేకుండా చెయ్యాలని పన్ని కుట్రలొ చిన్న్న చిన్న పావులే ఈ హేతువాదులు.

    దేవుడి ని నమ్మక నువ్వేమి అదనం గా సంపాదిచావొ (డబ్బయిన విజ్ఞానమయినా సంతొషమయినా ) నాకు తెలీదు కానీ దేవుడి నమ్మడం మేము కొల్పొయినది ఎదీ లేదు..

  18. మంచుపల్లకీ - December 13, 2009

    @ కుహానా హేతువాదులూ (హేతువాదులమనే ముసుగులో వున్న హిందూ మతద్వేషులూ ) -
    హిందుమతద్వేషం అనే పొరలు తీసి చూడండి .. అయితే అన్ని సరిగ్గా కనిపిస్తాయి.. లేక పొతే ఇంతకన్న దారుణమయిన విషయాలు కనిపిస్తాయ్.. ముందక్కడికి పోయ్ చెప్పండి .. ఆ తరువాత మీరు బతికుంటే ఇక్కడకు వచ్చి మాకు చెబుదురుగానీ..

  19. Praveen Sarma - December 13, 2009

    కేవలం హిందూ మతాన్ని వ్యతిరేకించడం వల్ల మాకేమిటి లాభం? ఇస్లాం మతం కూడా నాస్తికుల తలలు నరకాలి అంటోంది. నాస్తికుడి తల నరికినవాడు స్వర్గానికి వెళ్తాడనీ, నాస్తికుడు నరకాగ్నిలో కాల్చబడతాడనీ ఖురాన్ లో వ్రాసి ఉంది. అలాంటి మతాన్ని నాస్తికులు సమర్థిస్తారా?

    భారత హేతువాద సంఘం 1931లో బొంబాయిలో ప్రారంభం అయ్యింది. అప్పట్లో దాని పేరు బొంబాయి హేతువాద సమాఖ్య. 1948లో దాని పేరు భారత హేతువాద సంఘంగా మారింది. అంతే కానీ భారత దేశంలో హేతువాద ఉద్యమాన్ని ప్రారంభించింది అబ్రహాం కోవూర్ కాదు. ఆంధ్ర ప్రదేశ్ లో చార్వాక లాంటి నాస్తిక పత్రికలు వచ్చాయి. వాటి ఎడిటర్లు చనిపోయిన తరువాత అవి మూత పడ్డాయి. నాస్తిక పుస్తకాలు మార్కెట్ లో ఉన్నాయి. వాటిలో ఇస్లాం, క్రైస్తవ మతాల పైన కూడా విమర్శలు ఉన్నాయి. నాస్తిక పుస్తకం ఒక్కటి కూడా చదవకుండానే నాస్తికులు కేవలం హిందూ మతాన్ని ద్వేషిస్తున్నారు అనడం ఏమిటి?

  20. మంచుపల్లకీ - December 13, 2009

    నువ్వు ఫీల్ అవ్వమాక ప్రవీణ్.. ..

  21. rudhirapriya - December 13, 2009

    >>> ఈ పెళ్ళి తప్పకుండా జరుగుతుంది, మీరు పెళ్ళికి గుడికి వచ్చి మమ్మల్ని ఆశిర్వదిస్తే మంచిది అని అన్నాడు జీవన్.

    hEtuvAdulu guLLo peLLi cheskovadamenti praveeNuu??

  22. kumbh karan - December 14, 2009

    http://edisatyam.blogspot.com/2009/12/blog-post_14.html

    instead of answering for so many blogs, I thought of starting this topic in my own blog. please check and give your comments.

  23. రహంతుల్లా - December 28, 2009

    మన రాష్ట్రంలో కొన్ని మూఢనమ్మకాలు

    * పెదకాకాని బాజీబాబా దర్గా ఉరుసు లో గుర్రానికి తినిపించిన ఎంగిలి మిఠాయి భక్తులు ఎగబడి తింటారు,
    * పరోపకారం కోసం తన దేహాన్నే కోసి ఇచ్చిన గొప్ప దానశీలి త్యాగమూర్తి మయూరధ్వజుడు. అతని పేరుతో నెలకొల్పిన ధ్వజస్థంభం నీడ గుడి మీదకానీ ఇళ్ళమీదకానీ పడకూడదంటారు.
    * బుధవారం నాడు ఆడపిల్ల పుడితే అరిష్టం అని చంపేయటమో ఎక్కడో వదిలేసి రావటమో చేస్తారు.
    * జాతర రోజులలో గ్రామశక్తి పోలేరమ్మ పట్టణంలో సంచరిస్తుంటుందని, అరిష్టం కలుగుతుందని శుభకార్యాలు చేయడం ఆపివేస్తారు. మసూచి ఆటలమ్మ లాంటి రోగాలను అమ్మవారికి ఆపాదిస్తారు.
    * అనంతపురం జిల్లా హిందూపురం ఎస్‌.సడ్లపల్లిలో పిల్లలకు వచ్చిన కోరింత దగ్గు నయం కావడానికి కుక్క విగ్రహానికి పూజలు చేస్తారు.
    * చేతబడి చేశారని పళ్ళు పీకడం, కిరోసిన్ పోసి నిప్పంటించడం, వివస్త్రలను చేయడం, కొట్టి చంపడం లాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు.
    * చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం సోమాపురం గ్రామంలో చిన్న పిల్లల జబ్బులకు అక్కడి పూజారి చెక్క చెప్పు వైద్యమే మందు. అనారోగ్యంతో వచ్చే వారికి దెయ్యాలు ఆవహించాయని, వాటిని తరిమేస్తే ఆరోగ్యం కుదుట పడుతుందని కొరడాతో బాదుతాడు. పిల్లలు లేని వారు తమ వీపుపై పూజారి పాదం పడితే పిల్లలు పుడతారని తొక్కించుకుంటారు.
    * కొందరు గ్రహణం రోజు బోజనం చెయ్యరు, అమావాస్య నాడు పెళ్ళిచేసుకోరు. గర్బిణులు బయటకు రారు. వంటపాత్రలలో, నీటిలోగడ్డిపోచలు వేస్తారు. గ్రహణం కారణంగా దేవాలయాల్లో అన్నిసేవలు, దర్శనాలను రద్దు చేసి ఉదయం 10 నుంచి సాయంత్రం 6.30 వరకు ఆలయం తలుపులను మూసి వేస్తారు.
    * బయలుదేరినప్పుడు ఎవరన్నా తుమ్మితే కాసేపు కూర్చొని మంచినీళ్ళు తాగి వెళ్ళమంటారు. పరీక్షల్లో కాపీకొడుతూ దొరికిపోయినా బయలుదేరేటప్పుడు తుమ్మిన వ్యక్తిదే తప్పు అతనిది మంచితుమ్ము కాదు అంటారు. తుమ్ము రాబోయే ప్రమాదాన్ని తమ్ముడై చెబుతుంది అంటారు.
    * తండాల్లోని గిరిజనుల్లో ఎక్కువమంది ఆడపిల్లలు గలవారు ఆడపిల్లను దానమిస్తే మగపిల్లలు పుడతారంటూ మగపిల్లవాడికోసం ఆడపిల్లను దానం చేసి వదిలించుకుంటారు.
    * కరీంనగర్ జిల్లాలో ఆవుకు మనిషి పుట్టాడని అందువలన కొడుకులు చస్తారని ఎంతమంది కొడుకులుంటే అన్ని దీపాలు వెలిగించారు.
    * నాగమణి, నల్లపసుపు కొమ్ము, నేలగుమ్మడికాయ, నల్లపిల్లి, ఇరవైగోళ్ల తాబేలు, రెండుతలల పాము లాంటివాటికి అద్భుత శక్తులున్నాయనే కారణంతో లక్షలాది రూపాయలు తీసుకొని మోసం చేస్తున్నారు .(సాక్షి గుంటూరు6.11.2009)
    దేశంలో కొన్ని మూఢనమ్మకాలు
    * ఒరిస్సా-జీవితం సుసంపన్నం అవుతుందన్న నమ్మకంతో దేవతల విగ్రహాలకు లక్షల రూపాయల కరెన్సీ నోట్ల దండలు వేసి నదిలో నిమజ్జనం చేస్తారు. నీళ్లలో వేసిన డబ్బును తీసుకుంటే దేవత ఆగ్రహానికి గురికావల్సి వస్తుందన్న భయంతో ఎవరూ వాటిని తీసుకోరు.
    * మధ్య ప్రదేశ్‌-జబల్‌పూర్‌కు చెందిన సర్జన్ బాబా-’సరోత బాబా’ ఈశ్వర్ సింగ్ రాజ్‌పుట్. గోళ్ళను కత్తిరించే గోరుగల్లు తో రోగుల కంటివ్యాధులను నయం చేస్తానని నమ్మబలికి పదకొండు ప్రాణాలను బలి తీసుకున్నాడు.http://telugu.webdunia.com/religion/believeitornot/article/0709/17/1070917027_1.htm
    * కేరళ-నాడీ శాస్త్రంలో మీరు పాత జన్మలో ఎవరు, ఏమిటి అనే కాకుండా వచ్చే జన్మ లో ఎక్కడ ఎలా జన్మించబోతున్నారో కూడా చెప్పేస్తారు.
    * నవరత్నాలు ధరిస్తే అపజయం ఉండదట. వజ్రాలు కొందరికి అదృష్టాన్ని కలిగిస్తాయని, కొందరికి అవి అరిష్టాన్ని తెస్తాయని నమ్మకం.
    * గోదానం చేసినవారు పడవలో వైతరణి నదిని దాటగలరు గాని, గోదానం చెయ్యలేని పాపాత్ముడు సలసల కాగుతూ ఉండే ఆ నదిలో దిగి నడవవలసిందేనట,

  24. Rajesh - July 19, 2010

    చక్కగా చెప్పారు మురళి గారు..

    ఈ హేతువదులు ఎన్ని చెప్పినా వారి ద్వేషము ఒక మతాన్ని టార్గెట్ చేస్తుంటది..
    మీకు తెలుసా… అది ఎంతవరకు వచిందంటే చేప మందు వాళ్ళ వాల్ల చేపలు నష్ట పోతున్నయట .. అదే వాటి సంపద!!!.. అందుకని చేప మందు బాన్…
    నేను చూసాను…
    ఒక మతం పండుగలో ఎన్ని జీవాలు చచ్చిపోతయూ.
    అలాగే అదే మతం పండుగలో కొందరు బబ్లేడ్స్ తో కోసుకుంటారు .. కాని వీటి మీద హేతువాదుల గొంతు వినలేదు.. ఏ టీవీ లో ను అరవలేదు..

    పుస్తకం కన్నా టీవీ ఎఫ్ఫెక్ట్/ఇంపాక్ట్ ఎక్కువ కాబట్టి.. అక్కడ చేప మందు మీద అరిచినట్టే ఇక్కడా అరవండి చూద్దాం

    ఒకటి మురళి గారు, మెత్తని వాడిని చుస్తే ఎవరికిన మొత్త బుద్ది పుడుతుందని ..
    మనం అంత ఒకటిగా ఉంటె వీలు మూసుకొని కూర్చోరు..

    @రహమతుల్ల,
    పాపం మీకు హైదరాబాద్ లో పండగ్ పేరుతో జరిగే అనాగరిక ఆటవిక్ చర్య కన్పించలేదు..

Leave a Reply