రెండు సీరియళ్ళు ఒకేసారి!

జనవరి నెలనుంచీ నేను రాసిన రెండు నవలలు రెండు వేర్వేరు పత్రికలలో సీరియళ్ళుగా వస్తున్నాయి.

చిత్ర మాస పత్రికలో ఉపక్రమణము అనే నవల ఆరంభమవుతోంది. తీవ్రవాద నేపధ్యంలో రాసిన థ్రిల్లర్ నవల ఇది.

కౌముది.నెట్ లో చారిత్రాత్మక నవల ద్రష్ట సీరియల్ గా ఆరంభమవుతోంది. మాలిక్ కాఫర్ దక్షిణ భారత దండయాత్ర కేంద్రమీ నవలకు. ఈ చారిత్రక నవల కథను, కాల్పనిక పాత్రలు చెప్తాయి.

ఈ రెండు నవలలు చదివి మీ అభిప్రాయాలనూ, సూచనలనూ నిర్మొహమాటంగా తెలియచేస్తారని ఆశిస్తున్నాను.

Enter Your Mail Address

December 17, 2009 · Kasturi Murali Krishna · No Comments
Posted in: నా రచనలు.

Leave a Reply