పుస్తక ప్రదర్శనలో బ్లాగర్లకు గొప్ప తగ్గింపు!

ఈసారి పుస్తక ప్రదర్శనలో నేను క్రితం సంవత్సరంలోలా ప్రత్యేకంగా అమ్మే ప్రయత్నాలు చేయటంలేదు. నా స్నేహితుడు పాలపిట్ట ప్రచురణల పేరిట ఒక స్టాల్ తీసుకోవటంతో నా పుస్తకాలూ ఆ స్టాలులోనే  వుంచుతున్నాను. పాలపిట్ట ప్రచురణకర్తలతో మాట్లాడి బ్లాగరులకు ప్రత్యేకంగా తగ్గింపుధరలో పుస్తకాలిచ్చే ఏర్పాటు చేశాము.

స్టాల్ నంబర్ 81 పాలపిట్ట ప్రచురణల స్టాలు. ఈ స్టాలులో బ్లాగరులు కొన్న పుస్తకాలపై ప్రత్యేక తగ్గింపు లభిస్తుంది. అయితే, ఆ స్టాలులో పుస్తకాలు కొని, బిల్లు చెల్లించేసమయంలో బ్లాగర్లు తమ బ్లాగు వివరాలివ్వాలి. అప్పుడే తగ్గింపు ధర లభిస్తుంది. అంతేకాదు. ఇకపై పాలపిట్ట ప్రచురణలన్నీ తగ్గింపుధరలో లభిస్తాయీ బ్లాగర్లకు. దానితోపాటు పాలపిట్ట పుస్తకాల ప్రచురణల వివరాలూ అందుతాయి.

బ్లాగరులీ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని అభ్యర్హిస్తున్నాను.

ఈ స్టాలులో నా పుస్తకాలు లభిస్తాయి. ముఖ్యంగా పాప్ ప్రపంచానికి రారాజు మైకెల్ జాక్సన్ కూడా లభిస్తుంది. ప్రచురితమయిన మూడు నెలలో ద్వితీయముద్రణకు నోచుకుందీ పుస్తకం. అయితే, ఎమెస్కో వారు ప్రచురించిన పుస్తకాలు మాత్రం ఆ స్టాలులోనే దొరుకుతాయి.

Enter Your Mail Address

December 19, 2009 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

Leave a Reply