హాసం సభకు ఆహ్వానం!

ప్రతి చివరి శనివారం, త్యాగరాయ గాన సభ మినీ హాలులో హాసం సభ జరుగుతుంది. ఈవేళ హాసం సభలో నేను సాహిర్ పాటల విశ్లేషణ పై నేను రాసిన పుస్తకం గురించి మాట్లాడతాను. ఈ పుస్తకం త్వరలో విడుదల అవుతుంది.

invitation copy

Enter Your Mail Address

December 25, 2009 · Kasturi Murali Krishna · One Comment
Posted in: pustaka paricayamu

One Response

  1. Vamsi M Maganti - December 25, 2009

    మీ పనే బాగుంది మాష్టారూ – చక్కగా సాహితీ పోషణతో పాటుగా బోలెడు మందికి ఆహ్లాదాన్ని పంచుతూ ఉపయోగకరమైన పనులు చేస్తూ, చక్కబెడుతున్నారు. ఇక్కడో ? అడక్కండి – అందరూ కప్పలే! ఎవడి బావి వాడికి సముద్రం! ఎవడి చెరువు వాడికి సాగరం! అంటే ఆవేశం! అయ్యా ఇదీ ఇక్కడి భాగోతం!

    పోనీ మీరే చెయ్యొచ్చంటారా? దానికీ కప్పల ఫిట్టింగులున్నాయి మహాప్రభో!

    ఒకడు అసలు పనితో సంబంధం లేకుండా నా కథలు (బావుండవని వాడికీ తెలుసు, ఇవతలి వాడికీ తెలుసు!) అచ్చేసుకోవాలి, ఎవరన్నా వుంటే చూసిపెట్టండి, లేపోతే లాబీయింగు చేస్తానంటాడు! ఇంకొకడు దిక్కుమాలిన చెల్లి పెళ్ళి లాటి కవితలు చదువుతానంటాడు, ఇంకోడు అవతారాలేద్దామంటాడు – వాడికి అవతారం వున్నా లేకున్నా, ఇంకోడు పాత కథలన్నీ ఒక సంకలనం కింద తీసుకొచ్చి జనాల మీద అచ్చోసిన ఆంబోతుల లాగా వదులుదామంటాడు (ఆ సంకలనంలోని కథలు ఆల్రెడీ జనాలను కుమ్మేసున్నా కూడా!), ఇంకోడు సాహితీ సభ పెట్టి వాడికొచ్చిన గజకర్ణ గోకర్ణ విద్యలు గిటారో, వీణో వాయిస్తూ చూపిస్తానంటాడు….

    ఏదేమైనా ఇవి అన్నీ తప్పించుకుని సుఖంగా కాలం గడుపుతున్న మీకు అభినందనలు….ఇంతకీ మీరు ఆ హేతువాది వీడియో పెట్టనేలేదు….

Leave a Reply